ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు !..జగన్మోహన్ రెడ్డి కి హైడ్రా అధికారుల నోటీసులు..వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం..సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్.. సీతారాం ఏచూరి మృతి పట్ల పలువురి సంతాపం..అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు..వంట నూనెలను మంట నూనెలు గా మార్చిన మోడీ ప్రభుత్వం.. అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు..బీజేపీలో నేతల మధ్య తీవ్రమవుతున్న కలహాలు.. మరో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్.. ఎస్సై పై హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో కేసు..ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్ల తొలగింపులో ఎందుకింత ఆలస్యం?…

👉 వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం*
*మంత్రి లోకేష్ కు రూ.5 కోట్ల చెక్కు అందజేత*
కృష్ణా నదికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ భారీ విరాళంతో ముందుకు వచ్చింది.
దివీస్ సిఈఓ దివి కిరణ్ ఆదివారం హైదరాబాదులో మంత్రి నారా లోకేష్ ను కలిసి ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.
ఈనెల 1 నుంచి 8వ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందజేసేందుకు గాను అక్షయపాత్ర ఫౌండేషన్ కు మరో రూ. 4.8 కోట్లను దివీస్ సంస్థ అందజేసింది.
మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం 9.8 కోట్ల రూపాయల విరాళాన్ని అందించిన దివీస్ సంస్థను మంత్రి నారా లోకేష్ అభినందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
👉ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్*
ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు.
👉ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి హైడ్రా అధికారుల నోటీసులు..*
*హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో లోటస్ పాండ్ లో చెరువు శిఖంలో ఇంటిని నిర్మించినట్టు అధికారుల ఆరోపణ.*
👉 గుంటూరు జిల్లా .
మంగళగిరి.
వైయస్సార్ సిపి మాజి MP నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
తెదేపా రాష్ట్ర కార్యాలయం పై దాడి కి సంబందించిన కేసులో ఈనెల 5 వ తేదిన అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
కోర్టు వారు రెండు రోజుల పాటు సెప్టెంబర్ 15 నుండి 17 వరకు పోలీస్ కస్టడికి అనుమతించారు..
ఈ నేపధ్యంలో ఆదివారం మధ్యాహ్నం విచారణా అధికారి మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయం కు చేరుకున్నారు.
👉ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
*అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు…
కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారులో శ్రీ లక్ష్మీ గణపతి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 600 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కంచికచర్ల ఎస్సై…
కార్డ్ దారుల నుండి ఈ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి భారీ నిల్వలు ఉంచి అక్రమంగా రవాణా చేయటానికి సిద్ధంగా ఉండగా సమాచారం తెలుసుకున్న ఎస్సై రేషన్ బియ్యంనిల్వపై దాడులను నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు…
ఈ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సాంబమసురు బియ్యం లో కలిపి భారీ అమ్మకాలు జరుగుతున్నట్లుగా పోలీసులు విచారణలో బయటపడింది…
👉గుంటూరు: నేడు నందిగం సురేష్కు కస్టడీ.. 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించిన మంగళగిరి కోర్ట్.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. నందిగం సురేష్ను ప్రశ్నించనున్న పోలీసులు 👉స్పా ముసుగులో వ్యభిచారం, ముగ్గురు విటుల అరెస్టు
తిరుపతి నగరంలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడులు చేసి ముగ్గురు విటులను అరెస్టు చేశారు. ఈస్ట్ పోలీసు స్టేషన్ లో డీఎస్పీ వెంకటనారాయణ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. తిరుపతి నగరం డీబీఆర్ ఆసుపత్రి ఎదురుగా సీ7 స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ పోలీసులకు సమాచారం అందింది. ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు అమ్మాయిలతో వేర్వేరు గదుల్లో ఉండగా పట్టుకున్నారు.
👉వంట నూనెలను మంట నూనెలు గా మార్చిన మోడీ ప్రభుత్వం:నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శిఎం రాధాకృష్ణ విమర్శ*
చిలకలూరిపేట:వంటనూనెలపై 20 శాతం నుండి 32.5% వరకు దిగుమతి సుంకం విధించడం ద్వారా వంట నూనెలను మంట నూనెలుగా మార్చి పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం మోపిందని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం రాధాకృష్ణ విమర్శించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో పెద్ద మొత్తంలో దిగుమతి సుంకాన్ని విధించిన తొలి ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం నూతన రికార్డు సృష్టించిందన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆహార పదార్థాలు అల్పాహారాలు కొని ,తినే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దిగుమతి సుంకం పెంపు వల్ల స్వీట్ షాపులు, హోటళ్ళు, తోపుడు బండ్లపై అల్పాహారం విక్రయించడం ద్వారా చిరువ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారి ఆదాయానికి గండిపడుతుందని తద్వారా అనేకమంది ఉపాధి అవకాశాలు కోల్పోతారని అన్నారు. ప్రతిరోజు 30 లక్షల లీటర్ల వంట నూనెలు ఉపయోగించుకుంటున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం విధించిన దిగుమతి సుంకం భారం పెద్ద ఎత్తున పడబోతుందని రాధాకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడమే ముఖ్యమని భావించింది తప్ప పేద మధ్యతరగతి ప్రజలు పొట్ట నింపుకోవడానికి అవసరమైన ఆహార పదార్థాలు ఆకాశాన్ని అంటే విధంగా చేస్తున్నామనే విషయం విస్మరించారని రాధాకృష్ణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కష్టాల కడలి ఈదుతున్న ప్రజలపై పెనుబారాలు మోపే నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు.
