గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో 2,04,414 నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు?..సమగ్ర సర్వే పైన లేని పోనీ అపోహలు వద్దు- షబ్బీర్ అలీ….ఆధార్ కార్డులో పొరపాటున ఒక్క అక్షరం దొర్లిన అడిగినంత సమర్పించాల్సిందే..గోపవరంలో పట్టపగలు ఘరానా మోసం..వామ్మో అవినీతి కి కేరాఫ్ అడ్రస్ ఇతను ..భూ మార్పిడి పేరుతో 100 కోట్ల దోపిడీ..రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 100 చెంచు కుటుంబాలకు టార్పాలిన్ పట్టలు, దుప్పట్లు పంపిణి.

👉సామాన్యులు ఎప్పుడు క్షేమంగా ఉంటారు మోడీ జీ?..రాహుల్..‘మోడీ జీ.. మీ పాలనలో సామాన్యులు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు?’అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.ఇవాళ బిహార్‌లో రైలు ఇంజిన్, బోగీల మధ్య చిక్కుకొని ఉద్యోగి చనిపోయిన ఘటనపై రాహుల్ తీవ్రంగా స్పందించారు.‘మీరేమో అదానీని రక్షించడంలో బిజీగా ఉన్నారు.ఈ భయానక చిత్రం రైల్వేలో సుదీర్ఘకాలంగా తాండవిస్తున్న నిర్లక్ష్యానికి, అంతంతమాత్రంగానే జరుగుతున్న నియామకాలకు నిదర్శనం’ అని ట్విట్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
👉మానవత్వం చాటుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్*
గుంటూరులో పవన్ కళ్యాణ్ సభ ఉండటం వలన ట్రాఫిక్ ఆగిపోవడంతో చిలకలూరిపేట కు చెందిన కొమ్మినేని వారి అంబులెన్స్ లో ఉన్న పేషెంట్ కు దారి ఇచ్చిన అధికారులు… అంబులెన్స్ లోనే చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది…
👉పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష..
మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దని ఆదేశం..గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన..ఇటీవల 25వేల కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులను ప్రశంసించిన హోంమంత్రి.
మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి అనిత అధ్యక్షతన శనివారం సమీక్ష సమావేశం జరిగింది.ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ అదృశ్య కేసులలో గాలింపు చర్యలపై వేగం పెంచి ఎటువంటి అఘాయిత్యం జరగముందే పట్టుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి కేసులలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లు, కోర్టుల ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఛార్జీషీట్లు వేయడం, నిందితుల అరెస్ట్ లలో జాప్యం లేకుండా చేసి నేరాలను నియంత్రించడంపై శ్రద్ధ వహించాలన్నారు. ఇకపై చిన్నారులు,మహిళలకు సంబంధించిన సున్నితమైన కేసులలో ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు సమీక్ష చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బృందం అక్రమంగా రవాణా చేస్తున్న 25,251 కేజీల గంజాయిని పట్టుకోవడాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి ప్రశంసించారు. ఈ కేసులో 373 వాహనాలను స్వాధీనపరచుకోవడం, 2,237 మంది నిందితులను గుర్తించడంలో కృషిని మెచ్చుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా వ్యవహరించే వారికి సందేశమిచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సోషల్ మీడియా వేదికగా పేట్రేగిపోతున్న చీడపురుగుల్లా వ్యవహరించే వారికి బుద్ధిచెప్పేలా కూటమి ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడం దిశగా చిత్తశుద్ధితో ముందుకెళుతోందన్నారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా పని చేయడంలో పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హోంమంత్రి వెల్లడించారు. అన్ని జిల్లాలలో సీసీ కెమెరాలకు సంబంధించి డ్రైవ్ చేపట్టాలన్నారు. హోంమంత్రి ఆదేశాల ప్రకారం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిబద్ధతతో వ్యవహరించనున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ లడ్డా, సీఐడీ ఏడీజీ రవిశంకర్, యాంటీ నార్కోటిక్ చీఫ్ ఆకే రవికృష్ణ, లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్ సహా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
👉గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో 2,04,414 నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు జరిగాయని మాజీ మంత్రి,టీడీపీ సీనియర్‌ నాయకురాలు పీతల సుజాత వెల్లడించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యకర పోస్టులు పెడుతున్న వర్రా రవీంద్రారెడ్డి సైకోలాంటి వాడని, ఆయన వెనుక ఎవరున్నారు? ఎక్కడి నుంచి జీతం వస్తోందని ప్రశ్నించారు. అన్నింటిపైనా సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు. ‘‘తాడేపల్లి ప్యాలె్‌సలో కూర్చున్న పెద్ద తిమింగలాలను కూడా వదిలిపెట్టేది లేదు. వైసీపీ పాపాల పుట్ట బద్దలైంది. ఒక్కొక్క పాము బయటకు వస్తోంది. వైసీపీ నేతలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. వైసీపీ ఆగడాలు ఇక సాగవు’’ అని హెచ్చరించారు. జగన్‌ పాలనతో పోల్చితే కూటమి పాలనలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయని అన్నారు. నేరాల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు.
