టిడిపి ప్రభుత్వం పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..తెలంగాణ బీజేపీకి ‘పైడి’ తంటా.. బోట్ల యజమాని లోకేష్ సన్నిహితుడా….నంద్యాలలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగింపు… అఖిలప్రియ స్పందన..ఏబీవీకి భారీ ఊరట.. నారాయణ కాలేజీలో దారుణం ఫీజు కట్టలేదని సుమారు 30మంది విద్యార్థులను రోడ్డుపై నిలబెట్టిన యాజమాన్యం..స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఈడీ దూకుడు…

👉తెలంగాణ బీజేపీకి ‘పైడి’ తంటా.. ఏం జ‌రిగింది? తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందువుల‌ను ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని సికింద్రాబాద్‌లో ఉన్న ముత్యాల‌మ్మ ఆల‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న స‌హా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో రాజ‌కీయాలు వేడెక్కాయి.ఈ నేప‌థ్యానికి తోడు.. పైడి రాకేష్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత వివాదంగా మారాయి. రాష్ట్రంలో హిందూ ఆల‌యాల‌పైనే దాడులు ఎందుకు జ‌రుగుతున్నాయ‌న్న పైడి.. ముస్లింలు, ఇత‌ర మ‌త‌స్థుల ఆల‌యాల‌పై ఎందుకు దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని నిల‌దీశారు. దీనికి కార‌ణం హిందువుల్లో చీము నెత్తురు లేక‌పోవ‌డ‌మేన‌ని తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. “హిందువుల్లో మ‌గ‌త‌నం చ‌చ్చిపోయింది. సిగ్గు లేదు. చీము నెత్తురు అంత‌క‌న్నా లేదు. ఇన్ని దాడులు జ‌రుగుతుంటే.. ఒక్క‌రూ స్పందించ‌డం లేదు. ఒక్క నిర‌స‌న కూడా వ్య‌క్తం చేయ‌డం లేదు“ అని పైడి నోరు జారారు. అయితే.. పైడి వ్యాఖ్య‌ల‌పై ధార్మిక సంస్థ‌లు, హిందూ సంఘాల నాయ‌కులు నిప్పులు చెరిగారు. పైడి ఏదో వ్య‌క్తిగ‌త అజెండాను మోస్తున్నార‌ని, కేవ‌లం తాను మాత్ర‌మే హిందువుల‌కు గొడుగు ప‌డుతున్న‌ట్టు వ్యాఖ్యానిస్తున్నార‌ని చాలా మంది ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకుల‌ను కంట్రోల్ చేసుకోవాల‌ని మ‌రింత మంది బీజేపీకి సూచించారు. ఇంకొంద‌రు స్పందిస్తూ.. పైడికి ఓట్లేసిన వారంతా హిందువులేనా అని ప్ర‌శ్నించారు. ఇక‌, పైడి చేసిన వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, పైడి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ కూడా సీరియ‌స్ అయింది. ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో హిందూ స‌మాజంలో బీజేపీ ప‌లుచన అవుతుంద‌ని, కేంద్ర మంత్రి బండి సంజ‌య్ త‌న వారి వ‌ద్ద వ్యాఖ్యానించారు. పార్టీ చీఫ్ కేంద్ర మంత్రికిష‌న్ రెడ్డికి చెప్పి.. పైడిని కంట్రోల్ చేయాల్సి ఉంద‌ని తెలిపారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మత విధ్వంసాలు సృష్టించడానికి బిజెపి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నది అనే విషయం తేటతెల్లం.. ఈ మేరకు ఇటీవల తిరుపతి లడ్డు ప్రసాదం విషయంపై ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయని భావించారు. కానీ అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేసినట్లుగా ప్రజలు అర్థం చేసుకున్నారనీ అనుకోవచ్చు. దీంతో రాష్ట్రంలో విధ్వంసాలు జరగలేదు.ఏదేమైనప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఏదో విధంగా మత విధ్వంసాలు సృష్టించడానికి అనేక కుట్రలు పన్నుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు సైతం బిజెపి కుట్రలను అర్థం చేసుకున్నందువల్లే ఈ రెండు రాష్ట్రాలలో మతోన్మాదం విస్తరించడం లేదని, పేదలు రైతుల సంక్షేమాన్ని విస్మరించడం వల్ల పలు రాష్ట్రాలలో సైతం ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా బీజేపీ తన విధానాలను మార్చుకోకపోతే రాబోయే రోజులలో బిజెపిని ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని భావించవచ్చు..
