సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష….రఘురామ కేసు:జగన్ సర్వీస్ బ్యాచ్ నిండా మునిగినట్లేనా!..నాగార్జున‌కు ప‌రువు ఉందా?: సిపిఐ నారాయ‌ణ కామెంట్స్‌.. మెగాస్టార్ కి హైడ్రా భయం..”రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం..”అనంతలో మహిళ అదృశ్యం..గంజాయి మత్తులో కత్తులు తీసుకొని యువకులు హల్చల్..పోలీసు ఆంక్షలతో అష్ట దిగ్బంధనం లో చిక్కుకున్న దుర్గమ్మ ఆలయం.. మార్కాపురంలో రూట సమావేశం..

👉 సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై రివ్యూ..
ప్రజలపై భారం పడకుండా చూడాలని అధికారులకు సీఎం సూచన..
డిమాండ్-సప్లైకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం..
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా సివిల్ సప్లై శాఖ తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై ధరల భారం లేకుండా చూడాలని సిఎం అధికారులకు సూచించారు.
డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ధరలు పెరిగిన తర్వాత తగ్గించే ప్రయత్నం చేయడం, సబ్సిడీలో అందించడం కంటే…. మూడు శాఖలు నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరల పెరుగుదలను ముందుగానే గ్రహించి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయని సూచించారు.
నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలకు, తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ రివ్యూలో మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆన్‌లైన్ విధానంలో హాజరయ్యారు. ప్రస్తుతం రైతు బజార్లలో కౌంటర్ల ద్వారా చేపట్టిన అమ్మకాలపై సమీక్షలో వివరించారు. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమోటా, ఉల్లిపాయలు రైతు బజార్ లలో కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కంటే రూ.10 నుంచి రూ.15 తక్కువకు అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు.
విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలని, వ్యాపారులు కూడా సహకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు.పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేవడం ద్వారా రైతులకు, వినియోగదారులకు కూడా న్యాయం చేయవచ్చని సీఎం సూచించారు. ధరల నియంత్రణ విషయంలో ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉంటేనే వారు హర్షిస్తారని, ఆ స్థాయిలో అధికారులు ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
👉రఘురామ కేసు:జగన్ సర్వీస్ బ్యాచ్ నిండా మునిగినట్లేనా!
రఘురామను కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో జగన్ సర్వీస్ బ్యాచ్ పోలీసు అధికారులు నిండా మునిగినట్లే అయింది. సీఐడీ ఓఎస్డీగా పని చేసిన విజయ్ పాల్ అనే అధికారి విచారణకు హాజరయ్యారు. ఈ విజయ్ పాల్ రిటైర్మెంట్ అయినపోయినా సరే మనోడు అన్న కారణంగా జగన్ ప్రభుత్వంలో సీఐడీలో ఓఎస్డీగా నియమించారు. ఆయన పని టీడీపీ నేతలపై తప్పులు కేసులు పెట్టి తీసుకొచ్చి కొట్టడం.రఘురామను అదే చేశారు. ఆయన హైదరాబాద్ కు పుట్టిన రోజువేడుకల కోసం వస్తే టీమును పంపి అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకు వచ్చి ధర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఏ కేసు అంటే.. రఘురామను అరెస్టు చేసిన తర్వాత రాజద్రోహం కేసు పెట్టారు. దీనికి ఫిర్యాదుదారు ఎవరంటే ఈ విజయ్ పాలే. మీడియాతో మాట్లాడితే రాజద్రోహం ఎందుకవుతుందో.. ఆయనను కొట్టడానికే తీసుకొచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. రఘురామకృష్ణరాజు ప్రభుత్వం మారిన వెంటనే గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.అప్పట్నుంచి ఆయన పరారీలో ఉన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా రాలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. తదుపరి విచారణ వరకూ అరెస్టు నుంచి రక్షణ ఇచ్చిన సుప్రీంకోర్టు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. దాంతో ఆయన ఐదు రోజుల తర్వాత విచారణకు హాజరయ్యారు. ఇందులో మాజీ సీఎం జగన్ పేరు కూడా ఉంది. ఈ కేసులో ఉన్న పోలీసు అధికారుల్ని, సిబ్బందిని ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. అందరి వాంగ్మూలాలు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలను కూడా సేకరించారు. రఘురామను కొట్టారడానికి అవసరమైన అన్ని సాక్ష్యాలు ఉండటంతో త్వరలో అరెస్టులు చేసే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

👉👉నాగార్జున‌కు ప‌రువు ఉందా?: సిపిఐ నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్‌ !!!..😱😱😱
దీనికి సంబంధించి నాగార్జున స్టేట్‌మెంటును నాంప‌ల్లి కోర్టు న‌మోదు చేసింది. అక్కినేని నాగార్జునపై సీపీఐ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, నారాయణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “ప‌రువు ఉన్నోడు క‌దా.. నాకు ప‌రువు పోయింది.. నాకు ప‌రువు పోయింది.. అని ఏడుస్తాడు. నాగార్జున‌కు ప‌రువు ఉందా?“ అని ప్ర‌శ్నించారు.
తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై చేసిన తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆమెపై నాగార్జున ప‌రువు న‌ష్టం దావా వేసిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి నాగార్జున స్టేట్‌మెంటును నాంప‌ల్లి కోర్టు న‌మోదు చేసింది. త‌మ కుటుంబాన్ని రాజ‌కీ యాల్లోకి లాగార‌ని.. త‌మ పరువుకు భంగం క‌లిగించార‌ని నాగార్జున పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే 100 కోట్ల రూపాయ‌ల ప‌రువు న‌ష్టం దావా వేశారు. దీనిపై స్పందించిన చికెన్ నారాయ‌ణ‌.. నాగార్జున‌కు ప‌రువు ఎప్పుడో పోయింద‌న్నారు. ఆయ‌న బిగ్ బాస్ వంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ప్పుడే.. ఆయ‌న పరువు పోయింద‌న్నారు. ఇప్పుడు ప‌రువు-పరువు అంటే ఎలా వ‌స్తుంద‌న్నారు. పరువు ఉన్నోడు పరువు నష్టం దావా వేయాలని, బిగ్‌బాస్ షో చేయడం ద్వారా… నాగార్జున పరువు ఎప్పుడో పోగొట్టుకొన్నాడని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసే హక్కు నటి సమంతకు మాత్రమే ఉంద‌ని నారాయ‌ణ తీర్పు చెప్పారు. ఆమె పరువు న‌ష్టం దావా వేస్తే.. త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు మ‌హిళా సంఘాలు కూడా వస్తాయ‌న్నారు. క‌మ్యూనిస్టులుగా మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను తాము ఎలా స‌మ‌ర్థిస్తామ‌ని ప్ర‌శ్నించారు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు దారి త‌ప్పేస్తున్నార‌ని చెప్పారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న గురించి మాట్లా డుతూ.. ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకుని ఆయ‌న‌ను గెలిపించార‌ని.. కానీ, ఆ స్థాయిలో ఆయ‌న పాల‌న అందించ‌డం డౌటేన‌ని చెప్పారు. క‌మ్యూనిస్టు పోరాటాలు త‌గ్గిపోయాయ‌న్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. మీడియా ప్ర‌భావం కూడా ఉంద‌ని చెప్పారు. “మేం ఎక్క‌డ ఉద్య‌మాలు చేస్తున్నా.. అస‌లు క‌వ‌రేజీ ఉందా? మేం కూడా బూతులు తిట్టాల‌ని మీరు కోరుకుంటున్నారు“ అని త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించారు.
👉మెగాస్టార్‌ చిరంజీవికి హైడ్రా భయం..?😲
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఒక శిఖరం లాంటివారు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి… ఇప్పటికీ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే రాజ్యసభ సభ్యులుగా… కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం మెగాస్టార్ చిరంజీవికి ఉంది.
అలాగే ప్రజారాజ్యం పార్టీ పేరుతో అప్పట్లో సంచలనం సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు హైడ్రా…భయం పట్టుకుందని… వైసిపి సోషల్ మీడియాలో… వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులోని.. ఓ ప్రముఖ వ్యాపారవేత్త… మెగాస్టార్ చిరంజీవికి చెప్పకుండా ఓ ప్రభుత్వ స్థలాన్ని.. అమ్మాడట. అయితే ఆ విషయం తెలియకుండా మెగాస్టార్ చిరంజీవి ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠినంగా వ్యవహరిస్తోంది హైడ్రా. ఇప్పటికీ అక్కినేని నాగార్జున.. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి అదే భయం పట్టుకుందట. ప్రభుత్వ స్థలం కొనుగోలు చేయడంతో… హైడ్రాధికారులు రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని… మెగాస్టార్ చిరంజీవి భయపడుతున్నారట.
ఈ విషయం ఇప్పుడు… వైసిపి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అయితే… మెగాస్టార్ తెలియక కొనుగోలు చేయడం… తప్పు కాదు… మిస్టేక్ అవుతుంది. ఒకవేళ హైడ్రా అధికారులు వచ్చినా కూడా… మెగాస్టార్ చిరంజీవి చాలా హుందాగా ఆ స్థలాన్ని అప్పగించే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి తో… మెగాస్టార్ చిరంజీవికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి… ఈ విషయంలో రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది.
