కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

👉కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..
బీఆర్ ఎస్ పార్టీ హ‌యాంలో తీసుకువ‌చ్చిన ప‌లు ప‌థ‌కాల‌కు తెలంగాణ ప్ర‌స్తుత ప్ర‌భుత్వం మంగ‌ళం పాడింది.ముఖ్యంగా రైతు బంధు, ద‌ళిత బంధు ప‌థ‌కాల‌ను వ‌దిలేసింది. వీటి స్థానంలో ఒక్క రైతు భ‌రోసా ను తీసుకువ‌చ్చినా.. దీనికి గాను ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్ర‌కారం.. ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌కు మాత్ర‌మే తాజాగా ప్ర‌క‌టించిన ఏడు మాసాల బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించింది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సంప్రదాయకంగా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘బడ్జెట్‌ విందు’ను ఏర్పాటు చేశారు ఈ విందులో పాల్గొన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు.

👉అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ
అమరావతి రాజధాని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చేందుకు పలువురు రైతులు ముందుకొస్తున్నారు. పెనుమాక రాజధాని, సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి రైతులు 2.65 ఎకరాల భూమిని సీఆర్‌డీఏకు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వం 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరించింది. మరో 4 ఎకరాలను సమీకరించాల్సి ఉంది.
జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి భూ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వందల మంది బాధిత ప్రజలు. వెలుగులోకి వస్తున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విస్తు గొలిపే వాస్తవాలు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై విచారణలో తెరపైకి కొత్త అంశాలు. పలు నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూ దందాపై బయటపడుతున్న వాస్తవాలు. నాటి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండటంతో, తమ భూముల కబ్జాలపై ఫిర్యాదులు చేసేందుకు వందల సంఖ్యలో తరలివస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు. ఒక్క మదనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్‌లో ఈ స్థాయి బాధితులు ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్న బాధిత ప్రజలు.
👉9వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్..నారాయణ పేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయం పై గురువారం ఏసిబి అధికారులు దాడులు చేశారు. గాసం వెంకటేష్ చెందిన 107. 121 సర్వే నెంబర్ లో 17 ఎకరాల భూమిని నలుగురు బాగస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా హద్దులు కోసం సర్వేర్ బాలరాజు కోరారు. దీంతో 12000 లంచం డిమాండ్ చేయాగా ముందుగా 3000 చెల్లించి 9వేలు ఈరోజు సర్వేర్ కు ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి అబ్దుల్ ఖాదర్ జిలాని, ఇన్స్ పెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు
👉కోకాపేట వరకు మెట్రోరైలు…రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం పెరిగి రూ.24,042 కోట్లకు చేరింది. రాయదుర్గం నుంచి విప్రో కూడలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ వరకు 8 కి.మీ. మార్గాన్ని తొలుత ప్రతిపాదించారు. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్‌ వరకు విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో ఇక్కడ 3.3 కి.మీ.పైగా పెరిగింది. ఈ కారణంగా అంచనాలు పెరిగాయి.
👉మోడీ మాయతో ఏపీకి అన్యాయం..
• ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..
• మౌనంగా ఉండే తప్పు చేస్తున్నారే !!!..
ఏపీకి కేంద్రం అన్యాయం చేసినా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అన్ని బడ్జెట్స్ కూడా ఏపీకి మంచి చేసినట్లే ఉంటాయి కానీ మంచి జరగదు. అదే మోడీ బడ్జెట్లోని మాయ. 2024-25 బ‌డ్జెట్‌లో కూడా ఏపీకి కేటాయింపులు లేవు. ఓన్లీ అప్పులే ఇవ్వడానికే కేంద్రం సిద్ధమైంది కానీ అదేదో సొంతంగా, ఫ్రీగా డబ్బులు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారు. ఎన్డీయేనే ఏపీలో అధికారంలో ఉంది. అయినా ప్రజలకు కేంద్రం వెన్నుపోటు పొడిచింది. ఇంత పెద్ద మోసం జరుగుతున్నా ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మౌనం ఉండడం విస్మయానికి గురి చేస్తోంది.చాలా ఏళ్లుగా రాజకీయాల్లో జగన్ తిరుగుతున్నారు. సీఎంగానూ ఐదేళ్లు పనిచేశారు. ఏ విషయం పైన మాట్లాడాలి? ఏ విషయం పైన మాట్లాడకూడదు అనేది జగన్ ఇంకా తెలుసుకోలేకపోతున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉంటుందంటే లాలీపాప్‌లు ఇచ్చి రెండు చెంపలు వాయించినట్లే ఉంటుంది. ఆమె ఈసారి ఏపీపై వరాల జల్లు కురిపించిందని ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఏపీ కేపిటల్ అమరావతి కోసం నిర్మల సీతారామన్ రూ.15 వేల కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మల్టీ నేషనల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తున్నామని అన్నారు.అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందే ఫైనాన్సియల్ హెల్ప్ ను గ్రాంట్ అని అంటారు. కానీ ఏపీకి అందించే మనీ విషయంలో గ్రాంట్ అని పదం ఎక్కడ వాడలేదు. దీన్ని బట్టి కేంద్రం ఈ 15,000 కోట్లు ఆంధ్రాకి గ్రాంట్ ఇస్తుందా లేకపోతే ఓన్లీ అప్పుగా ఇస్తారా అనేది తెలియడం లేదు.నిర్మలా సీతారామన్ దీనిపై ఒక ప్రెస్ మీట్ లో క్లారిటీ కూడా ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్స్‌ ద్వారా అప్పు ఇప్పిస్తాం. ఒకవేళ ఏపీ కట్ట లేకపోతే అవి మేమే కడతాం అని చెప్పింది. డైరెక్ట్ గా తామే పెద్ద మనసు చేసుకొని ఏపీ ప్రజలకు రాజధాని నిర్మించి ఇస్తామని మాత్రం చెప్పలేదు. అమరావతికి అవసరమైతే ఎక్కువ నిధులను కూడా సమకూరుస్తామని తెలియజేశారు. అది కూడా అప్పే అయి ఉండొచ్చు. పోలవరం ప్రాజెక్టు, వైజాగ్-చెన్నై కారిడార్ వంటి వాటికి కూడా ఫండ్ ఇస్తామని తెలియజేశారు. కానీ అవన్నీ అప్పుల లాగానే కనిపిస్తున్నాయి కానీ గ్రాంట్స్ లాగా కనిపించడం లేదు. రాష్ట్రానికి కేంద్రంలో బీజేపీ సర్కారే ఉన్నా కూడా ఏపీ ప్రజలకు బిహార్ లాగా బడ్జెట్లో న్యాయం జరగలేదు మొత్తం ఒక మాయ లాగా చేశారు. దీనిని జగన్ బలంగా ప్రశ్నించకపోవడం, అసలు దీనిపై మాట్లాడకపోవడం షాకింగ్ గా అనిపిస్తోంది.

