ఢిల్లీ డ్రగ్స్ వెనుక అంతర్జాతీయ మాఫియా!…. నలుగురు పాకిస్థానీ పౌరుల అరెస్టు .. లంచావతారమెత్తిన ముగ్గురు సీఐలు 13 మంది ఎస్ఐల పై వేటు.చెరువుల FTL హద్దులు మార్చనున్న ప్రభుత్వం..ఓ ప్రైవేటు హాస్టల్‌లో విద్యార్థుల ఆందోళన..రైల్వే స్టేషన్ల అబివృద్ది మరియు బ్రిడ్జీల పనులు పూర్తికి gm హామీ-ఎంపీ మాగుంట..చెత్త పన్ను ఎత్తివేయటం హర్షణీయం..డాక్టర్ గొట్టిపాటి..వైసీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు బూచేపల్లి కి తోడ్పాటును ఇస్తాం..నారా లోకేష్ ను,లీడ్ క్యాప్ చైర్మన్ ను కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.

👉ఢిల్లీ డ్రగ్స్ వెనుక అంతర్జాతీయ మాఫియా.. మళ్లీ వెలుగులోకి వచ్చిన వీరేంద్ర..కేసులో ప్రధాన నిందితుడిగా తుషార్ కోయల్ తో వీరేంద్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ డ్రగ్స్ వెనుక అంతర్జాతీయ మాఫియా.. మళ్లీ వెలుగులోకి వచ్చిన వీరేంద్ర.. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై అనుమానాలు???
మనదేశంలో డ్రగ్స్ ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పట్టుబడిన కొన్ని వేల కోట్ల రూపాయల విలువచేసే కొకైన్‌ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ ముఠా ఉన్నట్టు టాక్. దర్యాప్తులో దుబాయ్ లో ఉంటున్న వీరేంద్ర బసొయా ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ గా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తుషార్ కోయల్ తో వీరేంద్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసు విషయంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఐదో నిందితుడైన జితేంద్ర పాల్ సింగ్ యూకే కి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో గురువారం అమృత్సర్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.జితేంద్ర పాల్ సింగ్ అలియాస్ జెస్సీ గత 15 సంవత్సరాలుగా యూకే లో నివాసం ఉంటున్నాడు. అయితే తాజాగా భారత్ లోని డ్రగ్స్ బిజినెస్ కోసం అతను పంజాబ్ కు వచ్చాడు.
ఢిల్లీలో డ్రగ్స్ కేసు విషయంలో జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో భయపడిన జెస్సి యూకే కి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు అతను దొరికిపోయాడు. ఇటీవల పట్టుబడిన నిందితులను పోలీసులు గట్టిగానే విచారించారు.. వారి విచారణలో దుబాయిలో ఉన్న వీరేంద్ర హిస్టరీ బయటపడింది. అంతేకాదు గత సంవత్సరం పూనేలో మూడు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో కూడా వీరేంద్ర హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.కానీ తీరా పోలీసులు అతన్ని అరెస్టు చేయడానికి ఢిల్లీ, పిలాంజిలోని అతని ఇంటిపై దాడి చేసేటప్పటికి అతడు పారిపోయాడు. గతంలో వీరేంద్ర కొడుకుని కూడా పోలీసులు డ్రగ్స్ కేస్ విషయంలో అరెస్టు చేశారు.👉👉 అయితే వెంటనే అతను పేల్ పై బయటకు కూడా రావడం జరిగింది. గత ఏడాది వీరేంద్ర కొడుకు పెళ్లి యూపీ కి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూతురుతో జరిగింది.
