కేసీఆర్ మహబూబ్ నగర్ కు ఏం చేశారు?.. సీఎం రేవంత్ రెడ్డి….దొంగ నోట్లు చలామణి ముఠాను అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు….విజయవాడ లో నిర్వహిస్తున్న భిన్నత్వంలో ఏకత్వం కార్యక్రమానికి విచ్చేయనున్న శ్రీ శ్రీ రవి శంకర్ జి..

👉కేసీఆర్ మహబూబ్ నగర్ కు ఏం చేశారు???..
సీఎం రేవంత్ రెడ్డి..
* గత పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ మహబూబ్ నగర్ కు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
* ఆదివారం కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ మీడియాతో మాట్లాడారు.
* త్వరలోనే మక్తల్ నారాయణ్ పేట్ కొండగల్ ప్రాజెక్టులు ప్రారంభిస్తాం.నాపై కోపముంటే రాజకీయంగా కాకుండా వేరే విధంగా చూపండి.* నా జిల్లాను అభివృద్ధి చేసుకోవనివ్వండి.ఇన్నాళ్లూ మీ నియోజక వర్గాలకు నిధులు తీసుకెళ్తే మేము పడి ఏడ్వలేదు.* ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది.మమ్మల్ని అభివృద్ధి చేసుకోనివ్వండని అన్నారు..

👉నారాయణ్‌పేట్ – కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్‌కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. “తెలంగాణ వచ్చి పదేళ్లవుతున్నా పాలమూరు నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు” అని అన్నారు.
*శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయంలో లక్ష్మీదేవి,భూదేవి అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.
*అంతకు ముందు శ్రీ కురుమూర్తి స్వామి ఆలయానికి రూ. 110 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
*ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ఇంకా ఏమన్నారంటే…*పాలమూరు జిల్లా వలసలకు మారుపేరు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ప్రజా ప్రభుత్వ భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూడొద్దు.
*వలసల నిరోధించడానికి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసి పాడి పంటలతో విలసిల్లేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.
*ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదన్నారు
*అడ్డుకోవాలని చూసే వారిని పాలమూరు జిల్లా ప్రజలు క్షమించరు. అలాంటివారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
*జిల్లాలో అమర్‌రాజా బ్యాటరీస్ కంపెనీలో 2 వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ అంగీకరించిందనీ,ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
*జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మాది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం అన్నారు..
*ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…
👉 దొంగ నోట్లు చలామణి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు..!తిరుపతి జిల్లా, నగరి నియోజకవర్గంలోని, పుత్తూరులో శనివారం రాత్రి పలు దుకాణాల లో వస్తువులను కొంటూ దొంగ నోట్లును చలామణి చేస్తున్న అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
తిరుపతి చెర్లోపల్లి సర్కిల్‌ వద్ద నివాసం ఉంటున్న రమేష్‌, అతని భార్య సంధ్య, కూమార్తె ఇషా, వారి స్నేహితుడు మునికృష్టారావు ఇంటిలో పోలీసులు సోదాలు చేయగా వారి వద్ద దొంగనోట్లు ముద్రణకు కావాల్సిన వస్తువులను, ప్రింటర్స్‌, ప్రింట్‌ చేసి కట్‌ చేయడానికి సిద్దంగా ఉన్న 100, 500 నోట్లును స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా కు చెందిన మునికృష్టారావు, రమేష్‌తో పేస్‌ బుక్‌ యాప్‌ ద్వారా పరిచేయం చేసుకుని, తిరుపతిలోని రమేష్‌ ఇంటిలో షేర్‌ మార్కటింగ్‌ బిజినెస్‌ చేసేవారు అయితే భారీ నష్టాలు రావడంతో, యూ ట్యూబ్‌ లో దొంగనోట్లు ముద్రణ చూసి దాని ప్రకారం ఇంటిలోని కుటుంబసభ్యులంతా ముద్రణకు కావాల్సిన వస్తువులను తిరుపతిలో కొని, ఇంటిలో ముద్రించి, వాటిని చుట్టుప్రక్కల ఉన్న తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరు వంటి ప్రాంతాలలో వస్తువులను కొంటున్నట్లు మార్పిడి చేసేవారని పుత్తూరు డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు.
దొంగనోట్లు ముద్రణకు పాల్పడిన నలుగురిన అరెస్టు చేసి, వారు ఉపయోగించినా వస్తువులను, ఒక కారు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు…
👉ఈనెల 13వ తేదీన విజయవాడ లో నిర్వహిస్తున్న భిన్నత్వంలో ఏకత్వం కార్యక్రమానికి విచ్చేయనున్న శ్రీ శ్రీ రవి శంకర్ జి..
ఈనెల13వ తేదీన విజయవాడ మహా నగరం నందు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *భిన్నత్వంలో ఏకత్వం* కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ శ్రీ రవిశంకర్ జీ* విచ్చేస్తున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏపీ స్టేట్ అపెక్స సభ్యులు సీత పెద్దింటి, కూన ఫాల్గుణ రావు, పోతురాజు రవికిరణ్ తెలియచేశారు.
గత 10 సంవత్సరాలుగా మతసామరస్యం కోసం పాటుపడు తున్న మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ గురూజి ని ఆహ్వానించటం జరిగింది,ఆయన ఆహ్వానాన్ని మన్నించి గురూజీ ఈ కార్యక్రమానికి విచేయటం జరుగుతుందన్నారు.భిన్నత్వం లో ఏకత్వం పోస్టర్లను విడుదల చేసారు.
ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవింకర్ మా రాష్ట్రానికి విచ్చేయటం రాష్ట్ర ప్రజలకు గౌరవప్రదం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు,న్యాయ & మైనారిటీ వ్యవహార శాఖ మాత్యులు పెద్దలు NMD ఫరూక్, పోలిట్ బ్యూరో సభ్యులు టిడిి జనార్ధన్ పాల్గొంటారన్నారు.
ఈ కార్యక్రమంలో జీ అనూప్, కౌన్సిల్ సభ్యులు కానన్ త్రివేది మాజీ ఐఏఎస్ అధికారిణి , మరో సభ్యులు సురేష్ కోరే, డాక్టర్ వినోద్ , డాక్టర్ కే హరిక, సీ హెచ్ మోహన్ వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు… స్టేట్ కోఆర్డినేటర్ రజాక్ భాష..

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?