వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

👉 వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?: కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..
విద్యుత్ చార్జీల అంశంలో షర్మిల విమర్శనాస్త్రాలు..
ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని ఆగ్రహం..
మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విద్యుత్ చార్జీల అంశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీలపై గత ప్రభుత్వ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సిన కూటమి ప్రభుత్వం, ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోందని మండిపడ్డారు.

రూ.18 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు, వసూళ్ల విషయంలో తమ తప్పేం లేదని, తమకసలు సంబంధమే లేదని, ఆ భారం తమది కాదని, ప్రజలపైనే ఆ భారం మొత్తం మోపుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సర్దుబాటు కాదని, ప్రజలకు సర్దుపోటు అని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన భారీ కరెంట్ షాక్ అని పేర్కొన్నారు.
“విద్యుత్ చార్జీల అంశంలో వైసీపీ చేసింది పాపం అయితే, రాష్ట్ర ప్రజలకు టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం పెడుతున్నది శాపం. గత సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏమిటి సంబంధం? ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే, ఆ అదనపు భారాన్ని ప్రజలపై మోపుతారా?
విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ఐదేళ్లలో వైసీపీ మోపిన భారం రూ.35 వేల కోట్లు అయితే, ఈ ఐదు నెలల్లో కూటమి ప్రభుత్వం మోపిన భారం రూ.18 వేల కోట్లు! వైసీపీకి మీకు తేడా ఏంటి?
వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచిందని అన్నారు… కూటమి అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలు పెంచబోమన్నారు… అవసరమైతే 30 శాతం తగ్గిస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటే, అదనపు భారాన్ని ప్రజలపై మోపకూడదన్న చిత్తశుద్ధి మీకుంటే వెంటనే ఆ రూ.18 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి. అదనపు భారం తగ్గించేందుకు నిధులు ఇవ్వాలని మోదీని గల్లా పట్టి అడగండి. ఇకపై ప్రజల నుంచి ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఒప్పుకునేది లేదు. ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. ట్రూఅప్ చార్జీల రూపంలో అధిక విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం” అని షర్మిల ట్వీట్ చేశారు.
👉త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు అనిత..
మహిళలు, చిన్న పిల్లలపై ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయని హోం మంత్రి అనిత తెలిపారు. పోలీసులకు దొరకకుండా నేరస్థులు తప్పించుకుంటున్నారని చెప్పారు. తమ ముందు చాలా టాస్క్లు ఉన్నాయని, శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ప్రతి జిల్లాలోనూ సోషల్ మీడియా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో అనేక ఉన్మాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
👉నాడువైసీపీ నేతలకు తొత్తులుగా అధికారులు*
*బుగ్గన బంధువుకు భూమిని కట్టబెట్టిన వైనం*
*అప్పు ఇచ్చిన డబ్బులు అడుగుతుంటే ప్రాణాలు తీస్తామని బెదిరింపులు..*పని కల్పిస్తామని విదేశాలకు తిసుకెళ్లి చిత్రహింసలు..*నేతలకు మొరపెట్టుకున్న బాధితులు..
*మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట… మంత్రి ఫరూక్*
*టిడిపి కేంద్ర కార్యాలయానికి వచ్చి వినతులు సమర్పించిన బాధితులు.. *అమరావతి నవంబర్ 5*
*నంద్యాల జిల్లాలో వైసీపీ నేతలకు సహకరిస్తూ.. తమ భూమిని అప్పటి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి బంధువు బీఆర్సీ బుగ్గారెడ్డికి అక్రమంగా రెవెన్యూ అధికారులు ఆన్ లైన్ చేశారని పాణ్యం మండలం గోరుకల్లు గ్రామానికి చెందిన సురేష్ బాబు తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు .*
*మంగళవారం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో సురేష్ బాబు టిడిపి నాయకులకు తనకు జరిగిన అన్యాయంపై వివరించారు.* *దీనిపై నాడు ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరించారని.. వారికి అక్రమంగా ఆన్ లైన్ చేసిన 14 సెంట్లను రద్దు చేసి ఈ అక్రమాలకు సహకరించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ లో నేతలకు ఫిర్యాదు చేశాడు.*

