14 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..కరెంట్ ఛార్జీలు పెంచను: ఏపీ సీఎం చంద్రబాబు.. వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు..IHEFను ప్రారంభించిన విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ..కడప సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిరసన..నెల్లూరు లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అగ్నిప్రమాదం..నిద్రమత్తులో ఆటో నుండి జారి వ్యక్తి మృతి ..వివాహా కార్యక్రమాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్..వెలుగు విఓఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి..

👉ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యాప్తంగా  రూ.6 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టుల   పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు . రాజధాని ప్రాంతానికి  నిరంతర  విద్యుత్ సరఫరా కోసం  తాళ్లాయపాలెంలో జీఐఎస్ సబ్ స్టేషన్‍ను ప్రారంభించిన సీఎం. రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటు చేసిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ఇది.
రాష్ట్రంలో రూ.5,407 కోట్ల వ్యయంతో చేపట్టిన14 సబ్స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం తో పాటు ఐదు నూతన సబ్ స్టేషన్లను సీఎం చంద్రబాబు
గురువారం ప్రారంభించనున్నారని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతి పరిధిలోని తాళ్వాయి పాలెంలో రాష్ట్ర ఇంధన రంగంలోనే మొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కేవీ సబ్స్టేషన్ (GIS)ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
👉 కరెంట్ ఛార్జీలు పెంచను: ఏపీ సీఎం చంద్రబాబు*
👉రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ,హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం.

