ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

👉ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..*
*హైద్రాబాద్:*కొన్ని రోజుల క్రితం తొర్రూరు పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సిరెడ్డి పాల్గొనగా షాపింగ్ మాల్ ముందు వేసిన వేదిక కూలి కాలు విరగడంతో అపోలో హాస్పటల్ లో చికిత్స పొంది హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంతుండగా ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి ఝాన్సి రెడ్డిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.వారి వెంట ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,తదితరులున్నారు.
👉 నిన్న కొచ్చిలో జరిగిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసన్ కృష్ణన్ కుమార్తె ఐశ్వర్య వివాహ రిసెప్షన్ లో శశిథరూర్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
👉చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?
తప్పు చేశానని ఆయన చెప్పుతో కొట్టాడు కానీ ఆ చెప్పు బంగారంతో చేసిందని వెనకటికి ఒకడు చెప్పుకుని సంతోషపడ్డాడట… ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే ఉంది. చంద్రబాబు విశాఖ రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ రెడ్డి నిర్వాకాన్ని బయటపెడితే… చంద్రబాబు పొగిడారని ప్రచారం చేసేసుకుంటున్నారు. ఈ దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుందో అని చంద్రబాబు ఆశ్చర్యపోయారు. దొంగలన్న సంగతి మర్చిపోయి ఇదిగో ఇన్నోవేషన్ అని.. మా జగన్ అన్ననే అన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ దొంగ అని కూడా ఒప్పుకుంటున్నా మని వారికి అర్థం కాలేదు.చంద్రబాబు ఏమన్నారో వీడియోలు మాత్రం పెట్జడం లేదు.
కానీ పొగిడారంటూ పేపర్ క్లిప్‌లు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి నిర్మించిన భవనం విషయంలో జగన్ వ్యహరించిన తీరును తప్పు పట్టారు. పర్యవరణ విధ్వంసాన్ని చేసింది కాకుండా జపాన్ టెక్నాలజీని తెచ్చి కొండ చరియలు పడకుండా కోట్లు ఖర్చు పెట్టారు. ఇలాంటివన్నీ ఏ మాత్రం బాధ్యత లేని వ్యక్తులే చేస్తారని మండిపడ్డారు. జగన్ రెడ్డి నిర్వాకాన్ని ప్రజలకు చూపించాలని నిర్ణయించారు.దీనికే చంద్రబాబు పొగిడితే జగన్ రెడ్డి జీవితానికి అంత కంటే గుర్తింపు ఉండదనుకుని అవే పొగడ్తలనుకుని ప్రచారం చేసేసుకుంటున్నారని టిడిపి నాయకులు చెప్పుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియాను ఎవరు డీల్ చేస్తున్నారో కానీ ఉదయం నుంచి జగన్ ను పొగిడిన చంద్రబాబు అంటూ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. వాటిని చూసి టీడీపీ కార్యకర్తలు నవ్వుకుంటూనే ఉన్నారు. అసలు చంద్రబాబు పొగిడారో తిట్టారో తెలుసుకోలేనంత అమాయకులు.. జగన్ పరువు తీస్తున్నారని కొంత మంది నిష్ఠూరమాడుకుంటున్నారు.
👉వక్ఫ్ పరిరక్షణ మహాసభ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ స్క్రోలింగ్ పాయింట్స్..
*విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని భవానిపురం ఈద్గా మైదానం లో జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ నిర్వస్తున్న వక్ఫ్ పరిరక్షణ మహాసభ .
*ఈ మహాసభ లో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్, ఎం.పి లావు కృష్ణ దేవరాయలు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వర రావు..*ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి సేవా కార్యక్రమాలు చేసే సమాజం ముస్లిం సమాజం..*పార్ల‌మెంట్ లో వ‌క్ఫ్ బోర్డ్ స‌వ‌ర‌ణ చ‌ట్టం జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీకి పంపించాల‌ని సూచించింది తెలుగుదేశం పార్టీ..ఈ బిల్లు విష‌యంలో జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీ ఏర్ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కృషి, టిడిపి తీసుకున్న నిర్ణ‌యం..సీఎం చంద్ర‌బాబు మ‌త‌స్వామ‌ర‌స్యాన్నికాపాడే నాయ‌కుడు..