ఇక ఢిల్లీలో లాభం లేదని ఫిక్సయిన వీరేంద్ర తన మకాం దుబాయ్ కి మార్చి అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ తో కలిసి స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు.ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి వచ్చే ప్రతి కొకైన్‌ కన్సైన్మెంట్ కు మూడు కోట్ల రూపాయల చొప్పున ఇస్తాను అని తుషార్ గోయల్ తో వీరేంద్ర ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది.దేశవ్యాప్తంగా గంజాయి మాఫియా యువతను మత్తులో చిత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల అండదండల వల్లే గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
👉నారా లోకేష్ ను కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..*విజయవాడ : సచివాలయంలోని మినిస్టర్స్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అంశాల పై చర్చించారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకారం అందించాలని వారిని కోరగా అందుకు లోకేష్ సానుకూలంగా స్పందించారు..*
👉లీడ్ క్యాప్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీడ్ క్యాప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పిల్లి మాణిక్యాల రావుకి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుభాకాంక్షలు తెలియచేశారు. శుక్రవారం ఉదయం తాడేపల్లె లోని లీడ్ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాల రావుకి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు శుభాకాంక్షలు తెలిపారు.*
👉 లంచావతారమెత్తిన ముగ్గురు సీఐలు 13 మంది ఎస్ఐల పై వేటు*..హైదరాబాద్:
లంచాల కోసం ఇసుక బకాసురులతో దోస్తీ కడుతున్న ముగ్గురు సిఐలు 13 మంది ఎస్ఐలను వీఆర్ కు అటాచ్ చేస్తూ మల్టీ జోన్ 2 ఐజి వీ,సత్య నారాయణ, గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు..అక్రమాల్లో భాగం కావడం, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు పలువురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. తెలంగాణలో మల్టీజోన్-2లోని 9 జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో విఫలమైన పోలీస్ అధికారులను వీఆర్ లో ఉంచారు. ఉంచిన వారిలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ సీఐలతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్ఐలు ఉన్నారు. వీరిలో ఇసుక అక్రమ రవాణాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఐజీ వెల్లడించారు.త్వరలో వారిని లూప్లైన్కు బదిలీ చేయనున్నట్లు చెప్పారు. కాగా, ఇప్పటికే ఒక సీఐ, 14 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. వికారాబాద్ జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణా,అక్రమ పీడీఎస్ బియ్యం రవాణా, మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కీలక కేసుల్లో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కథనాలు రావడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.
*👉చెరువుల FTL హద్దులు మార్చనున్న ప్రభుత్వం !*
హైదరాబాద్ రియల్ఎస్టేట్ కు పెద్ద సమస్యగా మారిన చెరువుల బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ విషయంలో వస్తున్న అనేక అభ్యంతరాలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం ముందుగా ఫుల్ ట్యాంక్ లెవల్ హద్దులను పునర్‌ నిర్వహించాలని నిర్ణయించింది. చాలా కాలం కిందట ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్ణయించారు. వాటిపై అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు హైడ్రా దూకుడుతో… అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్‌లో ఉన్న ప్రధానమైన 71 చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్స్ పై సర్వే చేయించాలని.. కొత్త ఎఫ్‌టీఎల్‌ను ఖరారు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ముందుగా ముసాయిదా రిలీజ్ చేసిన తర్వాత ప్రజల అభ్యంతరాలు, సలహాలు,సూచనలు తీసుకుంటారు. ఫైనల్ గా అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్ హద్దులను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎఫ్‌టీఎల్ లోప ల ఉన్న భవనాలను నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎఫ్‌టీఎల్ పరిధిలో లేనివి కొత్తగా వచ్చే అవకాశం లేదని కానీ చెరవుకు దూరం గా ఉండి. .ఎఫ్‌టీఎల్ జోన్ లో ఉన్నట్లుగా రికార్డుల్లో ఉన్న వారికి మాత్రం ఊరట లభిస్తుందని అంటున్నారు.
ఎఫ్‌టీఎల్ ఖరారు చేస్తే ఆటోమేటిక్ గా బఫర్ జోన్ కూడా ఖరారవుతుంది. హైదరాబాద్ లో చెరువులు ఎక్కువ. సుదూరంగా చెరువు కనిపిస్తూందంటే ఇప్పుడు అక్కడ కొనుగోలు చేయడానికిచాలా మంది వెనుకడుగు వస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఈ అంశానికి అధికారికమైన క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొనుగోలుదారులకు భరోసా లభిస్తుంది.