👉 మానవత్వం చాటుకున్న కంభం పోలీసులు.
నంద్యాల జిల్లా, కోయిలకుంట్ల మండలం, బిజినవేముల గ్రామం పెళ్లి ట్రావెల్ బస్సు గుంటూరు జిల్లా నరసరావుపేటలో వివాహానికి పోతూ శనివారం రాత్రి జంగంగుంట్ల దాటిన తర్వాత మూడవ కిలోమీటర్ అవతల పెళ్లి బస్సు ఆపి ఉండగా రేగి కాయలు లోడ్ తో ఉన్నటువంటి వాహనం గుంటూరు వైపు వెళుతూ ఆగి ఉన్న పెళ్లి బస్సును వెనక నుండి కొట్టడంతో పెళ్లి బస్సు తిరగబడి ప్రమాదం జరిగినది. పెళ్లి బస్సులో ఉన్నా కొంతమందికీ స్వల్ప గాయాలైనాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కంభం ఎస్సై బి. నరసింహా రావు మరియు నైట్ రౌండ్స్ తిరుగుతున్నటువంటి కంభం ఏఎస్ఐ సుధాకర్ రావు చీపు డ్రైవర్ బి. మస్తాన్ వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి పోయి క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మిగిలిన వారిని వారి వాహనాల్లో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేర్చారు. పోలీసులు చూపిన చొరవకు పలువురు ప్రయాణికులు హార్షం వ్యక్తం చేశారు.
👉మామూలు దోపిడి కాదు..ఆధార్ కార్డులో పొరపాటున ఒక్క అక్షరం దొర్లిన అడిగినంత సమర్పించాల్సిందే..
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు బరితెగిస్తున్నారు..అసలు ఏం జరిగిందంటే..
యువరాజు యాదవ్ అనే ఒక పదవ తరగతి విద్యార్థి తన ఇంటి పేరులో ఒక అక్షరం మార్చడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్ళాడు. వెంటనే మార్చాలంటే 5000 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు.. చేసేది లేక అక్షరాల 5000 రూపాయలు ముడుపులు మొట్ట చెప్పాడు యువరాజు.. శ్వేత అనే ఓ విద్యార్థిని తన ఆధార్ కార్డులో డేటాఫ్ బర్త్ ను మార్చుకోవడానికి వెళ్లగా.. ఆమె వద్ద నుంచి 2000 రూపాయలు వసూలు చేసినట్లు చెప్పింది. భువనగిరి రెడ్డి సుస్మిత అనే విద్యార్థిని ఆధార్ లో పేరు మార్పు కోసం వెళ్లగా తన వద్ద నుంచి 2,800 రూపాయలు వసూలు చేసినట్లు వాపోయింది..
ఇలా ఒకరిద్దరు కాదు ఎంతోమంది ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించడం జరుగుతుంది. సాధారణంగా ఆధార్ లో మార్పుల కోసం 50 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే, రాజంపేటలోని ఆధార్ నిర్వాహకులు మాత్రం అందిన కాడికి దోచుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మరికొందరు ఆధార్ సెంటర్ యజమానులు.. ఇక్కడ లేకున్నా ఇతరులకు తమ ఆధార్ సెంటర్‌లను అప్పగించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఆధార్ సెంటర్ లపై అధికారుల నిఘా కొరవరడం పర్యవేక్షణ లేకపోవడంతో సెంటర్ల నిర్వాహకులు ఇస్థారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
అసలు ఆధార్ సెంటర్లకు అనుమతులు ఉన్నాయా లేవా..? ఎవరి పేరుతో అనుమతులు ఉన్నాయి..? ఎవరు వాటిని నిర్వహిస్తున్నారు..? అన్నదానిపై అధికారుల నిఘా కొరవడింది.. దీంతో ఆధార్ యజమానులు ఆడిందే ఆటగా వేలకు వేలు దోచేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆధార్ సెంటర్లకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు.
