👉క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు… ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు.
కొత్త స్పోర్ట్స్ పాలసీపై చంద్రబాబు సమీక్ష..కీలక ప్రతిపాదనలకు ఆమోదం..
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 శాతం నుంచి 3 శాతానికి పెంపు..నూతన క్రీడా పాలసీపై సమీక్ష సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు క్రీడాకారులకు తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచుతున్నట్టు వెల్లడించారు..ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫాం సర్వీసెస్ లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. అంతేకాకుండా, శాప్ లో గ్రేడ్-3 కోచ్ ల నియామకాల్లో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఆటలు అంటే క్రికెట్ ఒక్కటే కాదని…అన్ని ఆటలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆటలను తమ గోల్ గా ఎంచుకునే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని.. ఎక్కువ మంది ఆ వైపు ప్రయాణం చేస్తారని తెలిపారు.
👉పవన్ వ్యాఖ్యలపై ఇంటెలిజెన్స్ ఆరా..?
తాను హోంమంత్రినైతే పరిస్థితులు ఇలా ఉండబోవన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. పవన్ వ్యాఖ్యలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ సహజంగానే ఈ వ్యాఖ్యలు చేశారా.. లేక పవన్ వెనక బీజేపీ నేతలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. గతంలో పవన్ హోంమంత్రి అవుతారని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది.
👉తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయడును గౌరవప్రదంగా కలిసిన జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు టీటీడీ బోర్డు మెంబర్ . పనబాక లక్ష్మీ పనాబాక కృష్ణయ్య
👉 వైఎస్ విజయమ్మ మరో లేఖ విడుదల చేశారు. ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ ప్రమాదానికి తన కుమారుడు కారణమన్నట్లుగా దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు
👉తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ*
తనకు ప్రమాదం జరిగిందనే ప్రచారంపై విజయమ్మ స్పందించారు.’ఈ ప్రచారంతో నాకు తీవ్ర వేదన కలుగుతోంది. నేను ఖండించకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన కారు ప్రమాదాన్ని ఇప్పుడు నా కుమారుడికి ఆపాదించి దుష్ప్రచారం చెయ్యడం జుగుప్సాకరం. నేను నా మనవడి దగ్గరకు వెళ్లినా తప్పుగా చిత్రీకరించారు. ప్రజలు గమనిస్తున్నారు.
సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారు’ అని ఆమె లేఖ విడుదల చేశారు.
👉నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ దురుసు ప్రవర్తన.
తల్లి ప్రాణం ఎక్కడ పోతుందో అని బిడ్డ బాధ..
నిర్లక్ష్యం వహించిన డాక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
డాక్టర్ చూసి వెళ్ళిన 20 నిమిషాలకే దురదృష్టవశాత్తు ఆ తల్లి ప్రాణాలు విడిచి పెట్టింది
👉హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం.. *హోం మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన అనితకు.. ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్..*హోటల్ అలెగ్జాండర్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన టిడిపి నేతలు, కార్యకర్తలు..*ఎమ్మెల్యే దగ్గుపాటికి హోం మంత్రి అనిత ఆత్మీయ పలకరింపు.. *హోటల్ అలెగ్జాండర్ లో హోంమంత్రితో ఎమ్మెల్యే దగ్గుపాటి సమావేశం*
*పలు అంశాలపై చర్చించుకున్న ఇరువురు నాయకులు*
👉 బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది
తెలంగాణ . సెంట్రల్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా బోర్డర్లు ఎత్తివేత ..ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గత పదేళ్లుగా తెలంగాణ బోర్డర్ కొనసాగుతూనే ఉంది వసూలు చేసిన ధనం. గంటకి 50,000. 24 గంటల్లో లక్షల్లో వసూలు అవుతున్నదనం
వసూలు చేసిన ధనమంతా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాక పోతుందా. కిందిస్థాయి అధికారులు ఖజానాకు పోతుందా???.. ప్రతిపక్షాల ఆరోపణ
👉 స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు..
