మంత్రి సీతక్క జిల్లాలో మహిళకు దక్కని న్యాయం..మత సామరస్యం ప్రతీ ఒక్కరూ పాటించాలి: KLR..పవన్ కళ్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్..ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటోన్న ఎంపీ మిథున్ రెడ్డి..ఘనంగా ఎస్ డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం..మార్కాపురం డిఎస్పీగా నాగరాజు .. ప్రకాశంజిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం.. జూదరుల అరెస్టు..50 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం

👉సీఎం చంద్రబాబు నిర్ణయం ఏమిటో.. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రెండు ఊత కర్రలుగా అటు టీడీపీ ఇటు జేడీయూ ఉన్నాయి.ఈ రెండు పక్షాలలో బలమైన ఊతకర్రగా టీడీపీ ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రెండు ఊత కర్రలుగా అటు టీడీపీ ఇటు జేడీయూ ఉన్నాయి. ఈ రెండు పక్షాలలో బలమైన ఊతకర్రగా టీడీపీ ఉంది. టీడీపీ మీదనే బీజేపీ పెద్దలు ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నారు. చంద్రబాబుకు ఉన్న ఏపీ అవసరాలను తీర్చడంతో ఆయనను మచ్చిక చేసుకుని అయిదేళ్ళూ బండిని నడిపించాలని కూడా ఆలోచిస్తున్నారు.
అయితే కొన్ని పాలసీల విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ససేమిరా అనే అంటున్నారు. అది ఈ రోజుకీ కొనసాగుతోంది. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఒకటి. ఇది పాలసీ డెసిషన్ అని బీజేపీ పెద్దలు అంటున్నారు. ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మినహాయింపు ఇస్తే మిగిలిన లిస్ట్ లోని పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నీ రిలాక్సేషన్ కోరుతాయని అపుడు పాలసీయే ఉండదన్నది బీజేపీ పెద్దల ఆలోచన.ఇక బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయి అన్నది ఆ పార్టీ నేతలే తరచూ చెబుతూ ఉంటారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్నది వారి ఫిలాసఫీ. అలా లాభ నష్టాలను చూడకుండా ప్రభుత్వం ముందుకు సాగాలని ప్రజా సంక్షేమమే విధానం కావాలన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచన. అందుకే దశల వారీగా దేశంలోని పరిశ్రమలను అన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలన్న పాలసీ ఉందని అంటారు. అందులో స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉంది. దానికి తిరిగి లాభాల బాట పట్టించాలి అంటే వేల కోర్ట్ల ఖర్చు అన్నది కూడా ఉంది. అదే దానికి ప్రైవేట్ పరం చేస్తే పూచీ పేచీలు ఉండవని అంటున్నారు.అయితే ఇక్కడ మిగిలిన పరిశ్రమలకు స్టీల్ ప్లాంట్ కి తేడా ఏంటి అంటే మిగిలినవి ప్రభుత్వం అనుకుని పెట్టినవి. స్టీల్ ప్లాంట్ అలా కాదు ఏపీ మొత్తం కోరి మరీ సాధించుకున్నది. అందువల్లనే దీనికి ఆ ప్రత్యేకత ఉంది. కానీ పాలసీ విషయంలో సెంటిమెంట్లకు తావు లేదని బీజేపీ అంటోంది. ఈ రకమైన సంక్లిష్ట పరిస్థితులలో బీజేపీకి టీడీపీకి మధ్య ఏమైనా విభేదాలు వస్తే ఇక్కడే రావచ్చు అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అయితే ప్రైవేటీకరణకు కట్టుబడి ఉందని అంటున్నారు. కాకపోతే దాని మీద ఏమైనా సవరణలకు మాట్లాడే చాన్స్ ఉందేమో కానీ మొదటి దానికి అయితే వీలే లేదు అని అంటున్నారు. మరి ఏపీ విషయంలో బీజేపీకి రాజకీయంగా కూటమిలో ఉండడం వల్ల లాభమే కలిగింది. స్టీల్ ప్లాంట్ సమస్య