👉పోలీసు ఆంక్షలతో అష్ట దిగ్బంధనం లో చిక్కుకున్న దుర్గమ్మ ఆలయం..*వినూత్న ఆంక్షలతో భక్తులను అష్ట కష్టాలు పెడుతున్న డ్యూటీ పోలీసులు…*అమ్మ దర్శనానికి పడరాని పాట్లు పడుతున్న భక్తులు..
*అమ్మ దర్శనం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్న భక్తులు..
*దారులు ముసుకుపోవడంతో సాహసం చేసి కొండ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న భక్తులు……*
*పోలీసు వాహనాలకు రాచ మార్గము…భక్తులకు నరక మార్గమా….???*ఎలాగైనా అమ్మ దర్శనం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న భక్తులకు ఏమైనా జరిగితే ఎవరిది భాధ్యత…???
👉 జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న నారా బ్రాహ్మిణి..బ్రాహ్మిణికి తీర్థప్రసాదాలు అందించిన పూజారులు..జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయానికి తరలి వచ్చిన భక్తులు..అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు..హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు.
దసరా పర్వదినం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దర్శనం కోసం వేలాదిమంది తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూకట్టిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి.
శనివారం పెద్దమ్మతల్లి ఆలయంలో వాహనపూజ నిర్వహించనున్నారు. వాహనపూజ నేపథ్యంలో చాలామంది భక్తులు తమ వాహనాలను గుడికి తీసుకువచ్చారు. దేశంలో ఈరోజు శరన్నవరాత్రులు ముగియనున్నాయి. అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.
👉 ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్ – బంగ్లా మ్యాచ్.. రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు..
ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా రాత్రి 7 గంట‌ల‌కు భార‌త్ – బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో స్టేడియం వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పాసులు ఉన్న‌వారిని మాత్ర‌మే స్టేడియంలోకి అనుమ‌తిస్తున్నారు.ఇక‌.. మ్యాచ్ దృష్ట్యా అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైలు స‌మ‌యం పొడిగించిన‌ట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఆర్టీసీ కూడా అద‌న‌పు బ‌స్సులను న‌డిపేందుకు రెడీ అయ్యింది. ఉప్ప‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో భార‌త్ కైవ‌సం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా సిద్ధ‌మైంది.
👉అనంతలో మహిళ అదృశ్యం*
* మనవడి పుట్టిన రోజుకు వచ్చి తిరుగు ప్రయాణం
* నవోదయ కాలనీ నుంచి బయలుదేరిన కాసేపటికే మాయం
* సెల్ స్విచ్చాఫ్ వస్తుండడంతో మరింత ఆందోళన
* ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న కుటుంబ సభ్యులు
* ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదంటున్న బాధితులు
* వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు
*అనంతపురం: పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం నుంచి అనంతపురం నవోదయ కాలనీకి వచ్చిన అంకాలమ్మ(40) అనే మహిళా అదృశ్యమైంది. ఈ నెల 9న తన మనవడి పుట్టిన రోజు వేడుకల కోసం స్వగ్రామం నుంచి అనంతపురంలో ఉంటున్న అల్లుడు జగన్(ఐసీడీఎస్ పీడీ వాహన డ్రైవర్), కూతురి ఇంటికి ఆమె వచ్చారు. అదే రోజు రాత్రి మనవడి పుట్టిన రోజు ఘనంగా చేసుకున్నారు. మరుసటి రోజు(10వ తేదీ) ఉదయం 9.45 గంటలకు నవోదయ కాలనీలోని ఇంటి నుంచి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
* అయితే ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే ఆమె సెల్లు స్విచ్చాఫ్ వచ్చిందని తెలిపారు.
* స్వగ్రామానికి కూడా చేరుకోలేదని, అన్ని ప్రాంతాల్లోనూ గాలించామని వివరించారు.
* అయినా ఆచూకీ దొరకలేదని వాపోయారు.
* విధి లేక అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
* పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని అంకాలమ్మ ఆచూకీ తెలపాలని కోరారు.
👉 కోడిపందాల శిబిరాలపై పోలీసుల దాడి..
NTR: ఇబ్రహీంపట్నంలోని చిన్నలంక, రాయనపాడు గ్రామాల్లో శనివారం కోడిపందాల శిబిరాలపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జోరుగా నిర్వాహకులు పందెం నిర్వహించారు. సుమారు 80 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ట్రాక్టర్ సహాయంతో పందెం రాయుళ్ల వాహనాలను పోలీసులు స్టేషన్కు తరలించారు.