👉Apcc చీఫ్..వైఎస్ షర్మిలా రెడ్డి.. @NaraLokesh గారూ… మోదీకి మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు మీరు చాలా గర్వపడుతున్నారు.. కానీ ఏపీ ప్రజలకు నెరవేర్చని హామీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ “Super6” వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా… ఏపీ ముఖ్యమంత్రి ప్రతి వారం ఢిల్లీకి పరుగులు తీస్తున్నా… మోదీ ఏపీకి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరియు పోలవరం ప్రాజెక్టులకు అతి గతి లేదు.. ఫ్రాంక్లీ స్పీకింగ్ అనే టీవీ షోలో మిమ్మల్ని చూడడం చాలా బాగుంది..కానీ ఇప్పుడు ఏపీ ప్రజలు తమకు ఇచ్చిన వాగ్దానాలను.. నెరవేర్చడంపై మీ ఉద్దేశాలను “స్పష్టంగా మాట్లాడాలని” ఆశిస్తున్నానన్నారు.
👉24 గంటలుగా చెన్నైలో నాన్ స్టాప్‌గా వర్షం..
వేలచేరిలో నీటమునిగిన వేలాది ఇళ్లు..
తారామణి రోడ్లు జలమయమయ్యాయి..
భారీ వర్షాలతో 11 సబ్ వేలు మూసివేత..
సహాయ చర్యల కోసం 16 వేల మంది వాలంటీర్లు..
చెన్నైలో 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు..
వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
👉 ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి రైస్ మిల్లులో అక్రమంగా నిలవకుండా రేషన్ బియ్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలో పట్టుకున్నారు..నిల్వ ఉన్న బియ్యం బస్తాలను గుర్తించిన అధికారులు..పేద ప్రజల ఆహార భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. పేదల ఆహారం కోసం అందించే రేషన్ బియ్యం అక్రమార్కులకు వ్యాపార వస్తువుగా మారి కాసులు కురిపిస్తున్నాయి.
రేషన్ బియ్యాన్ని ఇతర బియ్యంతో కలుపుతూ ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి.
ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపారు..
అందులో భాగంగా నేడు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల రైస్ మిల్ తనిఖీ చేశారు.పరిటాల గ్రామంలో లక్ష్మీ గణపతి రైస్ మిల్లు ను మంత్రి నాదెండ్ల తనిఖీ చేసి అక్రమంగా నిలవకుండా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు
అక్రమంగా నిల్వ ఉన్న 100 టన్నుల బస్తాల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. కార్డుదారుల నుండి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి భారీ నిల్వలు ఉంచారు.
రేషన్‌ బియ్యాన్ని నిర్వాహకులు రీసైక్లింగ్‌ చేసి సాంబమసూరు బియ్యంలో కలిపి భారీ అమ్మకాలు జరుపుతున్నట్లుగా విచారణలో బయటపడింది. లారీతోపాటు రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేసిన్నట్లు తెలిపారు.
👉👉👉అన్నం పారేయడానికి ఒక నిమిషం చాలు.. పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి..!!
*ఆహారాన్ని వృధా చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి..
*ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు..💐💐💐
👉బోట్ల యజమాని నారా లోకేష్ సన్నిహితుడా..??? ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కావాలనే ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయాలని కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆ బోట్లకు లంగర్లు వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడు కట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కావాలని ఇలా చేశారని అంటున్నారు. ఆ బోట్లు వైసీపీ కార్యకర్తలకు చెందినవని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని, ఢీకొట్టిన 3 బోట్ల యజమాని వైసీపీ నేత అని చెప్పారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ సన్నిహితుడని ఆరోపించారు. బోట్లకు వైసీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. రూ. కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నిమ్మలతోపాటు టీడీపీ నేతల ఆరోపణలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది.