*వక్ఫ్ సవరణ చట్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూలంకషంగా అన్ని ముస్లిం జమాతులతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటారు.*వక్ఫ్ బోర్డు సవరణ చట్టం మీద అభ్యంతరాలు ఉన్నాయని బహిరంగ సభ పెట్టి చర్చించడం చాలా చాలా సంతోషకరమైన విషయం
*ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు సూచన, సలహా మేరకు. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని సబ్ కమిటీ కు పంపవలసిందిగా కోరడం జరిగింది.*తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ముస్లిం సమాజ అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేయదు*సీయం చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజం అభివృద్ధి కోసం,వక్ఫ్ ఆస్తులు ఏ విధంగా కాపాడాలి అని నిరంతరం ఆలోచిస్తారు
విజయసాయిరెడ్డి, ఎంపీ కామెంట్స్..*
ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది..వైయస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారు..ఈ బిల్లును క్యాబినెట్ లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు..రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ఏ మంత్రి విబేధించినా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు రావాల్సి ఉంటుంది..కానీ ఈ బిల్లుని రామ్మోహన్ నాయుడు ఆమోదించారు..వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైసీపి వ్యతిరేకించింది..వైసీపి తరఫున మేము డీసెంట్ నోట్ కూడా ఇచ్చాం ..ముస్లింల తరఫున వైసీపి ఎప్పుడూ నిలపడే ఉంటుంది..వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది..
కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ..కామన్ ఫండ్‌ని ఏడు నుంచి ఐదు శాతానికి తగ్గించడానికి కూడా వైసీపి వ్యతిరేకం..
రైల్వే శాఖకు 4.88 లక్షల హెక్టార్లకు పైగా భూమి ఉంది..
ఆ భూముల్లో చాలాభాగం వక్ఫ్ బోర్డు.. ఆక్రమించుకుందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పు..
కుట్రపూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు..ఈ ఆరోపణలను వైసీపి ఖండిస్తోంది..
వక్ఫ్ బోర్డు భూములే 50% ఆక్రమణలకు గురయ్యాయి..
9.40 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి..
ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ భూములను ఆక్రమించారు..
ఆ ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వైసీపి వ్యతిరేకిస్తుంది..ముస్లిం సంస్థలకు నాన్ హిందువులు విరాళాలు ఇవ్వకూడదన్న బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం..
ముస్లింలు ఇతరులకు విరాళం ఇవ్వవచ్చు, ఇతరులు మాత్రం వక్ఫ్ బోర్డుకు ఇవ్వకూడదనటం చాలాచాలా అన్యాయం..
వక్ఫ్ బోర్డు సిఈవోగా గతంలో ముస్లింలే ఉండేవారు
ఇప్పుడు నాన్ ముస్లింలు కూడా సీఈవోగా ఉండొచ్చని ఈ బిల్లులో నిర్ణయం తీసుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం..
ముస్లింల హక్కులకు భంగం కలిగిస్తే మేము సహించం
జగన్ ఆదేశాలతో మేము ముస్లింల హక్కుల కోసం పోరాడతాం అన్నారు.
👉కొమరోలు మండల పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు తన వంతు సహకారం అందిస్తూ వచ్చారు. వారి సేవలను గుర్తించిన హైదరాబాద్ యూనివర్సిటీ ఆసియా అంతర్జాతీయ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు సెప్టెంబర్ 30 వ తేదీన డాక్టరేట్ ను అందించారు. ఈ సందర్బంగా గిద్దలూరు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ సభ్యులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గోని బోనేని వెంకటేశ్వర్లు కు పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అందించి నేడు డాక్టరేట్ పొందటం చాలా సంతోషకరమైన విషయం అని తాను మరెన్నో సేవా కార్యక్రమాలతో ఉన్నత శిఖరాలను అందుకోవాలని, వారికీ శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,గిద్దలూరు పట్టణ టీడీపీ నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గోన్నారు.
