సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్.. జగన్ పై ధ్వజమెత్తిన హోమ్ మినిస్టర్ అనిత..’నేనూ సోషల్‌ సైకోల బాధితురాలినే” షర్మిల..ఐదేళ్లలో, పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయి, ఒప్పుకుంటున్నాం-dgp..గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏడు చోట్ల రైస్ మిల్లుల తనిఖీ..నిరసనకు పిలుపునిచ్చిన ఈయూ..కేతిరెడ్డి మరదలు వసుమతికి నోటీసులు!..విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ లాంతర్ల ర్యాలీ..కేటీఆర్ అరెస్ట్ కు అంతా సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..ఆత్మకూర్ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా.

👉సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్*..*ఆడబిడ్డల జోలికి వస్తే సహించిదే లేదు – సీఎం చంద్రబాబు*..సోషల్‌ మీడియాలో ఆడబిడ్డల పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. ఆడబిడ్డ హోంమంత్రిపైనా పోస్టులు పెడుతున్నారు..
ఆంబోతులుగా మారి మదమెక్కి వ్యవహరిస్తున్నారు
పవన్‌ కల్యణ్ కూతురిపై పోస్టింగ్‌లు పెట్టి.. వారు బాధపడే పరిస్థితి తెచ్చారు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలా? వద్దా..?సీఎం చంద్రబాబు అంటూ అలాంటి వారిని విడిచిపెట్టే ప్రసక్తేలేదని తెలిపారు.
👉కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట•పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
•ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి
•త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.750 కోట్లు
•వెదురు పెంపకం, బయో డీజిల్ మొక్కల పెంపకం ద్వారా పంచాయతీల ఆదాయం వృద్ధికి చర్యలు
•ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటి సరఫరా లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనులు..
•పల్లె పండుగ పనుల నాణ్యతను సర్పంచులూ పర్యవేక్షించాలి..•ఇది మొండి ప్రభుత్వం కాదు… వినే ప్రభుత్వం…•పంచాయతీల సమస్యలు వినేందుకు ప్రతి నెలా సమావేశం..•పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ప్రతినిధులతో సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ..గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని ఇష్టానుసారం నిర్వీర్యం చేసింది. పంచాయతీల్లో స్వపరిపాలన, సుపరిపాలనకు చోటు లేకుండా చేసింది. ఆర్ధిక విచ్చలవిడితనంతో పంచాయతీల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. సర్పంచులకు విలువ లేకుండా చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. దీనిని సరిచేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం. ఆయన అనుభవంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట వేస్తామని తెలిపారు.
👉మాదాపూర్ ఐటీసీ కోహినూర్ ఎదురుగా ధర్నా చేపట్టిన ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్ మరియు యూనియన్ సభ్యులు..గతంలో సీఎం రేవంత్ రెడ్డి, కుమార్ ఆంటీ విషయంలో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని సంస్థలు.. జిహెచ్ఎంసి సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని..
దీంతో ధర్నా చేపడుతున్న ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్ మరియు యూనియన్ సభ్యులు…
👉ఐదేళ్లలో, పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయి.. ఒప్పుకుంటున్నాం. తప్పులను సరిదిద్దడంపై దృష్టిపెట్టాం.. డీజీపీ ద్వారకా తిరుమలరావు..2017లో తెచ్చిన ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ టెక్నాలజీని, గత 5 ఏళ్ళలో ఎందుకు వాడకుండా పక్కన పడేసారో అర్ధం కావటం లేదు.
గతంలో ఓ పార్టీ ఆఫీస్‍పై దాడి జరిగినా పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదు. భావప్రకటనాస్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని పోలీసులు రాసుకున్నారు. ఒక పార్టీ ఆఫీసుపై దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. ఒక ఎంపీని తీసుకెళ్ళి కొట్టేసారు. మూడేళ్ల తర్వాత చర్యలు ఏంటని ప్రశ్నించడం సరికాదు. తప్పు జరిగితే 30 ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకోవచ్చు. న్యాయం చేసేందుకే చట్టాలు, కోర్టులు ఉన్నది
👉సాధారణ పౌరుడిలా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్
సత్తెనపల్లిలో రోడ్డు పక్కన ఆగి టీ తాగిన మంత్రి నాదెండ్ల మనోహర్.. రైస్ మిల్లు తనిఖీల కోసం పల్నాడు జిల్లా సత్తెనపల్లి వచ్చిన నాదెండ్ల ..రోడ్డు పక్కనే కారు ఆపించి బడ్డీ కొట్టు వద్ద టీ తాగిన మంత్రి నాదెండ్ల..అక్కడ సామాన్యులను నిత్యావసర ధరలపై ఆరా తీసిన మంత్రి
👉యనమలకుదురులో గ్యాంగ్ వార్.. పోలీసుల దర్యాప్తు
కృష్ణ జిల్లా యనమలకుదురులో ఈనెల 5న జరిగిన గ్యాంగ్ వార్కు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ వల్ల ఇరు వర్గాల యువకులు దాడులు చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 9మందిని అరెస్ట్ చేశామని, మరో వర్గంలోని యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. నిందితుల్లో ఎక్కువమంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించామన్నారు.