👉 బెంగళూరు శివార్లలో నలుగురు పాకిస్థానీ పౌరుల అరెస్టు ..పాకిస్తాన్ బోధకుడు రషీద్, అతని భార్య మరియు కుటుంబం ‘శర్మ’ పేరుతో నకిలీ హిందూ ఐడెంటిటీలను ఉపయోగించి భారతదేశంలో 10 సంవత్సరాలు నివసించారు: బెంగళూరులో అరెస్టు..బెంగళూరు శివార్లలో నలుగురు పాకిస్థానీ పౌరులను అధికారులు అరెస్టు చేశారు . వీరు నకిలీ గుర్తింపుతో పదేళ్లుగా భారత్‌లో నివాసం ఉంటున్నారు. నిందితులను రషీద్ అలీ సిద్ధిఖీ (48), అతని భార్య అయేషా (38), ఆమె తల్లిదండ్రులు హనీఫ్ మహ్మద్ (73), రుబీనా (61)లుగా గుర్తించారు. వీరు శంకర్ శర్మ, ఆశా రాణి, రామ్ బాబు శర్మ, రాణి శర్మ అనే మారుపేర్ల కింద రాజ్‌పురా గ్రామంలో ఉంటున్నారు.
బెంగళూరు శివార్లలోని జగనిలో సోదాలు నిర్వహించారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు పాకిస్థానీలను పట్టుకున్న తర్వాత ఇంటెలిజెన్స్ సిబ్బంది అందించిన సమాచారం ఆధారంగా ఈ చర్య జరిగింది. ఢాకా నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ పాస్‌పోర్టులను ఉపయోగిస్తున్నట్లు గుర్తించడంతో పాక్ జాతీయులు పట్టుబడ్డారు. వీరంతా సిద్ధిఖీ బంధువులని విచారణలో తేలింది. పోలీసుల విచారణ అధికారులు రషీద్ అలీ సిద్ధిఖీ వద్దకు వెళ్లింది.
ఈ జంట బెంగళూరుకు మకాం మార్చడానికి ముందు 2014లో ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. సిద్ధిఖీ మరియు అయేషా వివాహం చేసుకున్న కుటుంబం గతంలో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో నివసించింది.
సిద్ధిఖీ కుటుంబం నివాసం విడిచి వెళ్లేందుకు ప్యాకింగ్‌ చేస్తుండగా, వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు స్క్వాడ్‌ వచ్చింది. ప్రశ్నించగా, తాను 2018 నుంచి బెంగళూరులో ఉంటున్నానని సిద్ధిఖీ అంగీకరించాడు. హిందూ పేర్లతో ఉన్న కుటుంబానికి చెందిన భారతీయ పాస్‌పోర్ట్‌లు మరియు ఆధార్ కార్డులను కూడా చూపించాడు. ఇంటి గోడలపై “మెహదీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ జహసన్-ఎ-యూనస్” అని రాసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారు ఇస్లామిక్ మత గురువుల చిత్రాలను కూడా కనుగొన్నారు.
సిద్ధిఖీ ఇండియాలో ఎలా అడుగుపెట్టాడు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, సిద్ధిఖీ విచారణలో అతను మరియు అతని కుటుంబం పాకిస్తాన్ నుండి వచ్చినట్లు ధృవీకరించారు . అతని భార్య మరియు ఆమె కుటుంబం లాహోర్‌కు చెందినవారు మరియు అతను కరాచీలోని లియాఖతాబాద్‌కు చెందినవారు. అయేషా తన తల్లిదండ్రులతో కలిసి బంగ్లాదేశ్‌లో ఉన్నప్పుడు 2011లో తనకు వాస్తవంగా వివాహం జరిగినట్లు అతను వెల్లడించాడు. పాకిస్థాన్‌లో మత పెద్దల వేధింపుల కారణంగా తాను బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సి వచ్చిందని సిద్ధిఖీ తెలిపారు. అతను బంగ్లాదేశ్‌లో బోధకుడిగా పనిచేశాడు మరియు మెహదీ ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా మద్దతునిచ్చాడు, మొదటి సమాచార నివేదిక ప్రకారం.
