తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

👉 ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం.
*సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వశేషాద్రి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వి.శివధర్ రెడ్డి,ఎస్ ఐ బీ ఐజీ బి‌‌‌.సుమతి.

*👉సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెక్కులు పంపిణీ చేసిన:డిప్యూటీ సీఎం భట్టి..
హైదరాబాద్:అక్టోబర్ 07..సింగరేణి కార్మికులకు ప్రజా భవన్ వేదికగా బోనస్ చెక్కుల పంపిణీ కార్య క్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కార్మికులు బోనస్ చెక్కులు అందుకున్నారు. ఈ ఏడాది సింగరేణికి రూ.2412 కోట్ల లాభం రాగా.. అందులో 33 శాతం అంటే రూ.796 కోట్ల ను కార్మికులకు ప్రభుత్వం బోనస్‌గా ప్రకటించిన సంగతి తెలిసందే.
దాదాపు 42 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1.90 లక్షల చొప్పున బోనస్‌గా అందుకుంటు న్నారు. సింగరేణిలో పనే చేసే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ ఏడాది రూ. 5 వేల బోనస్ ప్రకటించారు. చెక్కుల పంపిణీ కార్యక్ర మంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి.. సంస్థలో ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ఎంప్లాయీస్‌ మధ్య ఖర్చు విషయంలో వ్యత్యాసం చాలా ఉందని అన్నారు.
తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రమదోపి డీని సహించదని అన్నారు. అందుకే ఈ వ్యత్యాసాన్ని తగ్గించడంపై తమ ప్రభు త్వం దృష్టి సారిస్తుందని అన్నారు. సింగరేణిలో మినిమం వేజెస్ పెంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
అవసరమైతే ప్రత్యేకంగా ఓ కమిటీ వేసి కాంట్రాక్ట్, రెగ్యులర్ ఎంప్లాయీస్ మధ్య ఉండే వేతనాల వ్యత్యాసాన్ని తగ్గించడానికి తమవంతుగా ప్రయత్ని స్తామని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. సింగరేణి గనుల్లో పని చేసే కార్మికులు వైద్యం కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా చూస్తామన్నారు.
సింగరేణి భూమిని కేటాయిస్తే.. అక్కడ యంగ్ ఇండియా ఇంగిగ్రేటెడ్ స్కూల్స్‌ని పైలెట్ ప్రాజెక్ట్‌గా కింద నిర్మిస్తామని అన్నారు. పెన్షన్ విషయంలోనూ అధ్యయనం చేస్తామని.. ప్రస్తుతం రూ.8 లక్షలుగా ఉన్న పెన్షన్‌ను రూ.10 లక్షల వరకు పెంచేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు..
👉 ఉం.,కొన్న దానితో తిరుమల కొండమీద .. ViP దర్శనo,..స్వాగతలు,..సెల్ఫీ లు.. మారరా…! అని mlc దువ్వాడ పై నెట్ ఇంట్లో సెటైర్లు..
👉 మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..!!!మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్‌ అరోఢా నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. భూ అక్రమాల వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. పంజాబ్‌లోని లూధియానాలో గల ఎంపీ నివాసం, కార్యాలయంతో పాటు ఇతర వ్యక్తుల ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోమవారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు.
👉 దేవాదాయశాఖ అధికారి చేతివాటం..