ఉన్నా కూడా నాలుగు ఎంపీ సీట్లు ఆ పార్టీ ఖాతాలోకి వచ్చాయి. దాంతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఇది రాజకీయంగా దెబ్బ తీసే అంశం కాదని అర్ధం అయింది. అందుకే దూకుడుగా వెళ్తోంది. కానీ టీడీపీకి మాత్రం అలా కాదు ఆ పార్టీకి ఉత్తరాంధ్ర కంచుకోట. విశాఖ అంటేనే పసుపు పార్టీకి జై కొట్టే నగరం. అలాంటి చోట స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే ఆ వేడిని వాడిని టీడీపీయే తట్టుకోవాలి. కానీ ఇంకా అయిదేళ్ళ పాటు ప్రభుత్వం ఉంటుంది. ఈ లోగా ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి మరేం ఫరవాలేదు అన్నది బీజేపీలో ఏమైనా ఉందేమో కానీ టీడీపీకి మాత్రం అది ప్రాణ సంకటం లాంటి సమస్య. అందుకే కేంద్రంతో ఈ విషయం తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి మెత్తగా చెబితే కేంద్ర పెద్దలు వింటారా అంటే అది కాదు అని తేలిపోతోంది. మరి ఎంతదాకా వెళ్లాలి అంటే మద్దతు ఉపసంహరణ దాకా వెళ్లాల్సిందే అని అంటున్నారు. ఈ విషయంలో ఎగదోస్తోంది వైసీపీయే అని చెప్పాలి. వైసీపీకి చెందిన మాజీ మంత్రి మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని అంటున్నారు.అంటే మద్దతు ఇవ్వమని టీడీపీ చెప్పాలన్నదే వైసీపీ ఆలోచనా అని కూడా అంటున్నారు.టీడీపీ అధినాయకత్వం అయితే ఏమి ఆలోచిస్తుందో తెలియదు కానీ అంత దాకా వెళ్తేనే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని వైసీపీ అంటోంది. మరి వైసీపీ ఇస్తున్న ఈ సలహా టీడీపీ పాటిస్తుందా అంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటుందా అంటే వెయిట్ అండ్ సీ.
👉 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను ఈ రోజు ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు..
👉మత సామరస్యం ప్రతీ ఒక్కరూ పాటించాలి: KLR*
ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు.
*అన్ని పండగలను అందరూ కలిపి జరుపుకోవాలని కిచ్చెన్న ఆకాంక్ష..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను విడదీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాద్ ఉన్ నబీగా జరుపుకోవటం విశేషమన్నారు. వారం రోజుల పాటు పలు సేవ కార్యక్రమాలు, పేదలకు పండ్లు, ఆహార పదార్ధాలు పంచి ముస్లిం సోదరులు మానవత్వాన్ని చాటుకుంటున్నారని కేఎల్ఆర్ అన్నారు. వినాయక నిమజ్ఞనాలను సంతోషంగా జరుపుకోవాలని కే. లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. రూపాలు వేరైనా దేవుడు అందరికీ ఒక్కడే అన్నారు. కాబట్టి కలిసి అందరూ అన్ని పండుగలను జరుపుకోవాలని ప్రజలకు కేఎల్ఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి సహా మహేశ్వరం నియోజకవర్గం మైనార్టీ సెల్ ఛైర్మన్ షేక్ యుసూఫ్ ఖాద్రీ సహా పలువురు ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
*డిజే లు ఏర్పాటు చేస్తే తాట తీస్తా*ఏసీపీ నందిరామ్ నాయక్..*డిజేలకు ఎలాంటి పర్మిషన్ లేదు*
*భారీ సౌండ్ లతోటి గణనాదుని ఊరేగింపు చేస్తే కఠిన చర్యలు..*ప్రతి గణనాదుడి మండపానికి ఒక కానిస్టేబుల్ ఉంటారు..*1100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు**ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా *భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము*ఏసీపీ నందిరామ్ నాయక్*
👉మంత్రి సీతక్క జిల్లాలో మహిళకు దక్కని న్యాయం..!!