*అర్జీని స్వీకరించిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, మాజీ శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్, బుచ్చిరాంప్రసాద్ లు అర్జీని స్వీకరించి న్యాయం చేస్తామని బాధితుడికి హామి ఇచ్చారు.*
*అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే.. తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని చింతల చెరువు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని.. అవసరం అంటే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి రూ.32 లక్షలు అప్పుగా ఇచ్చానని. ఇప్పుడు డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోమంటున్నాడని తనకు వెంకటేశ్వరరెడ్డి నుండి రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన యక్కంటి కృష్ణారెడ్డి నేతల ముందు వాపోయాడు.*
*పనిచూపిస్తానని తన భార్యను మస్కట్ తీసుకెళ్లి అక్కడ పనికల్పించకుండా తనకు తిండి పెట్టకుండా ఏజెంట్ ఇబ్బంది పెడుతున్నాడని,తన భార్యను ఇండియాకు తిరిగి పంపించమని అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని,ఏజెంట్ మల్లీడి సుబ్రహ్మణ్యంపై పాలకొల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తల్లికోసం పిల్లలు బెంగ పెట్టుకున్నారని అంతేకాకుండా మస్కట్ లో ఉన్న తన భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని,తనను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన టి. రాజశేఖర్ నేతలకు విన్నవించుకొన్నాడు..
*తన పొలాన్ని వైసీపీ నేతల కబ్జా చేస్తే.. న్యాయం కోసం పోలీసులు, అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడంలేదని.. తిరిగి తనపైనే దాడులకు దిగుతున్నారని కృష్ణా జిల్లా జి. కొండూరుకు చెందిన మేరెడ్డి సామ్రాజ్యం అనే మహిళ నేతలకు ఫిర్యాదు చేశారు. విచారించి తనకు న్యాయం చేసేలా చూడాలని కోరారు.*
*కేంద్రం నుండి రిటైర్డ్ అయిన మాజీ ఉద్యోగులు తమ ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రులకు వెళ్లాలంటే నెల్లూరులో ఉండే CGHS కు వెళ్లవలసి వస్తోందని.. దూరాభారంతో వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని.. కావున కర్నూలులో మరో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఏవైన్ బాబు రాజ్ నేతలను కోరారు.*
*ప్రకాశం జిల్లా చిన్నగుడిపాడుకు చెందిన రమణబాబు అనే వ్యక్తి నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. దాదాపు నాలుగు తరాలుగా తమ పూర్వికుల పండిచుకుని అనుభవంలో ఉన్న భూమిని… కరువు రిత్యా ఉపాధి కోసం మరో ఊరికి వెళ్లగా.. అప్పటి నేతల చర్యలతో ప్రభుత్వం ఆ భూమిని వేరోకరికి కేటాయించిందని.. వారికి కేటాయించిన భూమిని రద్దు చేసి తమకు భూమిపై హక్కులు కల్పించాలని.. అలాగే ప్రభుత్వం ఎవరికైతే భూమి కేటాయించిందో వారికి న్యాయం జరిగేలా మరోక చోట భూమి కేటాయించాలని అలా కుదరని పక్షంలో తమకు మరోక చోట అంతే భూమిని కేటాయించాలని విన్నవించుకున్నాడు.*
*మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది… మంత్రి ఫరూక్..
*గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో కొత్త మసీదుల నిర్మాణం, మరమ్మతులకు నిధులు, షాదిఖానాల నిర్మాణం, చర్చిల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసినప్పటికీ, వైసిపి ప్రభుత్వం నిధులను నిలిపివేసిందని వెంటనే మైనార్టీల సంక్షేమం కోసం నిలిచిపోయిన మైనారిటీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని పలువురు ప్రతినిధులు మైనార్టీల తరఫున మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్ కు విన్నవించారు. ఈ విషయంపై మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఇప్పటికే మైనార్టీల సంక్షేమం కోసం సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కార్యాచరణ బద్ధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఉపాధి కోసం కువైట్ దుబాయ్ గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఆయా దేశాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని మంత్రి ఫరూక్ బాధితులకు హామీ ఇచ్చారు*
*రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు సీఎం ఆర్ఎఫ్ సాయం కోసం అర్జీలు తీసుకురాగా.. మరికొందరు నామినేటెడ్ పదవులు ఆశిస్తూ.. నేతలు అర్జీలు ఇచ్చారు. వివిధ సమస్యలపై తమకు న్యాయం చేయాలంటూ పలువురు నేతలను వేడుకున్నారు.
👉 శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి
సర్వీస్ ఛార్జ్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేసి జిఎస్టి బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న యజమాన్యం..
ఆరోగ్యశాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న డాక్టర్ అర్జున్ రెడ్డి పై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం కు సహకరిస్తున్న డిఎంహెచ్ఓ..
పేద ప్రజల రక్తాన్ని జలగలు లాగా పీల్చుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ..
లేనియెడల రాబోయే రోజులలో హాస్పిటల్ ఎదురుగా వేల మందితోని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిక..
బోడ రమేష్ నాయక్..ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు
మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో గుండాల మురళీధర్ రెడ్డి ను మరియు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమా రాణి ను కలిసి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు మరియు వాటి యాజమాన్యం చేసే మెడికల్ మాఫియా గురించి వినతి పత్రం అందజేసి ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ అర్జున్ రెడ్డి మరియు యాజమాన్యం వారు పేద ప్రజల రక్తాన్ని పీల్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు నర్సంపేటకు చెందిన ఎర్రబెల్లి సతీష్ కారు కిరాయి డ్రైవర్ గా మహబూబాబాద్ వస్తే అతనికి కడుపునొప్పి వస్తే శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ కు తీసుకు వెళ్తే డాక్టర్ అర్జున్ రెడ్డి వివిధ రకాల టెస్టుల పేరుతో సంబంధంలేని మందులు రాసి ఆరోగ్యశాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులు చెల్లించిన తర్వాత జిఎస్టి సంబంధించిన బిల్లు కావాలని అడుగుతే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు జిఎస్టి బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా గండి పెడుతున్నారు అని అన్నారు శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ కు పార్కింగ్ సౌకర్యం ఉండదు మౌలిక సదుపాయాలు ఉండవు సరైన మిషనరీలు ఉండవు ఉండవు ఆరోగ్యశాఖ నియమ నిబంధనలు పాటించరు అయినా సర్వీస్ ఛార్జీ ల పేరుతో అధిక డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫీజుల పట్టిక కూడా హాస్పటల్లో కనిపించదు ఇటువంటి హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల వేల మందితోని హాస్పిటల్ ఎదురుగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బయ్యారం అధ్యక్షుడు నరేష్ నాయక్ మహబూబాద్ టౌన్ ప్రెసిడెంట్ హాతిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు
