పోకిరీలకు పోలీసులు రాచ మర్యాదలు.. దూకుడు పెంచిన ఏసీబీ..24 శాతం సైబర్ నేరాలు పెరిగాయి: సీపీ ఆనంద్..తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా సమీక్ష సమావేశం..ధరల భారాలకు వ్యతిరేకంగా ప్రజా పోరుకు సిద్ధంకండి..మేస్త్రీలను విధుల్లోకి తీసుకోవాలని అర్థ నగ్న ప్రదర్శన..ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్..పొగాకు ప్రత్యామ్నాయ పంటలు (కంభం)..

👉పోకిరీలకు పోలీసులు…రాచ మర్యాదలు..!!!
*గన్నవరం:* ఈ దృశ్యాలు చూసి షాక్ గురైన పలువురు రాజకీయ నేతలు …❓▪️వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచ మర్యాదలు.▪️రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో గన్నవరంలోని ఓ రెస్టారెంట్‌లో విందు భోజనం.▪️టీడీపీ కార్యకర్తలు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా …ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేసిన పోలీసులు.▪️చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై ఇష్టారీతిన మాట్లాడిన అనిల్‌కు ఇలా మర్యాదలు జరగడం పై టీడీపి నేతలు,కార్యకర్తలు,అభిమానులు మండిపడుతున్నారు.
👉24 శాతం సైబర్ నేరాలు పెరిగాయి: సీపీ ఆనంద్..
24 శాతం సైబర్ నేరాలు పెరిగాయి: సీపీ ఆనంద్
తెలంగాణలో ఈసారి 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాగా చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని చెప్పారు. 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువవుతు న్నాయన్నారు. దాదాపు రూ.36 కోట్లను బాధితులకు తిరిగి ఇచ్చామని చెప్పారు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్‌లు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
👉గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 12 మంది విద్యార్థినులకు అస్వస్థత..😯😯😯
తెలంగాణ : మంచిర్యాల జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో బుధవారం ఫుడ్ పాయిజన్ అవడంతో 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గుర్తించిన ఆశ్రమ పాఠశాల సిబ్బంది.. హుటాహుటిన విద్యార్థినులను ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
👉దూకుడు పెంచిన ఏసీబీ
తెలంగాణ : ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఆర్‌ఈ (రెగ్యులర్ ఎంక్వయిరీ)ని మొదలపెట్టింది ఏసీబీ. ఆర్‌ఈ లో ఫైళ్లు పరిశీలించి, అక్రమాలు ఎలా జరిగాయి అనే దానిపై ఏసీబీ విచారణ జరుపనుంది. రెండు రోజుల్లో కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఫార్ములా-ఈ రేసింగ్ సంబంధించి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది.
*హైదరాబాద్:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం..*
*నిద్రమత్తు వీడండి–రోడ్ల రిపేర్లు చేయండి-ఆర్&బీ రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం..*
🔸వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రిపేర్లు చేయకుండా మీనమేషాలు లెక్కించడం ఏంటి…?
🔸మాటలు కాదు–రిజల్ట్ కావాలి..
🔸మీరేమో ప్రతీ రివ్యూలో రోడ్లు బావున్నాయని చెబుతారు..ప్రజలు రోడ్లు బాలేవంటున్నారు..క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారా..స్టేట్ రోడ్స్ అధికారులపై సీరియస్ అయిన మంత్రి..🔸ప్యాచ్ వర్క్ లు చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది..🔸మనం ప్రజల కోసం పనిచేస్తున్నామన్న స్పృహ ఉండాలి..🔸పార్ట్ హోల్స్ నింపకుండా ఏం చేస్తున్నారు..🔸ప్రతీవారం రివ్యూ చేయండని స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్,స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందనకు ఆదేశం..
