👉గుజరాత్ కు చెందిన నరేంద్ర మోదీ – అమిత్ షా,అదానీ – అంబానీ…దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారు. మోదీ అండతోనే సెబీ కుంభకోణం పై ఛైర్మన్ మాధుబి బచ్ రాజీనామా చేయలేదు. స్కాం పై కేంద్రం జేపీసీ వేయలేదు. దీనిపై రాహుల్ గాంధీ పోరాటానికి కోట్లాది కార్యకర్తలం అండగా ఉంటాం దేశ ఆస్తులను కాపాడే బాధ్యత తీసుకుంటాం. దీనిపై రాహుల్ గాంధీ పోరాటానికి కోట్లాది కార్యకర్తలం అండగా ఉంటాం దేశ ఆస్తులను కాపాడే బాధ్యత తీసుకుంటాం.
సెబీ స్కాం పై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదు.. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనా …మలినమైనా…మాకు అభ్యంతరం లేదు.సెబీ స్కాం పై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనా …మలినమైనా…మాకు అభ్యంతరం లేదు.సెబీ స్కాం పై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 14 వ తేదీన జరుగబోయే నేషనల్ లోక్ అదాలత్ లో భా గంగా గిద్దలూరు కోర్ట్ ప్రాంగణంలో నేషనల్ లోక్ అదాలత్ జరుగునని,కావున కక్షిదారులందరూ ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని గిద్దలూరు కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని రకముల సివిల్ కేసులు, భరణం కేసులు, గృహహింస కేసులు,చెక్ బౌన్స్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, బ్యాంకుల ప్రీ లిటిగేషన్ కేసులు, టెలిఫోన్ ప్రీలిటిగేషన్ కేసులు,మరియు కోర్టుల వరకు వెళ్లని ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవలసినదిగా గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికారసంస్థ చైర్మన్ ఏ. ఓంకార్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.లోక్ అదాలత్ అవార్డుపై అప్పీలు ఉండదని, మరియు సివిల్ కేసుల్లో కోర్టులకు కట్టిన ఫీజు రెవిన్యూశాఖ ద్వారా వాపసు చేయబడుతుందని తెలియజేశారు.
👉దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ఆర్గనైజేషన్ గిద్దలూరు ఆధ్వర్యంలో కొమరోలు మండలం. బాదినేనిపల్లె గ్రామానికి చెందిన కీ. శే.కామురి. రామిరెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా గిద్దలూరు. లోని.సంజీవని వృద్ధాశ్రమం గురుకుల స్వచ్ఛంద సేవ సంస్థ వారికి .నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో లోక్కు శరత్ బాబు సునీల్ కుమార్ నాయుడు పాల్గొన్నారుసహాయం అందించిన కుటుంబానికి సంజీవని వృద్ధాశ్రమం చైర్మన్ రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు
👉బత్తుల వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ..*మార్కాపురం టౌన్ సౌజన్య ఫంక్షన్ హాల్ నందు బత్తుల పుల్లారెడ్డి,భూదేవి గార్ల కుమారుడు వివాహానికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన రాజశేఖరరెడ్డి,నాగ సౌమ్య లను ఆశీర్వదించిన మార్కాపురం వైసీపీ సమన్వయ కర్త అన్నా వెంకట రాంబాబు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు*
👉కీసరి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబు ,మాజి ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి .. ఒంగోలు టౌన్ లోని శ్రీనివాస కాలనీ నందు కొండారెడ్డి,వీర నరాయణమ్మ గార్ల కుమార్తె వివాహానికి హాజరుఅయి నూతన వధువును సాయి సౌజన్యను ఆశీర్వదించిన మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా వెంకట రాంబాబు మరియు ఉడుముల శ్రీనివాస రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు*
👉దళపతి విజయ్.. మరో విజయ్ కాంతా? ‘వి’ జయలలితనా? కమల్ హాసనా?…తమిళనాట మరో కొత్త పార్టీ ప్రస్థానం మొదలైంది. ఇప్పటికే పార్టీ ఖరారైనప్పటికీ.. దళపతి విజయ్ గురువారం నుంచి పూర్తిస్థాయి రంగంలోకి దిగారు ..అసలే తమిళ రాజకీయాలు సినిమా రంగంతో గట్టిగా ముడిపడి ఉంటాయి. ప్రస్తుత అధికార పార్టీ డీఎంకేకు చెందిన కరుణానిధి సినీ రచయిత అనే సంగతి తెలిసిందే. ఆయన మనవడు, సీఎం స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి తమిళ సినిమాల్లో హీరోగా చేసి ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇక డీఎంకేకు చిరకాల ప్రత్యర్థి అన్నాడీఎంకేను స్థాపించింది తమిళుల సినీ దేవుడు ఎంజీఆర్ అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ సినీ నటి జయలలిత చేతుల్లోకి వెళ్లడం, ఆమె పలుసార్లు సీఎం కావడం అందరికీ అనుభవమే.