👉 జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన హోమ్ మినిస్టర్ అనిత.. అమరావతి..
ఆర్ధిక నేరగాళ్ళ నుంచి ఆకు రౌడీల దాకా, రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారనీ రాష్ట్ర హోమ్ మినిష్టర్ అనిత ప్రెస్ మీట్ మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శాంతిభద్రతల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరం అని
జగన్, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు..
మన రాష్ట్ర పరువు, ప్రతిష్ఠను జగన్ ఎప్పుడో తీసేశారు.
ఐదేళ్ల పాలనలో ఏం చేశారనే దానిపై జగన్ మాట్లాడాలి.
వైసీపీ హయాంలో ఎన్ని నేరాలు జరిగాయో లెక్కలు చూడండి..ఎన్ని నేరాలు జరిగినా జగన్ ఐదేళ్లపాటు మాట్లాడలేదు..మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినా జగన్ పట్టించుకోలేదు..ఐదు నెలల్లో ఏదో జరిగిపోయిందని అభాండాలు వేస్తున్నారు.
వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయి.
మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అనేకమందిపై కేసులు పెట్టారు..బూతులు మాట్లాడే వాళ్ళ పై కేసులు పెడుతుంటే, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం అంటాడు.
70 ఏళ్ళ రంగనాయకమ్మ నీ అసమర్ధత ప్రశ్నిస్తే అరెస్ట్ చేసావ్..సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు..అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడారు. దుర్గమ్మ గుడికి వెళ్లకుండా ఎలా అడ్డుకున్నారో చూశాం. డీజీపీ ఆఫీసు పక్కనున్న టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. పెన్నులు, నల్లబట్టలు వేసుకున్నా సభలకు రానీయలేదు.జగన్ హయాంలో పరదాలు కట్టుకుని సమావేశాలు పెట్టుకున్నారు. నువ్వు మాట్లాడుతున్నావా జగన్ ?..చీకటి రోజులు అంటే ఏంటో తెలుసా జగన్ రెడ్డి ? మా అక్కని ఏడిపిస్తున్నారు అంటే, ఒక చిన్న కుర్రాడిని తగలబెట్టేసారు చూడు. అవి చీకటి రోజులు అంటే.కనీసం ఒక ఎంక్వయిరీ చేసావా జగన్ ?.. సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నావా జగన్ ? .. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మర్చిపోయావా ?..గౌతు శిరీష, చింతకాయల విజయ్, రంగనాయకమ్మను ఇబ్బంది పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటే ఏమిటో జగన్‌కి తెలుసా ? జగన్ హయాంలో పోలీసులను డ్యూటీ చేయనివ్వలేదు.తన తల్లి, చెల్లి జోలికి ఎవడైనా వస్తే, మనిషి అనేవాడు లాగి పెట్టి కొడతాడు.అలాంటిది విజయమ్మ, షర్మిలపై దారుణమైన పోస్టులు పెట్టినా, జగన్ పట్టించుకోలేదు. వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి విజయమ్మ, షర్మిలపై దారుణమైన పోస్టులు పెట్టారు.వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు.కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది.
మమ్మల్ని మీరు పెట్టిన బాధలు సమాజానికి తెలియాలి.