అయితే, సిద్ధిఖీ 2014లో బంగ్లాదేశ్‌లో దాడులను ఎదుర్కొన్నాడు. ఫలితంగా, అతను భారతదేశంలోని మెహదీ ఫౌండేషన్ నుండి పర్వేజ్‌తో పరిచయం పెంచుకున్నాడు మరియు చట్టవిరుద్ధంగా దేశానికి మకాం మార్చాడు. అనంతరం సిద్ధిఖీ, అతని భార్య, అత్తమామలు, బంధువులు మహమ్మద్‌ యాసిన్‌ అలియాస్‌ కార్తీక్‌ శర్మ, జైనాబీ నూర్‌ అలియాస్‌ నేహా శర్మ మధ్యవర్తుల సహకారంతో బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మీదుగా భారత్‌కు వెళ్లారు.2018లో తాను నేపాల్‌కు వెళ్లిన సమయంలో అక్కడ బోధించాల్సిందిగా స్థానికులు వసీం మరియు అల్తాఫ్‌లు అభ్యర్థించడంతో బెంగళూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అల్రా టీవీలో ఇస్లాం ప్రచార ప్రసారాల కోసం మెహదీ ఫౌండేషన్ అతనికి పరిహారం అందించగా, అల్తాఫ్ అద్దెను నిర్వహించాడు. అదనంగా, అతను ఆహార పదార్థాలను విక్రయించాడు మరియు గ్యారేజీలకు నూనెలను సరఫరా చేశాడు. అతని అత్తమామలు బెంగళూరులో బ్యాంకు ఖాతాలు కూడా తెరిచారు. బంగ్లాదేశ్ నుండి తన “హ్యాండ్లర్స్” ద్వారా “తన నాయకుడి మత బోధనలను ప్రోత్సహించడానికి” బెంగళూరుకు పంపించినట్లు సిద్ధిఖీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు ఏం చెప్పారు
ఒక పోలీసు అధికారి తెలియజేసారు , “మా జిగాని ఇన్‌స్పెక్టర్ ఒక విషయంపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నకిలీ పత్రాల సాయంతో ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి ఆ నలుగురిని విచారిస్తున్నారు. విచారణ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కుటుంబం నకిలీ పత్రాలు సంపాదించి జిగానిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గత ఆరేళ్లుగా అద్దెకు ఉంటూ గడిపింది.
మెహదీ ఫౌండేషన్ తరపున సిద్ధిఖీ ఉపన్యాసాలు ఇచ్చిన ఢిల్లీలో మొదట్లో నివసిస్తుండగా ‘శర్మ’ కుటుంబం అని తప్పుడు గుర్తింపుతో డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులు పొందారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.వారి గురించిన వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వారు గ్యారేజీకి మెటీరియల్‌ని సరఫరా చేస్తున్నారు, కానీ అది దర్యాప్తు చేయవలసి ఉంది. అధికారుల ప్రకారం, సిద్ధిఖీ స్లీపర్ సెల్‌లో సభ్యుడు కావచ్చు. “ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను పాకిస్తాన్‌లో ఉన్న నా బంధువులను పిలుస్తాను” అని అతను పోలీసుల ముందు వెల్లడించాడు.
భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 468 (మోసం చేయాలనే ఉద్దేశ్యంతో ఫోర్జరీ), 471 (నకిలీ డాక్యుమెంట్ లేదా ఎలక్ట్రానిక్ రికార్డును ఉపయోగించడం) మరియు 420 (చీటింగ్) కింద అలాగే పాస్‌పోర్ట్ చట్టం కింద కేసు నమోదు చేయబడింది. . ఇటీవల బంగ్లాదేశ్‌కు వెళ్లి తమ మత గురువును కలిసేందుకు వెళ్లి చెన్నై మీదుగా తిరిగి వస్తున్న మహమ్మద్ యాసిన్, అతని భార్య జైనాబ్ నూర్, అల్తాఫ్ అహ్మద్ మరియు అతని భార్య ఫాతిమా గోహర్‌లను ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నప్పుడు ఈ రాకెట్ బయటపడింది.
👉మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు..
ఇల్లంతకుంట కేంద్రంలో న్యూట్రీషన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి అమ్మితే లాభాలు వస్తాయంటూ ముగ్గురు వ్యక్తుల వద్ద రూ. 9, 00, 000 వసూలు చేసి చీటింగ్ చేసిన ఇద్దరు వ్యక్తుల పై మరియు ఏజెంట్ల పై కేసు నమోదు చేయడం జరిగిందని ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శుక్రవారం ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
👉 ఓ ప్రైవేటు హాస్టల్‌లో విద్యార్థుల ఆందోళన..
హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్టల్ లో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ అశోక్ నగర్ ప్రధాన రహదారిలో బంధవి హాస్టల్ ముందు విద్యార్థుల నిరసన తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని.. చెడిపోయిన కూరగాయలు పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని విద్యార్థుల ఆరోపించారు. ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోలేదు యాజమాన్యం. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సర్ధి చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించుకున్నారు
👉రైల్వే స్టేషన్ల అబివృద్ది మరియు బ్రిడ్జీల పనులు పూర్తికి జనరల్ మేనేజరు హామీ –
విజయవాడలోని రైల్వే ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ లో పార్లమెంటు సభ్యులతో రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సమక్షంలో రైల్వే అధికారులు ఏర్పాటు చేచేసిన సమావేశంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి పలు సమస్యలపై మాట్లాడినారు.
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని
1.ఒంగోలు – దొనకొండ నూతన రైలుమార్గం,
2.కంభం – పోరుమామిళ్ళ నూతన రైలుమార్గం,
3.నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణం సత్వర పూర్తితోపాటు
4.పొదిలి మరియు మర్రిపూడి స్టేషన్లను సదరు రెండు పట్టణాలకు దూరంగా కాకుండా దగ్గరగా నిర్మాణం,
5.అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు, మరియు. 5 రైల్ ఓవర్ బ్రిడ్జీలు – 3 లిమిటెడ్ సబ్ వేలు నిర్మాణం – ముఖ్యంగా ఒంగోలు స్టేషన్ అగ్రహారం గేటు LC. No. 207 వద్ద లిమిటెడ్ సబ్ వే సత్వర నిర్మాణంతోపాటు
6.ఒంగోలులో రైల్వే స్థలంలో ఇండ్లు నిర్మించుకొన్న గుడిసెవాసుల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరినారు.
7.ఒంగోలు లో కేరళ express, అయోధ్య- రామేశ్వరం స్పెషల్ ట్రైన్ తో పాటు టంగుటూరు, సింగరాయకొండ, దొనకొండ, కురిచేడు స్టేషన్ లలో పలు రైళ్లు నిలపాలని కోరినారు. 8 ⁠సేతు బంధన్, గతి శక్తి ప్రాజెక్ట్ లలో నిర్మిస్తున్న పలు రైల్వే ఓవర్ బ్రిడ్జి లు మరియు రైల్వే అండర్ బ్రిడ్జి లు త్వరతగతిన పూర్తి చెయ్యాలని కోరినారు.
దానికి రైల్వే జనరల్ మేనేజరు మరియు విజయవాడ డివిజనల్ మేనేజరు సానుకూలంగా స్పందించి అన్ని పనులు పూర్తిచేయుటకు హామీ ఇచ్చినారు.