👉ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం
నైరుతి బంగాళాఖాతంలో ఎల్లుండికి అల్పపీడనం
రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు వర్షం ఈనెల 14 నుంచి 17వరకు కోస్తా,రాయలసీమలో భారీవర్షాలు
తీరం వెంబడి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక..
జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన అధికారులు
👉ఏలూరు సిటీ..*రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం,*
*డిప్యూటీ తాసిల్దార్ ప్రమోద్ 50,000 డిమాండ్,*
*50,000 ఇస్తే లేదా చావు నాకేంటి అంటూ అవహేళన*
*ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్న జన్యావుల సుధాకర్ (నాని),*
ఇక వివరాల్లోకొస్తే స్థానిక ఏలూరు పట్టణానికి చెందిన జన్యావుల సుధాకర్(నాని)అనే వ్యక్తి పినకడిమి గ్రామంలో 13 బస్తాలు *ఆరున్నర* క్వింటాల్ బియ్యం కొనుగోలు చేస్తుండగా డిప్యూటీ తాసిల్దార్ ప్రమోద్ అక్కడికి చేరి తనకు 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, 50,000 ఇస్తే కేసు ఉండదని , లేకపోతే నీ చావు నువ్వు చావని అసభ్యకరంగా మాట్లాడడం వలన తాను మనస్థాపన చెందానని ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని దానికి పూర్తి కారణం డిప్యూటీ తాసిల్దార్ ప్రమోదనని, ఆ బస్తాలకు నా వ్యాన్కు ఎటువంటి సంబంధం లేకపోయిన కానీ కావాలని ఆ బస్తాలు నా వ్యాన్లో ఎక్కించి అన్యాయంగా కేసు నమోదు చేసారని తెలిపారు, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు తగిన విచారణ చేసి న్యాయం చేయాలని జన్యావుల సుధాకర్ (నాని) కోరారు.
👉”మార్కాపురం లో రూటా సమావేశం: ప్రకాశం జిల్లా మార్కాపురం, రెండవ వార్డు లోని మునిసిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ నందు జిల్లా ఉర్దూ ఉపాధ్యాయుల (రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్)కాన్ఫరెన్స్ జరిగింది.రూట జిల్లా అధ్యక్షలు జనాబ్ షేక్ అన్వర్ అధ్యక్షతన జరిగిన కాన్ఫరెన్స్ లో ఉర్దూ పాఠశాలల, ఉర్దూ టీచర్ల సమస్యలను గురించి చర్చించి కొన్ని తీర్మానాలను ఆమోదించారు. (1)సర్వీసు మరియు అర్హతలు కలిగిన సెకండరీ గ్రేడ్ ఉర్దూ టీచర్లకు ప్రమోషన్లు కల్పించాలి (2)ఖాళిగా ఉన్న అన్ని క్యాటగిరి ఉర్దూ టీచర్ పోస్టులను డిశంబర్ లో ఇచ్చే డి. ఎస్. సి. నోటిఫికేషన్ లో చూపించి భర్తీ చేయాలి.(3)ఉర్దూ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉర్దూ అంగన్వాడీ సెంటర్లను ప్రారంభించాలి. (4)ఉర్దూ పాఠాల పుస్తకాలను (Govt., Free Text Books) పాఠశాలలకు సకాలంలో అందించాలి.(5)జిల్లా లోని ప్రతీ హైస్కూల్ లో 20 మంది ముస్లిం విద్యార్థులు ఉన్న చోట ఒక ఉర్దూ బి. ఈడి., పోస్టును మంజూరు చేసి భర్తీ చేయాలనీ తీర్మానం చేశారు. అనంతరం రెండు సంవత్సరాలకు జిల్లా రూట నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు.*
*గంజాయి మత్తులో కత్తులు తీసుకొని యువకులు హల్చల్*
*భయాందోళనలో ప్రజలు*
*పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని అంటున్న ప్రజలు*
నందిగామ: గంజాయి మరియు ,మత్తులో ఉన్న నలుగురు యువకులు నందిగామ పట్టణంలో శనివారం రాత్రి వీరంగం సృష్టించారు. గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు రెండవ వార్డు రోడ్డు లో కత్తులు తీసి పరుగులు పెట్టుకుంటూ వెళ్తూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై తిరగబడి చేయి చేసుకున్నారు. అడొచ్చిన వారిపై దాడి చేసేందుకు యత్నించారు. యువకుల వీరంగం కారణంగా జనాలు గుమిగూడడంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సుమారు గంటకు పైగా యువకులు హాల్ చల్ చేసి అందరినీ హాడలెత్తించారు.
