పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం ..మాజీమంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు..సిపిఎం మహాసభల పోస్టర్ విడుదల.. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గోల్మాల్..కర్పూరం ఫ్యాక్టరీలో ఘోర ఘటన..దీపావళి రోజు – డబుల్ మర్డర్..వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణి చేసిన మంత్రి డోలా…400 మంది మహిళలను లైంగికంగా వేధించిన బిలియనీర్‌!.. పైడిపాడు లో తాగు నీటి కొరత.. గిద్దలూరులో మట్కారాయుళ్ల అరెస్టు.. శంషాబాద్ లో ఏడు కోట్ల డ్రగ్స్ పట్టివేత.. గుడి విధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి దేహశుద్ధి

👉అమరావతి:ముగిసిన నారా లోకేష్ అమెరికా పర్యటన…ఏపీకి బయల్దేరిన మంత్రి లోకేష్.*
*ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన..*పలు సంస్థల ప్రతినిధులు మరియు సీఈవోలతో భేటీ….ప్రముఖ కంపెనీలు నిర్వహించిన భేటీల్లో పాల్గొన్న లోకేష్….*పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించిన మంత్రి లోకేష్..
👉 ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గోల్మాల్ ?
*రాచర్ల లో ఉండే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో దోపిడి దొంగలు… ఒకరి అకౌంట్ లో ఉన్న డబ్బులు వేరే వారి అకౌంట్ లోకి అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసే బ్యాంక్ సిబ్బంది ఉన్నారట. అనుమలవీడు గ్రామానికి చెందిన ఒక పొదుపు సంఘం గ్రూవు (అంకితగ్రూపు )కొన్ని సంవత్సరాలనుండి బంద్ అయి ఉండగా ఆ గ్రూపులో 53000 వేల రూపాయలు ఉంటే 1st లీడర్ తలపాటి. స్నేహలత ఉంటే ఆమె బదులు ఇంకో ఆమెను 1st లీడర్ గా చూపించి తీర్మాణం చేస్తే వి ఓ ఏ డి. బాగ్యలక్ష్మి మరియు బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కు అయి 53000 వేల రూపాయలు ఫస్ట్ లీడర్ గా వేరే ఆమెను చూపించిన వారి అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారట. కొంతమంది వి ఓ ఏ లతో బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కు అయి ఎన్ని అక్రమాలు చేసి ఉంటారని ఒక చిన్న అక్షరం తప్పు రాస్తే డబ్బులు ఇవ్వరు.. అలాంటిది లీడర్ కాని ఆమెను లీడర్ గా చూపిస్తే పాస్ బుక్ మరియు కంప్యూటర్ లో చెక్ చేయకుండా ఎలా డబ్బులు వేరే అకౌంట్ లో కొట్టారు.. రాచర్ల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లీలలు ఇంకెన్ని ఉన్నాయో. వి ఓ ఏ లతో జాగ్రత్త అని ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు హల్చల్ సృష్టిస్తున్నారు….*
👉 డిసెంబర్ 13,14 ,15 తేదీలలో సిపిఎం జిల్లా మహాసభలు -జిల్లా అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి
-రైతాంగ ఉద్యమాలు ,కార్మిక పోరాటాలు, వ్యవసాయ కార్మికుల స్థితిగతులపై మహాసభల్లో చర్చ
-జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
-సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ -జిల్లా మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ ..సిపిఎం జిల్లా మహాసభలు డిసెంబర్ 13, 14, 15 తేదీలలో చీమకుర్తిలో జరగనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ తెలిపారు.మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను పార్టీ జిల్లా కార్యవర్గసభ్యులతో కలిసి స్థానిక సుందరయ్య భవన్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హనీఫ్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని, జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించినట్లు ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం ప్రకటన చేసింది తప్ప అభివృద్ధికి సంబంధించి ఆచరణలో ఎలాంటి నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. ఇది పాలకుల దివాళకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు .జిల్లాలో రైతాంగ ఉద్యమాలు, కార్మిక పోరాటాలు ,వ్యవసాయ కార్మికుల స్థితిగతులపై పార్టీ జిల్లా మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు .రైతులు, రైతు కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు అన్నీవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో సమగ్రంగా చర్చించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ, జిల్లా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరుతూ ఈనెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 15వ తేదీన తాహసిల్దార్ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఉంటుందని తెలిపారు. జిల్లా ఏర్పాటు అయ్యి ఇన్నేళ్లు కావస్తున్నా ఏ రంగంలోనూ అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగు, సాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 28 ఏళ్లు గడిచినా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం దుర్మార్గమన్నారు. నాలుగేళ్లలో పూర్తి కావలసిన ప్రాజెక్టుని పాలకులు అనేక సంవత్సరాలుగా నాన్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా క్షీణించిందని తెలిపారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్, కనిగిరి నిమ్జుల ఊసే లేదని వివరించారు. అభివృద్ధికి సంబంధించి ప్రతి విషయంలో ఎదురుచూపులే తప్ప పరిష్కారం లేదని తెలిపారు. గతంలో టిడిపి వాళ్లు ఏమి చేయలేదని ఐదేళ్లు వైసిపి వాళ్లు కాలయాపన చేశారని తెలిపారు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వాళ్ళ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మరో రెండేళ్లు పడుతుందని ఇటీవల టిడిపికి చెందిన మంత్రులు తెలపడమే అందుకు సాక్షాత్కారమని వివరించారు. పాలకులు హామీలు ఇస్తున్నారు తప్ప అమలుకు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన కరువు మండలాలు జాబితాలో జిల్లాకు సంబంధించి ఒక్క మండలం కూడా లేకపోవడం దుర్మార్గం అన్నారు. జిల్లాలో 11 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉందని నివేదికలు చెబుతున్నప్పటికీ ఒక్క మండలం కూడా కరువు జాబితాలో చోటు సంపాదించకపోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం అనితెలిపారు.ఉద్యోగులు,ఉపాధ్యాయులు,కార్మికులు,రైతులు,రైతుకూలీలు,యువకులు,విద్యార్థులు అందరూ కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. వారి సమస్యల మీద వారిని చైతన్యం చేసే దిశగా, ప్రజా సమస్యలు పరిష్కారానికి పోరాటాలు రూపొందించే విధంగా వచ్చే నెలలో జరిగే తమ పార్టీ మహాసభలు ఉంటాయని తెలిపారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎంతో విశ్వాసంతో ప్రస్తుత ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పాలకుల చర్యలు కనిపించడం లేదన్నారు. రైతులు అతివృష్టి, అనావృష్టితో నష్టపోయారని, వారి ఉపశమనానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం దారుణం అన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. రోడ్ల పరిస్థితి అలాగే ఉందన్నారు. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించినప్పటికీ అది అమలుకు నోచుకోలేదన్నారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్, కనిగిరి నిమ్జు, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని కోరారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ గత మూడేళ్ల కాలంలో జరిగిన ప్రజా ఉద్యమాలను సమీక్షించి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఉద్యమాల గురించి వచ్చే నెలలో జరిగే జిల్లా మహాసభలో చర్చిస్తామని తెలిపారు. విద్యా, వైద్యం, ప్రాజెక్టులు తోపాటు అన్ని వర్గాల ప్రజల సమస్యల మీద మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఫ్లోరిన్ సమస్య అనేక మండలాల్లో తీవ్రంగా ఉందని, దాని పరిష్కారానికి పాలకులు చర్యలు చేపట్టాలని కోరారు .విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పునాటి ఆంజనేయులు ,చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
👉 పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం తరలించే సీన్‌ మీకు గుర్తుందా? అచ్చం అలాంటి ప్లాన్‌నే గంజాయి స్మగ్లర్లూ అమలు చేశారు. కాకపోతే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ జిల్లాలో వెలుగు చూసిన ఈ సంఘటన పుష్ప సినిమాలోని ఎర్రచందనం స్మగ్లింగ్‌ సీన్‌ను గుర్తు చేసింది.
అనుమానాస్పదంగా లారీ డ్రైవర్‌ : కుమురం భీం జిల్లా వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న ట్యాంకర్‌ లారీలో డ్రైవర్‌ అనుమానాస్పదంగా కనిపించిందని తెలిపారు. దీంతో చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టామని వివరించారు.
👉 ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణి చేసిన మంత్రి డోలా..ఒంగోలులో దీపం-2 పథకంలో భాగంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ.డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి,శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు,జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా,జాయింట్ కలెక్టర్ .ఆర్.గోపాలకృష్ణ.