వితంతు మహిళపై అత్యాచారం.. ఫిర్యాదు చేసి 2 రోజులైనా పట్టించుకోని పోలీసులు..
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పెరుకపల్లి గ్రామంలో వితంతు మహిళపై శివకుమార్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు.
అయితే పోలీస్ స్టేషన్లో రెండు రోజుల కింద ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు బైఠాయించి ఆందోళనకు దిగారు.
నిందితుడిని అరెస్టు చేసి న్యాయం చేస్తామని డీఎస్పీ రవీందర్ తెలిపారు…
👉 చెప్పకుండా నిమజ్జనానికి ఎందుకు వెళ్లావంటూ మందలించిన తండ్రి.. యువకుడి ఆత్మహత్య.
హైదరాబాద్ – కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థి అశోక్ స్నేహితులతో కలసి రాత్రి నిమజ్జనానికి వెళ్లి, ఉదయం ఇంటికి వచ్చాడు.
అయితే చెప్పకుండా ఎందుకు వెళ్లావంటూ మందలించిన తండ్రి.దీంతో మనస్థాపానికి గురై.. గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న అశోక్.
👉ఏలూరు ఆటో నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసిన అమానుష ఘటన.దొంగతనం నెపంతో ఓ వ్యక్తిని ఇంజెన్ బెల్ట్ తో విచక్షణా రహితంగా చితిక బాధిన వైనం
పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ..?
👉 ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటోన్న ఎంపీ మిథున్ రెడ్డి…ఎంపీ మిథున్ రెడ్డి.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కొడుకే అయినా, ఓ బ‌డా కంపెనీని న‌డిపిస్తున్న వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది కీల‌క నేత‌ల‌కు సుప‌రిచితుడు. రాజంపేట ఎంపీగా వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్న మిథున్ రెడ్డి… కొంత‌కాలంగా స్థానికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులను ఎదుర్కొంటున్నారు. పుంగ‌నూరు ఎమ్మెల్యేగా ఉన్న త‌న తండ్రి పెద్దిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గం వైపే రావ‌టం లేదు. ఎప్పుడైనా వ‌చ్చినా స్థానికంగా నిర‌స‌న‌లు, టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు తోడు అక్ర‌మంగా భూముల‌ను కొట్టేశార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతుండ‌టంతో పెద్దిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారు. దీంతో అప్పుడ‌ప్పుడు స్థానిక ఎంపీగా ఉన్న ఆయ‌న కొడుకు మిథున్ రెడ్డి వ‌స్తున్నారు. అయితే, ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయాల‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది. 2026లో ఏపీలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పున‌ర్విభ‌జించే అవ‌కాశం ఉంది. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం 2014 ప్ర‌కారం ఏపీలోనూ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వ‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ప్ప‌నిసరి. అదే జ‌రిగితే… పుంగ‌నూరు రెండు నియోజ‌క‌వ‌ర్గాలుగా మారితే… ఎక్క‌డో ఒక చోట నుండి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తాన‌ని, పుంగ‌నూరును వ‌దిలిపెట్టేది లేద‌ని ప్ర‌క‌టించారు. పుంగ‌నూరును పెద్దిరెడ్డి ఫ్యామిలీ విడిచిపెట్ట‌బోతుందని కొంత‌కాలంగా స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. క్యాడ‌ర్ చేజార‌కుండా ఉండేందుకే మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌న్న ప్ర‌క‌ట‌న చేసి ఉంటార‌ని, ఎవ‌రు పోటీ చేసినా… పుంగ‌నూరులో పెద్దిరెడ్డికి వ‌చ్చేసారి ఓట‌మి రుచి చూడ‌టం ఖాయం అంటోంది టీడీపీ క్యాడ‌ర్.