ఆ బోట్ల యజమాని…మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ కేసులో నిందితుడు కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అరెస్ట్ చేశారని, అందులో రామ్మోహన్…టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం బంధువు అని ఆరోపిస్తోంది. గతంలో లోకేశ్ తో కలిసి ఉషాద్రి దిగిన ఫొటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితులకు లోకేష్ తో సంబంధాలున్నాయనేందుకు ఈ పొటోలే సాక్ష్యమని చెబుతోంది. వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దానిని డైవర్ట్ చేసేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
👉 కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం..
ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ(సీసీఎస్) ఆమోదం..
DRDO ఆధ్వర్యంలో అందుబాటులోకి రానున్న టెస్టింగ్ సెంటర్..ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
👉హార్ట్ స్ట్రోక్ తో ఆర్టీసీ డ్రైవర్ మృతి*
రేపల్లె నుంచిచీరాల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు కర్లపాలెం కి దగ్గరలో ఉన్న ముకుంద టీ స్టాల్ వద్ద బస్సు నడుపుతున్న డ్రైవర్ కు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో చాకచక్యంతో బస్సును పొలాల్లో దించడం జరిగింది అనంతరం డ్రైవర్ హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడు పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది
👉 సైబర్ క్రైమ్ బ్రాంచ్ అంబాసిడర్‌గా సినీ నటి రష్మిక మందాన..
సినీ నటి రష్మికను ప్రస్తుతం భారత ప్రభుత్వం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా నియమించింది..
అందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం నూతన కార్యక్రమం చేపట్టింది.. అయితే ఆ కార్యక్రమానికి రష్మికని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.
ఈ మేరకు రష్మిక ఓ వీడియోని షేర్ చేసింది…
👉 జైలులో రామాయణ నాటకం.. వానరుల వేషంలో సీతను వెతకటానికి వెళ్లి ఇద్దరు ఖైదీల పరార్..
హరిద్వార్ జైలులో రామాయణ నాటకం వేయగా రావణుడు.. సీతను అపహరించుకుపోయిన సన్నివేశం ముగిసిన తరువాత వానర సభ్యలు సీతని కోసం వెతకడం మొదలు పెట్టారు.
ఆ సమయంలో ఖైదీలు పంకజ్, రాజ్ కుమార్ ఇద్దరూ జైలు గోడపై వెతకడం మొదలు పెట్టారు. అది నాటకంలో భాగమని ప్రేక్షకులు, పోలీసులు నోరెళ్ళబెట్టి చూస్తుండగా.. వారు ఇద్దరూ గోడ దూకి పారిపోయారు.
చివరకు సీత దొరికినప్పటికీ.. వారిద్దరూ మాత్రం దొరకలేదు…
👉ఏబీవీకి భారీ ఊరట..నిఘా పరికరాల కొనుగోళ్ల కేసుల నుంచి విముక్తి..
రెండు కేసులు మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
మరో కేసు ఫైల్‌ సీఎం చంద్రబాబు టేబుల్‌పై!