👉నెల్లూరు జిల్లా..సంగం మండలం..
👉మర్రిపాడు లోని ఎస్టీ కాలనీలో చెట్టు కొమ్మపడి ఈగ చెంచమ్మ (58) అనే మహిళ మృతి..*
*పక్కింటిలో చెట్టును తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కొమ్మ పడడంతో మృతి చెందిన మహిళ..ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్న పోలీసులు..
👉సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విద్వంసం చేసిన తరహాలో భీమవరం లో విద్వంసం చెయ్యటానికి ప్రయత్నించిన ఓక వ్యక్తిని పట్టుకొని దేహ శుద్ధి చేసి స్టేషన్ లో అప్ప చెప్పిన స్థానికులు వాడి దగ్గర ఇంకా చెయ్య వలసిన లిస్ట్ కూడా ఉంది ..
👉400 మంది మహిళలను లైంగికంగా వేధించిన బిలియనీర్‌!
బ్రిటన్‌లో నివసించిన ఈజిప్ట్‌ బిలియనీర్‌ తన జీవితకాలంలో 400 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2023లో మరణించిన హారోడ్స్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ యజమాని మహమ్మద్‌ అల్‌ ఫాయిద్‌ తమను వేధించాడని వందల మంది మహిళలు చెబుతున్నట్లు యూకే లాయర్లు గురువారం వెల్లడించారు. సెప్టెంబర్‌లో బీబీసీ అతడి అత్యాచారాలపై ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఆ తర్వాత అతడి బాధితురాళ్లు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు.
👉వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత*
హైదరాబాద్ – చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ లోని ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేసిన నిందితులు.పక్క సమాచారంతో ఆ ఇంటి పై దాడులు జరిపిన చందానగర్ పోలీసులు.రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.
ఘటన స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేసిన పోలీసులు.
ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం…
👉ఢిల్లీ :*దీపావళి రోజు – డబుల్ మర్డర్*
*33 సం:ల క్రితం జరిగిన – సేమ్ సీన్ రిపీట్*
*మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మర్డర్ సీన్ రిపీట్ – అప్పుడు బెల్ట్ బాంబు – ఇప్పుడు గన్*
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని *కాళ్లు మొక్కి* బెల్ట్ బాంబు సహాయంతో హత్య చేసిన ఘటన రిపీట్ అయింది ఢిల్లీలో…!!ఇప్పుడు అదే విధంగా *కాళ్లు మొక్కి* ఆశీర్వాదం తీసుకునే సమయంలో తుపాకీ తో 5 రౌండ్లు కాల్పులు జరిపి హత్య..!!
దీపావళి పండుగ రోజు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన డబుల్ మర్డర్ తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో షహ్దారాలోని ఫర్ష్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీహారీ కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. దీపావళి రోజు రాత్రి సాయుధులైన ఇద్దరు వ్యక్తులు ఐదు రౌండ్లు కాల్చి మామ, మేనల్లుడిని చంపారు. కాల్పుల ఘటనలో ఓ మైనర్ బాలుడు గాయపడగా, అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. మృతుడు తన కుటుంబంతో కలిసి ఇంట్లో దీపావళి జరుపుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇంతలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్, క్రైమ్ టీమ్ ఆధారాలు సేకరించాయి.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది వ్యక్తిగత శత్రుత్వమేనని తెలుస్తోంది. ఈ విషయాన్ని మృతుడి బంధువులు కూడా తెలిపారు. భూవివాదాల కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అందరి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారు ఘటనను నిర్వహించడానికి ముందుస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
*పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం*..
ఇంట్లోకి ప్రవేశించి ముందుగా మృతుడి పాదాలను మొక్కి, అనంతరం విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఘటన అనంతరం ఇంట్లో కేకలు వినిపించాయి.