👉ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు..!!! ముంబై నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెన్షన్..
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు – ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం – జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల – కాన్ఫిడెన్షియల్ అని పేర్కొన్న ప్రభుత్వ వెబ్‌సైట్ – డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు – ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ – ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేసిన డీజీపీ.
_👉ప్రత్తిపాటి పుల్లారావు నీ పరామర్శించిన యువ నేత డాక్టర్ కోడెల శివరాం….
_మాజి మంత్రివర్యులు, కోడెల కుటుంబానికి అత్యంత ఆప్తులు, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తల్లి గారైన ప్రత్తిపాటి నారాయణమ్మ ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ విషయమై ఆదివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువ నేత డాక్టర్ కోడెల శివరాం ప్రత్తిపాటి ఇంటికి వెళ్లి నారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పత్తిపాటి పుల్లారావు ను పరామర్శించారు. కార్యక్రమంలో యువ నేత డాక్టర్ కోడెల శివరాం వెంట సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోడెల అభిమానులు పాల్గొన్నారు._
👉 సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
న్యూఢిల్లీ..సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో స్పందిస్తూ.. సీతారాం ఏచూరి తనకు మిత్రుడని, దేశ భావజాలానికి రక్షకుడని, మన దేశం గురించి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఆయనతో సుదీర్ఘ చర్చలను చేసే అవకాశాన్ని కోల్పోతున్నానని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
*నాతో చర్చించే వారు: బండారు దత్తాత్రేయ*
ఏచూరి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త తనకు చాలా దుఃఖాన్ని, బాధను కలిగించిందని తెలిపారు. వారు తనకు అత్యంత ఆత్మీయ సన్నిహితులని, చిన్న వయస్సులోనే సి.పి.ఎం పార్టీలో సైద్ధాంతిక బలంతో తర్కబద్దంగా విషయాలను చక్కగా వివరించే మేధావి అని, తాను కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు తాము అనేక సార్లు కలుసుకున్నామని అన్నారు. రాజ్యసభలో తాను ప్రశ్నలకు జవాబులు చెబుతున్నప్పుడు వారు కొన్నిసార్లు మద్దతు తెలిపారని, తాను కార్మిక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు కార్మికుల గురించి తనతో చర్చించేవారని తెలిపారు.
*నారా లోకేశ్ సంతాపం*
ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని, ఆయన మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన వారికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు.
*కేసీఆర్ దిగ్భ్రాంతి*
సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ కి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని అన్నారు. సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భట్టి విక్రమార్క స్పందన
సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
*తీరని లోటు: మహేశ్ కుమార్ గౌడ్*
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక వేత్త, మేధావి ఏచూరి సీతారాం మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. తెలుగు వాడిగా తన రాజకీయ వాణిని జాతీయ స్థాయిలో వినిపిస్తూ, అద్భుతమైన ప్రతిభ చూపిన గొప్ప నాయకులు ఏచూరి అని, ఆయన మరణం దేశ రాజకీయాలకు లోటని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు ఏచూరి అని, పేదల కోసం తన జీవితాంతం ఉద్యమాలు చేసిన ఏచూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.
👉సామాజిక న్యాయ పోరాటాల సారథి కామ్రేడ్ ఏచూరి!!..
దేశంలోని ఏ మూలన బడుగు వర్గాలపై దౌర్జన్యాలు జరిగినా.. స్వయంగా వెళ్లి, బాధితులను పరామర్శించి, పీడితులకు న్యాయం దక్కాలని జరిగిన పోరాటాలన్నింటిలో స్వయంగా పాల్గొన్న ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి!
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో.. 14 సెప్టెంబర్ 2020 న దళిత బిడ్డ మనిషా వాల్మీకి సామూహిక మానభంగానికి గురైన వార్త దేశాన్ని అట్టుడికించింది. రేపిస్టులు తన ఠాకూర్ కులానికి చెందిన వారు కాబట్టి.. రేప్ జరగనేలేదంటూ బుకాయించాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ దళిత బిడ్డ శవాన్ని సైతం బంధువులకు అప్పగించకుండా పోలీసుల చేత అడవుల్లో దహనం చేయించిండు.భయవిహ్వలురై, గుడిసె నుండి కాలు బయట పెట్టడానికి సైతం వణుకుతున్న ఆ నిరుపేద దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరూ రాకుండా పోలీసు బలాన్ని ఉపయోగించి కట్టడి చేశాడు. ఆ పరిస్థితులలో.. ఆ మారుమూల ఊరికి చేరుకుని, ఆ పూరి గుడిసె తలుపుతట్టి, బాధితులకు ధైర్యం చెప్పి.. ప్రభుత్వ పెద్దల దమన నీతిని ప్రపంచానికి చాటి చెప్పిండు ఏచూరి.
ఎమర్జెన్సీ కాలంలో.. విద్యార్థి సంఘ నాయకుడిగా.. నాటి ప్రధాని ఇందిరను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్ కి పిలిపించి, అసమ్మతి పత్రాన్ని చదివి వినిపించి, ఆమె చేత ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయించిన.. ఆ రాజీలేని పోరాట తత్వమే చివరి వరకూ ఆయన వెన్నంటి ఉన్నది.*నిక్కమైన ప్రజల మనిషికి ఉద్యమ నివాళి!!*
*ఏచూరి పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం!!*
👉 బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాను : మమ్ముట్టి..
సీతారాం ఏచూరి మృతి పట్ల మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు.మమ్ముట్టి తన ప్రియ మిత్రుడి మృతికి చింతిస్తున్నానని, మంచి వ్యక్తిత్వానికి వ్యక్తిని కోల్పోయానని ఫేస్‌బుక్‌లో రాశారు.
