వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా?..ఉండదా?.. ఒక్కమాటలో తేల్చేసిన సీఎం చంద్రబాబు..త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో వైకాపా విలీనం ఖాయం: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు..పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించిన జెవి.సంతోష్.. వరద బాధితులకు కమలా విద్యాసంస్థల విరాళం..కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు..రేషన్ మాఫియా ఇరువర్గాల ఆదిపత్య పోరులో ఒకటి పట్టుకోబోతే, మరోటి దొరికింది.. సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల

[9/19, 2:52 PM] Shamsheer Baig: *నెల్లూరులో వైసీపీ భూస్థాపితం*
-మంత్రి లోకేష్ స‌మ‌క్షంలో మంత్రి నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో టీడీపీలో చేరిన 14 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు
-14 మంది వైసీపీ కార్పొరేట‌ర్లతో పాటు వైసీపీ ఆర్య‌వైశ్య‌సంఘం అధ్య‌క్షుడు ముక్కాల ద్వార‌కానాథ్‌ ఈ రోజు టీడీపీలో చేరిక‌
-ఉండ‌వ‌ల్లిలో పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్
-కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, ప‌ట్టాభిరామిరెడ్డి, డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్‌*
-నెల్లూరు కార్పొరేష‌న్‌లోని 54 డివిజ‌న్లలో ఇప్ప‌టివ‌ర‌కు టీడీపీ తీర్థం పుచ్చుకున్న‌ 43 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు
-నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో 23 మంది, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ‌ప‌రిధిలో 20 మంది కార్పొరేట‌ర్లు చేరిక‌
ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు రాజ‌కీయాల‌కు స‌ఫ‌రేట్ రూట్ ఉంది. సింహ‌పురి రాజ‌కీయ వేడి రాష్ట్ర‌మంతా ఉంటుంద‌నే జ‌గ‌మెరిగిన స‌త్యం… ఈ నేప‌థ్యంలో నెల్లూరులో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎన్న‌డూలేనివిధంగా నెల్లూరులో రాష్ట్ర‌పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ చేప‌డుతున్న అభివృద్ధి, కార్య‌క‌ర్త‌ల‌కు క‌ల్పిస్తున్న భ‌రోసా, ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న ధైర్యాన్ని చూసిన ప‌లువురు వైసీపీ కార్పొరేట‌ర్లు మ‌న‌సు మార్చుకుంటున్నారు. నారాయ‌ణ సార్‌తోనే అభివృద్ధి జ‌రుగుతుంద‌ని భావించి టీడీపీలో చేరేందుకు ముందుకొచ్చారు.
ఈ నేప‌థ్యంలో గురువారం ఉద‌యం అమ‌రావ‌తిలోని ఉండ‌వ‌ల్లి సీఎం నివాసంలో మంత్రి నారా లోకేష్ స‌మ‌క్షంలో పుర‌పాల‌క‌శాఖ‌ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో నెల్లూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ 14 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు, ఆర్య‌వైశ్యసంఘం రాష్ట్ర వైసీపీ అధ్య‌క్షుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో 3వ వార్డు కార్పోరేటర్ సంక్రాంతి అశ్విని, 4వ వార్డు కార్పోరేటర్ పి.ప్రత్యూష, 5వ వార్డు కార్పోరేటర్ ఓ.రవిచంద్ర, 6వ వార్డు కార్పోరేటర్ ఎమ్.మస్తానమ్మ, 10వ వార్డు కార్పోరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్, 11వ వార్డు కార్పోరేటర్ గోతం అరుణ, 14వ వార్డు కార్పోరేటర్, రాష్ట్ర వైసీపీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి కర్తం ప్రతాప్ రెడ్డి, 15వ వార్డు కార్పోరేటర్ జి.వెంకటేశ్వర్ రెడ్డి, 16వ వార్డు కార్పోరేటర్ వి.శ్రీకాంత్ రెడ్డి, 47వ వార్డు కార్పోరేటర్ పొట్లూరు రామకృష్ణ, 48వ వార్డు కార్పోరేటర్ షేక్ ఇంతియాజ్, 49వ వార్డు కార్పోరేటర్ వి.