ఘటన అనంతరం మృతుడు ఆకాష్ తల్లి వాంగ్మూలం పోలీసులు రికార్డ్ చేశారు. అందరూ దీపావళిని ఇంట్లోనే జరుపుకుంటున్నారని చెప్పారు. అంతలో లక్ష్య అనే వ్యక్తి వచ్చి తలుపు కొట్టాడు. అతను పైకప్పు నుండి క్రిందికి చూడగా, లక్ష్య తోపాటు మరొక వ్యక్తి ముఖం కప్పుకుని నిలబడి ఉన్నారు. అతను రావడానికి కారణం అడిగాడు, లక్ష్య అతనికి స్వీట్లు పెట్టె చూపించి, తీసుకోమని అడిగాడు. బకెట్‌ని కిందికి వేలాడదీసి పెట్టెను తీసుకున్నానని తల్లి చెప్పింది. కానీ అతను మళ్ళీ తలుపు కొట్టడం ప్రారంభించాడు. కిందకు వచ్చేసరికి కొడుకు లోపలికి పరిగెడుతున్నాడని చెప్పింది. అతను కూడా తిరిగి వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులకు తెలిపింది.
దాడి చేసిన నిందితులు ముందుగా ఆకాష్ పాదాలను తాకి కాల్చి చంపారని మృతుడి తల్లి తెలిపారు. బంటీ, పునీత్ తమ కొడుకులను, ధేవతేను చంపడానికి డబ్బు చెల్లించారు. ఇంతకు ముందు కూడా ఇదే వ్యక్తులే తన భర్తను హత్య చేశారని ఆమె ఆరోపించింది. ఈ వ్యక్తులు తమ ఇంట్లో వాటా అడుగుతున్నారని, సొంత డబ్బు పెట్టి ఈ ఇల్లు కొన్నామని వెల్లడించింది. తన కొడుకుపై మొదట కాల్పులు జరిపింది లక్ష్యనేనని ఆమె చెప్పింది.
ఈ సంఘటన గురువారం(అక్టోబర్ 31) రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో బీహారీ కాలనీకి చెందిన ఆకాశ్ శర్మ అలియాస్ ఛోటూ, అతని మేనల్లుడు రిషబ్ శర్మ మృతి చెందారు. కాగా ఆకాష్ పదేళ్ల కుమారుడు క్రిష్ శర్మ బుల్లెట్‌తో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంట్లో అందరూ సంతోషంగా దీపావళి జరుపుకుంటున్నారని మృతుడి తల్లి ఆకాష్ తెలిపారు. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చారు. అతను ఇంటి లోపలికి వచ్చి ఆకాష్ పాదాలను మొక్కి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆకాష్, రిషబ్, క్రిష్ బుల్లెట్ గాయాలతో రక్తస్రావమై చనిపోయారు.
గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆకాష్, రిషబ్ చనిపోయినట్లు ప్రకటించారు. మరోవైపు క్రిష్‌కి చికిత్స జరుగుతోంది. తనపై దాడి చేసిన నిందితులు తనకు తెలుసని మృతురాలి తల్లి చెబుతోంది. వీరి మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. దాడి చేస్తున్న యువకుడు చాలా రోజులుగా తన వీధిలో తిరుగుతున్నాడని ఆమె చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి వ్యక్తిగత కక్షలు కూడా ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా చూస్తే ఇది వ్యక్తిగత శత్రుత్వమేనని తెలుస్తోంది. మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేసి విచారణ జరుపుతామని తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసు అధికారి మాట్లాడుతూ రాత్రి 8.30 గంటల సమయంలో పీసీఆర్‌ కాల్‌ రావడంతో ఘటనా స్థలానికి పోలీసు బృందాన్ని పంపించామని చెప్పారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలను బృందం గుర్తించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైంది. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
👉 తాడేపల్లి*వైసిపి మాజీమంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు..
తనను ఆర్థికంగా మోసం చేశారంటూ మేరుగ నాగార్జున పై సీఐ కళ్యాణ్ రాజుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన మహిళ.. కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తానంటూ 90 లక్షలు రూపాయలు తీసుకుని ఆర్థికంగా మోసం చేశాడంటూ మాజీ మంత్రి నాగార్జున పై బాధితురాలు ఫిర్యాదు..
తనకు న్యాయం చేయాలని కోరుతూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించిన మహిళ. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసుల ఎదుట వాపోయిన బాధితురాలు
👉కర్పూరం ఫ్యాక్టరీలో ఘోర ఘటన..