👉విజయ ఫిజియో థెరఫీ క్లినిక్ ను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*ప్రకాశం జిల్లా, కంభం పట్టణములోని రావిపాడు రోడ్డులో డా. విజయ భాస్కర్ నూతనముగా ఏర్పాటు చేసిన శ్రీ విజయ ఫిజియోధెరపి క్లినిక్ ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధి గా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ముత్తుముల అశోక్ రెడ్డిని హాస్పిటల్ నిర్వాహకులు మేళ తాళాలతో, వేద పండితులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిజియోధెరపి కోసం నూతన పరికరాలతో ఈ ప్రాంతములో ఏర్పాటు చేయడం చాలా హర్షనీయమని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేశారు.. కార్యక్రమంలో కంభం మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.*
👉రాచర్ల గ్రామంలో పలువురిని పరామర్శించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*రాచర్ల గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతూ చికిత్స అనంతరం ఇంటిలో విశ్రాంతి తీసుకొనుచున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కుప్పాల రమేష్ బాబు మరియు రాచర్ల ఐటీడీపీ మండల అధ్యక్షులు పఠాన్ సనాఉల్లాఖాన్ లను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరామర్శించి వారి ఇరువురి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారితో పాటు మండల అధ్యక్షులు కటికే యోగానంద్, గోపిరెడ్డి జీవన్ రెడ్డి మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గోన్నారు.*
నేటి యువత క్రీడల్లో రాణించాలి*
👉విజేతలకు టోర్నమెంట్ ట్రోఫీ అందచేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*బెస్తవారిపేట పట్టణంలో యువతను ప్రోత్సహిస్తూ హరి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ & నిర్వాహకులు హరినాధరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి రూ. లక్ష రూపాయలు, రెండవ బహుమతి రూ. 50 వేలు, మూడవ బహుమతి రూ. 30 వేలు గా ప్రకటించగా,, ఫైనల్స్ లో మొదటి విజేతగా బెస్తవారిపేటకు చెందిన సులేమాన్ – 11 టీం, రెండవ విజేతగా దిశాన్ – 11 టీం,మూడవ విజేతగా ఆపిల్ జే – 11 లు నిలిచాయి. గెలుపొందిన విజేతలకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ట్రోఫీలను మరియు నగదును అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో క్రీడలు యువత యొక్క శారీరక దృఢత్వానికి మేధోశక్తికి ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, పోటీ పరీక్షలు అన్నీ రంగాల్లో రాణించాలని, టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోరెడ్డి మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దూదేకుల సైదులు, మరియు పలువురు టీడీపీ నాయకులు, టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గోన్నారు.*
👉ఎడవల్లి చెరువులో అక్రమంగా అక్రమార్కులు సాగు చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్న రెవిన్యూ సిబ్బంది*ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి చెరువులో అక్రమంగా సాగు చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఒక ట్రాక్టర్ ని అదుపులోకి తీసుకున్న వీఆర్వో రంగయ్య మరియు వీఆర్ఏ రమణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె
👉మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా*..పట్టించుకోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్.. *పక్క రాష్ట్రాలకు మొక్కుబడిగా నడుపుతున్న ఆర్టీసీ అధికారులు*
మదనపల్లెలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు సామాన్యులను దోచుకుంటున్నాయంటూ ఆదివారం స్థానిక ప్రయనీకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తూ ప్రణాణికుల నడ్డి విరుస్తున్నా రంటూ వాపోయారు. సీటు కెపాసిటికి మించి కుక్కి తరకిస్తున్నా ఎంవీఐ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఏళ్ల తరబడి మదనపల్లి నుండి బెంగళూరుకు ప్రైవేట్ బస్సుల దందా కొనసాగుతున్న అడిగే నాధుడే లేకుండా పోయాడు. బెంగళూరు బస్టాండులో ప్రైవేట్ బస్సులది ఇష్ట రాజ్యమైపోయింది. మదనపల్లె నుంచి బెంగళూరుకు ఆర్టీసీ అధికారులు సకాలంలో బస్సులు నడపకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటూ వారు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరారు.
👉 *అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో* *అడ్డగోలు వ్యవహారాలు!..*సొంత శాఖ ఉద్యోగులపైనే నిఘా*
*అక్రమార్కుల కొత్త ఎత్తుగడ*.. *వెలుగు చూస్తున్న కొత్త కోణాలు* : ఉమ్మడి అనంతపురం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బదిలీల ప్రక్రియ పూర్తయినా ఆ శాఖలో మార్పు కనిపించడం లేదు. యధా రాజా.. తథా ప్రజా అన్న చందంగా పరిస్థితి కనిపిస్తోంది. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వింతపోకడలు నెలకొన్నట్లు తెలుస్తోంది. కొంతమంది రిజిస్ట్రేషన్ అధికారులలో కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెత్తనం తమదే జరగాలన్న పోటీ కొన్నింటిలో జరుగుతోంది. మరోవైపు సొంత ఉద్యోగులపైనే నిఘా పెట్టినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ వ్యవహారాల తంతు వెలుగు చూస్తూ ఉండటంతో అందుకు బాధ్యులైన వారిని కనిపెట్టేందుకు కొందరు అక్రమార్కులు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు అటు మీడియాకు, ఇటు నిఘా సంస్థలకు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులే సమాచారాన్ని లీక్ చేస్తున్నట్టు కొందరు సబ్ రిజిస్ట్రార్ లు అనుమానిస్తున్నారు. సొంత శాఖ ఉద్యోగుల పైన నిఘా పెట్టడంపై కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యను చాలామంది ఉద్యోగులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాంటివారు ఎక్కడో ఒకచోట ఒకరిద్దరు ఉంటే ఉండవచ్చు గాక, సంబంధం లేని వారిని కూడా అనుమానించడం తీవ్రమైనదిగా వారు అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉండగా తమ ఆక్రమాలు బయటకు పొక్కడాన్ని సహించలేని కొందరు ఎస్ఆర్ఓ లు కార్యాలయంలో పనిచేసే తమ అనుయాయుల ద్వారా ఉద్యోగుల కదలికల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతోంది.