👉 ఘనంగా ఎస్ డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం.. చిలకలూరిపేట:ఆర్టీసీ కార్మికుల అనేక సమస్యలతో సతమాతమ వుతున్న సమయంలో 1979 సెప్టెం బర్ 16వ తేదిన సిఐటియు అనుభంధంగా ఎస్. డబ్ల్యూ.ఎఫ్.(స్టాఫ్ అండ్ వర్క ర్స్ ఫెడరేషన్) స్థాపించడం జరిగిందని గుంటూరు జిల్లా ఎస్డబ్ల్యుఎఫ్ కార్యదర్శి రవిశంకర్ అన్నారు. 46వ ఎస్ డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముఖ్య అతి థిగా వచ్చి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జెండాను సోమవారం ఆవిష్కరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా సిపిఎం అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి మరణానికి తీవ్ర సంతాపం తెలియ జేశారు. ఈ కార్మికులు అనేక సమస్యలే కాకుండా రోజువారి సమస్యలను ఎదు ర్కొంటున్నా రన్నారు. ఈ సంస్థలో ఉన్నన్ని వేధింపులు ఏ ప్రభు త్వ రంగ సంస్థల్లో లేవ న్నారు. ముఖ్యంగా ఇష్యూ అండ్ స్టార్ట్ ప్రయాణికులు ఎక్కిన వెంటనే టికెట్ ఇవ్వలేదని, అద్దాలు పగిలాయని, టైర్లు పంచర్లు అయ్యాయని డ్రైవర్ల వద్దనే డబ్బు లు వసూలు దారుణమైన విషయం అన్నారు.అంతే కాకుండా చిన్న చిన్న సమస్యలకు కూడా కేసులు పెట్టి సంవత్స రాలు తరబడి ఇంక్రిమెంట్లు ఆ పటం ప్రమోషన్లు, రిమూవ్ లు, సస్పెన్షన్లు, లాంటి ఘటనలు ఈ ఒక్క ఆర్టీసీ లోనే ఉన్నాయ న్నారు. అనేక పోరాటాలతో సాధించుకున్న జి.ఓ. 1/2019 సక్రమముగా అమ లు కావటం లేదని,ఎందుకు అమలు కావడం లేదని అడిగితే ఆర్టీసీ ప్రభుత్వ పరం చేశామని అందువల్ల ఆ జీవో ఇంప్లిమెంట్ కాదంటున్నారని అదే ఆర్టిఏ చట్టం ప్రకారం ఆ జీవో పరిస్థితి ఏమిటని అడిగితే ఆ జి.ఓ పని చేస్తుందని తికమకలుగా సమాధా నాలు చెప్తున్నారన్నారు. ఆర్టీసీ పని విధానంలో మార్పులు రావాలని, స మస్త విధివిధానాలు మెరుగు పడాలని, ఎస్.డబ్ల్యూ.ఎఫ్ మొదటి నుంచి గళం విప్పి మాట్లాడు తుందన్నారు. ఆర్టీసీ లో ప్రైవేటు బస్సులను ఆపాలని, కొత్త బస్సులను కొనాలని, 2012 నుంచి రిక్రూట్మెంట్లు లేవని,ప్రయాణికులకు సరిపడ బస్సులు కొనాలని, కాలం చెల్లిన బస్సులను ఆపాలని, లక్షలకు లక్షలు తిరిగిన బస్సులతో మిలేజీ తీసుకు రావాలని ఆయా డ్రైవర్లను బలవంతము చెయ్యటం అన్యాయ మన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యో గుల కు 7/8 వేలతో పనులను చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తు న్నారని ప్రయాణికులకు సరి పడా బస్సులను ఏర్పాటు చేయాలని ఇ టు వంటి పలు సమస్యలు గట్టిగా ప్రశ్నిస్తోంది కేవలం ఈ ఎస్.