రాజేశ్వరి, 51వ వార్డు కార్పోరేటర్ కాయల సాహిత్య, 54వ వార్డు కార్పోరేటర్ షేక్ సఫియా బేగం, కో-ఆప్షన్ మెంబర్ షేక్ జమీర్‌తో పాటు వైసీపీ ఆర్య‌వైశ్యసంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఉన్నారు. తామంతా టీడీపీలో చేరుతామ‌ని మంత్రి నారాయ‌ణ‌కు వారు ఆశ్ర‌యించారు. ఇందుకు సుముత వ్య‌క్తం చేసిన మంత్రి నారాయ‌ణ… వారంద‌రినీ నారా లోకేష్ స‌మ‌క్షంలో పార్టీ కండువాలు క‌ప్పి సాద‌రంగా టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీ శ్రేణుల స‌మ‌న్వ‌యంతో నెల్లూరు న‌గ‌రాభివృద్ధికి కృషి చేయాల‌ని పార్టీలో చేరిన వారికి మంత్రి నారాయ‌ణ సూచించారు. అయితే ఈ చేరిక‌ల‌కు వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, ప‌ట్టాభిరామిరెడ్డి, డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. నెల్లూరు కార్పొరేష‌న్‌లోని 54 డివిజ‌న్లలో ఇప్ప‌టివ‌ర‌కు 42 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు, ఒక‌రు కో-ఆప్ష‌న్ స‌భ్యుడుతో క‌లిపి 43 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో 23 మంది, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ‌ప‌రిధిలో 20 మంది కార్పొరేట‌ర్లు అధికారికంగా టీడీపీలో చేరారు. కాగా ఇదిలాఉంటే మ‌రికొంత మంది వైసీపీ శ్రేణులు పెద్ద‌సంఖ్య‌లో అతిత్వ‌ర‌లో టీడీపీలో చేరనున్న‌ట్లు స‌మాచారం. ఇదే జ‌రిగితే నెల్లూరులో వైసీపీ భూస్థాపితం కానుంద‌ని ప‌లువురు అంటున్నారు..
👉వరద బాధితులకు కమలా విద్యాసంస్థల విరాళం
మార్కాపురం పట్టణం లోని కమలా విద్యాసంస్థల విద్యార్థిని,విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు యాజమాన్యం రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వలన అతలాకుతులమైన విజయవాడ ప్రాంతం ప్రజలకు సహాయార్థం తమవంతుగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి ఒక లక్ష రూపాయల చెక్కును అందజేశారు .ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని ,విద్యార్థులు, ఉపాధ్యాయులు సేవాభావంతో ముందుకు వచ్చి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కమలా విద్యాసంస్థల కరస్పాండెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ శ్రీ పి. పవన్ కుమార్ గారు పాఠశాలల ,కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు
👉 రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి..
👉 మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు..
మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి విడదల రజినిపై పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. విడదల రజిని అక్రమాలపై యడ్లపాడు బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన ఆమె.. రజిని అక్రమాలపై విచారణకు ఆదేశించారు.
👉ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా?..ఉండదా?.. ఒక్కమాటలో తేల్చేసిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? లేదా?
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై గందరగోళం కొనసాగుతోంది.
వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు.. ఆ అంశాన్ని కూడా ఏపీ కేబినెట్‌ ఎజెండాలో చేర్చినప్పటికీ.. ప్రభుత్వం పక్కన పెట్టింది.ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ప్రభుత్వ శాఖల్ని ఇంటిగ్రేటెడ్‌ చేస్తూ సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారుల్ని ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.మొత్తం మీద ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థన ఉంటుందని చెబుతూనే.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటోంది.