👉మోడీ మాయ : తెలుగు రాష్ట్రాలపై కేంద్రం కపట ప్రేమ..

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తెలుగు రాష్ట్రాలపై చూపించే ప్రేమ కపట ప్రేమ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ పాలనలో రాష్ట్రానికి మంచి జరగలేదని చాలామంది ఫీలవుతున్నారు. మోదీ సర్కార్ మాటలు ఉన్నంత తియ్యగా చేతలు ఉండవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల విషయంలో మోదీకి ఎందుకింత నిర్లక్ష్యం అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.👉ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచెయ్యి చూపారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మోదీ సర్కార్ ఆ రాష్ట్రానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏపీకి 15,000 కోట్లు ఇస్తామని పోలవరంను పూర్తి చేస్తామని కేంద్రం మాటల్లో చెబుతున్నా ఆ నిధులకు సంబంధించిన షరతులు ప్రజలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతున్నా బీజేపీకి మాత్రం ఈ రాష్ట్రాలు పెద్దగా ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాలు అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోదీ సర్కార్ ప్రకటించే కేంద్ర బడ్జెట్ అరచేతిలో వైకుంఠాన్ని చూపేలా ఉన్నా వాస్తవంగా కలిగే ప్రయోజనాలు మాత్రం పెద్దగా లేవనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మరోవైపు బీజేపీపై విమర్శలు చేసే బలమైన నేతలు లేకపోవడం, విమర్శించిన పార్టీల ప్రముఖ నేతలు ఇతర కేసుల్లో చిక్కుకొని జైలు శిక్ష అనుభవిస్తూ ఉండటం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మోదీ సర్కార్ నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం అని ఏపీలోని రాజకీయ పార్టీల అధినేతలు సైతం సైలెంట్ గా ఉంటున్నారు. బీజేపీ నేతల మాటలు ఉన్నంత తియ్యగా చేతలు అయితే లేవని చెప్పవచ్చు. గ్రాంట్ల రూపంలో ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి ఏపీకి మేలు చేసే అవకాశం ఉన్నా కేంద్రం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు.