కర్నూలు జిల్లా కాల్వబుగ్గ ఆలయంలో దేవాదాయశాఖ అధికారి చేతివాటం చూపించారు. ఈవోగా ఆలయ బాధ్యతలు స్వీకరించగానే బ్యాంకులో పర్సనల్ అకౌంట్ తెరిచాడు. గత ఐదేళ్లుగా ఆలయానికి వచ్చిన నగదు, కానుకలను ఆ ఖాతాకే మళ్లించాడు. ఆ నగదు మొత్తాన్ని ఈవో స్వాహా చేశాడు. రూ. కోటి 30 లక్షల వరకు నగదు మళ్లించినట్లు సమాచారం. వేరే ఆలయానికి బదిలీ అయ్యే సమయంలో బ్యాంక్ అకౌంట్ మూసివేసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
👉మంత్రాల నెపంతో మహిళా సజీవ దహనం
తెలంగాణ – రామాయంపేట
మంత్రాలు చేస్తున్నదన్న నెపంతో ఓ మహిళపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కాట్రియాలలో జరిగింది. గురువారం రాత్రి గ్రామానికి చెందిన ధ్యాగల ముత్తవ్వ(50) అమావాస్య రోజు మంత్రాలు చేయడం వల్ల, తమ కుటుంబ సభ్యురాలు అనారోగ్యం పాలైందని కోపోద్రిక్తులై ఆమెను విపరీతంగా కొట్టారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ముత్తవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రాల నెపంతో తీవ్రంగా కొడుతున్న సందర్భంలో, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప ఆపడానికి ప్రయత్నం చేయకపోవడం విచారకరం. వరుసగా రెండు రోజులు రామాయంపేట మండలంలో మంత్రాల నెపంతో దాడులు జరగడాన్ని దృష్టిలో పెట్టుకుని, పోలీసులు అవగాహన కార్యక్రమంలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కాట్రియాలలో జిల్లా ఎస్పీ పర్యటన
కాట్రియాలలో మంత్రాల నెపంతో సజీవ దహనం సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గ్రామంలో పర్యటించారు. ముత్తవ్వను కొట్టి చంపిన కేసుపై విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు డీఎస్పీ వెంకటరెడ్డి, సిఐ వెంకట రాజా గౌడ్ తదితరులున్నారు.
👉గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నియమించిన సందర్భంగా ఢిల్లీ లోని పార్లమెంట్ భవనం లోని మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన కమిటీ మీటింగ్ లో పాల్గొన్న కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల పరిచయ కార్యక్రమం మరియు పలు అంశాలపై చర్చించినారు.
👉 ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది: నటి జెత్వానీ..
గత ప్రభుత్వ హయాంలో తీవ్ర వేధింపులకు గురైన ముంబయి నటి జెత్వానీ..
ఏపీలో ప్రభుత్వం మారాక పరిస్థితుల్లో మార్పు..
జెత్వానీ ఫిర్యాదుతో ముగ్గురు ఐపీఎస్ లపై వేటు..
తప్పుడు కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ అరెస్ట్
నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న జెత్వానీ
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో, తీవ్ర వేధింపులకు గురైన ముంబయి నటి కాదంబరి జెత్వానీ… రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఊపిరి పీల్చుకుంది. ఆమె ఫిర్యాదుతో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. తప్పుడు కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. .
కాగా, నటి జెత్వానీ తాజాగా విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవ స్ఫూర్తి వెల్లివిరుస్తోందని తెలిపారు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించానని వెల్లడించారు. ఎంతగానో సహకరిస్తున్న ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని జెత్వానీ స్పష్టం చేశారు. కాగా, ఇటీవలి వరకు ఎంతో భయాందోళనలతో, ముఖానికి మాస్కుతో కనిపించిన కాదంబరి జెత్వానీ… ఇవాళ మాత్రం మాస్కు తీసేసి, ఎంతో ఆత్మవిశ్వాసంతో, నిబ్బరంగా కనిపించారు. మీడియాతో ఎంతో ఉల్లాసంగా మాట్లాడారు.👉పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. మ‌రోసారి ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు..ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మ‌రోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారని, ఆయ‌న‌ను ఎవ‌రైనా ఉప‌యోగించుకుంటార‌ని తెలిపారు.
ఆయ‌న చెబుతున్న‌ట్లు స‌నాత‌న ధ‌ర్మం, హిందూ మ‌తం ప్ర‌మాదంలో లేవ‌ని అన్నారు. కేవ‌లం బీజేపీ మాత్ర‌మే ఇబ్బందుల్లో ఉంద‌ని పేర్కొన్నారు.