👉 కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసన. *మేయర్ ఛాంబర్ లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేసిన వైనం. *మేయర్ వేదిక వద్ద కుర్చీ లేకపోవడంతో నిలబడే ఉన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి. *నిల్చొని నిరసన వ్యక్తం చేసిన మాధవిరెడ్డి.*
సత్యసాయి జిల్లా : హిందూపురం మున్సిపాలిటీపై కన్నేసిన టీడీపీ – మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం – టీడీపీలో చేరిన చైర్‍పర్సన్, 14 మంది కౌన్సిలర్లు – రేమేష్‍ను చైర్మన్ పదవికి ఎంపిక చేసిన బాలకృష్ణ – కౌన్సిలర్లు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయం – హైదరాబాద్ క్యాంప్‍లో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు – నోటిఫికేషన్ రాగానే హైదరాబాద్ నుంచి నేరుగా హిందూపురం తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేసిన టీడీపీ ?
మార్కాపురం పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడలైన ప్రదాన ఏరియాలోని కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం…. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సీఐ సుబ్బారావు.
*👉నెల్లూరు నగరంలోని జిల్లా వైద్యాధికారి (DMHO)కార్యాలయంలో అగ్నిప్రమాదం…*
ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో పలు రికార్డులు తో పాటు, కొంత ఫర్నిచర్ కూడా దగ్ధం…
మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది..
👉*వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు*
• వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. • సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు. • వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు.
• వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు..కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు.
👉అమరావతిలోని విట్ యూనివర్సిటీ ప్రాంగణంలో విట్-ఏపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ (IHEF)ను విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన అధునాతన డ్రైవర్ లెస్ వ్యాన్, డ్రోన్, రోబోట్ వంటి నవీన ఆవిష్కరణలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ… యువత ఉద్యోగం సాధించడంపై కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తయారుకావాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని స్టార్టప్‌లను ప్రారంభించాలన్నారు. ఇందుకు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తుందని, రూ.250కోట్లతో సీడ్ ఫండ్ ను కూడా ఏర్పాటుచేశామని చెప్పారు.
యువత ఆకాంక్షలకు మద్దతుగా నవీన ఆవిష్కరణలు, పరిశోధనలు, అకడమిక్ ఎక్సలెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉండేలా బలమైన విద్యావ్యవస్థ నిర్మాణానికి కలిసి పని చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.
👉కడప జిల్లా…జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన విద్యా సాగర్ నాయుడు…పూర్వపు ఎస్పి హర్షవర్ధన్ రాజును బదిలీ చేయడంతో ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కు అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం.
👉హిందూపురం నియోజకవర్గం చిలుమత్తూరు మండలంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులకు సహకరించారని పరిగి ఏఎస్ఐ హిదాయతుల్లా ను సస్పెండ్ చేసిన శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ V రత్న_అధికారకంగా సమాచారం ఇచ్చిన పరిగి ఎస్సై రంగడు యాదవ్_
👉మార్కాపురంలో ప్రారంభమైన ప్రధాన రహదారులపై ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియ…. మున్సిపల్ మరియు పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రక్రియలో భారీగా మోహరించిన పోలీసులు.
👉పూరిమెట్ల వారి కళ్యాణంలో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్*
*గిద్దలూరు మండలం, నరవ గ్రామంలోని లక్ష్మినరసింహ స్వామి కల్యాణ మండపంలో పూరిమెట్ల నరసింహాచార్యులు కుమారుడు చి. నవీన్ కుమార్ మరియు చి.ల.సౌ వైష్ణవి లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు..
👉సూరె వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్*
*గిద్దలూరు పట్టణంలోని సంజీవరెడ్డి నగర్ లోని రిషిత అపార్ట్మెంట్ లో సూరె మురళీధర్ రెడ్డి కుమార్తె చి.ల.సౌ ఉమాప్రియా మరియు గంగా ప్రకాష్ రెడ్డి లకు జరగనున్న వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గోని నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు పాల్గోన్నారు.*
👉కొనకనమిట్ల మండలం,చినారికట్ల పంచాయతీ సిద్దవరం వద్ద రూ.35.50 కోట్ల తో నిర్మించనున్న 132/33 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని అమరావతి రాజధాని నుండి వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .ఈ వర్చువల్ కార్యక్రమంలో చినారికట్ల నుండి జిల్లా కలెక్టర్ .ఏ.తమీమ్ అన్సారియా,మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.
👉నిద్రమత్తులో ఆటో నుండి జారీ వ్యక్తి మృతి ..
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మొహద్దిన్ పురం నాగులవరం మార్గం మధ్యలో ఆటో ప్రక్కన కూర్చొని ప్రయాణిస్తున్న వ్యక్తి నిద్ర మత్తులో ఆటో నుండి జారీ కింద పడడంతో తలకు బలమైన గాయం తగలడంతో వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. అక్కడచికిత్స పొందుతూ మృతి చెందడంతో పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే అర్ధవీడు పంచాయతీ లోని నారాయణ పల్లె గ్రామానికి చెందిన శీలం రామకృష్ణారెడ్డి (45)సం”మృతుడు గ్రామంలోని నిమ్మ తోటలో కాపలాదారునిగా వుంటూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. ఎప్పటిలాగే నిమ్మకాయలు కోసుకొని తోట యజమానితో కలిసి ఆటోలో వెళ్లుతూ ఆటోనుండి జారిపడిమృతి చెందడంతోకుటుంబ సభ్యులరోదన చూసేవారిని కంటతడి పెట్టించింది మృతుడికి భార్య,కుమారుడు, కుమార్తె ఉన్నారు కుమార్తెకు పెళ్ళికాగా కుమారుడు చదువు కుంటున్నాడు.
👉3 ఏళ్ల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని వినతి*
వెలుగు విఓఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కోరుతూ కంభం మండల వెలుగు వివోఏలు గురువారం వెలుగు కంభం మండల ఏపిఎం లకు కంభం మండల తహశీల్దార్ కార్యాలయపు అధికారి కి, కంభం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయపు సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం అందజేసి తమ డిమాండ్లను ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వెలుగు విఓఎల సంఘం (సిఐటియు అనుబంధం) కంభం మండల అధ్యక్ష , కార్యదర్శులు పెద్దిరెడ్డి.శ్రీలక్ష్మి , దొంతా కాశీ రత్నం, విఓఏ ల సంఘం నాయకులు రహమత్ , హసీనా , వెల్పుల విజయ , ఉయ్యాల వాడ రత్నమ్మ , తదితర వివోఏలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్.. జగన్ పై ధ్వజమెత్తిన హోమ్ మినిస్టర్ అనిత..’నేనూ సోషల్‌ సైకోల బాధితురాలినే” షర్మిల..ఐదేళ్లలో, పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయి, ఒప్పుకుంటున్నాం-dgp..గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏడు చోట్ల రైస్ మిల్లుల తనిఖీ..నిరసనకు పిలుపునిచ్చిన ఈయూ..కేతిరెడ్డి మరదలు వసుమతికి నోటీసులు!..విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ లాంతర్ల ర్యాలీ..కేటీఆర్ అరెస్ట్ కు అంతా సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..ఆత్మకూర్ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా.

14 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..కరెంట్ ఛార్జీలు పెంచను: ఏపీ సీఎం చంద్రబాబు.. వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు..IHEFను ప్రారంభించిన విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ..కడప సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిరసన..నెల్లూరు లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అగ్నిప్రమాదం..నిద్రమత్తులో ఆటో నుండి జారి వ్యక్తి మృతి ..వివాహా కార్యక్రమాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్..వెలుగు విఓఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి..

పోకిరీలకు పోలీసులు రాచ మర్యాదలు.. దూకుడు పెంచిన ఏసీబీ..24 శాతం సైబర్ నేరాలు పెరిగాయి: సీపీ ఆనంద్..తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా సమీక్ష సమావేశం..ధరల భారాలకు వ్యతిరేకంగా ప్రజా పోరుకు సిద్ధంకండి..మేస్త్రీలను విధుల్లోకి తీసుకోవాలని అర్థ నగ్న ప్రదర్శన..ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్..పొగాకు ప్రత్యామ్నాయ పంటలు (కంభం)..

అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కాలేజీలకే.. ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల-మంత్రి నారా లోకేష్.. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు నిలిపివేశారా.. వైసిపి కో-ఆర్డినేటర్ “కారుమూరి”నిసత్కరించిన “అన్నా”.. పొలంబడి ( కంభం)సీఎం, డిప్యూటీ సీఎం లపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..