👉హోం మంత్రి వంగలపూడి అనిత డిజిపి ద్వారకా తిరుమలరావులను మర్యాదపూర్వకంగా కలిసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి..
అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి అనంతపురంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రహోం మంత్రి వంగలపూడి అనితకు మంగళవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ లు పుష్ప గుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి సత్కరించారు.అదేవిధంగా పి టి సి గెస్ట్ హౌస్ లో ఉన్న డిజిపి ద్వారకా తిరుమలరావును వారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై హోం మంత్రి అనిత, డిజిపి తిరుమలరావు దృష్టికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి తీసుకొచ్చారు. పుట్టపర్తి నియోజకవర్గం లో పలు స్టేషన్లో పోలీసు సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని హోం మంత్రి, డిజిపి దృష్టికి తీసుకు పోయారు. అలాగే కొన్ని ఏళ్ళ క్రితం పోలీస్ లకు ఇచ్చిన వాహనాలు కాలం చెల్లి పూర్తిగా దెబ్బతిన్నాయని ,అంతే కాకుండా ఆ వాహనాలు ఎక్కడపడితే అక్కడే ఆగిపోతున్నాయని అవి పూర్తిగా పాడై పోవడం వల్ల పోలీసులకు ఏ మాత్రం ఉపయోగ పడడం లేదనీ హోంమంత్రి ,డిజిపి దృష్టికి తీసుకువచ్చారు . ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది వివిఐపీలు వీఐపీలు విచ్చేస్తుంటారని ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఎంతో పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు పోలీస్ సిబ్బందితోపాటు నూతన పోలీసు వాహనాలను, జిల్లా ఎస్పీ నూతన కార్యాలయం తో పాటు ప్రత్యేక పోలీస్ గెస్ట్ హౌస్ ను మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేకంగా వారినీ కోరారు. పుట్టపర్తి నియోజక వర్గంలో ఎస్సైలకు ,సీఐలు వాడుతున్న వాహనాలు కాలం చెల్లిన వాహనాలు వాడుతున్నారని ఆ స్థానంలో నూతన వాహనాలు అందించే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని హోంమంత్రి అనిత, డిజిపి ద్వారాక తిరుమలరావు ను ప్రత్యేకంగా విన్నవించారు. అలాగే నల్ల మాడ ,ఆమడ గూరు ,పుట్టపర్తి ,బుక్కపట్నం పోలీస్ స్టేషన్ లకు నూతన భవనాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
👉బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి…
*జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి…*
బాపట్ల జిల్లా స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశం బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, తొలిసారిగా బాపట్ల జిల్లాకు విచ్చేశారు. జిల్లా అభివృద్ధి పై సమక్షించారు.. ఇన్చార్జి మంత్రి తో పాటు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, శాసనమండలి సభ్యులతో అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు…అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారించాలి జిల్లా ఇన్చార్జి మంత్రి తెలిపారు…
👉ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయని మర్యాదపూర్వకంగా కలిసి యర్రగొండపాలెం నియోజకవర్గ సమస్యలపై ఆమె దృష్టికి తీసుకెళ్లిన యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్
👉జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో అధికారులతో సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అన్సారియా,జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్.
👉 ఒంగోలు నగరంలోని బృందావనం ఫంక్షన్ హల్ నందు మున్సిపల్&సచివాలయం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో శాసనసభ్యులు బి.ఎన్ విజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రావు..
👉చీమకుర్తి మండలంలోని రామతీర్థం లో జరిగిన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ అసోసియేషన్ సమావేశంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ముందుగా గ్రానైట్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్ధాలను వేసుకొనిటకు ఖాళీ స్థలము మంజూరు చేయించవలసిందిగా కోరారు. గ్రానైట్ క్వారీలనుండి తీసిన రా మెటీరియల్ను ఇక్కడ ఫ్యాక్టరీ లకు సరఫరా చేసే విధంగా చూడాలని కోరారు. కరెంటు చార్జీలు కూడా తగ్గించాలని కోరారు.
అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ మీ కోరికలు న్యాయబద్ధంగానే ఉన్నాయని తన వంతు సాయంగా మీ విషయాలను స్థానిక శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ తో కలిసి మంత్రివర్గ సభ్యులకు వివరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రానైట్ సంస్థల యాజమానులు, ఫ్యాక్టరీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
👉 ప్రకాశం జిల్లా కంభం మండలం పెద్ద నల్లకాలువ గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 5,540/-రూ నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండల పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు…
👉అక్కపల్లె లో మద్యం బెల్టు షాపులపై పోలీసులు దాడి.. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం అక్కపల్లె గ్రామంలో ఎస్సై రవీందర్ రెడ్డి తనిఖీలు నిర్వహించగా అక్కపల్లె గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మద్యం బెల్టుషాపు నడుపుచున్నఆవ్యక్తిని నుండి 15 క్వాటర్ స్వాధీనం చేసుకొని అతని అదుపులో తీసుకోని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చన్నారు.ఈ సందర్భంగా ఎస్సై రవీందర్ రెడ్డి మాట్లాలాడూతు ఎవరుఅయినా బెల్టుషాపులు నిర్వహించి మద్యం అమ్మితే వారిపై కఠిమైన చర్యలు తప్పవుఅని తెలిపారు
👉ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట కొత్తపల్లి గ్రామంలో కాశయ్య అనే వ్యక్తి వద్ద 25 క్వాటర్ల మద్యం మరియు ఆకవీడు గ్రామంలో రత్నమ్మ అనే మహిళ వద్ద 8 క్వాటర్ల లా మద్యం స్వాధీనం చేసుకొని ఇద్దరు పై కేసు నమోదు చేసిన రాచర్ల ఎస్సై వారి బృందం…