“న‌టుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్ర‌లు పోషిస్తారు. పాలిటిక్స్ అలా కాద‌ని ఆయ‌న తెలుసుకోవాలి. ఓ స్థిర‌మైన ఆలోచ‌న ఉంటే బాగుంటుంది” అని ప్ర‌కాశ్ రాజ్ హిత‌వు ప‌లికారు. ఇక ఇప్ప‌టికే ప్ర‌కాశ్ రాజ్ ప‌లుమార్లు జ‌న‌సేనానిపై సెటైర్లు వేస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) లో పోస్టు పెట్టిన విష‌యం తెలిసిందే. ఎంజీఆర్‌పై ప‌వ‌న్ ట్వీట్ చేయ‌గా… దానికి స్పందించిన ప్ర‌కాశ్ రాజ్‌.. ఉన్న‌ట్టుండీ ఎంజీఆర్‌పై ఎందుకింత ప్రేమో అంటూ సెటైర్ వేసిన విష‌యం తెలిసిందే.
👉ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం..
హైదరాబాద్:అక్టోబర్ 07
ముంబైలోని చెంబూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయినట్టు తెలిసింది, అయితే, ఈ ప్రమాదానికి గల కారణాన్ని పోలీసులు విచారణలో భాగంగా తేల్చారు.
దేవీ నవరాత్రుల్లో బాగంగా ఇంట్లో పెట్టిన దీపం వల్లే కుటుంబంలోని ఏడుగురు మరణించారని పోలీసులు నిర్దారించారు. పోలీసుల కథనం ప్రకారం.. చెంబూరు లోని సిద్ధార్థ్‌ కాలనీలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు సమాచారం అందించారు
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇంట్లో పెట్టిన దీపం వల్లే మంటలు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు. దుర్గా నవరాత్రి సందర్భంగా తెల్లవారు జామున గ్రౌండ్ ఫ్లోర్‌లోని కిరాణా షాప్‌లో పూజ అనంతరం దీపం వెలిగించారు. ఆ దీపం మంటలే వస్తువులకు అంటుకున్నా యి. ఈ క్రమంలోనే షాప్‌లో నిల్వ ఉంచిన కిరోసిన్‌కు మంటలు అంటుకొవడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో మొదటి, సెకండ్ ఫ్లోర్‌‌లో ఉన్నవారు నిద్రలోనే సజీవదహనం అయినట్లు అధికారులు విచారణలో గుర్తించారు…
👉భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్..
NTR: ఇబ్రహీంపట్నం భార్యతో విభేదాలు ఏర్పడి మనస్తాపంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండపల్లిలో జరిగింది. కుమ్మరి బజార్లో నివసిస్తున్న అశోక్(36) ఓ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. భార్యతో విభేదాల కారణంగా రెండేళ్ల క్రితం కంచికచర్ల పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
👉క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..
తీరా చూస్తే ఈయన sc రిజర్వడ్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు.. ఇప్పుడు ఈయన క్రిస్టియన్ అని డిక్లరేషన్ ఇచ్చాడు కనుక బీసీ-సీ కేటగిరీ కిందకు వస్తాడు..
టెక్నికల్ గా తన sc రిజర్వేషన్ కోల్పోతాడు..అప్పుడు ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతాడు..
ఈ వ్యవహారం ఎలా ఉందంటే సూది కోసం సోదికెలితే పాతవన్నీ బయటపడ్డాయి అనే సామెతలా ఉంది..
👉స్టీల్‌ప్లాంట్ గట్టెక్కాలంటే సెయిల్‌లో విలీనం చేయాలి*
*—- సెయిల్‌ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ విశ్వనాథరాజు..
విశాఖ స్టీల్ ప్లాంట్ కు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే సెయిల్ (స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్) లో విలీనం కావాల్సిందే.సొంతగనులు కేటాయించినా స్టీల్‌ప్లాంట్ కోలుకోదు..ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాం..
చంద్రబాబు,లోకేష్‌ కూడా సానుకూలంగా ఉన్నారు.
రేపు స్టీల్‌ప్లాంట్‌ పై సానుకూల నిర్ణయం రావొచ్చు..
సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విలీనమైతే ఉద్యోగ భద్రతతో పాటు విస్తరణ జరిగే అవకాశం
-సెయిల్‌ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ సాగి కాశీ విశ్వనాథరాజు
👉 న్యూ ఢిల్లీ :
మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లకు ఊరట.. జాబ్ ఫర్ మనీ కేసులో లాలు, ఆయన కుమారులకు బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున బెయిల్ బాండ్ ఇవ్వాలని ఆదేశాలు
👉 బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..
పట్నా: లైసెన్స్ లేని ఆయుధాలు నిల్వ చేశారని బెదిరించి లంచం డిమాండ్ చేసిన కేసులో ఎన్ఐఏ అధికారిని సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాజధాని పట్నాలో ఎన్ఐఏ యూనిట్‌లో డీఎస్పీగా పని చేస్తున్న అజయ్ ప్రతాప్‌సింగ్.. లైసెన్స్ లేని ఆయుధాలు సరఫరా చేస్తున్నారని చెప్పి ఓ కుటుంబం నుంచి రూ.2.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. ఈ అంశంపై బాధితుడు రాకీ యాదవ్ సీబీఐకి ఫిర్యాదు చేశాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సెప్టెంబరు 19 న అజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది.సెప్టెంబర్ 26న విచారణ అధికారి ముందు హాజరుకావాలని సింగ్‌ను కోరినట్లు అధికారులు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఎన్‌ఐఏ పని చేస్తున్న సింగ్.. యాదవ్‌ను ఆయన కుటుంబాన్ని బెదిరించి రూ.2.5 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.బెదిరింపుల నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించాలనే యాదవ్ ఎన్ఐఏను ఆశ్రయించారు. సెప్టెంబర్ 26న బాధితుడి నుంచి సింగ్.. రూ. 25 లక్షలు ముట్టచెప్పాలని డిమాండ్ చేశాడు. మధ్యవర్తిగా ఉన్న మరొకరి మొబైల్ సాయంతో చెల్లించాల్సిన డబ్బులు, వివరాలను మెసేజ్ రూపంలో పంపాడు. డబ్బులు సమకూర్చాక అదే నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పాడు. అలా రూ.25 లక్షలు ఔరంగాబాద్‌కు చెందిన ఓ మధ్యవర్తికి అందాయి. అక్టోబర్ 1న యాదవ్‌ను సింగ్ మళ్లీ పిలిపించాడు. అదే రోజు మిగతా రూ.70 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు సింగ్. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను రెడ్‌హ్యాండెడ్గా పట్టుకున్నామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
👉పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. మ‌రోసారి ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు..
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మ‌రోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారని, ఆయ‌న‌ను ఎవ‌రైనా ఉప‌యోగించుకుంటార‌ని తెలిపారు.ఆయ‌న చెబుతున్న‌ట్లు స‌నాత‌న ధ‌ర్మం, హిందూ మ‌తం ప్ర‌మాదంలో లేవ‌ని అన్నారు. కేవ‌లం బీజేపీ మాత్ర‌మే ఇబ్బందుల్లో ఉంద‌ని పేర్కొన్నారు.
“న‌టుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్ర‌లు పోషిస్తారు. పాలిటిక్స్ అలా కాద‌ని ఆయ‌న తెలుసుకోవాలి. ఓ స్థిర‌మైన ఆలోచ‌న ఉంటే బాగుంటుంది” అని ప్ర‌కాశ్ రాజ్ హిత‌వు ప‌లికారు.ఇక ఇప్ప‌టికే ప్ర‌కాశ్ రాజ్ ప‌లుమార్లు జ‌న‌సేనానిపై సెటైర్లు వేస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) లో పోస్టు పెట్టిన విష‌యం తెలిసిందే. ఎంజీఆర్‌పై ప‌వ‌న్ ట్వీట్ చేయ‌గా… దానికి స్పందించిన ప్ర‌కాశ్ రాజ్‌.. ఉన్న‌ట్టుండీ ఎంజీఆర్‌పై ఎందుకింత ప్రేమో అంటూ సెటైర్ వేసిన విష‌యం తెలిసిందే.
