👉వైసిపి నేత మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు.*
*రేపు ఉదయం 10:00 నుంచి 4:00 మధ్యలో విచారణ కు హాజరుకావాలని నోటీసు జారీ చేశారు …*
*దీనిపై మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు స్పందించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో ఇప్పటి వరకు 65 మందిని విచారించటం జరిగింది. అందులో ఇప్పటి వరకు 28మందిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇప్పటికే పలువురు నిందితులను
ఈ కేసులో విచారించామని అరెస్టులు పర్వం కొనసాగిందని,
ఇంకా పలువురును విచారించాల్సిన అవసరం ఉందని విచారణలో వెలుగులోకి వచ్చిన నిందితులను గుర్తించి వారిని అరెస్ట్ చేస్తామని శ్రీనివాస్ తెలిపారు.
మిగతా ముద్దాయిలు కోర్ట్ ను ఆశ్రయించటం జరిగింది. పోలీస్ విచారణకు సహకరించాలి అని కోర్ట్ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డికి నేడు నోటీసులు ఇవ్వటం జరిగింది.గురువారం ఉదయం విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరవుతారని ఆయన నుంచి కావాల్సిన సమాచారాన్ని రాబట్టి కేసులో ఇంకా దాగి ఉన్న నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.
ఇప్పటికే గూగుల్ కు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. గూగుల్ లొకేషన్ మరియు ఆధారాల కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు నిందితులు తప్పించుకొని పోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రూరల్ సీఐ తెలిపారు.
👉మద్య నిషేధం చేస్తానని, మద్యం తయారు చేసి, మద్యం అమ్మి, మద్యం మీద వచ్చే ఆదాయం దోచేసిన నువ్వు మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నావా జగన్ ?..మద్య నిషేధం అని చెప్పి పాలసీలు మార్చి దోచేశారు.. మాజీ సిఎం జగన్ పై అధ్యమెత్తిన మంత్రి లోకేష్..
👉ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని, జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. కొత్తగా తెచ్చిన మద్యం పాలసీ వల్ల 72 శాతం అమ్మకాలు పెరిగాయి. విచ్చలవిడిగా అమ్మకాలు పెంచారు. సగటున మద్యం సేవించే వారి సంఖ్య 2019-2020 మధ్యన 5.55 నుండి 6.23 శాతానికి పెరిగింది. రేట్లు పెంచి లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తామని చెప్పినప్పటికీ భారీగా వినియోగం పెరిగింది. ఇదేనా సైకో జగన్,నువ్వు చెప్తున్న నీ గొప్ప లిక్కర్ పాలసీ ?..రూ.50 మందు రూ.250కి అమ్మిన నువ్వు చేసింది మద్యం వ్యాపారం. ఈ నకిలీ మద్యం తాగి ఎంత మంది చనిపోయారో, మన ఊరిలో మన కళ్ళ ముందే అనేక మంది కనిపిస్తున్నారు. ఇక ఇంత రేటు పెట్టి మద్యం తాగలేక గంజాయికి, నాటు సారాకి బానిసలు అయ్యారు. ఈ పాపానికి కారణం నువ్వు కాదా ?
👉ఐదేళ్ల పాటు అమ్మిన మద్యానికి డిజిటల్ చెల్లింపుల్లో కాకుండా కేవలం నగదు రూపంలో విక్రయించి రూ. 99,413.50 కోట్లు తీసుకున్నారు. డిజిటల్ చెల్లింపుల రూపంలో కేవలం రూ.615 కోట్లు మాత్రమే తీసుకున్నారు. ఈ రోజుల్లో తోపుడు బండ్ల వాళ్లు కూడా ఆన్ లైన్ పేమెంట్ తీసుకుంటుంటే ఇక్కడ మాత్రం అసలు ఆన్ లైన్ పేమెంటు అనేదే లేకుండా చేశారు. బిల్లు ఇవ్వండని అడిగిన వారిని అరెస్టులు చేశారు. ఈ డబ్బు మొత్తం నీ తాడేపల్లి కొంపకి తరలించింది వాస్తవం కాదా ?
