కాశ్మీర్ ఎన్నికలలో కొట్టొచ్చిన మార్పు.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు వ్యాఖ్యలు- వైయస్ షర్మిల.. “జానీ మాస్టర్ అరెస్టు..రేషన్ డీలర్ల పై ఫిర్యాదు చేసిన వినుకొండ సీపీఐ నాయకులు

👉 సీఎం చంద్రబాబుఫై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం.. ఈ వ‌య‌సులో చంద్ర‌బాబు ప‌నిచేస్తున్న తీరు నాకు ఆశ్చ‌ర్యం వేస్తుంది.క్యాబినెట్ మీటింగ్ లో అన్ని గంట‌లు కూర్చుంటే అస‌లు ఓపిక ఎక్క‌డి నుండి వ‌స్తుందో ఆయ‌న బుర‌ద‌లోకి దిగి న‌డుస్తుంటే విమ‌ర్శ‌లు… కానీ ఆయ‌న పాల‌నా యంత్రాంగాన్ని న‌డిపించారు.స్థానిక సంస్థ‌ల్లో వైసీపీ ఉంది..ఏమైపోయారనీ ప్రశ్నించారు.

👉బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించిన ప్రభుత్వం*తెలంగాణ డీజీపీ జితేంద‌ర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామ‌క ప‌త్రం అందుకున్న నిఖ‌త్‌ జ‌రీన్‌

👉 గుంటూరు జిల్లా ట్రాఫిక్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన N .రమేష్
👉 గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్ డి ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన సీతారామయ్య..
👉కశ్మీర్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా.. తొలిదశలో 61శాతం పోలింగ్ ఆసక్తికర అంశం ఏమంటే.. తొలిదశ పోలింగ్ లో ఏకంగా 61 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆసక్తికర పరిణామం కశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కనిపిస్తోంది. ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయటం.. ఓటేయటం నేరంగా భావించేవారు. ఎంత ప్రయత్నం చేసినా ఎన్నికల పోలింగ్ మొత్తంగా పాతిక శాతానికి కూడా మించేది కాదు. అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ బుధవారం ముగిసింది. ఆసక్తికర అంశం ఏమంటే.. తొలిదశ పోలింగ్ లో ఏకంగా 61 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఒక్క అంశం చాలు.. కశ్మీర్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదని చెబుతున్నారు. నల్గొండ పార్టీ ఆఫీస్ విషయంలో బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు ఇదే తాజాగా నమోదైన పోలింగ్ శాతం గడిచిన 35 ఏళ్లలో ఇదే అత్యధికంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పీకే పోలె మీడియాకు వెల్లడించారు. కిశ్త్ వాద్ జిల్లాలో అత్యధికంగా 77 శాతం పోలింగ్ నమోదు అయితే.. పుల్వామాలో అత్యల్పంగా 46 శాతం ఓటింగ్ నమోదైంది. తాజాగా వెలువడిన పోలింగ్ శాతం కంటే ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం బ్యాలెట్ల వివరాలు మారుమూల ప్రాంతాల నుంచి తుదినివేదికలు రావాలని చెబుతున్నారు. తొలి దశలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. మిగిలిన 66 నియోజకవర్గాల్లో పోలింగ్ సెప్టెంబరు 25న, అక్టోబరు ఒకటిన రెండు.. మూడుదశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ను చూసినప్పుడు కశ్మీర్ లోమార్పు కొట్టొచ్చినట్లు కనిపించటమే కదు.. ఓట్లు వేయటానికి గతంలో జనమే వచ్చే వారుకాదు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గతంలో మాదిరి జనం రాక.. పోలింగ్ ను నిర్వహించేందుకు ఉద్యోగులు ఏ మాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవటమే కాదు.. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
👉👉తిరుమలను అపవిత్రం చేస్తూ,హిందువుల మనోభావాలను,దెబ్బతీసేలా …టీడీపీ,వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి..వైఎస్ షర్మిలా రెడ్డి.APCC చీఫ్.. సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయి.
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి.చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే..నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే… తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి. లేదా CBI తో విచారణ జరిపించండి.మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి.మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
👉లైంగిక వేధింపులు కేసులో నిందితుడు గా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు..*
👉 బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ SOT పోలీసులు ..
👉రేషన్ డీలర్ల పై తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన సీపీఐ నాయకులు. *వినుకొండ*
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారిందని నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అన్నారు… పట్టణంలో లబ్ధిదారులకు రేషన్ బియ్యనికి బదులు డబ్బులు ఇస్తాం తీసుకోవాల్సిందే అంటూ గత కొద్ది నెలలుగా రేషన్ కార్డు దారులను రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందుల గురి చేస్తుండడంతో… బుధవారం సీపీఐ పార్టీ నాయకులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ… గత మూడు నెలలుగా రేషన్ బియ్యానికి బదులు డబ్బులు తీసుకోవాల్సిందే
నంటూ కార్డుదారులను రేషన్ డీలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని… ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు డబ్బులు ఇస్తుందా బియ్యం ఇస్తుందా అని అయన అధికారులను నిలదీశారు… దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు రెండు పూటల ఆహారం అందించాలనే తలంపుతో ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చాయని అయితే ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరగాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష ధోరణితో వ్యవహరిస్తున్న కారణంగా యం డి యు నిర్వాహకుడి తో వేలుముద్రలు వేయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బియ్యనికి బదులు డబ్బులు తీసుకుంటే తీసుకోండి లేదంటే మీ ఇష్టం వచ్చింది చేస్కోండి… అంటూ కొందరు రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నార న్నారు. ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన అందించాలని పదేపదే చెబుతుంటే… రేషన్ డీలర్లు మాత్రం బియ్యం దగ్గర అవినీతి మయం చేస్తున్నారని ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పట్టణంలోని ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రు లకు అర్జీలు పెట్టిస్తామని అధికారులను హెచ్చరించారు.