“నా చిరకాల మిత్రుడు సీతారాం ఏచూరి ఇప్పుడు మన మధ్య లేరన్న విషయం విని బాధపడ్డాను. తెలివైన రాజకీయ నాయకుడు,అద్భుతమైన వ్యక్తి మరియు నన్ను బాగా అర్థం చేసుకునే స్నేహితుడు. ఏచూరిని ఎప్పటికీ మరచిపోలేను’ అని మమ్ముట్టి అన్నారు.
👉 మరో మాట్రిమోనియల్ ఫ్రాడ్..
ప్రభుత్వ ఉద్యోగినని మహిళలకు వల..
ప్రైవేట్ ఫోటోలు-వీడియోలతో బ్లాక్మెయిల్..
పలు రాష్ట్రాల్లో నిందితుడిపై కేసులు..
ఒడిశా మహిళ ఫిర్యాదుతో పట్టుబడిన నిందితుడు..
ఒడిశా: ఇండియాలో మాట్రిమోనీ సైట్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో గొప్పింటి సంబంధాలని బొక్కబోర్లా పడుతున్నారు. చాలా కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఉందని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెబుతూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మచ్చిక చేసుకుని వారి వద్ద నుంచి డబ్బుతో ఉడాయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శారీరక దోపిడీకి కూడా పాల్పడుతున్నారు.
తాజాగా ఒడిశాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మధ్య వయస్కులైన మహిళల్ని టార్గెట్ చేస్తూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. మహిళల్ని పెళ్లి చేసుకుని వారిని ఆర్థికంగా దోపిడికి గురిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాలోని అంగుల్ జిల్లా చెండిపాకకు చెందిన బిరంచి నారాయణ్ నాథ్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
వేర్వేరు ప్రొఫైళ్ల ద్వారా తనను తాను రైల్వే ఉద్యోగిగా, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్గా, కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేస్తునట్లు మాయ మాటలు చెప్పి మహిళల్ని మోసగిస్తున్నాడు. పెళ్లికాని, విడాకులు తీసుకున్న లేదా వితంతులైన మధ్య వయస్కులైన మహిళల్ని అతడు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వైబ్సైట్లో పరిచయం పెంచుకుని, ఫోన్లో సుదీర్ఘ సంభాషణలు చేసి, ఆపై బాధిత మహిళల ఇంటికి వెళ్లేవాడు. నిందితుడు వారి పిల్లలకు జీవితాంతం సాయపడుతానని వాగ్దానం చేసి, వారిని మానసికంగా లొంగదీసుకునే వాడు. అతను బాధిత మహిళల్లో చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు. చాలా మందికి పెళ్లి తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. గుడిలో పెళ్లి చేసుకుని, వారి ఇంట్లోనే ఉండేవాడు. వారిని తన సొంత ప్రాంతానికి తీసుకెళ్లేవాడు కాదు. ఆ తర్వాత వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించే వాడు.
ఇతడిపై రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీతో పాటు ఒడిశాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కటక్కి చెందిన ఓ మహిళా ఒడిశా సీఐడీ-క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ యూనిట్లో కేసు నమోదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. సదరు మహిళ 2022లో రోడ్డు ప్రమాదంలో భర్తని కోల్పోయింది. ఇద్దరు కుమార్తెలు ఉననారు. గతేడాది అక్టోబర్లో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా నిందితుడు పరిచయమయ్యాడు. సుమారు రూ. 5 లక్షల నగదు, 32 గ్రాముల బంగారాన్ని దోచుకున్నాడు. ఆమె చివరకు అతని ఇతర సంబంధాలను కూడా కనుగొంది. ఆ తర్వాత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
👉బీజేపీలో నేతల మధ్య తీవ్రమవుతున్న కలహాలు..!
కారణం అదేనా.. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. పార్టీ అధ్యక్షుడు ఏది చెబితే అదే ఫైనల్. పార్టీ తరఫున ఎవరు ఏం మాట్లాడాలన్నా ఓ పద్ధతి ఉంటుంది. ముందుగా అనుకున్న విధంగానే ఎవరైనా మాట్లాడాలి.. కానీ, ప్రస్తుతం పార్టీలో ఆ పరిస్థితులు మారాయంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కమలం నేతల వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లు నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తుండటం వల్ల కమలంలో కలహాలు తీవ్రమవుతున్నాయని టాక్‌ వినిపిస్తోంది.
*నేతల మధ్య తీవ్రమవుతున్న బేదాభిప్రాయాలు..!*
తెలంగాణ బీజేపీలో నేతల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమవుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ఎంతో క్రమశిక్షణ గల కమలం పార్టీని ప్రస్తుతం రెండుగా విభజించి చెబుతున్నారు. 2019కి ముందు 2019 తరువాత బీజేపీ అంటూ పార్టీని రెండుగా విభజిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాతే తెలంగాణలో ఆ పార్టీ బలోపేతమవుతూ వచ్చింది. 2019లో తెలంగాణ నుంచి నాలుగు ఎంపీలు గెలవడంతో కమలం పార్టీలో చేరికలు ఎక్కువయ్యాయి. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండగా చేసిన ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పార్టీలో చేరికలు మరింతగా పెరిగాయని చెబుతారు. ఇలా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చాక గతం ఒక తీపి జ్ఞాపకంగానే మిగిలిపోతుందనే టాక్‌ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో ప్రారంభమైన విభేదాలు… ఇప్పటికీ సమసిపోలేదని తాజా ఉదంతాలు రుజువు చేస్తున్నాయి.
