ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు

👉 ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..
చెప్పేవన్నీ అబద్ధాలంటూ వ్యాఖ్య..హైదరాబాద్..
ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదని, ఆ పార్టీని నమ్మవద్దని మహారాష్ట్ర, జార్ఖండ్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మోడీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. తమ ప్రభుత్వం గురించి మోడీ చేసిన ప్రకటనలో అనేక అపోహలు, అవాస్తవాలు ఉన్నాయని వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీఆర్ఎస్ దుష్పరిపాలన పోయిందని, ప్రజల ఆనందం, ఆశలు వెల్లువెత్తుతాయి అన్నారు. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు వాగ్దానాలు నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తమ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగానే అడుగులు వేస్తోందని వెల్లడించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పదిలక్షలు ఆరోగ్య సంరక్షణకు విడుదల చేశామన్నారు. 11 నెలల్లో తెలంగాణ అమ్మలు, సోదరీమణులు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ ట్రిప్స్ వినియోగించుకున్నారని, దీనివల్ల రూ.3,433 కోట్ల రూపాయలు మిగిల్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పాట ఏడాది కాకముందే అత్యంత పెద్ద హామీ అయిన రుణమాఫీని అమలు చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం వల్ల 22 లక్షల 22 వేల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు.
ఒక్కో రైతుకి రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, బిజెపి ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వెల్లడించారు. 1.31 కోట్ల గ్యాస్ సిలిండర్లను ఇప్పటికే 500 కు పంపిణీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 11 నెలలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసి యువత ఆశలను నెరవేరుస్తున్నామని, ఏ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా తమకు సాటి రాదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నామని, 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన దాన్ని సరి చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యారంగంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని వివరించారు. 11 నెలల కాలంలో గత బిఆర్ఎస్ పాలనలో అలముకున్న చీకట్లో పారద్రోలుతున్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి పథంలో సాగుతూ ఉందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.
👉భీమవరంలో పాపం ఓ పిచ్చి వాడిని కొట్టి ‘జైశ్రీరామ్‌’ అని పలికించిన జనం! అతను ముస్లిం అని దుష్ప్రచారం చేశారు. ఇంతకీ అతను ముస్లిం కానే కాదు. ఓ మతి స్థిమితం లేని పిచ్చివాడు, *అతని పేరు దిలీప్ *. ఎంతటి అమానుషం. ఇంతటి ద్వేషమా?
👉తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీలో ముస్లింలకు స్థానం కల్పించలేదు.. డెమోక్రటిక్ ఫ్రంట్..
టిటిడి బోర్డులోని 24 మంది సభ్యులలో ఒక్కరూ నాన్-హిందువులు కాదు…*
*TTD కొత్త ఛైర్మన్ అక్కడ పనిచేసేవారు హిందువులుగా ఉండాలని చెబుతున్నారు..మేము ముస్లింలు దీనిపై వ్యతిరేకం వ్యక్తం చేయడం లేదని రాష్ట్ర డెమోక్రటిక్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.,కేవలం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లులో పేర్కొన్న విధంగా కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ఇద్దరు నాన్-ముస్లిం సభ్యులను నియమించాలనే విషయాన్ని మేము అభ్యంతరపెడు తున్నాము..వక్ఫ్ బిల్లులో ఈ నిబంధనలను ఎందుకు తీసుకువస్తున్నారు?..TTD హిందూ మతానికి చెందిన బోర్డు మరియు వక్ఫ్ బోర్డు ముస్లిం మతానికి చెందినది.ఇందులో సమానత్వం ఉండాలి…*TTD ట్రస్టులో ముస్లింలు ఉండకూడదని చెబుతున్నారు, అప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లింలు కానీ వారికి స్థానం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.
👉శనివారం ఉదయం తిరుమల లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని మధుర నియోజకవర్గ బీజేపీ పార్లమెంట్ సభ్యులు మరియు ప్రముఖ హీరోయిన్ హేమామాలిని ఆమె కూతురు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఈషా డియోల్ .