డబ్ల్యూ.ఎఫ్ యూనియన్ అన్నారు. అనంతరం స్థానిక పండరీ పురం రెండో లైన్లో గల సిఐటియు కార్యాలయంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ మహాసభ జరిగింది. ఈ మాహ సభలో కార్యదర్శి జి.వి. సుబ్బారా వు 3 సం వత్సరాల నివేదికలో ప్రవేశ పెట్టారు నివేదిక పై చర్చలలో సభ్యులు పా ల్గొన్నారు. అనంతరం నూతన కమి టీని ఎన్నుకోవడం జరిగింది. ఇక గ్రీ వంగా ఎన్ను కున్నారు. ఎస్డబ్ల్యుఎఫ్ చిలకలూరిపేట యూనియన్ గౌరవ అధ్యక్షులుగా పేరుబోయిన వెంకటే శ్వర్లు, అధ్యక్షులుగా వి.యోహాను, ప్రధాన కార్యదర్శిగా టి. పణి రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీగా వి.జి. నాయ క్, ఎస్. కే. జిలాని, వైస్ ప్రెసి డెంట్ గా బి.ఎన్. రావు,ఎం. విజయశాంతి, పబ్లిసిటీ కార్యదర్శిగాటీ. రోశ య్య, ట్రెజరీగా జీ.వి. సుబ్బారావు, గ్యారేజ్ కార్యదర్శిగాఎన్. సాంబశివ రావు అసిస్టెంట్ కార్యదర్శిగావి. ఆశీ ర్వాదం లను ఏకగ్రీవంగా ఎన్నుకోవ డం జరిగింది.
👉 మార్కాపురం డిఎస్పీగా నాగరాజు బాధ్యతలు చేపట్టారు… అనంతరం సిఐ సుబ్బారావు పట్టణ రూరల్ ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు…..
👉జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం..
ఒంగోలు: జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం జరిగింది. విఆర్ లో ఉన్న పలువురు ఎస్ఐ లకు స్టేషన్ కేటాయించారు. మరికొందరిని విఆర్ కు పంపించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కనిగిరి ఎస్ఐ గా టి.శ్రీరాం, హనుమంతుని పాడు ఎస్ఐ గా కె.మాధవరావు,పిసి పల్లి ఎస్ఐ గా కోటయ్య, పామూరు ఎస్ఐ గా కిషోర్ బాబు, సిఎస్ పురం ఎస్ఐ గా సుమన్,వెలిగండ్ల ఎస్ఐ గా మధుసూదన రావు, కొమరోలు ఎస్ఐ గా యం.వెంకటేశ్వర్లు నాయక్,కొనకనమిట్ల ఎస్ఐ గా టి.రాజ్ కుమార్, తర్లుపాడు ఎస్ఐ గా బ్రహ్మనాయుడు,పుల్లలచెరువు ఎస్ఐ గా పి.రాజేష్ లను నియమించారు.కాగా త్యాగరాజు,శివ నాగరాజు,ప్రేమ్ కుమార్ లను జిల్లా విఆర్ కు పంపించారు.
👉మహమ్మద్ ప్రవక్త జీవితం అందరికీ ఆదర్శప్రాయం..