*నిత్యం అసంతృప్తితో రగిలిపోతున్నారు..*
ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతల్లో కొందరు తమకు సరైన గౌరవం దక్కడం లేదని నిత్యం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డికి తగిన ప్రొటోకాల్ ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
*తనను చిన్నచూపు చూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి భావన..*
ఇటీవల వరద ప్రాంతాల బాధితులను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సూచన మేరకు రెండు బృందాలను నియమించారు. ఇందులో ఒక బృందం కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఖమ్మంలో పర్యటించగా, మరొకటి ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో మహబూబాబాద్‌ వెళ్లింది. అయితే ఈటెల బృందంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని సభ్యుడిగా పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారట. ఒక బృందాన్ని నియమిస్తే బీజేపీ ఎల్పీ నేతగా తాను నేతృత్వం వహించాలని లేదంటే తనను పూర్తిగా మినహాయించాలి కానీ సాధారణ బృంద సభ్యుడిగా ఎలా నియమిస్తారని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మహేశ్వర్‌రెడ్డి. తనను చిన్నచూపు చూస్తున్నారని భావించిన బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటనకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
*ఎల్పీ లీడర్‌ను ఆహ్వానించకపోవడమేంటని ఆగ్రహం..*
ఇదిలా కొనసాగుతుండగానే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఓ ప్రైవేటు హోటల్ లో అట్టహాసంగా చేపట్టారు కమలనాథులు. ఈ కార్యక్రమానికి కనీసం బీజేఎల్పీ నేతను ఆహ్వానించలేదన్న వార్త గుప్పు మంటోంది. మీడియాకు పంపించిన ఇన్విటేషన్ లో కేంద్ర మంత్రులు, ఎంపీల పేర్లు పెట్టినా బీజేఎల్పీ నేత పేరు పెట్టలేదట. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పిలిచి ఎల్పీ లీడర్‌ను ఆహ్వానించకపోవడమేంటని మహేశ్వర్‌రెడ్డి అనుచరులు నొచ్చుకుంటున్నారని చెబుతున్నారు.
*ఇదేనా బీజేపీ ఎల్పీ లీడర్‌కు ఇచ్చే మర్యాద? అంటూ ఆగ్రహం..*
ఇవి ఈ వారం రోజుల్లో జరిగిన సంఘటనలని.. గతంలో కూడా ఇలాంటి సంఘటలను చాలా ఉన్నాయని అంటున్నారు. ఎల్పీ నేతకి పార్టీ సమావేశాలలో వేదికపైకి ఆహ్వానించడం లేదని, పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా గది ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. చివరికి పార్టీ బ్యానర్లలో మహేశ్వర్‌రెడ్డి ఫొటో కూడా వేయడం లేదని ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా బీజేపీ ఎల్పీ లీడర్‌కు ఇచ్చే మర్యాద? అంటూ మహేశ్వర్‌రెడ్డి కూడా ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.
*బీజేపీలో చేరిన వారితోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్న సీనియర్లు..*
అయితే మహేశ్వర్‌రెడ్డి బాధపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సిద్ధాంతాలు, పార్టీ విధానాలు తెలియకుండా బీజేపీలో చేరిన వారితోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యమైన పదవులు ఇచ్చినా సంతృప్తి చెందడం లేదని, త్యాగాలు చేసి వారికి పదవులు కట్టబెడితే వారిలో సంతృప్తి ఉంటుందని.. పార్టీ లైన్‌ తెలియని వారే ఇలాంటి వాదనలు తెరపైకి తెస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆవేదనను కొట్టిపడేస్తున్నారు బీజేపీ సీనియర్‌ నేతలు. మొత్తానికి ఈ వ్యవహారం పరిశీలిస్తే బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం ఇప్పటికీ కుదరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
👉 ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్ల తొలగింపులో ఎందుకింత ఆలస్యం? : ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు పనులు మూడవ రోజు శరవేగంగా కొనసాగుతున్నాయి. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో తియ్యడం సాధ్యం కాకపోవడంతో అండర్ వాటర్ ఆపరేషన్ ద్వారా బోట్లను ముక్కలు చేసి తొలగిస్తున్నారు. మొన్న భారీ క్రేన్లతో బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కొక్కటి 40 టన్నులు బరువు ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీమ్ లను అధికారులు రంగంలోకి దించారు.
ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లను తీయడానికి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. బోట్లు చాలా భారీగా ఉన్నాయి. బాగా బలంగా కూడా ఉన్నాయి. దాంతో వాటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. వాటిని తొలగించేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. సాధారణంగా బోట్లు అంటే చెక్కతో ఉంటాయి. చెక్కతో ఉండే బోటు ఎంత పెద్దగా ఉన్నా.. వాటిని ఈజీగా కట్ చేసి చేసే పరిస్థితి ఉంటుంది. కానీ, ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లు పూర్తిగా ఐరన్ తో చేసినవి. చాలా బలమైన ఐరన్ తో వాటిని తయారు చేశారు. చాలా ధృడంగా ఉంది. బోటు ఖాళీగా ఉంటేనే దాదాపు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. ఇక నీటిలో పడిందంటే బరువు మరింత పెరుగుతుంది.
వంద టన్నుల బరువును మోయగల క్రేన్ కూడా ఈ బోట్లను కదలించలేని పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రేన్లతో బోట్లను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, ఇంచు కూడా కదల్లేదు. బోట్లు తీయడం చాలా కష్ట సాధ్యమైన పరిస్థితి. అయితే, ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి బోట్లు తీసేయాల్సిందే. ముందు ముందు నీటి ప్రవాహం పెరిగితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందంటున్నారు అధికారులు.