నాపై, నా రాజకీయ జీవితంపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. దారుణంగా పెట్టిన పోస్టులు తట్టుకోలేకే కొందరిని అరెస్టు చేస్తున్నాం. నువ్వు ఇలాంటి పోస్టులు పెట్టిస్తుంటే, మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా ? ఇలాంటి వాళ్ళని వదిలేయాలా ? ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాం.. లోపల వేస్తాం.. ఇలా బూతులు పోస్టు చేసే వెధవలను రక్షించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. సభ్యత, సంస్కారం లేనివారిని వార్‌రూమ్ పెట్టి మరీ రక్షిస్తారా. ఫేక్ ఖాతాలు సృష్టించి మమ్మల్ని దారుణంగా తిడుతున్నారు. నా పేరుతో ఫేక్ ఖాతా సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ల భాష గురించి మాట్లాడేందుకు సభ్యత, సంస్కారం అడ్డొస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా ఊరుకోం. ప్రతి ఒక్కడి సంగతి తేలుస్తాం.పోలీసులు తలెత్తుకుని విధులు నిర్వహించేలా చేస్తాం.నేరగాళ్లు అనుక్షణం భయపడేలా చర్యలు తీసుకుంటాం.
👉కేతిరెడ్డి మరదలు వసుమతికి నోటీసులు!
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నీటి పారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిక్కవడియార్ చెరువులో ఆక్రమణలు జరిగాయని, ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమారు 20 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం.
*👉మదనపల్లెలో దారుణం*..
*ప్రేమను అంగీకరించలేదని ఆత్మహత్యకు యత్నించిన యువతి*…ప్రేమను అంగీకరించలేదని విషం తాగిన యువతి మృతి*..చనిపోయే ముందు నగినా మాట్లాడిన వీడియో వైరల్*…!!
అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలనుకున్న తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. మమ్ములను విడదీస్తున్నారని.. ఓ యువతి మనస్థాం చెంది బుధవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి పాఠకులకు తెలిసిందే. అయితే ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తన *ఆశ* నెరవేర కుండానే తనువు చాలించడం కలకలం రేపుతోంది. బాదితురాలు మృతిపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె పట్టణం, బెంగళూరు రోడ్డు, నక్కలదిన్నెలో ఉండే నగీన (22) మదనపల్లె రీడింగ్ రూమ్ వీధిలో ఓ బట్టల షాపులో పనిచేస్తోంది. తనతో పాటు అదే బట్టల దుకాణంలో పనిచేసే అబ్దుల్ రజాక్ తనను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. పెళ్లి చేసుకోవాలని చూస్తే అబ్దుల్ రజాక్ మేన మామ సయ్యద్షావలి తమను విడదీసి పది మందిలో పరువు తీస్తున్నాడని, తన తల్లిదండ్రులు వెళ్లి వారితో మాట్లాడితే అవమానంగా మాట్లాడి పంపారన్న మనస్థాపంతో ఆ యువతి నిన్నటి దినం ఎలుకల మందు (విషం) తాగినట్లు తెలిపింది. కుటుంబీకులు గమనించి బాధితురాలని చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా, అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ఆ యువతికి మెరుగైన వైద్యం అందించిన కోలుకోలేదు. పరిస్థితి విషమించడంతో వెంటనే తిరుపతికి వెళ్లాలని డాక్టర్లు రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితురాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం నగినా మృతి చెందింది. మృతురాలి అక్క ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు…
కాగా నగీన *ఆశ* నెరవేరకనే అనంత లోకాల్లో కలిసిపోయిన ఆమె ప్రేమ….? బాధ్యులెవరు..?పోలీసుల దర్యాప్తులో తేలాల్చి ఉంది….!!
👉నిరసనకు పిలుపునిచ్చిన ఈయూ
ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్(EU) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ నెల 19,20 తేదీల్లో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. ఆర్టీసీ డిపోలు, వర్క్ షాప్ల వద్ద ధర్నాలు చేయాలని ఉద్యోగులకు తెలిపింది. ఉద్యోగ భద్రతకు ఇచ్చిన సర్క్యులరు యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేసింది.