రెండో వార్డులో శివ షాపు మరియు చంటి షాపు అను అభి ధియేటర్ వద్ద ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద
అర్ధరాత్రి మూడు గంటల వరకు ప్రతి రోజు మద్యం సేవిస్తూ గంజాయి మత్తులో ఉండి అల్లరిముకుల అల్లరి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, నూరు తండ్రి జానీ మరి కొంతమంది యువకులు ప్రతిరోజు గంజాయి సేవిస్తూ అల్లరికి పాల్పడుతూ ఉంటారనీ అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12వ తేదీ శనివారం దసరా సందర్భంగా గంజాయి మరియు మత్తు పానీయాలు సేవించి కత్తులు తీసుకొని హల్చల్ చేస్తున్న యువకులు రెండో వార్డ్ లో నివసిస్తున్న కొంతమంది వ్యక్తులపై దాడికి ప్రయత్నించారు,దాడికి గురైన వ్యక్తులు భయభ్రాంతులకు గురి అయినా వ్యక్తులు నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు, కేసు నమోదు అయిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతానికి రాగా వారిని చూసి పరుగులు పెట్టిన గంజాయి మత్తులో ఉన్న యువకులు.కావున రెండో వార్డ్ లోని ప్రజలందరూ ఇలాంటి అల్లరి మూకలపై కఠినమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించి,వేరెవరు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా యువతని సరైన దారిలో నడిచే విధంగా నందిగామ పోలీస్ వారు తగు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
👉ఖమ్మం జిల్లా:-పాలేరు* కూసుమంచి మండలం జీళ్ళచెరువు వద్ద ఘోర ప్రమాదం..**నేషనల్ హైవే పై బోల్తా పడిన కారు..కారులో ఇరుక్కున్న ఇద్దరు ముస్లీం దంపతులు..ఈ ప్రమాదం లో నలుగురికి తీవ్ర గాయాలు..హాస్పటల్ కి తరలింపు..గాయపడిన వారు ఖమ్మం అజీజ్ గల్లీకి చెందిన ఒకే కుటుంబ వాసులు.. హైదరాబాద్ లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వస్తున్న కుటుంబం..*
👉ఒంగోలులో ‘ మీకోసం ‘ రద్దు* ఈనెల 14వ తేదీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘ మీకోసం ‘ ( గ్రీవెన్స్ ) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.శ్రీలత తెలిపారు. జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం సోమవారం లాటరీ ప్రక్రియను నిర్వహించాల్సి ఉన్నది.జిల్లా కలెక్టరుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున ‘ మీకోసం ‘ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని, దూరప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలు రావద్దని డీ.ఆర్.వో. సూచించారు.
👉 పెన్షన్ ఆగిపోయి ఏడాది.. పూట గడవడమే కష్టంగా మారింది.. ఆపన్న ఆస్తం కోసం ఎదురుచూపులు.. ప్రకాశం జిల్లా కంభం..ఎస్ డి భానుబి బేగం పుట్టుకతో వికలాంగురాలు. ఎవరో ఒకరి సహాయం లేనిదే కనీసం నడవలేని దుస్థితి.
ఏడాది కిందట ఆమె అనారోగ్య కారణాలవల్ల హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉండవలసి వచ్చి రెండు నెలలు పెన్షన్ తీసుకోలేదు.అందువల్ల ప్రభుత్వ అధికారులు ఆమె పెన్షన్ను నిలిపివేశారనీ,అప్పటినుండి ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టుప్రదక్షిణలు చేసిన ఫలితం లేకుండా పోయింది..ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భవతి భర్త తోడు లేనిదే ఏ పని చేయలేని దుస్థితి ..ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది..ఇరుగుపొరుగువారు ఎంతో కొంత సహాయం చేస్తున్నారు..అధికారులు జాలి తలచి తనకు తిరిగి పెన్షన్ తనకు తిరిగి పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కన్నీటితో వేడుకుంటుంది.. ఆమె ప్రస్తుతం కంభం పట్టణంలోని డాల్ సాహెబ్ వీధిలో ని ఒక ఇంట్లో అద్దెకు నివసిస్తుంది ఆమె భర్త టీ మాస్టర్ గా పనిచేసేవాడు. కానీ ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో ఆమెకు తోడుగా ఉండవలసి రావడంతో పని మానేసి ఆమెకు తోడుగా ఉంటున్నాడు.
👉ఆమెకు ఆర్థిక సహాయం అందించాలనుకునే దాతలు క్రింది నెంబర్ కు ఫోన్ పే ద్వారా సహాయ సహకారాలు అందించాలని ఆ దంపతులు కోరుతున్నారు.. 92787 47480..

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.