👉ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం*
హైదరాబాద్:అక్టోబర్ 07
ముంబైలోని చెంబూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయినట్టు తెలిసింది, అయితే, ఈ ప్రమాదానికి గల కారణాన్ని పోలీసులు విచారణలో భాగంగా తేల్చారు.
దేవీ నవరాత్రుల్లో బాగంగా ఇంట్లో పెట్టిన దీపం వల్లే కుటుంబంలోని ఏడుగురు మరణించారని పోలీసులు నిర్దారించారు. పోలీసుల కథనం ప్రకారం.. చెంబూరు లోని సిద్ధార్థ్‌ కాలనీలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు సమాచారం అందించారు.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇంట్లో పెట్టిన దీపం వల్లే మంటలు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు. దుర్గా నవరాత్రి సందర్భంగా తెల్లవారు జామున గ్రౌండ్ ఫ్లోర్‌లోని కిరాణా షాప్‌లో పూజ అనంతరం దీపం వెలిగించారు. ఆ దీపం మంటలే వస్తువులకు అంటుకున్నా యి. ఈ క్రమంలోనే షాప్‌లో నిల్వ ఉంచిన కిరోసిన్‌కు మంటలు అంటుకొవడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో మొదటి, సెకండ్ ఫ్లోర్‌‌లో ఉన్నవారు నిద్రలోనే సజీవదహనం అయినట్లు అధికారులు విచారణలో గుర్తించారు…
👉 భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్..
NTR: ఇబ్రహీంపట్నం భార్యతో విభేదాలు ఏర్పడి మనస్తాపంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండపల్లిలో జరిగింది. కుమ్మరి బజార్లో నివసిస్తున్న అశోక్(36) ఓ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. భార్యతో విభేదాల కారణంగా రెండేళ్ల క్రితం కంచికచర్ల పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..
తీరా చూస్తే ఈయన sc రిజర్వడ్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు.. ఇప్పుడు ఈయన క్రిస్టియన్ అని డిక్లరేషన్ ఇచ్చాడు కనుక బీసీ-సీ కేటగిరీ కిందకు వస్తాడు..
టెక్నికల్ గా తన sc రిజర్వేషన్ కోల్పోతాడు..అప్పుడు ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతాడు..
ఈ వ్యవహారం ఎలా ఉందంటే సూది కోసం సోదికెలితే పాతవన్నీ బయటపడ్డాయి అనే సామెతలా ఉంది..
👉స్టీల్‌ప్లాంట్ గట్టెక్కాలంటే సెయిల్‌లో విలీనం చేయాలి*
*—- సెయిల్‌ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ విశ్వనాథరాజు..
విశాఖ స్టీల్ ప్లాంట్ కు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే సెయిల్ (స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్) లో విలీనం కావాల్సిందే.
సొంతగనులు కేటాయించినా స్టీల్‌ప్లాంట్ కోలుకోదు..
ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాం..
చంద్రబాబు,లోకేష్‌ కూడా సానుకూలంగా ఉన్నారు.
రేపు స్టీల్‌ప్లాంట్‌ పై సానుకూల నిర్ణయం రావొచ్చు..
సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విలీనమైతే ఉద్యోగ భద్రతతో పాటు విస్తరణ జరిగే అవకాశం
-సెయిల్‌ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ సాగి కాశీ విశ్వనాథరాజు
👉 న్యూ ఢిల్లీ :
మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లకు ఊరట.. జాబ్ ఫర్ మనీ కేసులో లాలు, ఆయన కుమారులకు బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున బెయిల్ బాండ్ ఇవ్వాలని ఆదేశాలు
👉 బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..