👉త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో వైకాపా విలీనం ఖాయం: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు*
రాష్ట్ర చరిత్రలోనే చెరగని సంక్షేమ సంతకం చేస్తున్న కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనతో విపక్ష వైకాపా దిక్కుతోచని స్థితిలో పడిందని, కాంగ్రెస్‌ పార్టీలో వారి విలీనం ఖాయంగా కనిపిస్తు ందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా సాగుతున్న ప్రజాకర్షక పాలన తో ఇక వారికి పుట్టగతులు ఉండవనే వైకాపా నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు వైకాపా నేతలు తమ సొంతగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా, వాళ్లందరికంటే ముందుగా జగన్ కూడా అదే పనిలో విలీన రాయబారాల్లో బిజిబిజీగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన దగ్గర్నుంచి బెంగళూరు లో అదే పనిగా పెట్టుకున్నట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. ఈ నెల 20వ తేదీతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వందరోజుల సందర్భంగా గురువారం ఈమేరకు గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే జీవీ. ఎన్డీయే కూటమి 100 రోజుల పాలన అద్భుతంగా ఉందని ప్రజలు శభాష్ అంటుంటే జగన్, వైకాపా నేతలు జీర్ణించుకోలేక అవస్థ పడు తున్నారని చురకలు వేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మాది అని ప్రజలంతా అనుకునేలా తమ ప్రభుత్వం 100 రోజుల పాలన సాగిందన్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకుంటునే రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయే జూన్‌-14వ తేదీన చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలతోనే రాష్ట్రం దశ మారిందని, మాటిచ్చిన సంక్షేమాన్ని రెండింతలుగా అందించడంలో కూటమి చరిత్ర సృష్టిస్తోందన్నారు. ప్రజల కోసం పాలన బ్రహ్మాండంగా ఉందని, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛను వెయ్యి రూపాయలు పెంచారని, మొదటి నెలలోనే 3 నెలల బకాయిలు కలిపి ఇచ్చారని, ప్రతినెలా 1వ తేదీనే ఇళ్ల వద్ద రూ.4 వేల పింఛన్ ఇస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలమందికి ఏకకాలంలో పంపిణీ చేస్తున్నారన్నారు. అది చూసిన తర్వాత కూటమి గెలిచి, చంద్రబాబు సీఎం అయితే సంక్షేమం ఆగిపోతుందని ప్రచారం చేసిన వారంతా నాలుక కరుచు కుంటున్నారని చురకలు వేశారు. మరీ ముఖ్యంగా వైకాపాలో వణుకు తారాస్థాయికి చేరిందన్నా రు జీవీ. రామలక్ష్మణులాగా సమన్వయంతో పనిచేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దెబ్బతో వైకాపా మొత్తం తట్టాబుట్టా సర్దుకునే పనిలో పడిందన్నారు. ఈ సూపర్ హిట్టు జోడి పాలన, ఇటు రాజకీయంలోనూ రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నారన్నారు. వైసీపీ నాయకులు ఏం చేయాలో అర్థంగాని పరిస్థితిలో తలోదారి వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత ఆ పార్టీ పతనం మరింత వేగం పుంజుకోవడం ఖాయమన్నారు. బాలినేని బాటలోనే ఇంకా చాలామంది నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారని, వైసీపీకి మనుగడ లేదని, అక్కడ ఉంటే ఉనికికే ప్రమాదమని వాళ్లంతా ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరాలనే ఉద్దేశంతో బెంగళూరులో కూర్చొని మంతనాలు జరుపుతున్నారని వెల్లడించారు. ఇలా స్వయంగా పార్టీ అధ్యక్షుడే దిక్కులేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరాలని జగన్‌రెడ్డి చూస్తుంటే ఆ పార్టీ నాయకులు ఏ పార్టీలో చేరాలో తెలియక సందిగ్ధంలో పడిపోయారన్నారు. కొంతమంది బీజేపీలోకి, మరికొంతమంది తెలుగుదేశంలోకి, ఇంకొంతమంది కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు. ఇక భవిష్యత్తులో వైసీపీకి మనుగడ ఉండదన్నారు. భవిష్యత్తులో ఏపీని దేశానికే ఆదర్శంగా స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే ఆశయంతో చంద్రబాబు, పవన్ కష్టపడి పని చేస్తున్నారని, రానున్న 15 సంవత్సరాల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో అద్భుతమైన రాష్ట్రంగా ఏపీ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. దేశంలోనే ఏపీ ఒక ఆదర్శంగా నిలబడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.
👉వరద బాధితులకు కమలా విద్యాసంస్థల విరాళం.. మార్కాపురం పట్టణం నందు గల కమలా విద్యాసంస్థల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు యాజమాన్యం రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వలన అతలాకుతులమైన విజయవాడ ప్రాంతం ప్రజలకు సహాయార్థం తమవంతుగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి ఒక లక్ష రూపాయల చెక్కును అందజేశారు .ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని ,విద్యార్థులు, ఉపాధ్యాయులు సేవాభావంతో ముందుకు వచ్చి వారిని అభినందించారు.కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ వైస్ ప్రెసిడెంట్ పి.పవన్ కుమార్ పాఠశాలల,కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.
