👉మదనపల్లెలో ఏం జరిగిందో మర్యాదగా చెప్పండి, ప్రత్యేక కమిటీ వేసిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి (ఉమ్మడి చిత్తూరు జిల్లా) సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై కూటమి ప్రభుత్వం అత్యవసర విచారణకు ఆదేశించింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధం అయ్యాయని సమాచారం.మదనపల్లె సబ్ కలెక్టర్ గా నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడు సైతం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై చాలా సీరియస్ అయ్యారు. అసలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిజంగా అగ్నిప్రమాదం జరిగిందా, కుట్ర పూరితంగా కావాలనే కార్యాలయానికి నిప్పంటించారా అనే అంశంలో విచారణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
👉రుషికొండ టాయిలెట్ పై చంద్రబాబు సెటైర్ వైరల్! ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమవేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమవేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు నల్లకండువాలు కప్పుకుని వైసీపీ నేతల నిర్సనలు..గవర్నర్ ప్రసంగం.. అనంతరం సభ వాయిదా జరగగా… రెండో రోజు సభ ప్రారంభమైంది.ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే, ఏపీ సీఎం మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.అవును… ఏపీ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం బయట ప్రపంచానికి తెల్లిసిన రుషికొండ హవనాల వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరిగింది.ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఈ చర్చ జరిగింది. ఇందులో భాగంగా… రుషికోండ ప్యాలెస్ కు పబ్లిక్ యాక్సెస్ ను అనుమతించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపదించారు. ఫలితంగా… ఇక్కడి ప్రజలు రూ.25 లక్షల ఖరీదైన టాయిలెట్ ను చూడవచ్చని అన్నారు. దీనికోసం రూ.30 లేదా రూ.50తో తక్కువ ప్రవేశ రుసుము పెట్టాలని సూచించారు.దీనికి సమాధానంగా స్పందించిన చంద్రబాబు.. “ఇంత ఖరీదైన మరుగుదొడ్డిని నేనెప్పుడూ చూడలేదు!” అని సమాధానం ఇచ్చారు. దీంతో… చంద్రబాబు సెటైరికల్ రియాక్సన్ వైరల్ గా మారింది.కాగా… జగన్ సర్కార్ హయాంలో రుషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.వందల కోట్ల ప్రజాధనాన్ని వారి వారి లగ్జరీల కోసం ఖర్చు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు.ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు మీడియా సమక్షంలో ఆ రిషికొండ ప్యాలెస్ లను సందర్శించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ఐఏఎస్ అధికారి భార్య తనకు పరిచయమైన గ్యాంగ్ స్టర్ తో కలిసిపోయింది. అతడితో కలిసి నేరాలకు పాల్పడింది. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. దీంతో… ఆ ఐఏఎస్ అధికారి విడాకులకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి తిరిగొచ్చింది.. కీలక నిర్ణయం తీసుకుంది. వివరాళ్లోకి వెళ్తే… గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్ జిత్ కుమార్.. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సూర్యజై కి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్ స్టర్ తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో… సుమారు 9 నెలల క్రితం ఆమె ఆ గ్యాంగ్ స్టర్ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే జూలై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించగా.. మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ స్టర్, ఐఏఎస్ అధికారి భార్య సూర్యజై కొసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గాంధీనగర్ లోని తన భర్త ఇంటికి వచ్చిందని అంటున్నారు. అయితే… ఆమె భర్త ఐఏఎస్ అధికారి మాత్రం ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో గత్యంతరం లేకో ఏమో కానీ… విషయం తాగి 108కి ఫోన్ చేసింది. దీంతో.. ఆమెను 108 సిబ్బంది వచ్చి ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్సపోందుతూ ఆదివారం మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే… ఆమె మృతదేహాన్ని చూసేందుకు కూడా ఆ ఐఏఎస్ అధికారి నిరాకరించినట్లు తెలుస్తోంది.