7k network
Recent Posts

వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా?..ఉండదా?.. ఒక్కమాటలో తేల్చేసిన సీఎం చంద్రబాబు..త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో వైకాపా విలీనం ఖాయం: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు..పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించిన జెవి.సంతోష్.. వరద బాధితులకు కమలా విద్యాసంస్థల విరాళం..కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు..రేషన్ మాఫియా ఇరువర్గాల ఆదిపత్య పోరులో ఒకటి పట్టుకోబోతే, మరోటి దొరికింది.. సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల

కాశ్మీర్ ఎన్నికలలో కొట్టొచ్చిన మార్పు.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు వ్యాఖ్యలు- వైయస్ షర్మిల.. “జానీ మాస్టర్ అరెస్టు..రేషన్ డీలర్ల పై ఫిర్యాదు చేసిన వినుకొండ సీపీఐ నాయకులు

ఎం ఎస్ ఎం ఈ, పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ ..ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పార్థసారథి.. సీఎంకు దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఎమ్మెల్యే దామచర్ల, ఎమ్మెల్యే ముత్తుముల..విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్.. కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ దాడి.. ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల..జిల్లా ఎస్పీని కలిసిన కంభం సీఐ.

చంద్రబాబుకు మోడీ వెన్నుపోటు..కూటమి సర్కార్‌ కూలడం గ్యారెంటీ ?.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సీఎం రేవంత్..విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు రూ.3,000 కోట్లు..పాత బకాయిలు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి..వైసీపీకి బాలినేని రాజీనామా..వరద ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం..రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి..కె.మల్లికార్జున..భారీగా పెరిగిన వంట నూనె ధరలు..ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు దారుణం..కంభం సిఐగా కే మల్లికార్జున

ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా..కూల్చివేతలు చేపట్టవద్దన్న సుప్రీం కోర్టు..వివేకా కుమార్తె రిక్వెస్ట్ – సరేనన్న చంద్రబాబు..సిఎం సహాయ నిధికి సీనియర్ జర్నలిస్టు అంకబాబు 5 లక్షల విరాళం..విశాఖలో దారుణ హత్య కలకలం..కర్రకు మృతదేహాన్ని కట్టి 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

రాహుల్ నాలుక కోస్తే రూ.11 లక్షలిస్తా..శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉంది-మంత్రి పొంగూరు..వరద బాధితుల సహాయ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పి షేక్షావలి..తప్పుగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తే ఏడేళ్ల జైలు శిక్ష..సబ్‌-రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రెడ్‌కార్పెట్లు కనపడవ్‌..జర్నలిస్ట్ ల భద్రతా,సంక్షేమమే ప్రధాన లక్ష్యం గా జె డి ఆర్ ఎఫ్.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా..గణేశుని లడ్డూ రూ.2,08,000 లక్షలకు కైవసం