👉వికారాబాద్ జిల్లాలో కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు..వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ లో బుధవారం అర్ధరాత్రి దారుణ సంఘ టన చోటుచేసుకుంది. కన్నతల్లిని కొడుకు చంపిన ఘటన సంచలనంగా మారింది. సయ్యద్‌ మల్కాపూర్‌ లో శంకరమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే తన కొడుకు రోజు తాగి ఇంటి వస్తుండంలో తల్లి కొడుకును మందలిం చేది. కుటుంబానికి పోషించాల్సిన కొడుకే ఇలా తాగి ఇంటికి వస్తే ఎలా? అంటూ రోదించేది?. విసుగు చెందిన కొడుకు తల్లిపై కక్ష పెంచుకున్నాడు.బుధవారం అర్ద రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. దీంతో కొడుకును తల్లి మందలించడంతో ఆవేశం చెందిన కొడుకు ఆమెతో వాదించాడు. గొడవ తాగిన మైకంలో తల్లిని తన్నడంతో ఒక్కసారిగా తల్లి శంకరమ్మ రోడ్డుపై కుప్ప కూలింది. అయినా తల్లిపై కొడుకు కర్కశంగా ప్రవర్తించడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొడుకు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లిపోయాడు. అయితే స్థానికులు శంకరమ్మను తట్టిలేపిన స్పందించలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పరిగి పోలీసులు శంకరమ్మ మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. శంకరమ్మ కుటుంబ సభ్యులను, ఇంటిదగ్గర పరిగి పోలీసులు విచారణ జరిపారు.కొడుకును అదుపులో తీసుకుని దర్యాప్తు చేపట్టారు.కొడుకు శంకరమ్మను బలంగా తన్నడంతో ఆమె చనిపోయింది.
👉పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించిన జెవి.సంతోష్* గురువారం పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా జెవి.సంతోష్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో నంద్యాల జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహించి పదోన్నతి పొంది, పల్నాడు జిల్లాకు అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నూతన అడిషనల్ ఎస్పీ ని పలువురు జిల్లా పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసారు.
👉రేషన్ మాఫియా ఇరువర్గాల ఆదిపత్య పోరులో ఒకటి పట్టుకోబోతే, మరోటి దొరికింది*
ఎ.కొండూరు: చౌకబియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు తార్కాణం ఈ ఉదంతం.ఎన్టీఆర్ జిల్లా ఎ. కొండూరు మండలం గోపాలపురం వద్ద ఇరువర్గాల వారు పరస్పరం కార్లతో ఢీకొట్టుకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు. తిరువూరు నియోజకవర్గంలో వైకాపా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి రాజుపేటలోని రైస్ మిల్లు కేంద్రంగా కాకినాడ పోర్టుకు ప్రతినెలా పదుల సంఖ్యలో రేషన్బియ్యం లారీలను తరలించి రూ.కోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వం మారాక అతని వ్యాపారానికి అడ్డుకట్ట పడింది. ఆ దందాను మరో మాఫియా నిర్వాహకుడు చేజిక్కించుకున్నాడు. వీరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఆదివారం గోపాలపురం నుంచి చౌక బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధంకాగా, మరోవర్గం వారు యూటు ఛానళ్ల విలేకరులతో కలిసి అడ్డుకునేందుకు
ప్రయత్నించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న లారీకి కారు అడ్డుపెట్టడంతో ఆగ్రహించిన ప్రస్తుత మాఫియాలోని వ్యక్తులు ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డారు. లారీకి అడ్డుగా ఉన్న కారును మరో కారుతో ఢీకొట్టారు. దీంతో ఆ కారు రహదారి పక్కనున్న కాల్వలోకి పల్టీ కొట్టింది..
ఒకటి పట్టుకోబోతే, మరోటి దొరికింది.**ఈ ఘర్షణ జరుగుతుండగానే బియ్యం లారీని అక్కడి నుంచి పంపించగా, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద అధికారుల తనిఖీలో దొరికింది. గోపాలపురానికి ఆలస్యంగా చేరుకున్న పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులకు మరో విచిత్ర అనుభవం ఎదురైంది. ఇక్కడి నుంచి బియ్యం తరలిస్తున్న లారీకి బదులు, గుంటూరు నుంచి ఛత్తీస్ గడక్కు చౌకబియ్యం తరలిస్తూ పోలిశెట్టిపాడు సమీపంలోని పెట్రోల్ బంకులో నిలిపి ఉన్న లారీ పట్టుబడింది. దీనిపై డిప్యూటీ తహసీల్దార్ శ్వేతను వివరణ కోరగా తాము ఘటనా స్థలానికి చేరుకోకముందే గొడవ జరిగిందని తెలిపారు.
👉హోం మంత్రి అనితను కలిసిన ముంబయ్ నటి జెత్వాని..*కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని కోరిన నటి జెత్వాని..
*కేసు ముగిసే వరకూ విజయవాడలో భద్రత కల్పించాలంటూ వినతిపత్రం అందజేసిన ముంబయ్ నటి..
*నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పిన హోంమంత్రి..*ఐపీఎస్ లపై చర్యలు తీసుకున్నందుకు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జెత్వాని కుటుంబం*
*👉పవన్‌కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం మాజీ ఎమ్మెల్యే లు ప్రయత్నం..మాజీ ఎమ్మెల్యే లు జనసేన లోకి వెళ్తారంటూ ప్రచారం.జనసేనలోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల్లో చాలా మంది ప్రస్తుత, మాజీలు జనసేన వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.*రెండు, మూడు రోజుల్లో వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు వరుసగా సమావేశం కానున్నారు. *జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోశయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పవన్‌కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారట.
👉పొదిలి ఆర్టీసీ డిపోలో రెండు సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డికార్యక్రమంలో పాల్గొన్న డిపో మేనేజర్ సుందర్ రావు, టిడిపి మండల,పట్టణ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.
👉 కనిగిరి శాసనసభ్యులు డా.ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ పల్లి నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన జి కోటయ్య 👉 కనిగిరి శాసనసభ్యులు డా.ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసిన హెచ్ఎం పాడు నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన మాధవరావు..👉 కనిగిరి శాసనసభ్యులు డా.ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసిన పామూరు నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన కిషోర్ బాబు ..👉కనిగిరి శాసనసభ్యులు డా.ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ని మార్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన టీ శ్రీ రామ్

7k network
Recent Posts

అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ -తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్..బోరుగడ్డ అనిల్ మరో జైలు వీడియో వైరల్..అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో వీధి రౌడీళ్ళ ప్రవర్తిస్తున్న విద్యార్థులు..మంత్రి లోకేశ్ కృషితో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..సైబర్ క్రైమ్‌ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు.. షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు.. ఘనంగా ఎంపీ మాగుంట తనయుడి జన్మదిన వేడుకలు.. గిద్దలూరు నగరపంచాయతీ అధికారుల తీరుపై సబ్ కలెక్టర్ అసహనం..

అసెంబ్లీ సమావేశాలు ఎవరి కోసమూ ఆగవని ముఖ్యమంత్రి చంద్రబాబు..పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు..వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు.. పోసానిపై పోలీసులకు ఫిర్యాదు,.హైదరాబాద్‌‌లోని బార్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు..హైదరాబాద్‌‌లోని బార్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు..కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడి సంచలన ఆరోపణలు.. ఉపాధి హామీ పథకం సిబ్బంది నిరసన..పంటల బీమా తో రైతుకు ధీమా.

బిఆర్ఎస్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క..వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి (పెనుగ్రంచిప్రోలు)..బాసర IIT లో విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన..బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కాలం చెల్లిన మందులు ?..చింతలపూడి యూనియన్ బ్యాంక్ వద్ద 4 లక్షల రూపాయలు అపహరణ..పలు కార్యక్రమాలలో ఎంపీ మాగుంట.. కంభంలో అక్రమ మద్యం పట్టివేత

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయవద్దని పదిలక్షల పోస్టు కార్డులతో ..రాజ్యాంగం రెడ్‌బుక్‌ని అర్బన్‌ నక్సలిజంతో పోలుస్తారా..అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది జగన్ తీరు: షర్మిల..వైసీపీ సోషల్ మీడియా వర్రా రవీంద్ర అరెస్ట్..సీసీ టీవీ ఫుటేజీ లీకేజీ వ్యవహారంలో టెక్నీషియన్ & విలేకరిపై కేసు..అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ పోలీసులకు వినతిపత్రం ఇచ్చిన కడప జర్నలిస్టులు..ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య?.. పొదిలిలో అక్రమ మద్యం స్వాధీనం..ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్న నాయబ్ రసూల్.

కేసీఆర్ మహబూబ్ నగర్ కు ఏం చేశారు?.. సీఎం రేవంత్ రెడ్డి….దొంగ నోట్లు చలామణి ముఠాను అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు….విజయవాడ లో నిర్వహిస్తున్న భిన్నత్వంలో ఏకత్వం కార్యక్రమానికి విచ్చేయనున్న శ్రీ శ్రీ రవి శంకర్ జి..

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో 2,04,414 నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు?..సమగ్ర సర్వే పైన లేని పోనీ అపోహలు వద్దు- షబ్బీర్ అలీ….ఆధార్ కార్డులో పొరపాటున ఒక్క అక్షరం దొర్లిన అడిగినంత సమర్పించాల్సిందే..గోపవరంలో పట్టపగలు ఘరానా మోసం..వామ్మో అవినీతి కి కేరాఫ్ అడ్రస్ ఇతను ..భూ మార్పిడి పేరుతో 100 కోట్ల దోపిడీ..రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 100 చెంచు కుటుంబాలకు టార్పాలిన్ పట్టలు, దుప్పట్లు పంపిణి.