7k network
Recent Posts

సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్.. జగన్ పై ధ్వజమెత్తిన హోమ్ మినిస్టర్ అనిత..’నేనూ సోషల్‌ సైకోల బాధితురాలినే” షర్మిల..ఐదేళ్లలో, పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయి, ఒప్పుకుంటున్నాం-dgp..గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏడు చోట్ల రైస్ మిల్లుల తనిఖీ..నిరసనకు పిలుపునిచ్చిన ఈయూ..కేతిరెడ్డి మరదలు వసుమతికి నోటీసులు!..విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ లాంతర్ల ర్యాలీ..కేటీఆర్ అరెస్ట్ కు అంతా సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..ఆత్మకూర్ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా.

14 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..కరెంట్ ఛార్జీలు పెంచను: ఏపీ సీఎం చంద్రబాబు.. వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు..IHEFను ప్రారంభించిన విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ..కడప సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిరసన..నెల్లూరు లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అగ్నిప్రమాదం..నిద్రమత్తులో ఆటో నుండి జారి వ్యక్తి మృతి ..వివాహా కార్యక్రమాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్..వెలుగు విఓఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి..

పోకిరీలకు పోలీసులు రాచ మర్యాదలు.. దూకుడు పెంచిన ఏసీబీ..24 శాతం సైబర్ నేరాలు పెరిగాయి: సీపీ ఆనంద్..తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా సమీక్ష సమావేశం..ధరల భారాలకు వ్యతిరేకంగా ప్రజా పోరుకు సిద్ధంకండి..మేస్త్రీలను విధుల్లోకి తీసుకోవాలని అర్థ నగ్న ప్రదర్శన..ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్..పొగాకు ప్రత్యామ్నాయ పంటలు (కంభం)..

అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కాలేజీలకే.. ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల-మంత్రి నారా లోకేష్.. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు నిలిపివేశారా.. వైసిపి కో-ఆర్డినేటర్ “కారుమూరి”నిసత్కరించిన “అన్నా”.. పొలంబడి ( కంభం)సీఎం, డిప్యూటీ సీఎం లపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..