న్యూఢిల్లీ : వక్ఫ్ బిల్లు సవరణలపై విచారణ చేపడుతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుండి తాము వైదొలగనున్నట్లు ప్రతిపక్ష ఎంపిలు సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. సమావేశ తేదీలు, సంప్రదింపుల కోసం సమన్లు జారీ చేసే అంశాల్లో కమిటీ అధ్యక్షుడు, బిజెపి నేత జగదాంబికా పాల్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆందోళనలను లేకుండా చేసేందుకు, వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింప చేసేందుకు ఆయన బలవంతపు చర్యలు తీసుకుంటున్నారని ఓం బిర్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. చట్టంలో సవరణల మార్పు గురించి రిప్రజెంట్ ఇచ్చేందుకు తగిన సమయం ఇవ్వకపోతే కమిటీ నుండి వాకౌట్ చేస్తామని హెచ్చరించారు.
వక్ఫ్ బిల్లుకు ప్రతిపాదిత మార్పులు ఆగస్టులో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లు జెపిసి కమిటీకి వెళ్లింది.
*👉ఉత్తరాఖండ్ 36కు చేరిన మృతుల సంఖ్య*
ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కి చేరుకుంది. ఇవాల ఉదయం అల్మోరా జిల్లా
మార్చుల వద్ద బస్సు లోయలో పడింది. ఘటనాస్థలంలోనే కొందరు మృతిచెందినట్లు అధికారులు
తెలిపుతున్నారు. మరికొందరిని ఆస్పత్రికి తరిలించామన్నారు. ముగ్గురిని హెలీప్యాడ్ ద్వారా
ఏయిమ్స్ కు తరలించినట్లు తెలిపారు. బస్సు గర్వాల్
మోటార్స్ యాజమాన్యానికి చెందినదిగా పేర్కొన్నారు.
👉నాసిరకం EV బ్యాటరీ.. OLAకి రూ1.7 లక్షలు ఫైన్*
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో నాసిరకం బ్యాటరీలను వాడుతున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన సునీల్ అనే వ్యక్తి నాసిరకం బ్యాటరీపై వినియోగ దారుల కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నోటీసులు ఇచ్చినా సంస్థ పట్టించు కోలేదు. దీంతో రూ.1.73లక్షలు జరిమానా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఓలాను ఆదేశించింది. అతను పడిన మానసిక క్షోభకు రూ.10 వేలు అదనంగా చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.
👉 భారతీయ జీవిత బీమా లో పాలసీదారులపై జీఎస్టీ ఎత్తివేయాలని బోనస్ పెంచాలని పాత పాలసీలలో వన్ లాక్ సమ్మర్ షెడ్యూల్ కొనసాగించాలని, ఏజెంట్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈనెల 11వ తేదీన నెల్లూరు డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమంలో భాగంగా పొదిలి ఎల్ఐసి శాటిలైట్ కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నాయకులు
👉 అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..
అగ్రికల్చర్ డిప్లమో గ్రామ వ్యవసాయ సహాయకుల జిల్లా సంఘం నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం పొదిలి వీరిశెట్టి జూనియర్ మహిళా కాలేజీ లో సోమవారం ఏకగ్రీవంగా జరిగినది. జిల్లా అధ్యక్షులుగా కనిగిరి కి చెందిన బత్తుల వెంకటసుబ్బయ్య ఎన్నికయ్యారు.అసోసియేట్ ప్రెసిడెంట్ గా శ్రీరామ. ఏడుకొండలు,గౌరవ జిల్లా అధ్యక్షులుగా జక్కి గణేష్ సాగర్,ఉపాధ్యక్షులుగా ఎం గౌస్ లాజం, ఎస్.కె మస్తాన్, వి సుమంత్, జి రమేష్ బాబు,ప్రధాన కార్యదర్శి గా సిహెచ్ వెంకటేష్,ట్రెజరరీ గా కె సుభాషిణి ,జాయింట్ సెక్రెటరీ గా రాణా ప్రతాప్ నాయక్,బి నవ్యభారతి,మృధులత, ఎస్కె అజారుద్దీన్,ఆర్గనైజింగ్ సెక్రటరీ గా టి వినోద్ కుమార్,
పబ్లిసిటీ సెక్రటరీ గా ఎస్.కె అబీద్ ,మహిళా సెక్రటరీగా వానిరెడ్డి,ఈసీ మెంబెర్స్ గా జీవి సుబ్బారావు,పూసల సుధాకర్ , జి గంగయ్య,టి చిరంజీవి ,టి బొర్రయ్య, ఆర్ వంశీ కృష్ణ,పిసురేష్,ఐ ప్రావీణ్య, కె విష్ణు వర్ధన రెడ్డి, కె శ్రీకాంత్, సిహెచ్ రవి చంద్రలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ నాయకులు నూతన కమిటీని ఘనంగా సత్కరించి అభినందించారు. నూతన కమిటీ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ అగ్రికల్చర్ డిప్లమో గ్రామ వ్యవసాయ సహాయకుల సమస్య ల పరిష్కారానికి, అభ్యున్నతికి తాను కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