👉 స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యానికి పసికందు బలి…. బాపట్ల రూరల్ స్థానిక జమ్ములపాలెం ఆనందనగర్ కాలనీ కి చెందిన మోచర్ల ప్రకాష్ (8 నెలలు )వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యానికి మహిళ చేతిలో ఉన్న బాలుడు వ్యాన్ తగలడం తో మృతి చెందిన బాలుడు. వివరాల్లోకి వెళ్తే మోచర్ల సౌమ్య సుసన్న, శేఖర్ దంపతులకు లేక లేక కలిగిన సంతానం ప్రకాష్ బాబు. 8 నెలలు కలిగిన ప్రకాష్ బాబుకు ఉదయాన్నే మేనత్త బాబుని ఎత్తుకుని ఇడ్లీ తినిపించే తరుణంలో బాపట్ల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతో మేనత్త కు వ్యాన్ తగలడంతో క్రింద పడిపోగా వ్యాన్ బాలుడిని ఈడ్చుకొని వెళ్లడంతో తల భాగానికి గాయం కావడం తో బాలుడుని హుటాహుటిన బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినబాలుడు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి జరిగిన సంఘటనతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన బంధువులు….
👉 సంతనూతలపాడు నియోజకవర్గం,సంతనూతలపాడు మండలం,మద్దులూరు గ్రామంలో మిషన్ పాట్ హోల్ ఫ్రీ-ఎపి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా,సంతనూతలపాడు శాసన సభ్యులు బి.ఎన్ విజయకుమార్.
👉మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు🔥
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ పై పోలీసులకు మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు.
అత్యాచార బాధితుల విషయంలో మాధవ్ అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు కంప్లైంట్ చేశారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఆమె సీపీకి అందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని సీపీ ఆమెకు హామీ ఇచ్చారు.ఇకపోతే వైఎస్సార్‌సీపీకి మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం కూడా చేశారు. తాను రాజకీయాల్లో కచ్చితంగా కొనసాగుతానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆమె రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాసిరెడ్డి పద్మ ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పదవి ఖాళీ అయింది. ఆ పదవి తనకు వస్తుందని ఆమె ఆశించారు. కానీ అలా జరగలేదు. ఎన్నికలకు ముందు కూడా ఎమ్మెల్యే సీటు ఇస్తారనే మహిళా కమిషన్ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆమె వైసీపీకి రాజీనామా చేస్తూ జగన్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
👉అమరావతి రైల్వేలైన్ కోసం భూసేకరణ*
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఖమ్మంజిల్లాలో ఎర్రుపాలెం మండలం లోని రెండు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది.
ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం, కేశిరెడ్డిపల్లి గ్రామాల్లో 24.01 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.
దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వదలచినవారు 30 రోజుల్లోపు ఖమ్మం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ ఎక్విజిషన్)కు
లిఖితపూర్వకంగా సమర్పించాలని రైల్వేశాఖ పేర్కొంది.
👉గుంతలు పూడ్చేందుకు రూ.210 కోట్లు విడుదల*
ఏపీలో రోడ్లపై గుంతలు పూడ్చేందుకు కూటమి ప్రభుత్వంలో మరో అడుగు ముందుకు పడింది.గుంతలు పూడ్చేందుకు రూ.210 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జిల్లా రోడ్లపై గుంతలుపూడ్చేందుకు ఆర్అండ్ బీ శాఖ నిధులు ఇచ్చింది.రోడ్ల పక్కనున్న పిచ్చిమొక్కలు కూడా తొలగించనుంది. అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంగా పనులు
చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
👉 గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..
వికారాబాద్ – దోమ మండలంలోని ఓ గ్రామంలో బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఐదుగురూ గంజాయి మత్తులో 8వ తరగతి విద్యార్థిని పై దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.బాధితురాలి తల్లిదండ్రులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
👉నిజమే… ఇది ఆత్మహత్యేనా!?
ప్రేమికుడి మరణంలో మిస్టరీ వీడేనా?
