చంద్రబాబుకు మోడీ వెన్నుపోటు..కూటమి సర్కార్‌ కూలడం గ్యారెంటీ ?.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సీఎం రేవంత్..విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు రూ.3,000 కోట్లు..పాత బకాయిలు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి..వైసీపీకి బాలినేని రాజీనామా..వరద ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం..రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి..కె.మల్లికార్జున..భారీగా పెరిగిన వంట నూనె ధరలు..ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు దారుణం..కంభం సిఐగా కే మల్లికార్జున

👉 జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా.. వరద బాధితులకు భారీ ప్యాకేజీ ప్రకటించిన చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన డబ్బులను కూడా ఇతర పనులకు మళ్లించారన్నారు. ఖర్చు పెట్టిన డబ్బును అకౌంట్‌లో చూపలేదని అన్నారు. అకౌంట్లను తారుమారు చేశారన్నారు. అన్ని శాఖల అకౌంట్లలో ఉన్న డబ్బులను గత ప్రభుత్వం ఖాళీ చేసిందన్నారు.
ఇల్లు మునిగిపోయిన….
వరదలతో ప్రజలు నరకయాతన అనుభవించారన్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ భూతాన్ని శాశ్వతంగా సమాధి చేయాలని పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని నిధులను దారి మళ్లించారని అన్నారు. తనకు అప్పలు చేయడానికి కూడా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశముందని తెలిపారు. వరద బాధితులకు 179 సచివాలయాల్లో ఏ ఇల్లు అయితే మునిగిపోయాయో వారందరికీ 25వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామని తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవారికి పదివేల రూపాయల ఆర్థికసాయాన్ని అందచేస్తామని తెలిపారు. నష్టపోయిన చిరువ్యాపారులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. టూ వీలర్స్ కు మూడు వేలు, త్రీవీలర్స్ కు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు. పంటలు కోల్పోయిన రైతులకు కూడా పరిహారాన్ని ప్రకటించారు. హెక్టార్ కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.
*వాట్ నాన్సెన్స్… తమాషాలా….?? రాజకీయం కోసం తిన్నింటి వాసాలు లెక్కపెడతారా…??*
మర్యాదగా చెప్తే అర్ధం కావడంలేదు వీళ్ళకు… ఇంకోసారి మాట్లాడితే… ఆ నాలుకలు…. వైసీపి దుష్ప్రచారం నేపథ్యంలో… సీఎం చంద్రబాబు ఆగ్రహం..*
***వరద బాధితులకు ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు.*
వంద రోజుల పాలనలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.
”భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తాం. ప్రతి ఇంటికి రూ.25వేలు ఆర్థిక సాయం చేస్తున్నాం. మొదటి అంతస్తులో ఉండే వారికి రూ.10వేలు,
ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10వేలు,
చిరు వ్యాపారులకు రూ.25వేల చొప్పున పరిహారం ఇస్తాం.
టూవీలర్స్‌కు రూ.3వేలు,
మూడు చక్రాల వాహనాలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం. ఫిషింగ్‌ బోట్‌, నెట్‌ పాక్షికంగా డ్యామేజీ అయితే రూ.9వేలు, పూర్తిగా డ్యామేజీ అయితే రూ.20వేలు ఇస్తాం. సెరీ కల్చర్‌కు రూ.6వేలు.
పశువులకు రూ.50వేలు. వరి ఎకరాకు రూ.10వేలు,
చెరకు రూ.25వేలు చొప్పున పరిహారం చెల్లిస్తాం” అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సాయం..”చేనేత కార్మికులకు రూ.15వేలు. *నష్టపోయిన ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సాయం చేస్తాం.*
రూ.40లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.లక్ష, రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న వాటికి రూ.1.5లక్షలు ఇస్తాం.
ఒక్కో కోడికి రూ.100, షెడ్డు ధ్వంసమైతే రూ.5వేలు.
పశువులకు రూ.50వేలు, ఎద్దులకు రూ.40వేలు.