పట్నా: లైసెన్స్ లేని ఆయుధాలు నిల్వ చేశారని బెదిరించి లంచం డిమాండ్ చేసిన కేసులో ఎన్ఐఏ అధికారిని సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాజధాని పట్నాలో ఎన్ఐఏ యూనిట్‌లో డీఎస్పీగా పని చేస్తున్న అజయ్ ప్రతాప్‌సింగ్.. లైసెన్స్ లేని ఆయుధాలు సరఫరా చేస్తున్నారని చెప్పి ఓ కుటుంబం నుంచి రూ.2.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. ఈ అంశంపై బాధితుడు రాకీ యాదవ్ సీబీఐకి ఫిర్యాదు చేశాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సెప్టెంబరు 19 న అజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది.సెప్టెంబర్ 26న విచారణ అధికారి ముందు హాజరుకావాలని సింగ్‌ను కోరినట్లు అధికారులు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఎన్‌ఐఏ పని చేస్తున్న సింగ్.. యాదవ్‌ను ఆయన కుటుంబాన్ని బెదిరించి రూ.2.5 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
బెదిరింపుల నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించాలనే యాదవ్ ఎన్ఐఏను ఆశ్రయించారు. సెప్టెంబర్ 26న బాధితుడి నుంచి సింగ్.. రూ. 25 లక్షలు ముట్టచెప్పాలని డిమాండ్ చేశాడు. మధ్యవర్తిగా ఉన్న మరొకరి మొబైల్ సాయంతో చెల్లించాల్సిన డబ్బులు, వివరాలను మెసేజ్ రూపంలో పంపాడు. డబ్బులు సమకూర్చాక అదే నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పాడు. అలా రూ.25 లక్షలు ఔరంగాబాద్‌కు చెందిన ఓ మధ్యవర్తికి అందాయి. అక్టోబర్ 1న యాదవ్‌ను సింగ్ మళ్లీ పిలిపించాడు. అదే రోజు మిగతా రూ.70 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు సింగ్. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను రెడ్‌హ్యాండెడ్గా పట్టుకున్నామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
👉తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?*
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ పడింది. ఆక్రమణల తొలగింపునకు హైడ్రా విరామం ప్రకటించినట్లు సమాచారం. ఇందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైకోర్టు హైదరాబాద్ పరిధిలో కూల్చివేతలపై హైడ్రా అధికారులను నేరుగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించారా? అని అడిగింది. దీనికి హైడ్రా అధికారుల వద్ద సమాధానం లభించలేదు. ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిని నిర్ధారించకపోవడం రానున్న కాలంలో అడ్డంకిగా మారనుందని భావించిన ప్రభుత్వం ముందు చెరువుల ఎఫ్‌టీఎస్ విస్తీర్ణం పరిధిని నిర్ధారించాలని నిర్ణయించింది.
ఇందుకోసం సమగ్ర సర్వేకు రేవంత్ సర్కార్ ఆదేశించింది. హెచ్ఎండీఏ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిపై సమగ్ర సర్వేను చేయాలని నిర్ణయించింది. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. సర్వే నివేదికను మూడు నెలల్లో పూర్తిచేయాలని కూడా టైం బౌండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వివరాలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ లో ఉంచాలని కూడా నిర్ణయించింది. లేకుంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను ప్రారంభించింది. అప్పటి వరకూ హైడ్రా కూల్చివేతలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
హైకోర్టు తప్పుపట్టడంతో్….
ఇటీవల హైకోర్టు తప్పుపట్టడంతో్ పాటు అనేక మంది తమ నిర్మాణాలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లలో లేవంటూ వాదనలు మొదలు పెట్టడం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా తయరయింది. వారికి న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాధ్ ను కూడా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిని నిర్ధారించారా? అని ప్రశ్నించడంతో ఆయన సరైన సమాధానం న్యాయస్థానానికి చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో పూర్తిగా చట్టబద్దతతో కూల్చివేతలకు ముందుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఆక్రమణదారులకు న్యాయస్థానాలు స్టే ఉత్తర్వులు ఇవ్వకుండా ఉపయోగపడుతుందని అభిప్రాయపడి ఈ నిర్ణయం తీసుకుంది.

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.