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తహసీల్దార్ ఆఫీస్ ఆవరణము ఎన్జీవో హోమ్ నందు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్క నాటి ముస్లిం సోదరులకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటం అందించి సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న గౌరవపెద్దలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ హభిబ్ ఖాన్, బియస్ నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు కాబట్టి ఆయన ద్వారా వచ్చిన పవిత్రమైన గ్రంధం ఖురాన్ సకల మానవాళి కి మార్గదర్శి అని ఆయన ఆ ఖురాన్ లో వున్న ప్రతి వాక్యాన్ని ఆచరించి చూపారని అందరూ శాంతియుతంగా, ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చాలి అని ప్రతి ఒక్కరూ ఖురాన్ ధర్మమని పాటిస్తూ ప్రవక్త చూపిన మార్గం లో నడవాలని తెలియజేశారు ముస్లిం సోదరులు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందున్నారన్నారు. రంజాన్ పండుగ రోజు ఆకలి ఉన్న వారి కోసం ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు వారికి తోచిన కాడికి దానం ఇచ్చి పేదవారిని ఆదుకోవడం గొప్ప ఉద్దేశం అని కూడా పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం టీవీ పఠాన్ ఖాన్ 27 సార్లు రక్తదానం చేశారు. షబ్బీర్ తిరుమల టింబర్ యజమాని కరాటే మాస్టారు. ప్రజా సంగ్రామం విలేకరి షేక్ మదార్, టీవీ9 విలేకరిగా సేవలందిస్తున్న సయ్యద్ నాయబ్ రసూల్ వారిని సత్కరించుకోవడం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నామని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి భారతరత్న ఇవ్వాలనే ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నల్లబోతుల వెంకటేశ్వర్లు సీనియర్ టిడిపి నాయకులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సభ్యులు కాశిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విశ్రాంత ఉపాధ్యాయులు నాయబ్ రసూల్ పాల్గొన్నారు.
👉జూదరుల అరెస్టు..ప్రకాశం జిల్లా..పెద్ద దోర్నాల మండలం, ఎడవల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న పెద్ద దోర్నాల ఎస్సై వి,మహేష్ , దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి 1650 /- అక్షరాలపదహారు వందల యాభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది. పేకాడుతున్న ఏడుగురిపై కేసు నమోదుచేశారు, దోర్నాలమండలంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన పోలీసు వారి దృష్టికి తీసుకురావాల్సిందిగా పెద్ద దోర్నాల సబ్ ఇన్స్పెక్టర్ వి, మహేష్ కోరారు,

👉 ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాప్ నడిపిస్తున్న వ్యక్తిని అతని వద్ద నుంచి 50 క్వాటర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు వారి బృందం..

7k network
Recent Posts

సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్.. జగన్ పై ధ్వజమెత్తిన హోమ్ మినిస్టర్ అనిత..’నేనూ సోషల్‌ సైకోల బాధితురాలినే” షర్మిల..ఐదేళ్లలో, పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయి, ఒప్పుకుంటున్నాం-dgp..గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏడు చోట్ల రైస్ మిల్లుల తనిఖీ..నిరసనకు పిలుపునిచ్చిన ఈయూ..కేతిరెడ్డి మరదలు వసుమతికి నోటీసులు!..విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ లాంతర్ల ర్యాలీ..కేటీఆర్ అరెస్ట్ కు అంతా సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..ఆత్మకూర్ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా.

14 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..కరెంట్ ఛార్జీలు పెంచను: ఏపీ సీఎం చంద్రబాబు.. వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు..IHEFను ప్రారంభించిన విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ..కడప సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిరసన..నెల్లూరు లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అగ్నిప్రమాదం..నిద్రమత్తులో ఆటో నుండి జారి వ్యక్తి మృతి ..వివాహా కార్యక్రమాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్..వెలుగు విఓఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి..

పోకిరీలకు పోలీసులు రాచ మర్యాదలు.. దూకుడు పెంచిన ఏసీబీ..24 శాతం సైబర్ నేరాలు పెరిగాయి: సీపీ ఆనంద్..తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా సమీక్ష సమావేశం..ధరల భారాలకు వ్యతిరేకంగా ప్రజా పోరుకు సిద్ధంకండి..మేస్త్రీలను విధుల్లోకి తీసుకోవాలని అర్థ నగ్న ప్రదర్శన..ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్..పొగాకు ప్రత్యామ్నాయ పంటలు (కంభం)..

అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కాలేజీలకే.. ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల-మంత్రి నారా లోకేష్.. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు నిలిపివేశారా.. వైసిపి కో-ఆర్డినేటర్ “కారుమూరి”నిసత్కరించిన “అన్నా”.. పొలంబడి ( కంభం)సీఎం, డిప్యూటీ సీఎం లపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..