దూడలకు రూ.25వేలు, గొర్రెలకు రూ.7500. ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తవి అందజేస్తాం.హెక్టారు పత్తికి రూ.25వేలు, వేరుశనగకు , హెక్టార్‌ ఫిషింగ్‌ ఫామ్‌ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15వేలు,
పసుపు, అరటికి రూ.35వేల చొప్పున సాయం.
మొక్క జొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15వేలు చొప్పున ఇస్తాం. బైక్‌ల బీమా, మరమ్మతులకు సంబంధించి 9వేలకు పైగా క్లెయిమ్‌లు పరిష్కరించాం. ద్విచక్రవాహనదారులు రూ.71 కోట్ల మేర క్లెయిమ్‌లు చేశారు. రూ.6కోట్లు చెల్లించాం.. 6వేల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి” అని సీఎం తెలిపారు.
👉చంద్రబాబుకు మోడీ వెన్నుపోటు…కూటమి సర్కార్‌ కూలడం గ్యారెంటీ ?
దేశవ్యాప్తంగా మళ్లీ జమిలీ ఎన్నికల పైన కొత్త చర్చ జరుగుతుంది. ఏ క్షణమైనా జమిలి ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు… విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అనే నినాదంతో మోడీ ప్రభుత్వం ప్రతిసారి ముందుకు వెళ్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిజెపి ఇదే వాదనను తెరపైకి తీసుకువస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక.. కారణంగా ఎన్నికల ఖర్చులు విపరీతంగా తగ్గుతాయని మోడీ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది.
ఎలాగైనా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలన్నది మోడీ లక్ష్యం. అయితే ఇప్పటివరకు ఆ దిశగా మోడీ సర్కార్ ఎక్కడ చర్యలు తీసుకోలేదు. కానీ మళ్ళీ జమిలి ఎన్నికల పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఈసారి సరైన మెజారిటీ రాలేదు. నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు నాయుడు సహాయంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అంటే మిత్రపక్షాలు సైడ్ అయిపోతే మోడీ ప్రభుత్వం కుప్పకూలడం గ్యారంటీ.
ఇలాంటి నేపథ్యంలో మోడీ మధ్యంతర ఎన్నికలకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేశారట. మధ్యంతర ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా… మోడీ ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల… మోడీ ప్రభావం అన్ని రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దానివల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితులు దేశ ప్రజలు లేరు.
అంటే ఓటర్లందరూ బిజెపి వైపు మొగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకే మోడీ ప్రభుత్వం మభ్యంతర ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 2026 వరకు ఈ ప్రక్రియ జరిగే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జంబి ఎన్నికలు నిర్వహిస్తే… చంద్రబాబు కూటమికి బిజెపి గుడ్ బాయ్ చెప్పే ఛాన్స్ ఉందట. ప్రాంతీయ పార్టీలు ఇలాగూ నష్టపోతాయి కాబట్టి సొంతంగా ఏపీలో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందట. అందుకే చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వార్తలు వస్తున్నాయి.
👉 గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్విఘ్నంగా సాగేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జన ప్రదేశాలను వారు పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
నిమజ్జన ప్రదేశాల్లో అమర్చిన క్రేన్స్ వద్ద పరిస్థితులను ముఖ్యమంత్రి పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బందితో మాట్లాడారు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునేలా సిబ్బందికి మూడు షిఫ్టుల్లో విధులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం కోసం వచ్చిన భక్తులను పలకరించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఆయన వెంట పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు జీఎహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌, హైదరాబాద్‌ సిటీ పోలీస్ కమిషనర్‌ ఇతర అధికారులు ఉన్నారు.
👉 వాట్ నాన్సెన్స్… తమాషాలా….?? రాజకీయం కోసం తిన్నింటి వాసాలు లెక్కపెడతారా…??*
మర్యాదగా చెప్తే అర్ధం కావడంలేదు వీళ్ళకు… ఇంకోసారి మాట్లాడితే…. వైసీపి దుష్ప్రచారం నేపథ్యంలో… సీఎం చంద్రబాబు ఆగ్రహం..*నువ్విచ్చిన జీవోను
నీ చెవికి కట్టి ఊరంతా తిప్పుతా.. ఏమనుకొంటున్నావో..