అమరావతి.. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. చెయ్యని తప్పునకు ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన ఎట్టకేలకు వాటినుంచి బయటపడ్డారు. ఏబీవీపై ఉన్న కేసుల్లో రెండింటిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈమేరకు మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. మరో కేసుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఏబీవీని వేధించింది. అసలు కొనుగోలు చేయని పరికరాల్లో అవినీతి ఎక్కడుందని అన్నందుకు హద్దులు మీరారని, సాక్షులను బెదిరిస్తున్నారని ఆయనపై కేసుల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసింది. ఏబీవీని సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలంటూ కేంద్రానికి ప్రతిపాదించింది. 2019 నుంచి ఐదేళ్లపాటు సస్పెన్షన్లు, కేసులు, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటూనే న్యాయపోరాటం చేసిన వెంకటేశ్వర రావు సరిగ్గా పదవీ విరమణకు ఒక్కరోజు ముందు పోస్టింగ్‌ దక్కించుకున్నారు. క్యాట్‌ ఆదేశాల మేరకు ఈ ఏడాది మే 30న ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించి ఆ మరుసటి రోజు 31న రిటైరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం తనను వేధించిన తీరు, చేయని తప్పులకు విధించిన సస్పెన్షన్లు, తప్పుడు కేసుల నుంచి విముక్తి కోసం ప్రభుత్వానికి ఏబీవీ విన్నవించుకున్నారు
*కక్షపూరితంగా అభియోగం*
ఏబీ వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేశారు. అప్పట్లో ఇజ్రాయెల్‌ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లకు ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ అనే సంస్థకు 2018 అక్టోబరు 31న రూ.35లక్షలు చెల్లించినట్లు వైసీపీ ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఏసీబీ విచారణకు ఆదేశించింది. రూపాయి ఖర్చు చేయలేదని చెబుతున్నా.. అవినీతి జరిగిందంటూ 2020 మార్చి 7న ఏబీవీని సస్పెండ్‌ చేసింది. దీంతో న్యాయపోరాటానికి దిగిన ఏబీవీ… క్యాట్‌ ఆదేశాలతో రెండేళ్ల తర్వాత 2022లో పోస్టింగ్‌ దక్కించుకున్నారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తనపై కుట్రపూరితంగా కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అవకాశంగా ప్రభుత్వ చర్యలపై బహిరంగంగా మాట్లాడినందుకు ఆలిండియా సర్వీ్‌స రూల్స్‌ ప్రకారం జగన్‌ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు సిద్ధపడింది. అప్పట్లో కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఆర్‌పీ సిసోడియా ముందు హాజరైన ఏబీవీ… తనను కుట్రపూరితంగా ఇరికించేందుకు ఎవరెవరు ఫోర్జరీ పత్రాలు సృష్టించారో వివరించారు. ఆలిండియా సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించలేదని స్పష్టం చేశారు. అయినా సంతృప్తి చెందని జగన్‌ సర్కారు, సాక్షులను బెదిరిస్తున్నారంటూ మరోమారు ఏబీవీని సస్పెండ్‌ చేసింది. కాగా, మీడియాతో మాట్లాడారని ఏబీవీకి గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు చార్జి మెమోలను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సర్వీసు నిబంధనల ప్రకారం గత ప్రభుత్వం విచారణ అధికారిని నియమించకుండా కాలయాపన చేసింది. వాటిని జారీచేసి ఏడాది పూర్తికావడంతో ఆ ఉత్వర్వులు నిరర్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో చార్జిమెమోలను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
👉 నంద్యాలలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగింపు… అఖిలప్రియ స్పందన
అఖిలప్రియ తన సీటులో కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహనరెడ్డి..
ఎస్వీ జగన్మోహనరెడ్డితో ఎమ్మెల్యే అఖిలప్రియ వాగ్వివాదం..
తొలగించిన శిలాఫలకానికి పాలాభిషేకం చేసిన అఖిలప్రియ..
వైసీపీ నేత, నంద్యాల విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహనరెడ్డి తీరుపై ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. అఖిలప్రియ మంగళవారం నంద్యాలలోని విజయ డెయిరీ కార్యాలయానికి అనుచరులతో కలిసి వెళ్లారు. విజయ డెయిరీ వద్ద కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి దివంగత ఎన్టీఆర్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని తొలగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధునీకరణ పేరుతో ఇలా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. శిలాఫలకాన్ని తొలగించిన డెయిరీ చైర్మన్ ఎస్పీ జగన్మోహనరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రోటోకాల్ విస్మరించి ఎన్టీఆర్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని తొలగించడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు. డెయిరీలో పక్కన పెట్టిన శిలాఫలకానికి అఖిలప్రియ పాలాభిషేకం చేశారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి చైర్మన్ సీటులో కూర్చున్నారు. ఎండీతో అఖిలప్రియ మాట్లాడుతున్న సమయంలో డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహనరెడ్డి ఫోన్ చేశారు. తాను లేని సమయంలో కార్యాలయానికి వచ్చి తన సీటులోనే కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబ్బంది కూర్చోమంటేనే తాను కూర్చొన్నానని అఖిలప్రియ బదులిచ్చారు.