👉 జిల్లా కలెక్టర్ పర్యటన..
యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా..పుల్లల చెరువు మండలం ముటుకుల ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పరిశీలించిన కలెక్టర్. ఇక్కడినుంచి నీటి సరఫరా విధానంపై ఆరాతీసిన కలెక్టర్ అన్సారియా.
పుల్లలచెరువు మండలంలో 23 గ్రామాలకు ఇదే ప్రధాన నీటి వనరుగా ఉందన్న అధికారులు.
👉 ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా.
*అదనపు తరగతి గదులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్. *పులిహోరను స్వయంగా రుచి చూసిన కలెక్టర్ నాణ్యత లేకపోవడంపై ఆగ్రహం.*
*ప్రతిరోజు వంటలను హెచ్.ఎం. రుచి చూసిన తరువాతే విద్యార్థులకు పెట్టాలని కలెక్టర్ ఆదేశం.*విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి, వారితో పుస్తకాలు చదివించి విద్యా ప్రమాణాలను పరిశీలించిన కలెక్టర్.*డ్రాపౌట్స్ లేకుండా చూడాలని టీచర్లకు ఆదేశం.విద్యార్థులు, వారికి కేటాయించిన టీచర్ల సంఖ్యపై కలెక్టర్ ఆరా.
👉 పొదిలి మండలంలో నెలకొన్న పలు సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల ..
వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఆయే జలాలను పొదిలి మండలానికి సరఫరా చేయాలని మంత్రి లోకేష్ ను కోరిన ఎమ్మెల్యే కందుల..
త్రాగు, సాగు నీటి వనరులు లేని పొదిలి మండలానికి దర్శి సాగర్ కాలవ నుండి పొదిలి పెద్ద చెరువుకు సాగర్ జలాలు నింపి పొదిలి ప్రాంతాన్ని ససస్యమనం చేయాలని కోరారు.అందుకు స్పందించిన ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయా సమస్యలు త్వలితగతిన పూర్తిచేసి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కందులకు మంత్రి నారా లోకేష్ భరోసా నిచ్చారు.
👉రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తో పాటు మరో ఆరుగురు ని అరెస్టు చేసిన పోలీసులు*,
*ప్రధాన నిందితుడు జిలాని ని జూలై 18 కోర్టు లో హజరు పరిచిన పోలీసులు… నేడు మరో 6 గురు అరెస్టు… నిందితులందరూ 30 సంవత్సరాల లోపు వారే…!!!*,
*మరి కొందరు నిందితుల కోసం పోలిస్ బృందాలు గాలింపు… సిఐ సాంబశివరావు*.
*వినుకొండ*..రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన… పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ సెంటర్ లో జూలై 17 న రాత్రి వైసీపీ కార్యకర్త రషీద్ హత్య సంఘటన లో ప్రధాన నిందితుడు జిలాని ని అరెస్టు చేసి జూలై 18 న కోర్టులో హాజరు పరిచారు… ఇదే సంఘటనలో మరో 6 గురు ను అరెస్టు చేసినట్లు సిఐ సాంబశివరావు తెలిపారు… వారిలో *నరసరావుపేట బరంపేట కు చెందిన పఠాన్ అబూ బకర్ సిద్ధిక్*… *వినుకొండ నిమ్మలబావి బజారు కి చెందిన కొమ్ము ఏడుకొండలు, బైలబోయిన అనిల్…ఇస్లాంపేట కు చెందిన షేక్ రోహిత్ … సీతయ్య నగర్ కు చెందిన కొమ్ము వెంకట సాయి*… *ప్రకాశం జిల్లా జే. పంగులూరు మండలం తక్కెళ్లపాడు కు చెందిన పలపార్తి సుమంత్*… అను వారిని అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు పంపడం జరుగుతుందని సిఐ సాంబశివరావు తెలిపారు. విలేఖరుల సమావేశంలో సిఐ తో పాటు ఎస్ఐ కృష్ణారావు పొల్గొన్నారు.
👉ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ……..*
ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి…
పొదిలి పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు…….
వాహనదారులకి ప్రజలకి ఇబ్బందులు కలిగించకుండా ఆటోలు నడపాలని..
ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పరిమితికి నుంచి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని..
నియమ నిబంధనకు విరుద్ధంగా ఆటోలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆటో డ్రైవర్ లను హెచ్చరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు.కార్యక్రమలో ఎస్సై జి కోటయ్య మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
👉వైసిపి కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే అన్నా రాంబాబు…గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలం అలసందలపల్లె గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త భూషణం అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలుసుకున్న మాజీ ఎమ్యెల్యే అన్నా రాంబాబు గురువారం నాడు నంద్యాల పట్టణంలోని వారి నివాస గృహానికి వెళ్ళి పరామర్శించారు.*
*ఆయన ఆరోగ్య పరిస్థితి,వైద్య చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.*

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.