అనంతపురం జిల్లా కేంద్ర సమీపంలోని వడెంపేట వద్ద ఓ కర్పూరం ఫ్యాక్టరీలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో అవుట్ సంపును క్లీన్ చేస్తుండగా ఇద్దరు అస్వస్థత గురయ్యారు.
వారిని కాపాడబోయి ..మరో నలుగురు కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదకర వాయువుల కారణంగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు సవేరా ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఆన్నారు. మరో ఇద్దరు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.
😱 మద్యం సేవించి మోటార్ సైకిల్ పై వేగంగా వచ్చి యువకుడిని ఢీ ..*ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన యువకుడి పరిస్థితి విషమం ..*మద్యం సేవించి రేష్ డ్రైవింగ్ తో ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఆడ్రంక్ అండ్ డ్రైవ్ పై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ దృష్టి సారించాలి బాధితులు ఆవేదన..రాజమహేంద్రవరం..
ఇద్దరు యువకులు మద్యం సేవించి మోటార్ సైకిల్ పై రేష్ డ్రైవింగ్ తో రోడ్డు దీపావళి మందు గుండు సామాగ్రి కాలుస్తున్న యువకుడిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు పాలైన సంఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా గాడాలకు చెందిన చల్లా నంద కిషోర్ తన అమ్మమ్మగారి ఇంటి వద్ద రోడ్డు కార్నర్లో దీపావళి సామాగ్రి కాల్చుతుండగా మద్యం సేవించి గాడాలకు చెందిన హర్ష అనే యువకుడు డ్రైవ్ చేస్తుండగా వెనుక భాను అనే యువకుడు కూర్చొని మోటార్ సైకిల్ పై వేగంగా వచ్చి మందు గుండు సామాగ్రిని తొక్కుకుంటూ యువకుడి ఢీకొట్టారు. ఈ సంఘటనలో చల్లా నందకిషోర్ కు తలకు , పెదవికి ఉన్న రెండు పళ్ళు ఊడిపోయి, తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో తీవ్ర గాయాలు పాలైన యువకుడు నంద కిషోర్ ను హుటాహుటిన బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతడిని చక్రధర్ హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం తరలించారు. యువకుడిని పరీక్షించిన డాక్టర్లు తలకు, ముక్కు దూలానికి తీవ్ర గాయాలు కావడంతో శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతు విషమ పరిస్థితుల్లో ఉన్నాడు.
మద్యం సేవించి వేగంగా వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యక్తులపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాడాల గ్రామానికి చెందిన చల్లా నందకిషోర్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన అమ్మమ్మ గారి ఇంటి వద్ద రోడ్డు కార్నర్లో దీపావళి సామాగ్రి కాల్చుతుండగా గాడాలకు చెందిన మద్యం సేవించిన ఇద్దరు యువకులు వేగంగా వచ్చి ఢీకొని కొద్ది దూరం లాక్కుపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనలో గాయాలు పాలైన యువకుడు నందకిషోర్ పరిస్థితి విషమించడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించి ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని ప్రమాదాలను అరికట్టాలని పోలీస్ అధికారులను వేడుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
👉 శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ సిబ్బంది డీఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.7 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
👉 ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో మట్కా ఆడుతున్న 5 గురిని అదుపులోకి తీసుకుని రూ,,8400లు స్వాదీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు.
👉పెద్దారవీడు మండలం వైడిపాడు ఎస్సీ పాలెంలో దాదాపుగా 400 కుటుంబాలకు గత పది రోజుల నుండి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఎస్సీ పాలెం ప్రజలు పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు రాజకీయ నాయకులు….కనీసం నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేవారు.గత పది రోజుల నుండి సరఫరా చేయటం ఆపేశారు.ఎస్సీ పాలెం లో కనీసం సింగల్ మోటార్ కూడా లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.మళ్లీ ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేసి మా సమస్యను పరిష్కరించాలంటూ కోరుతున్నారు.
👉 విద్యార్థులకు అవగాహన.. మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ . అంకమ్మ రావు, మార్కాపురం CI మరియు మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ అయిన యు.నాగరాజు మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ సమీపంలో ఉన్న జార్జి ఇంజనీరింగ్ కాలేజీ, ఇందిరా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ లలో ఉన్న విద్యార్థులందరికీ గొడవలు పడకుండా ఉండటానికి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడమైనది.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?