👉 అసెంబ్లీ సమావేశాలలో హైలెట్ల్స్ .. అబ్ధుల్ సలాం కుటుంబాన్ని నేను ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నా. _ సీఎం చంద్రబాబు..👉 గత వైకాపా ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయించని కారణంగా మెడికల్ కాలేజ్ నిర్మాణాలు ఆగిపోయాయి. _ మంత్రి సత్య కుమార్. 👉 నాడు – నేడు పేరిట గత ప్రభుత్వం వైకాపా భారీ దోపిడీకి పాల్పడింది. పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరగకుండానే బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డారు. _ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్.
👉 నాడు-నేడు పనుల్లో జరిగిన అవినీతిపై,నాసిరకం పనులుపై,ప్రభుత్వం విచారణ చేపడుతుంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దడం మా లక్ష్యం..స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… విద్య & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ .👉 గత వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఏపీ పోలీస్ శాఖను మహీంద్రా వారు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. గత జగన్ ప్రభుత్వానికి ఇది చాలా సిగ్గుచేటు. _ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత.👉 లక్షలాది మంది నిరుద్యోగులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై నమ్మకం కలగాలి అంటే గత వైకాపా హయాంలో పరీక్ష ఫలితాలన్నిటినీ సమీక్షించి తప్పు జరిగినచోట తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. _ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..👉 గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక నిధులను పక్కదారి పట్టించింది. _ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…👉 గత వైసీపీ పాలకులు వారి స్వార్థపూరిత స్వప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. _హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత.
👉 చిత్తశుద్దిలేని గత వైకాపా పాలకుల చెత్త విధానాల వల్ల దళిత బిడ్డలు త్రీవ్రంగా అలమటించారు. మా దళిత బిడ్డలకు అందాల్సిన సబ్ ప్లాన్ నిధులను గత పాలకులు దారి మళ్లించి చరిత్ర హీనులుగా మిగిలిపోయారు._ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా.
👉 లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో గత వైకాపా ప్రభుత్వం చెలగాటం ఆడింది. సంతలో పశువులను అమ్ముకున్నట్లు..గ్రూప్-1,గ్రూప్-2 పోస్టులు అమ్ముకున్నారు . _ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
👉 నాడు-నేడు పనుల్లో జరిగిన అవినీతిపై,నాసిరకం పనులుపై,ప్రభుత్వం విచారణ చేపడుతుంది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దడం మా లక్ష్యం. _ విద్య & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ .
👉 టీడీపీ హయాంలో ఎస్సీ కాలనీల్లో 5,776 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఘనత నారా లోకేష్ కే దక్కింది. _ ఎమ్మెల్యే బి. రామాంజనేయులు..
👉 టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో గృహాలను, గత జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించలేకపోయింది. _ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
👉టీడీపీ శ్రేణుల సంబరాలు..
అమరావతికి కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై TDP శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తమ అధినేత చంద్రబాబు సమర్థతతోనే కేంద్రం ఈ నిధులిచ్చిందని కొనియాడుతున్నాయి. ‘విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఈ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చింది లేదు. వ్యూహాత్మకంగా ఎన్డీయేలో చేరడం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ద్వారా చంద్రబాబు తన మార్కు రాజకీయం చూపించారు’ అంటూ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
👉 గత జగన్ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు కారణంగా అర్హులు పింఛన్ కోల్పోయారు. కూటమి ప్రభుత్వంలో అర్హత ఉన్న అందరికీ పింఛన్ ఇవ్వడం జరుగుతుంది.👉అర్హులైన ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారునికి పెన్షన్ మంజూరు చేసే బాధ్యత తీసుకుంటాం. _ మంత్రి కొండపల్లిశ్రీనివాస్.. హత్యలు,అరాచకాలు,కబ్జాలు,దందాలు చేసిన నీ గంజాయి దొంగల ముఠాతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్ నీకు అసలు సిగ్గు ఉందా జగన్ రెడ్డి.
గత ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. _ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి.. 👉 విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ, అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
👉ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బిల్లు రద్దు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. 👉గత జగన్ ప్రభుత్వం చిన్నపిల్లలకు, భక్తులకు ఇవ్వవలసిన పాలు,అల్పాహారాన్ని ఇవ్వలేకపోయింది. మన కూటమి ప్రభుత్వంలో క్యూలైన్లో ఉన్న పిల్లలకు ,భక్తులకు అల్పాహారం అందిస్తున్నాం. _ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 👉 గత వైకాపా ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయించని కారణంగా మెడికల్ కాలేజ్ నిర్మాణాలు ఆగిపోయాయి. _ మంత్రి సత్య కుమార్.