మెడికల్ కాలేజీల విషయంలో.. జగన్ అబద్దాల మీద నాయుడు ఫైర్ అయ్యారు.
👉 విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు రూ.3,000 కోట్లు..పాత బకాయిలు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి..జగన్‌ మిగిల్చిన అప్పులు.. తల్లిదండ్రులకు తిప్పలు!
అమరావతి: జగన్‌ ప్రభుత్వం నిర్వాహకం వల్ల పేద పిల్లల తల్లిదండ్రులు అప్పులపాలయ్యారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టి వెళ్లిపోవడంతో చాలా మంది అప్పులు చేసి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు డబ్బులు ఏనాడూ సకాలంలో ఇవ్వలేదు. ఎన్నికల ముందూ డబ్బులు ఎగ్గొట్టి పేదలపై ఆర్థిక భారం మోపారు. గతంలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌ మొత్తాలను నేరుగా కళాశాలల ఖాతాల్లో వేసే వారు. జగన్‌ వచ్చాక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో తల్లుల ఖాతాల్లో వేసే విధానం తెచ్చారు. దీంతో కళాశాలకు ప్రభుత్వానికి మధ్య సంబంధం తెగిపోయింది. తల్లుల ఖాతాల్లో జగన్‌ ఫీజు డబ్బులు వేయకపోయినా.. కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి భరించలేక తల్లిదండ్రులు, విద్యార్థులు అప్పులు చేసైనా కడుతూ వస్తున్నారు.
ఫీజులు ఎగ్గొట్టి..2023-24 విద్యా సంవత్సరంలో 4 త్రైమాసికాలకు ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. ఎన్నికల ముందు ఒక విడత విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అవి కూడా చాలా మంది ఖాతాల్లో పడలేదు. ఎలాగూ తల్లుల ఖాతాల్లో డబ్బు పడిందని ఆ మొత్తం చెల్లించాల్సిందేనని యాజమాన్యాలు అప్పట్లో ఒత్తిడి చేశాయి. ఫీజులు కడితేనే పరీక్షలకు అనుమతిస్తామని డిగ్రీ మూడో ఏడాది, బీటెక్‌ నాలుగో ఏడాది విద్యార్థులను యాజమాన్యాలు హెచ్చరించడంతో అప్పులు చేసి చెల్లించారు. మిగతా విద్యార్థులు కొంత చెల్లించగా.. మిగతా బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం(2024-25) మొదలైనందున బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. చెల్లిస్తేనే తరగతులకు రానిస్తామని తిరుపతిలో ఓ యాజమాన్యం నోటీసు బోర్డులో పెట్టింది. వైకాపా హయాంలో చెల్లించాల్సిన విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు రూ.3,480 కోట్ల వరకు ఉన్నాయి.వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ వారికి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య తదితర కోర్సులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని చెప్పిన జగన్‌ ఎప్పుడూ సక్రమంగా ఇవ్వలేదు. ట్రిపుల్‌ ఐటీ పిల్లలు సొంతంగా మెస్‌ ఛార్జీలు చెల్లించారు. 2020-21 నుంచి పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకాన్ని నిలిపేసిన జగన్‌.. అంతకుముందు ప్రవేశాలు పొందిన వారికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు బకాయి పెట్టారు.
👉 ప్రైవేటుకే మద్యం వ్యాపారం అప్పగింత..
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. త్వరలో తీసుకురాబోయే నూతన మద్యం విధానంలో 3,396 దుకాణాలను నోటిఫై చేయనున్నారు. గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 (10 శాతం) నోటిఫై చేయనున్నారు. వీటన్నింటికీ దరఖాస్తులు ఆహ్వానిస్తారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని వ్యక్తులైనా నిర్దేశిత రుసుము చెల్లించి వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు.