👉తెలంగాణ లో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మరియు కుల గణన సర్వేలో భాగంగా సర్వే ఎన్యుమరేటర్లు ఈరోజు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాసంలో సమగ్ర సర్వే నిర్వహించారు. షబ్బీర్ అలీ స్వయంగా తమ కుటుంబ వివరాలను తెలిపారు.
ఈ సర్వేను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మరియు వారి బృందం ఆర్డీవో ఎమ్మార్వో పర్యవేక్షణలో ఎన్యుమరేటర్, మరియు సూపర్‌వైజర్. సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ
కొందరు సమగ్ర సర్వే పైన లేని పోనీ అపోహలు సృష్టిస్తున్నారు.అందరూ స్వచ్ఛందంగా తమ తమ వివరాలను తెలియపరచి ప్రభుత్వ పథకాలను పొందాలన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ లో రాహుల్ గాంధీ ప్రోత్బలంతో దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగనకుల గణన చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతం చేయడం కోసం పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలన్నారు.ఇందులో భాగంగా ఇళ్ల గుర్తింపు కార్యక్రమం పూర్తయింది.భవిష్యత్తులో అన్ని పథకాలకు ఈసర్వే ఆధారంగానే ఉంటాయని తెలిపారు. పేదలకు సరైన లబ్ధి జరగాలంటే విశ్వసనీయ సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే వివరాల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయనుందనిఅన్నారు.
ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే కోసం చేస్తున్న సన్నాహలను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించాలి అన్నారు.ఎన్యుమారేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సరైన వివరాలు తీసుకోవాలని కుటుంబ సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కుల సర్వేను పక్కాగా నిర్వహించాలని సూచించారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ సర్వేచేస్తుందన్నారు. కార్యక్రమంలో దాదాపు లక్ష మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.దీని నివేదిక ఆధారంగానే రాబోయే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.ఇందులో అన్ని కుల సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు మరియు గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు దీన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి పూర్తి చేయాలన్నారు
👉కడప..గోపవరంలో పట్టపగలు ఘరానా మోసం…
ఆధార్ అప్డేట్ చేస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు…ఫోటో తీసేందుకు బంగారు సరడు తీసి పక్కన పెట్టమంటూ మాయ మాటలు…సరడు తీసి పక్కన పెట్టి ఆధార్ కార్డు కోసం ఇంట్లోకి వెళ్లిన బాధితురాలు…
మహిళ వచ్చే లోపల సరడుతో పరారైన దుండగులు…
👉పిల్లలతో కలిసి చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య..
సిద్దిపేటలో విషాదం చోటుచేసుకుంది. తేలు సత్యం(50) అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తండ్రితో పాటు అభంశుభం తెలియని చిన్నారులు అశ్విన్ త్రివర్ణ విగతజీవులుగా కనిపించడం కలిచివేసింది..
👉తిరుపతి జిల్లా…గూడూరు రూరల్*
*💥విందూరు కండ్రిగ లో విచ్చల విడిగా కోడిపందాలు నిర్వహణ*💥
తిరుపతి జిల్లా విందూరు కండ్రిగ లో కోడిపందాలు విచ్చల విడిగా నిర్వహిస్తున్నారు,చట్ట నిషేధం అయిన జూదాలు సైతం కొనసాగితున్నట్టు స్థానికులు చెబుతున్నారు,గూడూరు రూరల్ పోలీసు సర్కిల్ పరిధిలో జరుగుతున్న ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలుకు బయటి ప్రాంతాలు వ్యక్తులు,పోకిరీలు, జూదగాళ్ళు వస్తున్నారని దీనితో స్థానిక ప్రజలు,మహిళలు ఇబ్బందులు పడుతున్నారని రూరల్ పోలీసులు ఓ కన్నేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు…
👉చంద్రగిరిలో భారీగా గంజాయి పట్టివేత..
గంజాయి విక్రేతలతో పాటు మరో 5 మందిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్లు చంద్రగిరి సీఐ సుబ్బరామి రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఎం.కొంగరవారిపల్లి జగనన్న కాలనీలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో దాడులు చేశాం. ఇద్దరు మహిళలతోపాటూ మరో 5 మంది విక్రయదారులను అదుపులోకి తీసుకున్నాం. నిందితులన నుంచి 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం’ అని సీఐ తెలిపారు.
👉వామ్మో అవినీతి కి కేరాఫ్ అడ్రస్ ఇతను ….సామాన్యుడు కాదు బాబోయ్… తవ్వేకొద్దీ బయట పడుతున్న ఆస్తుల చిట్టా..!