కార్యాలయంలో జరిగే అక్రమ వ్యవహారాలు కార్యాలయంలో పనిచేసే వారే కారణమని ఎందుకు అనుమానిస్తున్నారో అర్థం కావడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. జరుగుతున్న వ్యవహారాలపై బాధితులు ఎవరైనా నష్టపోయి ఉంటే వారి ద్వారా కూడా అక్రమ వ్యవహారాలు బయటకు పొక్కే అవకాశం ఉంటుందని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉద్యోగులను అనుమానించడంలో అర్థం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సందర్భంలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమకు అడ్డంగా ఉన్న వారిని తప్పించి అక్కడ అంతా తమ పెత్తనమే సాగించాలన్న ప్రక్రియ కొన్నిచోట్ల జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది….. అనంతపురం ఆర్.ఒ కార్యాలయం లో ఏం జరుగుతోంది? అలాగే అక్కడ డాక్యుమెంట్ల స్కానింగ్ లో పొరపాట్లు జరిగాయా? రిజిస్ట్రేషన్ శాఖను శాసించేందుకు అంతర్గతంగా టీమ్ ఏర్పాటు అయిందా? పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్కడ జరిగే వ్యవహారాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు ఇన్ ఫార్మర్లను నియమించారా? రింగ్ మాస్టర్ కనుసన్నల్లో ఇదంతా జరుగుతోందా? అనే అంశాల మీద చర్చ జరుగుతుంది.
👉భూపాలపల్లిలో PHCలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన హరిత డెలివరీ కోసం మండలంలోని PHCలో సోమవారం అడ్మిట్ అయింది.కాగా, నొప్పులు వస్తున్నాయని సర్జరీ చేయండని చెప్పినా డాక్టర్ వినకుండా నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేశారని బాధితురాలు తెలిపింది.
దీంతో కడుపులోని శిశువు మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వలన బిడ్డ చనిపోయిందని వాపోయింది…
👉డ్రోన్ల‌ నిఘాతో శాండ్ మాఫియాకు చెక్‌..😯
ఎన్టీఆర్ జిల్లా బ్యూరో:ఇసుకాసురులకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అడ్డుకట్టకు సర్వసన్నద్ధమయ్యారు. నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో కృష్ణానదిలో అక్రమంగా ఇసుకను తోడి.. నిల్వ చేసి హైదరాబాద్కు తరలిస్తున్న ఇసుక మాఫియా ఆగడాలకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజ‌శేఖర బాబు బ్రేక్ వేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. డ్రోన్ లతో పహారా కు రంగం సిద్ధం చేశారు. ఇసుక క్వారీలు, ఇసుక డంప్లు, అక్రమ రవాణ ట్రిప్పర్లపై నిఘా పెంచారు.
క్షణ క్షణం ఈ అక్రమాలపై కంట్రోల్ కమాండ్ సెంటర్ నుంచి తనిఖీ చేస్తూ.. అధికారులను అలెర్ట్ చేసే పనిని ప్రారంభించారు. 17 చెక్‌పోస్టుల ఏర్పాటు..రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న ఉచిత ఇసుకను సామాన్య ప్రజలకు అందకుండా దళారులు అక్రమంగా దారి మళ్లించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అధిక ధరలకు అమ్ముతున్నారనే సమాచారంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు.
అక్రమ ఇసుక రవాణ నియంత్రణపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్, ఎస్. బి, లా అండ్ ఆర్డర్ అధికారులు, సిబ్బందితో పలు ప్రత్యేక బృందాలను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు నియమించారు.17 చెక్ పోస్ట్ లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ బృందాలతో పాటు సాంకేతికత పరిజ్ఞానం ఆధారంగా డ్రోన్ కెమెరాలతో పహారాకు రంగం సిద్ధం చేశారు.
సీసీ కెమెరాల‌తో నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌..స్టాక్ యార్డులు, చెక్ పోస్ట్ ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. టిప్పర్ల జీపీఎస్ లను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందిస్తారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ స్వయంగా కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తూ ఎక్కడా అక్రమంగా ఇసుక నిల్వలు లేకుండా , అక్రమ రవాణ జరగని రీతిలో అధికారులకు అప్రమత్తం చేస్తున్నారు.
అనదికారిక ఇసుక డంప్ లను నిల్వ చేసినా, అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రాజశేఖర బాబు హెచ్చరించారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?