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండల పరిధిలోని గండిగుంట గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ యువకుడి ఆత్మహత్య సంచలనం రేపింది. అనేక అనుమానాలను రగిల్చింది. ఇద్దరు చదువరులే. మేజర్లే. కానీ కులాలు ఈ ప్రేమను బలి తీసుకున్నాయి. అటు ప్రేమించిన యువతికి అష్టకష్టాలు.. ఇటు చేతికందిన సాప్ట్ వేర్ ఇంజనీరు తండ్రి కన్నీటి ఘోష అంతా ఇంత కాదు. ఉయ్యూరుకు చెందిన చిందా మాధవ దత్త రాజు, గండిగుంట గ్రామానికి యువతి ఒకే కళాశాలలో చదువుకున్నారు. ప్రేమికులుగా మారారు .వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఎందుకంటే అతడు క్షత్రియుడు. ఆమె అగ్రవర్ణమే.. ఉయ్యూరులో బలమైన సామాజిక వర్గం. దీంతో వీరి ప్రేమకు కులం అడ్డు వచ్చింది. 2021 నుంచి వీరిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో బీటెక్ పూర్తి చేసిన మాధవ దత్తరాజు విజయవాడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తన పాత ప్రేయసిని వీడలేక..శుక్రవారం రాత్రి 10:00 గంటల సమయంలో ఆ యువతి ఇంటికి వెళ్లాడు. ఆమెతో తనకు పెళ్లి చేయాలని కోరాడు. యువతి బంధువులు ససేమిరా అన్నారు. అతడిని మందలించి పంపివేశామని, శనివారం ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి తమ ఇంటి వరండాలో మాధవ దత్తరాజు ఉరికి వేలాడుతూ కనిపించాడని యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తన కొడుకు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తండ్రి రుక్మన్ గధ మహారాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా ఉయ్యూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఉయ్యూరు టౌన్ ఎస్ఐ వి. విశ్వనాథ్ తెలిపారు.కానీ ప్రియురాలి ఇంట్లో ప్రియుడు ఆత్మ హత్యపై పలు అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదొక మిస్టరీ కథనం..
ఈ ఘటనపై స్థానికుల్లో పీడిస్తున్న ప్రశ్నలు ఇవి. నిజమే తన ప్రేయసిని వీడలేక.. ఆమెతో పరిణయానికి ఆ కుటుంబ సభ్యులను వేడుకునేందుకు ఆ యువతి ఇంటికి వెళ్లిన విషయం వాస్తవం. పెళ్లి కుదరదని మందలించి ఇంటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు పంపించటం నిజం. కానీ మరుసటి రోజు ఉదయం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించటమే అనూహ్యం. ఎందుకంటే .. ఆ ఇంటి వరండాలోకి అతడు ఎలా వెళ్లాడు? క్రైమ్ సీన్ చూస్తే.. అతడు ఆరు అడుగుల ఎత్తు ఉన్నట్టు కనపడుతోంది. శవం నేలను తాకింది. అతడు ఓ కుర్చీ ఎక్కి ఫ్యాన్ కు ఒక బెడ్ షీట్ ఓ ఉరివేసుకున్నట్టు కనపడుతోంది. ఆ పక్కనే కుర్చీ మీద ఎక్కి మెడకు ఉరి బిగించుకుని దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి మెడ విరిగింది. అతడు కుర్చీ మీద నుంచి దూకితే శబ్ధం వినపడలేదా? ఇదే ఓ మిస్టరీగా జనం అనుమానిస్తున్నారు. ఆ కుర్చీ నుంచి అంతదూరం దూకాడా? అతడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి మద్యం సేవించాడా? మద్యం మత్తులో ఉరి వేసుకున్నాడా? ఒకవేళ అతడిపై దాడి జరిగిందా? చనిపోయిన తరువాత ఉరి వేశారా? లేక కొన ఊపిరిలో ఉండగా ఉరి వేశారా? ఈ విషయం తేలాలంటే.. అతడి శరీరంపై గాయాలు ఉండాలి. లేదా.. అతడే ఆత్మహత్య చేసుకున్నట్టు పోస్టుమార్టం రూఢీ చేస్తుంది. ఎనీ హౌ.. ఈ ఘటనలో ఈ ప్రశ్నలన్నింటికీ పోస్టుమార్టమే నివేదికే సమాధానం ఇస్తుంది.
👉సూపర్‌సిక్స్‌ అమలు చేయని సూపర్‌ఫ్లాప్‌ ప్రభుత్వం
కోటిన్నర కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ మొండిచేయితో మోసం
:మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజం
నెల్లూరులో వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌.కూటమి నేతల విమర్శలు దారుణం. అనైతికం వారి అవలక్షణాలపై మేం మాట్లాడితే తట్టుకోలేరు.తల ఎక్కక్కడ పెట్టుకోవాలో కూడా మీకు తెలియదు.మీరు సమధానం కూడా చెప్పలేని దుస్థితి వస్తుంది.:కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ..