బోట్లను వెలికితీసే విషయంలో ప్లాన్ ఏ పని చేయలేదు. దీంతో ప్లాన్ బి ని అధికారులు అమలు చేస్తున్నారు. ప్లాన్ బి లో భాగంగా బోట్లను ముక్కలు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం బోట్లను కట్ చేసే ప్రక్రియ మొదలైంది. కొంతమంది నీటి పైన భాగంలో కట్ చేస్తున్నారు. మరికొందరు క్యూబా డైవింగ్ ద్వారా నీటి లోపలికి వెళ్లి దాదాపు 12 నుంచి 15 అడుగులు ఉన్న నీటిలో కటింగ్ ప్రక్రియ జరుగుతోంది.
*అండర్ వాటర్ ఆపరేషన్..*
*వరుసగా మూడో రోజు ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ
*బోట్లను తొలగించేందుకు శ్రమిస్తున్న ఇంజినీర్లు
*చాలా క్లిష్టంగా కొనసాగుతున్న పడవల కోత ప్రక్రియ
*బోట్లను తీసేందుకు రంగంలోకి దిగిన సీలైన్ డైవింగ్ కంపెనీ
*బెలూన్లు, అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో పైకి తీసే ప్రయత్నం
*స్కూబా డైవింగ్ సూట్, ఆక్సిజన్ సిలిండర్లు ధరించి నదిలోకి వెళ్లిన డైవింగ్ టీమ్
ఇప్పటివరకు ఒక భారీ పడవను 6 మీటర్ల మేర కోసిన డైవింగ్ టీమ్
*పడవల తొలగింపునకు మరో 3 రోజులు పట్టే అవకాశం
*నది లోపల 12 అడుగుల లోతులోకి వెళ్లి భారీ పడవను రెండుగా కోస్తున్న సిబ్బంది
👉 నంద్యాల 3 టౌన్ PS ఇన్స్పేక్టర్ సూర్యమోలి మరికొందరిపై AP హైకోర్టు లొ కేసు నమోదు చేయించిన నవజ్యోతి హ్యూమన్ రైట్స్ అధినేత పల్ల బాలమద్దిలేటి @ బాలు
షేక్ సలీమ @ లక్ష్మి Dlo దస్తగిరి బోగ్గులైన్ నంధ్యాల. టౌన్, నంధ్యాల డిస్ట్రీక్ట్ లో జరిగిన అన్యాయం లొ
నంధ్యాల జిల్లా, నంధ్యాల టౌన్ మూలసాగరము పోలా రేసిడిస్సీ ప్రక్కన సారే. సత్యనారాయణ జనరల్ స్టోర్ కి చెందిన సారే సత్యనారాయణ మరియు సారే. లక్ష్మీదేవిల కూమారుడు. సారే . సతీష్ కూమార్ తన బావ కోoకాల నాయుడు @ ఓబులేస్. అక్క కొంకాల లీలావతి, తండ్రి సారే . సత్యనారాయణ, తల్లి సారే లక్ష్మీదేవి సహకారంతో తనని పెళ్లి చేసుకుంటానాని నమ్మించి మోసగించి 11 నెలలు సహజీవనం చేసి పెళ్ళికి నిరాకరించడం మరియు తనని చంపటానికి ప్రయత్నం చేయడం ఈ విషయం పై నంద్యాల 3 టౌన్ PS ఇన్స్ పేక్టర్ ఆఫ్ పోలీస్ అయిన సూర్యామోలి FIR నమోదుకు నిరకరించడమే కాకుండా బాధితులపై అక్రమ కేసులు పెడతా నని బెదిరించడాముతో బాధితురాలయిన షేక్ సలీమ న్యాయం కోసం నవజ్యోతి హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించడం తో ఆ సంస్థ అధినేత పల్ల బాలమద్దిలేటి బాధితురాలు తరుపున న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం AP హైకోర్టు లొ కేసు నమోదు చేయడం అయింది.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫీరియాధులపై FIR నమోదు చేయడములో అలసత్యం వహించడం నేరస్థులకు మరో నేరాన్ని చేసే అవకాశం ఇవ్వడమే అవుతుందని ఇకనుండి అయినా FIR నమోదులో అలసత్యం వసించొద్దని మీడియా ముఖముగా తెలియ జేశారు
రజనీకాంత్ సినిమా షూటింగ్‌లో అగ్ని ప్రమాదం..*
*విశాఖ..*తమిళ నటుడు రజనీకాంగ్ కూలీ సినిమా షూటింగ్ జరుగుతుండగా అగ్నిప్రమాదం..*
*బీచ్ రోడ్‌లో ఉన్న కంటెయినర్ టెర్మినల్‌లో చెలరేగిన మంటల్ని అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..*
*చైనా నుంచి లిథియం బ్యాటరీల లోడ్‌తో గత నెల 28న విశాఖ పోర్టుకి వచ్చిన కంటెయినర్ షిప్..*
*కంటెయినర్ టెర్మినల్‌లో ప్రమాదం…*
*తృటిలో తప్పించుకున్న రజనీకాంత్ కూలీ సినిమా యూనిట్‌..*
👉 వందలే కదా అని మీరు వదిలేస్తుంటే..
వాళ్లు వేల కోట్లు వెనకేసుకుంటున్నారు ..బెంగళూరు..