👉 భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
ఆందోళన చెందుతున్న ప్రజలు..కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ షాక్‌ ఇచ్చింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం వరకు పెంచేసింది. దీంతో సన్‌ఫ్లవర్‌, సోయాబీన్‌, రిఫైన్డ్‌ పామాయిల్‌, వేరుశనగపై ఇంపోర్ట్‌ టాక్స్‌ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి చేరింది. అన్ని రకాల నూనెల ధరలు లీటర్‌పై ఒక్కసారిగా రూ.15-20 వరకు పెరిగాయి. పామాయిల్‌ ధర రూ.100 నుంచి రూ.115-120, సన్‌ఫ్లవర్‌ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165-170కు చేరింది.
👉 ఏలూరు జిల్లా.. శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం బాలికల వసతి గృహంలో వార్డెన్ భర్త బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వైనం.
2023 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో దాదాపు 45 మంది విద్యార్థులు చిన్న తరగత నుండి డిగ్రీ వరకు ఆశ్రయం పొందుతున్నరు.
బాలిక రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
వెంటనే స్పందించిన ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ భీమడోలు సీఐ యూజే విల్సన్ రెండో పట్టణ సీఐ వెంకటరమణ గణపవరం సిఐ సుభాష్ రెండో పట్టణ మహిళా ఎస్సై నాగ కళ్యాణి రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ లతో ప్రత్యేక విచారణ చేస్తున్న పోలీసులు..
లైంగిక దాడికి పాల్పడిన శశి కుమార్ బీసీ వెల్ఫేర్ లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు. స్థానికంగా ఒక స్టూడియో నిర్వహిస్తున్నాడు…ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్..వార్డెన్ భర్త కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్పిస్తానని ఆశ్రమానికి వస్తున్నాడు బాలిక ఇచ్చిన ఫిర్యాదు వరకు కేసు నమోదు చేశాము.పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసాం. నిన్నితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం. నిందితుడు స్థానికంగా ఒక ఫోటో స్టూడియో ను నిర్వహిస్తున్నాడు.పూర్తి వివరాలు వెల్లడి చేస్తాం..
👉దారుణం.. ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు
దారుణం.. ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు
గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరి గొంతు కోసిన ఘటన మేడ్చల్ మున్సిపాలిటి పరిధిలో జరిగింది. కిష్టాపూర్ గ్రామంలో బీహార్‌కు చెందిన పవన్ కుమార్‌, సంతోష్ జీవనం సాగిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి పరారయ్యారు. గమనించిన స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అందులో సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. జిల్లా ఇన్చార్జ్ అజీమ్ భాష
👉 వైసీపీకి బాలినేని రాజీనామా.. రేపు పవన్ తో భేటీ..
ప్రకాశం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్ కు బాలినేని పంపారు. పార్టీ తీరుపై ఎన్నికల సమయం నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్తో భేటీ అనంతరం కూడా బెట్టు వీడలేదు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్న బాలినేని జనసేనలో చేరికపై ఆయనతో చర్చించనున్నారు.
👉ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్..
టీడీపీలో చేరిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ..
పద్మశ్రీతో పాటు పార్టీలో చేరిన పలువురు వైసీపీ నేతలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్..
అమరావతిః అభివృద్ధిని కాంక్షించి పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ.అశోక్, ఎస్.కిషోర్, ఎస్.మురళీ, రెడ్డి కిషోర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
👉 కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కె.మల్లికార్జున ఈరోజు ఉదయం 11:27 గంటలకు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా K.మల్లికార్జున, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ వారికి సర్కిల్ ఆఫీస్ సిబ్బంది స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేయుచున్నారు.
**వరద ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం*
*రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి.1000 మందికిబాధితులకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం కిట్ల పంపిణీ..