👉 విజయవాడ,మద్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు మంచి భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం… *కోన శశిధర్, పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి…*
రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి ప్రతి ఏటా రూ. 2,000 కోట్లు ఖర్చు చేస్తుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. . మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో సోమవారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం (స్టాండర్డ్ డైజేషన్ ఆఫ్ మధ్యాహ్నం బడి భోజనం) మెనూ ప్రామాణికతపై ఒక రోజు నిర్వహించిన వర్క్ షాప్ ని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు ఎంతో మంచి సంకల్పంతో రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న బడి భోజన పథకానికి ప్రతి ఏటా రూ. 2,000 కోట్లు ఖర్చు చేస్తుంటే.. ఇందులో కేంద్రం రూ. 400 కోట్లు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 1600 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో మంచిగా ఆహార పదార్థాలు అందించాలనే విషయంపై అన్ని జిల్లాల మంచి మెనూ తీసుకునే విధంగా కసరత్తు చేస్తున్నామన్నారు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వివిధ ఆహారపు అలవాట్లు ఉన్నాయన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో స్థానికంగా పండించే కూరగాయలను ఆహార పదార్థాలుగా అందించే మెనూలో చేర్చాలని సంకల్పించామన్నారు. పిల్లలకు బలవర్థకమైన ఆహారం అందినప్పుడే బాగా చదువుకుంటారని, అందించే ఆహారపు మెనూతోపాటు అందులో పోషక విలువలు ఎలా ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలు ఏది ఇష్టపడతారో అవి వారికి అందుబాటులో వస్తే వారు ఇష్టంగా తీసుకుంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా దొరికే చింతపండు పులిహార లాంటి వాటి స్థానంలో గుమ్మడికాయతో మంచిగా తయారు చేసే ఆహార పదార్థాలను ఇష్టంగా తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పిల్లలు బాయిల్డ్ కోడిగుడ్డు అంటే ఇష్టంగా తింటారని.. కొన్ని ప్రాంతాల్లో పిల్లలు వేయించిన కోడిగుడ్లు ఎక్కువగా తీసుకుంటారన్నారు. నేను రాష్ట్రంలోని మూడు ప్రాంతాలైన అనంతపురం, విజయనగరం, గుంటూరులలో జిల్లాల్లో కలెక్టర్ గా పనిచేసానన్నారు.. అనంతపురం జిల్లాలో వారు తీసుకున్న ఆహార పదార్థాలను కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తీసుకోరని, ప్రాంతాన్ని భట్టి ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయన్నారు. రాయలసీమలో ఒక విధమైన ఆహారపు అలవాట్లు కోస్తాంధ్రలో ఒక విధమైన ఆహారపు అలవాట్లు ఉత్తరాంద్ర వారికి ఇంకో విధమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయన్నారు.. అందరికీ ఆమోదయోగ్యమైన మెనూ అమలు చేస్తే పిల్లల పౌష్టికాహారానికి ఉపయోగపడి వారు బాగా చదువుకునే విధంగా తోడ్పడటంతోపాటు భావి భారత పౌరులుగా తయారవుతారన్నారు.. స్థానికంగా అందుబాటులో ఉండే కూరగాయలను ధృష్టిలో ఉంచుకొని మెనూ తయారుచేస్తే పిల్లలందరికీ ఇష్టమైన మెనూగా ఉంటుందన్నారు..
👉 గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ వెంకటరామిరెడ్డి ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన తాడేపల్లి పోలీసులు..
👉కడప నగరంలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని 1 టౌన్ సీఐ రామకృష్ణ సూచించారు.సీఐ ఆదేశాల మేరకు కడప నగరంలోని 1 టౌన్ స్టేషన్ పరిధిలో ప్రతి దుకాణం వద్దకు వెళ్లి సిబ్బంది నోటీసు అందజేశారు. ప్రతి ఒక్కరూ వారి దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా దొంగతనాలు ఇతర ఇబ్బందులు తలెత్తినప్పుడు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని సూచించారు.
బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..
Recent Posts