👉గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏడు చోట్ల రైస్ మిల్లుల తనిఖీ*
*1000 మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యం పట్టివేత, క్రిమినల్ కేసు నమోదుకు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆదేశం*
*మంత్రి రాకను ముందుగానే తెలుసుకుని పేరేచ‌ర్ల‌లో రైస్ బ్యాగ్ ట్యాగ్‌లు ద‌హ‌నం చేసిన మిల్లు నిర్వాహ‌కులు*😲
*అమ‌రావ‌తి:- ప్ర‌భుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. గురువారంనాడు గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ వెలుగు చూసిన అక్ర‌మాలు చూసి అవాక్క‌య్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రామలింగేశ్వర ట్రేడర్స్ రైస్ మిల్లును తనిఖీ చేసిన మంత్రి రైస్ మిల్లులో వందలకొద్దీ రైస్ బ్యాగుల్లో ప్రభుత్వం పంపిణీ చేసే చౌక ధరల బియ్యాన్ని గుర్తించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైస్ మిల్లులో దాదాపు 100 టన్నుల పిడిఎస్ రేషన్ గుర్తించిన మంత్రి ఈ విష‌య‌మై స్థానిక ఎమ్మార్వో చక్రవర్తిని ప్రశ్నించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెట్రాలజీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు రైస్ మిల్లు ప్రతి బ్యాగ్‌ని పరిశీలించాలని పంచనామా అనంత‌రం క్రిమినల్ కేసులు న‌మోదు చేసి రైస్ మిల్లును సీజ్ చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. సత్తెనపల్లి టౌన్‌లో సీతారామాంజనేయ సాయి, గణేష్ రైస్ మిల్ ఫ్లోర్ మిల్, శ్రీదేవి ట్రేడర్స్, రావు రైస్ మిల్, ఫ్లోర్ మిల్ కోమరపుడి గ్రామం, సత్తెనపల్లి మండలం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైస్ మిల్లుల‌ను మంత్రి తనిఖీ చేశారు. గుంటూరు జిల్లాలో మేడికొండ మండలం పేరేచెర్ల గ్రామంలో మూడు రైస్ మిల్లులను కూడా మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. రైస్ మిల్లు ప్రాంతంలో రేషన్ సప్లై చేసే వాహనాన్ని దాచి ఉంచిన వైనాన్ని చూసి మంత్రి ఆశ్చర్యపోయారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పేరే చెర్ల నందు మంత్రి రాకను ముందుగానే తెలుసుకుని వెంకటేశ్వర రైస్ మిల్ ప్రాంగణంలో సీఎంఆర్ రైస్ బ్యాగ్‌ టాగ్‌ల‌ను నిర్వాహ‌కులు దహనం చేశారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్య‌క్తం చేసి రైస్ మిల్ సిబ్బందిని అదుపులోకి తీసుకోవాలని, పంచనామ నిర్వహించి కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే విఘ్నేశ్వర రైస్ మిల్లు గుంటూరు జిల్లాలో తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ టార్చ్ లైట్ వెలుగులో రైస్ మిల్లులో బియ్యం, రికార్డులు మరియు 26 కేజీల బియ్యం బస్తాల తూకాన్ని పరిశీలించారు. సాధారణ పౌరుడిలా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సత్తెనపల్లిలో రోడ్డు పక్కన ఆగి టీ తాగారు. రైస్ మిల్లు తనిఖీల కోసం పల్నాడు జిల్లా సత్తెనపల్లి వచ్చిన మంత్రి రోడ్డు పక్కనే కారు ఆపించి బడ్డీ కొట్టు వద్ద టీ తాగారు. అక్కడ సామాన్యులను నిత్యావసర ధరలపై ఆరా తీశారు.*
👉నేనూ సోషల్‌ సైకోల బాధితురాలినే*వై యస్ షర్మిల..