మదనపల్లి రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసులో ఆర్డీఓగా పనిచేసిన మురళీ ఆస్తులపై రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో దాదాపు 35 కు పైగా ఆస్తులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. బెంగళూరు, పలమనేరు, మదనపల్లిల్లో ఇల్లు, తిరుపతి పరిసరాల్లో 20 కి పైగా ప్లాట్లు, ఆర్‌సీపురంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి, వీ కోటలో రెండు పౌల్ట్రీ ఫామ్స్, 5 ఎకరాల మామిడి తోట, వాయల్పాడు లో వ్యవసాయ భూమి, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట వ్యవసాయ భూమి, నెల్లూరు లో స్టోన్ హోస్ పేట లో ఇంటి స్థలాలు ఉన్నట్లు గుర్తించారు.
మరోవైపు అన్నమయ్య, సత్యసాయి జిల్లాలోనూ మురళి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ భావిస్తోంది. ఇవీకాకుండా 700 గ్రాముల గోల్డ్, 10 కి పైగా బ్యాంక్ ఖాతాలు, రెండు బ్యాంకు లాకర్స్ ఉన్నట్లు చెబుతున్న ఏసీబీ అధికారులు మురళీ స్నేహితుడు చిత్తూరు జిల్లా ఇనాం డీటీ శేషగిరి రావు, సర్వేయర్ చిట్టిబాబు, మదనపల్లిలో వీఆర్వో శేఖర్ ఇళ్ళలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. వందల కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పేరుతో మురళీ ఆస్తులు ఉన్నట్లు చెబుతున్నారు.
శనివారం(నవంబర్‌ 9) నుంచి ఏక కాలంలో రంగంలో దిగిన 14 టీంలు 5 జిల్లాల్లో సోదాలు కంటిన్యూ చేస్తోంది. తిరుపతిలో నాలుగు చోట్ల, మదనపల్లి, పలమనేరు, వి కోట, కడప, రాయచోటి నెల్లూరులో ఏసీబీ దాడులు కొనసాగిస్తోంది.
👉ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 26 (180ML) మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బి. నరసింహారావు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బెల్టు షాపులు నిర్వహించిన అక్రమంగా మద్యం తరలించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..

👉రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 100 చెంచు కుటుంబాలకు టార్పాలిన్ పట్టలు, దుప్పట్లు పంపిణి*..ముఖ్య అతిధిగా పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.
గిద్దలూరు మండలం, దిగువమెట్ట గ్రామంలోని చెంచు కాలనీలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డిస్టిబ్యూషన్ ఆఫ్ రిలీఫ్ మెటీరియల్స్ టూ ట్రైబల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. చెంచు కాలనీలోని 100 కుటుంబాలకు దుప్పట్లు, టార్పాలిన్ పట్టలను అందచేశారు.ఈ సందర్బంగా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ట్రేజరర్ చిట్యాల వెంకటేశ్వర రెడ్డి మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు పాలుగుళ్ళ ప్రతాప్ రెడ్డి, గ్రామస్తులు పాల్గోన్నారు.

👉భూ మార్పిడి పేరుతో 100 కోట్ల దోపిడీ..😲😲😲
ద్వారంపూడి మేనమామపై ఎమ్మెల్యే వనమాడి ఆరోపణ..
భూ మార్పిడి పేరుతో రూ.100 కోట్ల విలువైన భూమిని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మేనమామ కాజేశారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. శుక్రవారం ఆయన రాగంపేట, శ్రీవిద్యా కాలనీలోని ‘చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌’ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ద్వారంపూడి మేనమామ సత్తి గోపాలరెడ్డి. ఆయనకు కాకినాడ బ్యాంకుపేటలో స్థలం ఉంది. తన మేనల్లుడు ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో తన స్థలాన్ని పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఇచ్చాడు.దానికి బదులు శ్రీవిద్యా కాలనీలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని తీసుకున్నారు. ఈ మేరకు జీవో జారీ చేయించుకున్నారు. గోపాలరెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన రాగంపేటలోని స్థలంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి 2008లో అప్పటి సీఎం వైఎ్‌సఆర్‌ శంకుస్థాపన చేశారు.నాటి నుంచి నేటి వరకూ అక్కడ ఎలాంటి ఇళ్లనూ నిర్మించలేదు. పైగా నేటికీ ఈ స్థలాన్ని గోపాలరెడ్డి ప్రభుత్వానికి అప్పగించలేదు.ఆ భూమి విలువ రూ.100 కోట్ల వరకూ ఉంది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాను. భూమిని స్వాధీనం చేసుకొని,అక్కడ పేదలకు ఇళ్లు కట్టించేలా చర్యలు చేపడతా’అని ఎమ్మెల్యే తెలిపారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?