సంస్కారహీనంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ మాటలు
వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు మాట్లాడుతూ విమర్శలు
రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమాదం కుట్ర అంటున్నారు
ఎన్టీఆర్‌ మరణం,జూ.ఎన్టీఆర్‌ కారు ప్రమాదం కుట్ర కాదా?
పవన్‌ కళ్యాణ్‌ ఇంటి నుంచి గతంలో ఓ ఆడబిడ్డ రోడ్డెక్కింది.తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగా ప్రకటించింది.ఆ సంగతులన్నీ మర్చిపోయారా?
:సూటిగా ప్రశ్నించిన కాకాణి గోవర్థన్‌రెడ్డి
షర్మిలకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పిస్తామన్న పవన్‌
అసలు ఆ అవసరం పవన్‌కళ్యాణ్‌కు ఏముంది?
తొక్కి పెట్టి నారా తీస్తానంటున్న డిప్యూటీ సీఎం పవన్‌
ఆ పని సీఎం, ఆయన కొడుకు ఇద్దరికీ చేయాలి
ఎందుకంటే ఎన్నికల హామీలేవీ అమలు చేయడం లేదు
:ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన కాకాణి గోవర్థన్‌రెడ్డి
నెల్లూరు:ఉచిత గ్యాస్‌ సిలిండర్ల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ కాస్తా.. సూపర్‌ ప్లాఫ్‌గా మారిందని వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రంలో కోటి 47 లక్షల రేషన్‌ కార్డులుంటే వాటిరో అరకోటి మందికి మొండిచేయి చూపుతూ పథకాన్ని ఎగ్గొట్టారని, మరోవైపు మిగిలిన వారు కూడా తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్‌ కొనుగోలు చేస్తే, తర్వాత అకౌంట్లో్ల వేయడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజలను దగా చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.
ఇంకా కూటమి పార్టీల్లో ఉన్న నేతల అవలక్షణాల గురించి సంస్కారం వీడి తాము మాట్లాడాల్సి వస్తే వారంతా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక, తట్టుకోలేక అల్లాడాల్సిన దుస్థితి దాపురిస్తుందని, ఈ మేరకు రాజకీయ విమర్శలు చేసేటప్పుడు కాస్తా ముందూ, వెనుక వారి కుటుంబాల గురించి ఆలోచించుకుంటే బాగుంటుదని సీఎం, డిప్యూటీ సీఎంకు కాకాణి గోవర్థన్‌రెడ్డి హితవు చెప్పారు. రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ, మా పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్, ఆయన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలపై పిచ్చి విమర్శలు తగవని, ఇక నుంచి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని.. లేకపోతే ప్రజల్లో తలెత్తుకుని తిరిగే అవకాశం లేకుండా తాము కూడా మాట్లాడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
రెండేళ్ల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే, అందులో కుట్ర కోణం ఉందని టీడీపీ అఫీషియల్‌ సోషల్‌ మీడియా దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటు అని కాకాణి మండిపడ్డారు. కూటమి పార్టీల నేతలు సంస్కారం తప్పి విమర్శలు చేస్తే, వాటికి తాము చేసే ప్రతివిమర్శలకు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ను ఎవరు చంపేశారు? ఆయన ఎవరి వల్ల చనిపోయారు? ఆయన్ను శారీరకంగా, మానసికంగా హింసించడంతో పాటు, ఆయన స్థాపించిన పార్టీని, పార్టీ గుర్తును, పార్టీ బ్యాంక్‌ ఖాతాలను ఎవరు, ఎలా చేజిక్కించుకున్నారన్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు.
అలాగే ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌ తిరిగి వస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ కారు ప్రమాదానికి గురైతే, అది కూడా కుట్ర అనుకోవాల్సి వస్తుందని.. ఎందుకంటే భవిష్యత్తులో టీడీపీలో తనే, నారా లోకేష్‌కు అడ్డు వస్తాడన్న భయం వారిలో ఉందని మాజీ మంత్రి ప్రస్తావించారు. ఇంకా చెప్పాలంటే హరికృష్ణ, ఆయన కుమారుడు జానకిరామ్‌ మరణాల వెనకా కుట్ర కోణాన్ని ప్రస్తావించాల్సి వస్తుందన్న కాకాణి, మీ ఇంట్లో మహిళ ఆత్మహత్య చేసుకోవడం వెనుక కుట్ర ఉందని ప్రచారం చేస్తే ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎప్పుడూ సంస్కారంతో ఆలోచించే జగన్‌గారు, వ్యక్తిగత, కుటుంబ విమర్శలకు దిగరని చెప్పారు.