*వైఎ్‌సఆర్‌కు పుట్టలేదని నన్ను అవమానించారు*
*నాపైన, అమ్మ, సునీతలపై విచ్చలవిడిగా పోస్టులు*
*సైకోలు, సైకో పార్టీలతో కలసి సోషల్‌ మీడియాను*
*భ్రష్టు పట్టించారు.. మృగాల్లా మారారు వీరు భయపడేలా చర్యలుండాలి:
కొంతమంది సైకోలు,సైకో పార్టీలతో కలసి ఉచ్ఛం నీచం లేకుండా సోషల్‌ మీడియాను భ్రష్టు పట్టించారు. మానవ, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. అలాంటి సోషల్‌ సైకోల బాధితుల్లో నేనూ ఒకరిని’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. గురువారం ఆమె ఎక్స్‌ వేదికగా స్పందించారు. సైకో వర్రా రవీంద్రారెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘సోషల్‌ మీడియాలో సైకోలు… ఇంట్లో తల్లి, అక్క, చెల్లి కూడా సాటి మహిళే అనే ఇంగితం లేకుండా, రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి, వికృత చేష్టలతో రాక్షసానందం పొందారు. ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు పెట్టి, పైశాచికానందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, మా అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను, వైఎస్‌ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిపై నేను కూడా కేసు పెట్టాను. అరాచక పోస్టులు పెట్టేవాళ్లు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిందే. మరోసారి సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా’ అని షర్మిల పేర్కొన్నారు
👉 వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను బాగు చేయడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు..మంత్రి పెమ్మసాని.. దీనికి అందరూ సహకరించాలి. ఇసుక, మద్యం దుకాణాల్లో చేతులు పెట్టొద్దని సీఎం అన్నారంటే ఎమ్మెల్యేలు ఆలోచించుకుని, తమ రాజకీయ భవిష్యత్తును చూసుకోవాలి’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ హితవు పలికారు. గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం వంటి వ్యాపారాలకు దూరంగా ఉండాలన్నారు. ‘ఎన్నికలు ఖరీదుగా మారిపోయాయి. గ్రామాల నుంచి నాయకులు వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను డబ్బు కోసం పీక్కు తింటున్నారు. ఈ వ్యవస్థను చూస్తే ఒక్కోసారి అసహ్యమేస్తోంది.
నీతిగా ఉండాలనుకొనేవారికి రాజకీయాలు ఎప్పుడో దూరమైపోయాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో.. తమ గ్రామానికి డబ్బులు పంచలేదని ఓటర్లే వచ్చి బహిరంగంగా తనను అడిగారని గుర్తు చేసుకొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యవస్థలను సరి చేయాలని చూస్తున్నారని చెప్పారు. జగన్‌ హయాంలో కేంద్ర ప్రభుత్వం 40 రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తే మొత్తం 150 చోట్ల తవ్వి పోగేసుకొన్నారని చెప్పారు. ‘వ్యవస్థలో లోపాలు ఉంటాయి. వాటిని సరి చేసుకొంటూ ముందుకు వెళ్లినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది. జగన్‌ అనే వ్యక్తి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. మేం సమస్యలను పరిష్కరించాలని ఆలోచన చేస్తాం. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఈ రాష్ట్రానికి అంత మంచిది’ అని కేంద్ర మంత్రి అన్నారు.
👉విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ లాంతర్ల ర్యాలీ*
విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి విజయవాడలో లాంతర్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. గవర్నరుపేటలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి చల్లపల్లి బంగ్లా వరకు సాగిన ఈ ర్యాలీలో ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి పలక్‌వర్మ, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాల్గొన్నారు. విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని, ప్రజలపై భారం మోపొద్దని నినాదాలు చేశారు.ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
👉రిమాండ్‌ ఖైదీకి రాచమర్యాదలు చేస్తుండగా తాను ఫొటోలు తీస్తే, పోలీసులు బెదిరించి వాటిని డిలీట్‌ చేయించారని మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం బుర్రాజుపాలేనికి చెందిన టీడీపీ కార్యకర్త నితిన్‌ వరకోటి ఆరోపించారు. విజయవాడ ఎంపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, వారి కుటుంబ సభ్యులను, మహిళలను అసభ్యపదజాలంతో దూషించిన బోరుగడ్డ అనిల్‌ను ఎస్కార్ట్‌లో రాజమండ్రి తీసుకెళ్తూ మార్గమధ్యంలో పోలీసులు విలాసవంతమైన రెస్టారెంట్‌లో విందు భోజనం పెట్టించారన్నారు. ఆ సమయం లో అక్కడే ఉన్న తాను హోటల్‌లో అనిల్‌ ఫొటోలు తీశానని, అయితే పోలీసులు తన ఫోన్‌ లాక్కుని, బెదిరించి ఫొటోలు డిలీట్‌ చేయించారని తెలిపారు.