- 👉ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు కాబట్టే జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు..జగన్ భవిష్యత్తు అంతా అంధకారమయమే.. మంత్రి. డోలా శ్రీ ..
ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు కాబట్టే ఎన్నికల్లో జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ…. ఐదేళ్లపాటు రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన జగన్ రెడ్డి నేడు మెడలో నల్ల కండువాలు వేసుకుని నిరసన తెలపడం విడ్డూరం.అసెంబ్లీలో అరగంట సేపు కూడా కూర్చోకుండా బయటికి వెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడండoటూ నిరసన తెలపడం విడ్డూరం. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడబట్టే టిడిపిని గెలిపించి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించారు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా తనకు కావాలనడం సిగ్గుచేటు. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని నాడు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు జగన్ మర్చిపోయారా ? జగన్ జీవితమంతా మాట తప్పడం మడమ తిప్పడమే. జగన్ భవిష్యత్తు అంతా అంధకారమయమే అందుకే నల్ల కండువాలతో నిరసన తెలుపుతున్నాడు. ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మాని బాధ్యత గల ప్రజాప్రతినిధిగా సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు..
👉ఒంగోలు – కర్నూలు రహదారిలోని చీమకుర్తి మండలం, తాటిచెట్ల పాలెం, బూదవాడ గ్రామాల వద్ద దెబ్బతిన్న రోడ్డును మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, రహదారులు మరియు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు మరమ్మతు పనుల ఎస్టిమేషన్స్ తదితర వివరాలను ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒక కోటి 70 లక్షలతో రోడ్డు మరమ్మతు పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, లో లెవెల్ లో రోడ్డు వున్నందున సుమారు రెండు అడుగుల మేర లెవలింగ్ చేసి రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సి వుందని ఎస్ఈ దేవానందం, జిల్లా కలెక్టర్ కు వివరించారు. జిల్లా ప్రధాన రహదారుల్లో ఒకటైన ఈ రోడ్డు మరమ్మతు పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి ఎస్ఈ దేవానందం,ఈఈ గోపి నాయక, డి ఈ అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.
👉ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, వైద్య సిబ్బందిని ఆదేశించారు.
మంగళవారం ఉదయం దర్శి మండలం, గణేశ్వర పురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో ప్రజలకు నిర్వహించిన వైద్య పరీక్షలు గురించి, వైద్యులు డా. వెంకట శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు.జిల్లా కలెక్టర్,ఏ ఎన్ ఎం లతో మాట్లాడుతూ, గ్రామాల్లో ఫీవర్ సర్వే చేస్తున్నారా, ఈ నెలలో ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఫీవర్ సర్వే చేశారు,ఎన్ని ఫీవర్ కేసులు నమోదయ్యాయి తదితర వివరాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షలకు వచ్చిన గ్రామస్తులు బంకా కోటమ్మ, వెంకమ్మ లతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడుతూ, ఏ ఆరోగ్య సమస్యపై వచ్చారు, గ్రామంలో ఏఎన్ఎం వైద్య సేవలు సక్రమంగా అందిస్తున్నారా, మందులు ఇస్తున్నారా అని అడిగితెలుసుకున్నారు.
ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వంగా ఉండరాదని, మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా ఫీవర్ సర్వే కార్యక్రమం పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, వైద్య సిబ్బందిని ఆదేశించారు.
కలెక్టర్ వెంట కనిగిరి ఆర్.డి.ఓ జాన్ ఇర్విన్, తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
👉సాగర్ కాలువలపై పర్యటించిన జిల్లా కలెక్టర్ మరియు తెదేపా దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టి పార్టీ లక్ష్మి
👉 శిoగరాయకొండ పోలీస్ స్టేషన్ నూ ఆకస్మిక అతనికి చేసిన జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించడం జరిగింది. వీరీ వెంట సీఐ దాచేపల్లి రంగనాథ్ ఎస్ఐ టి శ్రీరామ్ ఉన్నారు.