‘నాతో మామగా మాట్లాడుతున్నావా.. లేక చైర్మన్‌గా మాట్లాడుతున్నావా..మామవైతే నీ సీట్లో కూర్చొంటే తప్పేముంది. మీ ఇష్టం వచ్చినట్లు డెయిరీ నిర్వహణ చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. నాకు ఎందుకు ఫోన్ చేశావు అసలు.. మీ సీట్లో కూర్చోవడం ఇబ్బందైతే అదే విషయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకో..గతంలో మా కుర్చీలో మీరు కూర్చోలేదా..నన్ను కుర్చీలో నుండి కదపండి చూద్దాం అంటూ ఎస్వీ జగన్మోహనరెడ్డికి సవాల్ చేశారు. ఇలా ఇద్దరి మధ్య కొద్ది సేపు మాటల యుద్దం జరిగింది. ఈ వ్యవహారం కర్నూలు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
👉స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఈడీ దూకుడు*
స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు 23 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. సీమెన్స్ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ అధికారులు నిర్ణయం తీసుకుంది. 2014లో స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ జరిగిందని మొన్నటి వైసీపీ ప్రభుత్వం విచారణకు సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో చంద్రబాబు నాయుడు అరెస్టయి 53 రోజులు జైలులో కూడా ఉన్నారు.
ఆస్తులను అటాచ్ చేసి…
అయితే సీఐడీ దర్యాప్తును అనుసరించి నిధులు వ్యక్తిగత ఖాతాల్లోకి దారి మళ్లింపు జరిగిందని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు గుర్తించారు. దీంతో ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో ఈడీ వేగం పెంచిందని దీనిని బట్ట ి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇంకా ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
👉 తెలంగాణలో జరిగిన అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.
తిరుమల లడ్డూ వివాదంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టి సనాతన ధర్మం రక్షణ కోసం ఉద్యమిస్తానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం దుర్మార్గం అని మండిపడ్డారు. అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. విగ్రహం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. హిందూత్వ సంఘాలు ఈ సంఘటనను ఖండిస్తున్నారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సంఘటనలో కొందరిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే
👉విజయవాడ..
నారాయణ కాలేజ్ లో దారుణం..
ఫీజు కట్టలేదని సుమారు 30మంది విద్యార్థులను బుధవారం తెల్లవారుజాము నుంచే రోడ్డుపై నిలబెట్టిన యాజమాన్యం..
కానూరు 100అడుగుల రోడ్డులోని శివ భవానీ బ్రాంచ్ స్టూడెంట్స్ కి పనిష్మెంట్ పేరుతో రోడ్డుపై నిలబెట్టిన ప్రిన్సిపాల్..ఇళ్లకు ఫోన్లు చేసి ఏడుస్తూ తమ పేరెంట్స్ కు సమాచారం ఇస్తున్న విద్యార్థులుఒకవైపు చదువుల ఒత్తిడి మరోవైపు ఫీజు కట్టకపోవడంతో అవమానం..
పిల్లల గురించి ఆందోళన చెందుతున్న తల్లితండ్రులు..
👉 ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ కి చెందిన బాలిరెడ్డి కి చెందిన బ్రాందీ షాపును కొందరు తాళాలను బద్దలు కొట్టి సెక్యూరిటీని బెదిరించి బ్రాందీ మరియు బీరు బాటిల్లను ధ్వంసం చేశారు.ప్రభుత్వానికి సంభందించిన కంప్యూటర్ మరియు ఇతర పరికరాలను ధ్వంసం చేశారు.
షాపు నందు దాదాపు 10 లక్షల విలువ గల వైన్స్ ఉంది సీసీ కెమెరాలను సైతం పగులకొట్టారు.

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.