*కమల్ రజనీ నుంచి శరత్ కుమార్ వరకు..సౌతిండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ దశాబ్దాల పాటు ఊరించి రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి విరమించుకున్నారు. విశ్వ నటుడు కమల్ హాస్ మక్కల్ నీది మయ్యం అంటూ తిప్పలు పడుతూ వస్తున్నారు. నటుడు, ఒకప్పుడు హీరోగానూ చేసిన శరత్ కుమార్ కూడా భార్య రాధికతో కలిసి పార్టీ పెట్టి దానిని విలీనం చేశారు. ఎటుచూసినా తమిళనాడు రాజకీయాలు సినీ రంగంతో ముడిపడి ఉన్నాయి.
*విజయం లేకున్నా విజయకాంత్..తమిళనాడు నల్ల ఎంజీఆర్ గా పేరుగాంచిన దివంగత విజయకాంత్ 20 ఏళ్ల కిందటనే ఎండీఎంకే పేరిట పార్టీ పెట్టారు. దానిని నిలపుకొంటూ వచ్చారు. గత ఏడాది ఆయన చనిపోయినా పార్టీ బాధ్యతలను భార్య చూస్తున్నారు. విజయకాంత్ ఊహించినంతగా విజయవంతం కాలేదు. కానీ, ఓ దశలో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఎండీఎంకే నిలిచింది. ఆ తర్వాత ఒడిదొడుకులు ఎదురైనా ఎండీఎంకే మాత్రం అలానే నిలిచింది. అయితే, విజయకాంత్ సీఎం పదవికి దగ్గరగా మాత్రం రాలేదు.
*శూన్యాన్ని భర్తీ చేస్తారా?..జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో గ్యాప్ వచ్చింది. దానిని భర్తీ చేసేవారే లేరు. జయ పార్టీ అన్నాడీఎంకే.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య చీలిపోయింది. ఇప్పుడు విజయ్ పార్టీ.. తమిళ రాజకీయాల్లో ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి? ఎందుకంటే తమిళనాడు వరుసగా రెండుసార్లు ఒకే పార్టీకి అధికారం దక్కిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు డీఎంకే, వచ్చేసారి అన్నాడీఎంకే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అయితే, విజయ్ పార్టీ.. అన్నాడీఎంకే స్థానాన్ని ఆక్రమిస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేను సవాల్ చేస్తుందా? అభిమానుల అండాదండ పుష్కలంగా ఉన్న విజయ్.. ‘విజయకాంత్’ గా మిగిలిపోతారా? లేక వి‘జయలలిత’ అవుతారా? అనేది చూడాలి.
*ఆకట్టుకునేలా జెండా..విజయ్ తాజాగా ఆవిష్కరించిన పార్టీ జెండా.. కాస్త ఆలోచింపేజేదిలాగే ఉంది. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు అటూఇటు ఏనుగులు ఉన్నాయి. తమిళ సంప్రదాయంలో వాగాయిని విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు. విజయ్ పార్టీ జెండాతో పాటు గీతాన్ని కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. తద్వారా తండ్రితో విభేదాలు లేవని చాటారు. ఇక కులం, మతం, లింగం, ప్రాంతం వివక్షను తొలగిస్తామని విజయ్ ప్రకటించారు.