👉 మార్కాపురం బస్టాండ్ లో రెండు నూతన ఇంద్ర బస్సులను ప్రారంభించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి..
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం ఆర్టీసీ డిపో కు చెందిన రెండు ఇంద్ర నూతన బస్సులను మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన స్వయంగా బస్సులను కొంతసేపు నడిపి ప్రజలను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్టీసీ డిఎం , మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
👉నారా లోకేష్ ను కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*..*విజయవాడ : సచివాలయంలోని మినిస్టర్స్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అంశాల పై చర్చించారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకారం అందించాలని వారిని కోరగా అందుకు లోకేష్ సానుకూలంగా స్పందించారు..
👉చెత్త పన్ను ఎత్తివేయటం హర్షణీయం..పేదల పక్షపాతి చంద్రబాబునాయుడు..
ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వంగా మరోసారి నిరూపణ..డా.గొట్టిపాటి లక్ష్మీ..
పేదల పక్షపాతి చంద్రబాబునాయుడు అని మరోసారి నిరూపితం అయ్యిందని,చెత్త పన్ను వసూళ్లను కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఆ మాట ప్రకారం చెత్త పన్నును ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించటం హర్షనీయమని దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. చెత్తపన్ను తొలగింపు పై ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చెత్త పన్ను వసూళ్లను మొదటి నుంచి టీడీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కరోనా వేళ వినియోగ రుసుముల వసూళ్ల ప్రతిపాదనలను టీడీపీ, జనసేనలు వ్యతిరేకించారు. అయినప్పటికీ వ్యతిరేకతను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోయిందని, ఇది పేద ప్రజలకు తీవ్ర భారంగా మారిందన్నారు. చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున వసూలు చేసేదని, ఇలా ఏటా రూ.200 కోట్లు వసూలు చేసేదన్నారు.దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తమ ప్రభుత్వం రాగానే చెత్త పన్ను వసూలు చేయమని హామీ ఇచ్చారని, ఈ హామీని నిలుపుకున్నదని, ఇది మంచి ప్రభుత్వం అనటానికి ఇదే ఉదాహరణ అని డా.గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు.
👉 తహసిల్దార్ పై తిరగబడ్డ స్థానిక ప్రజలు*
ప్రకాశం జిల్లా, తర్లుపాడు తహసిల్దార్ జయవర్ధన్ పై స్థానిక ప్రజలు తిరగబడ్డారు. క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు గత కొద్దిగ రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాసిల్దార్ జయవర్ధన్ సర్టిఫికెట్లు త్వరగా ఇచ్చేలా చూస్తామనడంతో స్థానికులు నిరసన విరమించారు.
👉వైసీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు బూచేపల్లి కి తోడ్పాటును ఇస్తాం… నాయకులు,కార్యకర్తలు*అధైర్యపడాల్సిన పనిలేదు..బూచేపల్లి’ పదవీ స్వీకార కార్యక్రమంలో..* *అన్నా రాంబాబు..*అధికారం లేనిసమయంలో,కష్టకాలంలో జగనన్న మాటను శిరోధార్యంగా భావించి, పిన్న వయసులో ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన డా.శివ ప్రసాద రెడ్డికి సంపూర్ణ మద్దతు, తోడ్పాటును ఇస్తామని మాజీ ఎమ్మెల్యే,*
*మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త అన్నా రాంబాబు ప్రకటించారు.*ఒంగోలు నూతన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా అధ్యక్ష పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పాల్గొని రాంబాబు మాట్లాడారు.**క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన దర్శి ఎమ్యెల్యే డా. బూచేపల్లి సమర్ధవంతంగా పార్టీని జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో నడప గలరనే విశ్వాసం ఉందన్నారు.**ఇకపై జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఉత్తేజంతో పని చేయాలని పిలుపునిచ్చారు.* *ప్రజాసమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసేందుకు పార్టీ అధిష్టానం,జిల్లా నాయకత్వం పనిచేస్తుందన్నారు.

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.