బెంగళూరులోని ఈస్ట్ రామమూర్తినగర్ బాధితురాలు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫెడ్ ఎక్స్ కొరియర్ స్కామ్‌కి కోటి రూపాయల నష్టం. కొరియర్ వచ్చిందంటూ ఫెడ్ ఎక్స్ తరపున ఫోన్ చేస్తున్నామంటూ ఆమెకు ఓ కాల్ వచ్చింది. ఆ పేరున తైవాన్ వెళ్లాల్సిన ఓ కొరియర్‌ను ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు సీజ్ చేశారని చెప్పారు. అక్కడితో ఆగితో ఈ కథలో పెద్ద కిక్కు లేదు. ఆ పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించారు. అక్కడ నుంచి కథ కస్టమ్స్‌కి మారింది. తాము కస్టమ్స్ అధికారులమంటూ మరి కొందరు ఫోన్‌లో బెదిరించడం మొదలు పెట్టారు. పార్శిల్‌లో డ్రగ్స్‌తో పాటు పాస్ట్ పోర్టులు, ఇతర వస్తువులు ఉన్నాయని, ఆల్రెడీ విచారణ మొదలైందంటూ భయపెట్టారు. అక్కడితో ఆగలేదు. మరొకరు ఫోన్ చేసి నార్కోటిక్స్ కేసులో ఆమె పాత్ర ఉందంటూ బెదిరింపులకు దిగాడు. ఆన్ లైన్లో ఇంటరాగేషన్ పేరుతో భయపెట్టారు. కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్‌కు సపోర్ట్ చెయ్యాలని, అందుకోసం ఆర్బీఐకి కొంత డబ్బు పంపాలని, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి విడతల వారీగా కోటీ రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అంతే సడన్‌గా కాల్ కట్టయ్యింది. విచారణ పూర్తయ్యింది. అక్కడితో వారి క్రైం కథా చిత్రం కూడా పూర్తయ్యింది. ఇంత జరిగిన తర్వాత కోటి రూపాయలు ఇచ్చేసిన తర్వాత కానీ ఆమెకు తాను మోసపోయానన్న సంగతి తెలియలేదు. ఆ తర్వాత లబో దిబో మంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది.
బెంగళూరు వరకు ఎందుకు…? కొద్ది రోజుల క్రితం వైజాగ్‌లోనూ ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. మీకు లాటరీ తగిలిందనగానే లింక్ క్లిక్ చేశారు.లాటరీ మాట దేవుడెరుగు.. ఖాతాలో ఉన్న కాస్త డబ్బులు కూడా కనిపించకుండా పోయాయి.
మొత్తంగా వైజాగ్, బెంగళూరు అనే కాదు… దేశ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 5 సైబర్ కంప్లైంట్లు నమోదవుతున్నాయి. అంటే రోజూ నమోదవుతున్న సైబర్ క్రైం ఫిర్యాదుల సంఖ్య అక్షరాల ఏడు వేలు. ఇప్పటి వరకు మొత్తం 17 కోట్ల 13 లక్షల ఫిర్యాదులు పోలీసులకు అందగా అందులో 85 శాతం అంటే సుమారు 14.5 కోట్ల ఫిర్యాదులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే.
తాజాగా నేషనల్ సైబర్ క్రైం రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి రోజూ సుమారు ప్రజల నుంచి సైబర్ క్రైమ్స్‌కు సంబంధించి 67 వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఒక్క 2024 తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 1700 కోట్ల రూపాయల సైబర్ క్రైం మోసాలు దేశంలో జరిగాయి. సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ఏటా 70 వేల కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయట. అయితే ఈ నేరాల విలువ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో లెక్క చెబుతున్నప్పటికీ… జరుగుతున్న నేరాల సంఖ్య విషయంలో మాత్రం పెద్దగా తేడాలు ఉండటం లేదు.
నిజానికి గతంలో సైబర్ నేరాల వల్ల ఏటా దేశంలో జరిగే నష్టం సుమారు 10 వేల కోట్లు ఉండేదని సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ చెబుతున్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పటికీ దాని విలువ విషయంలో భిన్నాభిప్రాయాలుండటానికి ప్రధాన కారణం ఈ సెబర్ నేరాల్లో చాలా వరకు చిన్న మొత్తాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఫిర్యాదులు ఇచ్చే వారి సంఖ్య పెద్దగా ఉండటం లేదు. లా ఎన్ ఫోర్స్‌మెంట్ దృష్టిలో పడకుండా ఉండేందుకు స్కామర్స్ చిన్న చిన్న మొత్తాలపైనే ఎక్కువ స్థాయిలో దృష్టి పెడుతున్నారు. ఫలితంగా ఆ మోసాల గురించి ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప నేరుగా చట్టం చేతికి చిక్కడం లేదు.
ఎక్కువగా ఈ స్కామ్‌లు మియన్మార్, లావోస్, కాంబోడియా, చైనా దేశాల బేస్‌గా జరుగుతున్నాయి. ఇండియాలో కొందర్ని అపాయింట్ చేసుకొని వారిని ఎరలుగా వాడుకుంటున్నారు. ఇలాంటి స్కామ్స్‌కి మన దేశంలో బీహార్‌లోని నలంద జిల్లా చాలా ఫేమస్. అలాగే గడిచిన 8 ఏళ్లుగా జవా కటియా అనే గ్రామం కూడా సైబర్ క్రైం సెంటర్‌గా పేరుంది. ఇలా దొంగలించే సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చేస్తున్నారు. ఫలితంగా వాటిని ట్రాక్ చెయ్యడం కూడా సాధ్యం కావడం లేదు.
*సైబర్ క్రైం ఎన్నిరకాలు ?..