*బుడమేరు వరద బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన వరద ముంపు బాధితులు అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు.*
మంగళవారం పంజా సెంటర్ ప్రాంతంలో నంద్యాల కు చెందిన గురు రాఘవేంద్ర విద్యాసంస్థల తరపున డైరెక్టర్లు షేక్షావల్ రెడ్డి, మౌలాలి రెడ్డి నేతృత్వంలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున 1000 మందికి బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు.పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు ఎన్ఎండి ఫరూక్,బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వరద మంపుతో నష్టపోయిన బాధితులు అందరినీ ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్లి పరిశీలించి నివేదిక రూపొందించడం జరిగిందన్నారు. *విపత్తు కారణంగా బాధితులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రివర్గం నిరంతరo అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.* వరద బాధితులను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, వివిధ సేవా సంస్థలు, విద్యాసంస్థలు,ఎందరో దాతలు, వివిధ వర్గాలకు చెందిన వారంతా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తూ తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.ధన రూపేనా, వస్తురూపేనా, వస్త్ర రూపేనా దాతలు రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు వచ్చి ముంపు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలోనే బాధితులకు చేయూతని అందిస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రులు ఫరూక్, జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ, టిడిపి మైనార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. *మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం*
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ చేగిరెడ్డి.తులసమ్మ, జడ్పిటీసి కొత్తపల్లి.జ్యోతి మరియు సర్పంచ్(రజిని)బి.తిరుపాలమ్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంఈఓ మరియు ఎస్జిఎఫ్ చైర్మన్ బి.మాల్యాద్రి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు.సామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ విజయ బావుటాను ఎగురవేయాలని అన్నారు. ఎస్జీఎఫ్ క్రీడల్లో కోకో,కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్,యోగా,అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనేందుకు మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.సుబ్రహ్మణ్యం, ఎన్సీసీ అధికారి ఇక్బాల్ భాషా తదితరులు పాల్గొన్నారు.
👉వీఆర్వో పై వైసీపీ సర్పంచ్ భర్త దాడి.*
(*కృష్ణా జిల్లా, కొత్త మాజేరు, చల్లపల్లి మండలం)
*కృష్ణాజిల్లా చల్లపల్లి మండలానికి చెందిన కొత్త మాజేరు విఆర్ఓ పై గ్రామ సర్పంచి భర్త దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో వరద నష్టం అంచనాకు వెళ్లిన విఆర్ఓ పై తన ఆదేశాలు పాటించలేదని ఆగ్రహంతో సర్పంచి భర్త వి ఆర్వో పై దాడి చేసినట్లు సమాచారం.గ్రామ సచివాలయంలో పలువురు గ్రామస్తులు, ఉద్యోగుల మధ్య సర్పంచ్ భర్త దాడికి గురైన వి ఆర్ ఓ తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లు సమాచారం.దాడి ఘటన బయటకు రాకుండా గ్రామ పెద్దలు రాజీ మార్గంలో సయోధ్య కుదరచడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ భర్త గత చాలా కాలంగా ఈ విధంగా దుందుడుకు స్వభావం కలిగి ఉండటం తన భార్యకు ఉన్న అధికారాలను హస్తగతం చేసుకొని దౌర్జన్యాలకు పాల్పడటం ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకొని సొంత కార్యకలాపాలకు వినియోగించుకోవడం తన మాట వినని వారిపై గత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారిందని పలువులు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మారినప్పటికీ సర్పంచి భర్త ఆగడాలు నియంత్రణ కాకపోగా శృతిమించటం పై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సర్పంచి భర్త ఆగడాలపై ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని పలువురు గ్రామస్తులు, ఉద్యోగులు పార్టీ కార్యకర్తల కోరుతున్నారు. సర్పంచి భర్త ఆధిపత్యానికి దుందుడుకు స్వభావానికి భయపడుతున్న వీఆర్వో విషయాన్ని బయటకు పొక్కకుండా చేసి సర్పంచి భర్త నుండి తనకు రక్షణ కల్పించాలని గ్రామంలో పెద్ద మనుషులను వేడుకుంటున్నట్టు సమాచారం.*
*లక్ అంటే ఇదే.. పొలానికి వెళ్తే వజ్రం దొరికింది* !
కర్నూలు(D) తుగ్గలి (M) సూర్యతండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీకి వజ్రం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. అది 8 క్యారెట్ల వజ్రం అని తేల్చారు. పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.5లక్షలకు దానిని కొనుగోలు చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో వజ్రాల నిక్షేపాలున్నాయని GSI గుర్తించిన నేపథ్యంలో అక్కడి ప్రజలు వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..