*💥అవినీతిమయం… సివిల్ సప్లయ్ డిఎం ఇర్ఫాన్ జీవితం*వనపర్తిలో రాచాల యుగంధర్ గౌడ్ ప్రెస్ మీట్*
*రాచాల కామెంట్స్:::*
*అవకతవకలపై ఇప్పటికే రెండు సార్లు సస్పెండ్*
*అయినా మారని తీరు.. వనపర్తిలోనూ అవినీతి జోరు*
*ప్రభుత్వం బదిలీ చేసినా ఉత్తర్వులు బేఖాతరు.. నిబంధనలకు విరుద్ధంగా విధులు*
*కొత్త అధికారిని రానివ్వకుండా అవినీతి సొమ్ముతో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఆటలు*
*డీఎంగా చేసిన వ్యక్తికే అనుభవం లేదని వంకలు పెడుతూ పొంకనాలు..*పనిచేసిన ప్రతీ చోటా.. అయితే సస్పెన్షన్ లేకపోతే నోటీసులు అందుకున్న చరిత్ర*
*ఇక్కడ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి.. బదిలీ అయినా వెళ్లకుండా నాటకాలు..*డబ్బుల కోసం మిల్లర్లను కూడా ఒత్తిడికి గురి చేస్తున్నట్లు ఆరోపణలు*
*కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కు ఈ తతంగం తెలియడం లేదా..*వనపర్తికి వచ్చిందే దొడ్డి దారిన.. పనిచేస్తుందే అక్రమంగా.. అయినా కదలని వైనం*
👉*తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా సమీక్ష సమావేశం*..నూతన క్రీడవిధాన రూపకల్పన, స్పోర్ట్స్ హబ్,సీఎం కప్ మరియు ఇతర అంశాలపై
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, పీసీసీ అధ్యక్షులు,తెలంగాణ కరాటే అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడల సలహాదారులు *ఏపీ జితేందర్ రెడ్డి,* రామగుండం శాసనసభ్యులు &శాప్ మాజీ చెర్మన్ ఎం. ఎస్. రాజ్ ఠాకూర్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాల దేవి తెలంగాణ ఒలింపిక్ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, వివిధ క్రీడ సంఘాల ప్రతినిధులు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
👉 మేస్త్రీలను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ,ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్పోరేషన్ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న మున్సిపల్ మేస్త్రీలు.. డివిజన్ రిపోర్టర్ అస్లాం బేగ్
👉 ప్రకాశం జిల్లా…పొదిలి
చిన్న చెరువులో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.పట్టణం లోని బాప్టిస్ట్ పాలెనికి చెందిన సుశీల అనే వివాహిత చిన్న చెరువులో కేకలు వేస్తూ మునిగిపోతుండగా ఓ ఆటో డ్రైవర్ చూసి చెరువు దగ్గరకు వెళ్లేసరికి అప్పటికే ఆమె నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆటో డ్రైవర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమికంగా
మృతురాలు పొదిలి మండలం బాప్టిస్ట్ పాలేనికి చెందిన సుశీలగా వివాహితగా గుర్తించారు ఉదయం బయటికి వెళ్లిన వివాహిత సుశీల ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో బంధువులు స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.అనంతరం చిన్న చెరువులో తను అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం గ్రామంలో తెలియడంతో సంఘటన స్థలానికి బంధువులు చేరుకున్నారు ఇటీవల కాలంలో ఆరోగ్యం సరిగా లేక పోవడంతో కలతొచ్చింది మృతి చెందినట్లుగా పలువురు కుటుంబ మరియు బంధువులు భావిస్తున్నారు.
👉ధరల భారాలకు వ్యతిరేకంగా ప్రజా పోరుకు సిద్ధంకండి..
*సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు పిలుపు*నవంబర్ 8 నుండి 14 వరకు ప్రజా సమస్యలపై ప్రచార ఉద్యమం… 15 న ధర్నాలు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ధరలభారాలు, మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా నవంబర్ 8 నుండి 14 వరకు జరిగే ప్రజాపోరులో పాల్గొనాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం సిపిఎం మండల ఏడవ మహాసభలు కొండేపిలో జరిగాయి. ఈ సభలకు ముప్పరాజు చిన్న బ్రహ్మయ్య అంగలకుర్తి విశ్రాంతి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పూనాటి మాట్లాడుతూ ఎన్నికలకు ముందుగా 420 పార్లమెంటు స్థానాలు వస్తాయని, దానితో రాజ్యాంగాన్ని మార్చేస్తామని, దేశాన్ని వికసిత భారతదేశంగా మారుస్తామని బిజెపి ప్రగల్బాలు పలికిందని అన్నారు. లౌకిక తత్వాన్ని ఆచరించే దేశ ప్రజలు బిజెపికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా తగిన బుద్ధి చెప్పారని అన్నారు. అయినా కూటమి పార్టీల అండతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టుపెట్టే విధానాలను, తన మత ఉన్మాద చర్యలను ఆపలేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రకృతి వనరులను అడ్డగోలుగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని ఆయన విమర్శించారు. ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం ఆడే విధంగా జెమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధం కావడం అమానుషమని అన్నారు. అది ప్రజాస్వామ్యాన్ని హరించి నియంతృత్వానికి దారి తీస్తుందని మండిపడ్డారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలని, లౌకిక తత్వం ఫెడరలిజం ఫరిడవిళ్లాలని భారత రాజ్యాంగ నిర్మాతలు భావించారని గుర్తు చేశారు. ఆ విధానాలకు తిలోదకాలిస్తూ మతాన్ని రాజకీయాల్లోకి దించి ప్రజల్ని మూఢత్వంలోకి నెట్టే చర్యలకు కేంద్రం పాల్పడుతున్నదని అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో శాంతి సంధులు చేసుకోవడం, సామరస్య వాతావరణాన్ని కాపాడటం ద్వారా 5 లక్షల కోట్ల రూపాయల రక్షణ వ్యయం వృధా కాకుండా దేశ ప్రజల సంక్షేమానికి మిగులుతుందని ఆయన సూచించారు. చైనా భారత్ మధ్య సుహృద్భావ వాతావరణానికి ఇరుదేశాలు సిద్ధమవటం సంతోషకరమని అన్నారు. ఇటువంటి ప్రయత్నాలు ఇరుగుపొరుగు దేశాలన్నిటితో ఏర్పడాలని సిపిఎం కోరుతున్నదని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల మీద ధరల భారాలను కేంద్ర ప్రభుత్వం మోపిందని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇప్పిస్తామనటం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడం లాంటి చర్యలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ విద్యుత్ సర్దుబాటు చార్జీల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదిగత ప్రభుత్వ నిర్ణయమని,ఈ ప్రభుత్వం తప్పించుకో చూడటం తగదని అన్నారు. ఆ ప్రభుత్వం ప్రజల మీద భారాలు మోపే నిర్ణయాలు చేసింది కాబట్టే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని దాన్ని గమనంలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మెలగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు తీవ్ర రూపం దాల్చాయని మద్యం, మత్తుమందులు వీటికి కారకాలుగా ఉంటున్నాయని అన్నారు. వీటి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, మద్యాన్ని నియంత్రించే విధంగా నూతన మద్యం పాలసీని సవరించాలని ఆయన కోరారు. ప్రజల మీద పాలకులు భారాలు మోపితే కచ్చితంగా తమ పార్టీ ఉద్యమిస్తుందని తెలిపారు.
ఈ సభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటేనపల్లి శ్రీనివాసులు, కంకణాల రమాదేవి పాల్గొని ఉపన్యశించారు.
సిపిఎం మండల కార్యదర్శి కేజీ మస్తాన్ గత మూడేళ్ల కాలంలో నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాల నివేదికను ప్రవేశపెట్టారు. హాజరైన ప్రతినిధులు దానిమీద చర్చించి కర్తవ్యాలను రూపొందించుకోవడం జరిగింది.
సభకు ముందుగా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు గడ్డం పిచ్చయ్య ఆవిష్కరించారు.ఇటీవల మరణించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి ముప్పరాజు లక్ష్మమ్మ పూలమాలవేసి,అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లెల కొండయ్య, అంగళకుర్తి చిన్న బ్రహ్మయ్య,వి. రూబెన్, జి.వందనం, యం.చిన్న పేతురు, పుట్టా రామారావు, యల్ పరిశుద్ధం, సుకన్య, సుధాకర్, పి శ్రీను,ఏ.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ ఎస్ రహేమాన్..
👉 ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్.. ఫోన్ చేస్తే రియాక్ట్ కావడం లేదు..*
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పోస్టులపై కీలక చర్చ జరిగింది. కూటమి నేతలు, రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చ లేవనెత్తారు.
కొంతమంది వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లనూ వదిలిపెట్టకుండా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన కొంత మంది అధికారులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పరిస్థితి ఇలానే ఉంటే నిందితులను శిక్షించేదేలా అని ఆయన ప్రశ్నించారు. సమస్యలు వచ్చినప్పుడు కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేస్తే రియాక్ట్ కావడం లేదని ఉప ముఖ్యమంత్రి మండిపడ్డారు. కిందిస్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లపైనా పోస్టులు పెడితే చూస్తూ ఎలా ఊరుకుంటామని అన్నారు. అందుకే తాను రియాక్ట్ అయ్యానని సీఎంకు తెలిపారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గత ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని చంద్రబాబు అన్నారు. వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రికి చెప్పారు. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారనీ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని పవన్‌కు చంద్రబాబు చెప్పారు. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిద్దామని సీఎం అన్నారు. ఇకపై సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు మాటలకు రియాక్టయిన పవన్ కల్యాణ్.. పోలీస్ డిపార్ట్మెంట్‌లో కొంతమంది అవినీతిపరులూ ఉన్నారని చెప్పారు. కొన్ని కేసులు గురించి సరైన ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వడం లేదని సీఎం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఎస్పీలు సీరియస్‌గా పని చేయడం లేదని మండిపడ్డారు. అందరినీ దారిలోకి తీసుకువస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి సూచించారు. తప్పనిసరిగా మనం ఎప్పటికప్పుడు చర్చించి నెల రోజుల్లో అందరినీ దారిలోకి తీసుకువద్దామని పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు చెప్పారు.