*కొరియర్ స్కామ్‌లు:*
దేశంలో ఇప్పుడు ఫెడ్ ఎక్స్ కొరియర్ స్కామ్ చాలా ఫేమస్. దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ కాల్స్ రోజూ ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటాయి. ఇందులో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మీపై డ్రగ్స్, నార్కోటిక్స్ అభియోగాలు ఉన్నాయని.. ఇలా ఏదో ఒక పేరుతో బెదిరించి డబ్బులు గుంజేస్తుంటారు. ఈ కథనం ప్రారంభంలో ప్రస్తావించిన బెంగళూరు యువతి ఘటన అందుకు ఉదాహరణ.
*జాబ్ స్కామ్స్:*
భారీ జీతాలతో ఉద్యోగాలిస్తామని, అందుకు ముందుగా కొంత ఫీ చెల్లిస్తే చాలంటూ వచ్చే కాల్స్ ఈ తరహావి. వారు చెప్పే భారీ జీతానికి ఆశపడి ఫీజు చెల్లించారో మీ పని అయిపోయినట్టే.
*ఇన్వెస్టిమెంట్ స్కామ్స్:*
ఇందులో బాధితుల్ని సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత ఓ నకిలీ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే మిమ్మల్ని ఒప్పిస్తారు. ఇలాంటివి సాధారణంగా క్రిప్టో మోసాలు క్యాటగిరిలో ఉంటాయి.
తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించేద్దాం.. అని ఇంటర్నెట్‌లో ఈ తరహా వెతికే వారు ఈజీగా ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకుంటారు. వాళ్ల డేటాను సేకరించి వాళ్లనే టార్గెట్‌గా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అలాగే వీళ్లు ఎప్పుడూ ఒకే లోకేషన్‌లో ఉండరు. అలాగే నలుగురుగైదురు ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉంటూ ఉంటారు కూడా. పని పూర్తయ్యాక.. వాళ్ల ఆచూకీ, ఆనవాళ్లు కూడా కనిపించకుండా చేస్తారు. నిజానికి ఇలాంటి విషయాల్లో ఫిర్యాదులిచ్చినా చాలా వరకు దాని ఎంక్వైరీకి అయ్యే ఖర్చుతో పోల్చితే బాధితుడికి జరిగే నష్టం అతి తక్కువ కావడంతో చిన్న చిన్న మొత్తాల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుంటుంది. అలాగే చిన్న మొత్తంలో నష్టపోయినప్పుడు బాధితులు కూడా దాని కోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ, పోలీసుల చుట్టూ ఎవడు తిరుగుతాడులే అని వదిలేస్తున్నారు కూడా. కానీ ఈ చిన్న చిన్న మొత్తాలే వందల, వేల కోట్ల ఆదాయంగా మారుతోంది ఈ తరహా స్కామర్లకు.
*పదో స్థానంలో ఇండియా*
ప్రపంచంలో సైబర్ క్రైం నేరాల బారిన పడుతున్న దేశాలలో ఇండియా పదో స్థానంలో ఉంది. దీంతో ఈ తరహా మోసాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెడుతోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి లాంచ్ చేసిన సస్పెక్ట్ రిజస్ట్రీ ప్రకారం దేశంలో జరుగుతున్న సైబర్ మోసాలలో సుమారు 14 లక్షల మంది క్రిమినల్స్ భాగస్వాములై ఉన్నారని తేలింది. ఈ సస్పెక్స్ట్ రిజస్ట్రీని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సెంట్రల్ ఇన్విస్టిగేషన్, ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు వినియోగించుకోవచ్చు. దీనిని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ రూపొందించింది.
సైబర్ మోసాలకు గురయ్యే వారు గోల్డెన్ అవర్‌లో అంటే బ్యాంక్ నుంచి మోసగాళ్లు మీ డబ్బును వారి ఖాతాల్లోకి బదిలీ చేసుకునే తొలి గంటలో 1930కి కాల్ చెయ్యాలి, లేదా WWW.cybercrime.gov.inలో ఫిర్యాదు చెయ్యాలి. అలా చేస్తే వెంటనే మీ డబ్బుల్ని వారి ఖాతాల్లోకి వెళ్లకుండా ఫ్రీజ్ చెయ్యచ్చు. అలా 2021 నుంచి ఇప్పటి వరకు NCRP సుమారు 2800 కోట్ల రూపాయలను రికవరీ చేసింది. తద్వారా సుమారు 8లక్షల50వేల మంది బాధితులకు మేలు జరిగింది. NCRP ప్రకారం దేశంలో ఇప్పటి వరకు సుమారు 47.8 లక్షల సైబర్ క్రైం ఫిర్యాదులు అందాయి.
దేశంలో పెరిగిపోతున్న సైబర్ క్రైం నేరాలను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా 5 వేల మంది సైబర్ కమాండోలను వచ్చే ఐదేళ్లలో నియమిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ప్రకటించారు. నేరం జరిగిన వెంటనే వీరు రెస్పాండ్ అవుతారని చెప్పారు. అలాగే ఇకపై ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ హోం మినిస్ట్రీ ఆధ్వర్యంలో పని చేయనుంది.