👉 అగ్రిగోల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నాంపల్లి ఎంఎ్‌సజే ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్‌ ముసుగులో 130కన్నా ఎక్కువ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆకర్షణీయమైన పథకాల పేరుతో 32 లక్షలకన్నా ఎక్కువ మంది పెట్టుబడిదారుల నుంచి రూ. 6380 కోట్లు సేకరించినట్లు తేలింది. తాజాగా అగ్రిగోల్డ్‌ ఎగ్జిమ్స్‌, అమృతవర్షిణి డైరీ ఫామ్స్‌ కేసుల్లో అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇన్ఫోటెక్‌, మాతాంగి ఇన్‌ఫ్రా వెంచర్స్‌, శక్తి టింబర్‌ ఎస్టేట్స్‌, అవ్వా సీతారామారావు, అవ్వా వెంకట సుబ్రహ్మణ్వేశ్వర శర్మ, శాంక్చురీ హోమ్స్‌లపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ కంపెనీలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌ సహా పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది
👉ఆత్మకూర్ ఆవాజ్ మండల కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ బజార్ (జ్యువెలరీ ఏరియా) నుండి పాత బస్టాండ్, బిఎస్ఆర్ సెంటర్ మీదుగా,ఎమ్మార్వో, ఆర్డీవో, ఆఫీసు వరకు భారీ నిరసన ప్రదర్శన చేసి, ఆర్ డి ఓ,ఎం ఆర్ ఓ,ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది,ధర్నా ని ఉద్దేశించి ఆత్మకూర్ ఆవాజ్ మండల కమిటీ కార్యదర్శి,P. యస్దాని భాష మాట్లాడుతూ,కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలైన, షాది తోఫా,విదేశీ విద్య,సబ్సిడీ రుణాలు,పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా,మసీదులలో విధులు నిర్వహిస్తున్న ఇమామ్, మౌజన్ లకు, ఆరు నెలలకు ఒకసారి కాకుండా, ప్రతినెల జీతాలు ఇవ్వాలని, పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా, జీతాలు పెంచి ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన , వాక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేస్తూ తీర్మానం చేయాలని, లేనిపక్షంలో ముస్లింలను సంఘటిత పరిచి పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని తమ హక్కులని కాపాడుకుంటామని అన్నారు, పై కార్యక్రమంలో ఆవాజ్ మండల కమిటీ సభ్యులు,మస్తాన్,Sd ఖలీల్, షేక్ షరీఫ్, షేక్.ఖలీల్, అల్లా బకష్ షేక్ ఇస్మాయిల్,P సల్మాన్ ఖాన్, షేక్ ఖాజా రహమతుల్లా షేక్ నాయబ్,ఆవాజ్ గౌరవాధ్యక్షులు ఎం.నాగేంద్ర, ఆత్మకూరు మండల పరిధిలోని, పది మసీదులకు సంబంధించిన, ఇమామ్, మౌజన్, ముతవల్లీలు పాల్గొన్నారు*
👉కేటీఆర్ అరెస్ట్ కు అంతా సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.*
వారం క్రితం అనుకొన్నట్లు బాంబ్ పేలలేదని అందరూ అనుకున్నారు కానీ కొన్ని లీగల్ సమస్యల కారణం గా ఆలస్యం జరిగింది. సీబీఐ కు కావలసిన సమాచారం ఇవ్వడం తో పాటు గవర్నర్ వద్ద అనుమతికోసం వేచిచూడాల్సి వచ్చింది.
అనుకోకుండా కేటీఆర్ ప్రెస్ మీట్ లో కేటీఆర్ హావభావాలు చూస్తే కేటీఆర్ అరెస్ట్ తప్పదని చెప్పకనే చెప్పాడు. కల్వకుంట్ల కుటుంభం అబద్ధాలు కూడా నిజాలుగా ఎదురు దాడి చేయడంతో గొప్ప ప్రావీణ్యత కలిగిన వారుగా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా కార్ రేసింగ్ లో అన్ని దారులూ మూసుకొని పోవడం తో మీడియా ముందు తప్పు చేశా అని ఒప్పుకోక తప్పలేదు. కేటీఆర్ తప్పు ఒప్పుకొన్నంత మాత్రాన శిక్ష ఉండదని కాదు.
కవిత లిక్కర్ కేసులో నిజం ఒప్పుకోక నెలల తరబడి జైల్లో ఛిప్పకూడు తిన్న విషయం కేటీఆర్ కు తెలియంది కాదు… ఒకవేళ ఎదురు దాడి చేస్తే తీగలాగితే డొంక కదిలినట్లు మరికొన్ని స్కాం లు బయటకు రావచ్చు ఆన్న భయం తో నేను జైలుకు పోవడానికి సిద్దం అని మీడియాతో చెప్పడం కేటీఆర్ అమాయకత్వం కాదు.. ముందుచూపు అనుకోవాలి.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?