చంద్రబాబు సహవాసంతో పవన్‌కళ్యాణ్‌కూడా గతి తప్పి మాట్లాడుతున్నారన్న మాజీ మంత్రి, షర్మిలకు భధ్రత కల్పించాల్సిన అవసరం ఆయనకు ఏముందని ప్రశ్నించారు. పవన్‌ కుటుంబం నుంచి గతంలో రోడ్డెక్కిన ఒక ఆడబిడ్డ, తనకు ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందంటూ బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ఈ మాటలు మీకెంత బాధ కలిగిస్తాయో.. ఎదుటివారికీ అలాగే ఉంటుందన్న విషయం మరవొద్దని చెప్పారు.
*తొక్కి పెట్టి నార తీస్తా అంటూ పవన్‌ పెద్ద పెద్ద డైలాగ్‌లు చెబుతున్నారన్న కాకాణి గోవర్థన్‌రెడ్డి, అంతలా తొక్కి నార తీయాలనుకుంటే, ఇసుక, మద్యం మాఫియాలో మీ ఎమ్మెల్యేలు ఏయే నేరాలు, ఘోరాలు చేస్తున్నారో తెలుసుకుని, వారికి ఆ పని చేయాలని.. అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ను తొక్కి పెట్టి నార తీయాలని సూచించారు.
👉 5 నెలల తర్వాత హత్య కేసును ఛేదించిన పోలీసులు..
ఢిల్లీలోని యోగేశ్ చంద్రపాల్ అనే వైద్యుడి హత్య కేసును ఐదు నెలల తర్వాత పోలీసులు ఛేదించారు. ప్రధాన సూత్రధారి విష్ణుస్వరూప్‌ సాహిని 1,600 కి.మీ మేర జల్లెడపట్టి భారత్‌-నేపాల్‌ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 8 మొబైళ్లు, 20 సిమ్‌ కార్డులు మార్చినట్లు తెలిపారు. ఆరు ఫేక్‌ పేర్లతో తిరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో అరెస్టు అయిన ముగ్గురు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకున్నారు.
👉 శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!
జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ నగర పరిధిలోని ఖన్యార్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబా కమాండర్ మరణించాడని కశ్మీర్ జోన్ ఐజీపీ విద్ది కుమార్ బర్డీ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన లష్కరే తాయిబా కమాండర్‌కు 2023లో జరిగిన ఇన్‌స్పెక్టర్ మస్రూర్ హత్య కేసుతో సంబంధం ఉందని ఐజీపీ బర్డీ చెప్పారు. శనివారం ఉదయం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రతా జవాన్లు గాయ పడ్డారని వెల్లడించారు.
👉 ఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!
ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!
ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన APలోని మచిలిపట్నం కాలేఖాన్‌పేటలో శనివారం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం స్కూలుకు వెళ్తున్నామని ముగ్గురు చిన్నారులు ఇంటి నుంచి వెళ్లారు. సాయంత్రం అయినా రాకపోవడంతో తల్లిదండ్రులు స్థానికంగా వెతికారు. ఎంతకీ కనిపించకపోవడంతో అనుగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక సీసీ టీవీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి మచిలీపట్నంలో గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

7k network
Recent Posts

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు

కెసిఆర్ అంటే ఇష్టం- రఘురామ సంచలన వ్యాఖ్యలు .. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై హత్య…. జమ్ముకశ్మీర్‌లో ఏపీ విద్యార్థులు దుర్మరణం..ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన..టీడీపీ – జనసేన పార్టీల మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు

పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం ..మాజీమంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు..సిపిఎం మహాసభల పోస్టర్ విడుదల.. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గోల్మాల్..కర్పూరం ఫ్యాక్టరీలో ఘోర ఘటన..దీపావళి రోజు – డబుల్ మర్డర్..వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణి చేసిన మంత్రి డోలా…400 మంది మహిళలను లైంగికంగా వేధించిన బిలియనీర్‌!.. పైడిపాడు లో తాగు నీటి కొరత.. గిద్దలూరులో మట్కారాయుళ్ల అరెస్టు.. శంషాబాద్ లో ఏడు కోట్ల డ్రగ్స్ పట్టివేత.. గుడి విధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి దేహశుద్ధి