*సర్కారు ప్రయత్నాలు సరే.. మన సంగతేంటి.. సైబర్ నేరాల బారిన పడకుండా మనకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం.*
1.గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ , ఈమెయిల్స్, మెసేజ్‌ల జోలికి వెళ్లకండి 2.అలాగే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల్లోని లింకులు, అటాచ్మెంట్స్ క్లిక్ చెయ్యద్దు. 3.ఆఫర్ల పేరుతో వచ్చే కాల్స్ విషయంలో అనవసరంగా తొందరపడి అనర్ధాలు తెచ్చుకోవద్దు. 4.డబ్బులు పంపేటప్పుడు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేటప్పుడు సదరు కంపెనీ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోండి. అలాగే మీ మొబైల్ ఫోన్లలలో కొన్ని యాప్స్‌ కాల్ లాగ్స్‌ని, కెమెరాను , మైక్రోఫన్ యాక్సిస్ అడుగుతాయి. వాటికి ఓకే చెప్పేటప్పుడు తప్పనిసరిగా వెరిఫై చేసుకోండి. 5.మీ ఆన్ లైన్ అకౌంట్లకు కఠినమైన పాస్ వర్డ్స్‌ను ఏర్పాటు చేసుకోండి. అలాగే టూ స్టెప్ వెరిఫికేషన్‌ను కచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. 6.మీ మొబైల్, ల్యాప్ ట్యాప్ సాప్ట్ వేర్ అలాగే సెక్యూరిటీ సిస్టమ్స్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోండి. 7. ఎప్పటికప్పుడు సైబర్ క్రైం విషయంలో వస్తున్న వార్తల్ని, వారి మోడస్ ఆపరెండీని గమనిస్తూ ఉండండి. భవిష్యత్తులో మీకు కూడా అదే తరహా కాల్స్, లేదా మెసేజెస్ లేదా మెయిల్స్ రావచ్చు. మీరు అనుకోకుండానే వాటిని క్లిక్ చేసే ప్రమాదం కూడా ఉంది. 8.గాడ్జెట్స్ వాడకంలో స్మార్ట్‌గా మాత్రమే కాదు… కేర్‌ఫుల్‌గా కూడా ఉండండి
👉సామాజిక న్యాయ పోరాటాల సారథి కామ్రేడ్ ఏచూరి!!..
దేశంలోని ఏ మూలన బడుగు వర్గాలపై దౌర్జన్యాలు జరిగినా.. స్వయంగా వెళ్లి, బాధితులను పరామర్శించి, పీడితులకు న్యాయం దక్కాలని జరిగిన పోరాటాలన్నింటిలో స్వయంగా పాల్గొన్న ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి!
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో.. 14 సెప్టెంబర్ 2020 న దళిత బిడ్డ మనిషా వాల్మీకి సామూహిక మానభంగానికి గురైన వార్త దేశాన్ని అట్టుడికించింది. రేపిస్టులు తన ఠాకూర్ కులానికి చెందిన వారు కాబట్టి.. రేప్ జరగనేలేదంటూ బుకాయించిండు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ దళిత బిడ్డ శవాన్ని సైతం బంధువులకు అప్పగించకుండా పోలీసుల చేత అడవుల్లో దహనం చేయించిండు.
భయవిహ్వలురై, గుడిసె నుండి కాలు బయట పెట్టడానికి సైతం వణుకుతున్న ఆ నిరుపేద దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరూ రాకుండా పోలీసు బలాన్ని ఉపయోగించి కట్టడి చేశాడు. ఆ పరిస్థితులలో.. ఆ మారుమూల ఊరికి చేరుకుని, ఆ పూరి గుడిసె తలుపుతట్టి, బాధితులకు ధైర్యం చెప్పి.. ప్రభుత్వ పెద్దల దమన నీతిని ప్రపంచానికి చాటి చెప్పిండు ఏచూరి.
ఎమర్జెన్సీ కాలంలో.. విద్యార్థి సంఘ నాయకుడిగా.. నాటి ప్రధాని ఇందిరను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్ కి పిలిపించి, అసమ్మతి పత్రాన్ని చదివి వినిపించి, ఆమె చేత ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయించిన.. ఆ రాజీలేని పోరాట తత్వమే చివరి వరకూ ఆయన వెన్నంటి ఉన్నది.
*నిక్కమైన ప్రజల మనిషికి ఉద్యమ నివాళి!!*
*ఏచూరి పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం..
👉 బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాను : మమ్ముట్టి..

👉ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి హైడ్రా అధికారుల నోటీసులు..
*హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో లోటస్ పాండ్ లో చెరువు శిఖంలో ఇంటిని నిర్మించినట్టు అధికారుల ఆరోపణ.*
👉 గుంటూరు జిల్లా .మంగళగిరి.వైయస్సార్ సిపి మాజి MP నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
తెదేపా రాష్ట్ర కార్యాలయం పై దాడి కి సంబందించిన కేసులో ఈనెల 5 వ తేదిన అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
కోర్టు వారు రెండు రోజుల పాటు సెప్టెంబర్ 15 నుండి 17 వరకు పోలీస్ కస్టడికి అనుమతించారు..
ఈ నేపధ్యంలో ఆదివారం మధ్యాహ్నం విచారణా అధికారి మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయం కు చేరుకున్నారు.
👉ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
*అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు…
కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారులో శ్రీ లక్ష్మీ గణపతి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 600 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కంచికచర్ల ఎస్సై…
కార్డ్ దారుల నుండి ఈ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి భారీ నిల్వలు ఉంచి అక్రమంగా రవాణా చేయటానికి సిద్ధంగా ఉండగా సమాచారం తెలుసుకున్న ఎస్సై రేషన్ బియ్యంనిల్వపై దాడులను నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు…
ఈ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సాంబమసురు బియ్యం లో కలిపి భారీ అమ్మకాలు జరుగుతున్నట్లుగా పోలీసులు విచారణలో బయటపడింది…
👉గుంటూరు: నేడు నందిగం సురేష్కు కస్టడీ.. 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించిన మంగళగిరి కోర్ట్.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. నందిగం సురేష్ను ప్రశ్నించనున్న పోలీసులు.

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..