ఏపీ క్యాబినెట్ సమావేశంలో వాడీవేడీ చర్చ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పవన్ కల్యాణ్, టీడీపీ అగ్రనేతలు సహా మహిళలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన వారి పని పట్టేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులపైనా చర్యలకు దిగుతోంది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అలాంటి అధికారులను గుర్తించారు. ఇవాళ సాయంత్రం లోగా పలువురు పోలీసు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
👉పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు*
గత ప్రభుత్వం వల్లే పోలీసులు అలా తయారయ్యారు…
వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది…
కొంతమంది డబ్బు తీసుకున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి..నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తా..లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిద్దాం…
👉సోషల్ మీడియా పోస్టుల పైనా ఇక ఉపేక్షేంచేది లేదు : *సీఎం చంద్రబాబు..
2. *ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.*
*ఏపీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్-2024 కు గ్రీన్ సిగ్నల్.* .. *పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖలో 2014 నుంచి 2018 మధ్య పెండింగ్ పనుల బిల్లుల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం.*.. *ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు-2024కు ఆమోదం.*
👉జ్యూవెలరీ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేపీ కొండారెడ్డి , నాగార్జున రెడ్డి..
మార్కాపురం పట్టణంలోని బంగారు షాపుల బజార్ నందు మున్సిపల్ కౌన్సిలర్ బుశ్శెట్టి నాగేశ్వరరావు నూతనంగా ఏర్పాటు చేసిన దినేష్ జ్యువెలరీ షాపును బుధవారం మార్కాపురం మాజీ ఎమ్మెల్యే పెద్దలు కేపీ కొండారెడ్డి మరియు వారి తనయుడు మార్కాపురం తాజా మాజీ ఎమ్మెల్యే , గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ నాగార్జున రెడ్డి ప్రారంభించారు.అనంతరం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారువారి వెంట మార్కాపురం మునిసిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు..
👉ఒంగోలు లోఎస్.హెచ్.జి (SHG) ప్రొఫైలింగ్ యాప్ నిర్వహణ పై నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్ షాప్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా.
👉పొగాకు ప్రత్యామ్నాయ పంటలు*..ప్రకాశం జిల్లా కంభం
మండలంలోని మదారుపల్లె మరియు నర్సిరెడ్డిపల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి గ్రామసభలు ఏర్పాటు చేసి పొగాకు పంట వేసే రైతులతో గ్రామ సభ నిర్వహించి పొగాకు పంటకు బదులుగా కంది మినిమం సెనగ పెసర వంటి అపరాల పంటల సాగును చేసుకోవాలని రైతులకు తెలియజేశారు ఎక్కువగా పొగాకు సాగు చేయడం వలన రైతులు అధిక పెట్టుబడులు పెట్టుకొని తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని ఇంకా ఈ పొగాకు పంట వల్ల క్యాన్సర్ మరియు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడి అయినటువంటి అపరాల పంటలు సాగు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది
అదేవిధంగా సెనగ పంట వేసిన ప్రతి రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ కట్టుకోవలసిందిగా రైతులకు తెలియజేశారు
👉మంచిర్యాల:27 మందికి ఆసుపత్రిని శుభ్రపరచాలని శిక్ష..మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన 27 మందికి బుధవారం న్యాయస్థానం వారం రోజులు జిల్లా కేంద్రంలోని మతా శిశు ఆసుపత్రిలో శుభ్రపరిచే పనులు చేపట్టాలని తీర్పు ఇచ్చింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. సత్యనారాయణ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు.
👉 ఎర్రచందనం కేసులో ప్రమేయం ఉన్న యర్రావారిపాలెం కానిస్టేబుల్ చలమకుంట గురప్ప PC-2958 అరెస్ట్
-2 నెలలు క్రితమే అవినీతి ఆరోపణలతో అదే కానిస్టేబుల్ సస్పెన్షన్ లో కొనసాగుతున్నాడు.
-ఎర్రచందనం కేసు దర్యాప్తులో కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.తిరుపతి నవంబర్ 6:
ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు నమోదు చేసిన ఒక కేసులో , యర్రావారిపాలెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చలమకుంట గురప్ప PC-2958 కు ప్రమేయంతో పాటు కేసులో ఉన్న ముద్దాయిలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.సదరు కానిస్టేబుల్ మరియు A4 ముద్దాయికి మధ్య సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో కూడా నిర్ధారణ అవడంతో ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., ఎస్పీ,తిరుపతి జిల్లా మరియు రెడ్ సెండెల్ టాస్క్ ఫోర్స్ (RSASTF) ఆదేశాల మేరకు పోలీసులు సదరు కానిస్టేబుల్ ను అరెస్టు చేశారు.ఇప్పటికే అదే కానిస్టేబుల్ 2 నెలల క్రితం అవినీతి కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెన్షన్ లో కొనసాగుతున్నాడు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?