నువ్వు అధికారంలోకి రాగానే, డిస్టిలరీస్ అన్నీ మిథున్‌రెడ్డి చేతిలోకి వెళ్ళింది వాస్తవం కాదా ? తయారీ నుంచి సరఫరా వరకూ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి, సుబ్బారెడ్డి అయితే వెనుక ఉన్నది నువ్వు కాదా జగన్ రెడ్డి ? 2019లో నువ్వు వచ్చిన తరువాత తెచ్చిన మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
👉మీ దోపిడీ కోసం బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుండి వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఏపీ బేవరేజేస్ లో వంద కంపెనీలు మద్యం తయారు చేస్తుంటే అందులో 74% మద్యాన్ని నాటి నీ ప్రభుత్వం కొనుగోలు చేసింది 16 కంపెనీల నుంచి. అవన్నీ నీ బినామీ కంపెనీలే కదా ? రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ డ్యూటీ (పన్ను) అని వసూలు చేసావ్. కానీ ఆ మొత్తం ఎక్కడికి వెళ్లిందో, ఇప్పటికీ తెలియడం లేదు..
👉 2014-19 మధ్య 31 బ్రాండ్ల లిక్కర్ బాటిల్ ధర రూ.50 నుండి రూ.70 మధ్యనే ఉండేది. 2019-24 మధ్య ఆ బ్రాండ్లన్నీ రద్దు చేసి కేవలం 2 బ్రాండ్లకు సంబంధినవి విక్రయించారు. ఆదాన్, గ్రేసన్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పీవీ స్పిరిట్స్ ఇలా పలు కంపెనీలు 2 వేల లక్షల లీటర్లు విక్రయించి రూ.20,356 కోట్లు ఆర్జించాయి. తక్కువ నాణ్యత గల లిక్కర్ ను సరఫరా చేశారు. ఇది నీ దోపిడీ కాక ఇంకేంటి ?
👉నీ నాసిరకం జే-బ్రాండ్స్ తాగి, 2019-24 మధ్య కిడ్నీలు పాడైనవారు 52 శాతం, ఊపిరితిత్తులు పాడైనవారు 54 శాతం పెరిగారు. ఇది నువ్వు తెచ్చిన జే-బ్రాండ్స్ విషం.
👉ప్రజలని దోపిడీ చేసే నీ మద్యం పాలసీ రద్దు చేసి, నూతన మద్యం విధానానికి శ్రీకారం చుట్టాం. 3,736 ప్రైవేటు రిటైల్ షాపులకు టెండర్లు పిలిస్తే, 90 వేల మంది వచ్చారు. రూ.1800 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. పారదర్శకంగా లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరిగింది. ఇది మా విధానం.
👉గీత కులాల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా వారికి మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ ఇచ్చి, లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తూ, గీత కులాలకు 340 షాపులు కేటాయించాం. నీ లాగా షాపులు తీసుకుని వెళ్లి మిథున్ రెడ్డి చేతిలో పెట్టలేదు. ఇది మా విధానం.
👉అక్రమ, కల్తీ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా ఏపీ నూతన మద్యం విధానం తెచ్చాం. సామాన్యుల కోసం చౌక ధరకు క్వాలిటీ మద్యం రూ.99 కంటే తక్కువ ధరకే జాతీయ స్థాయి బ్రాండ్ మద్యం అందిస్తున్నాం. నీలాగా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ, సొంత బ్రాండులు దింపలేదు. ఇది మా విధానం.
👉మద్యం కనీస ధరలను నిర్ణయించడానికి 90 రోజులలోగా టెండర్ కమిటీ ఏర్పాటవుతుంది. ఈ కమిటీకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. పొరుగు రాష్ట్రాల మద్యం ధరల ఆధారంగా ఏపీ మద్యం MRP ఉంటుంది. నీ లాగా రూ.50 మందు రూ.250కి అమ్మటం లేదు. ఇది మా విధానం.
👉ప్రజల ఆరోగ్యం, క్షేమం ప్రాధాన్యంగా ఏపీ నూతన మద్యం విధానం ఉంటుంది. 2 శాతం డ్రగ్ కంట్రోల్/ రిహాబిలిటేషన్ సెస్ వేస్తున్నాం. ఈ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మత్తు పదార్థాల నియంత్రణ, డి-అడిక్షన్ కేంద్రాల నిర్వహణ, కౌన్సిలింగ్ మొదలైన వాటి కోసం వినియోగిస్తారు
సుమారుగా రూ.90 నుంచి 100 కోట్లు ఇందుకోసం కేటాయిస్తారు. నీ లాగా తాగి ఊగమని ప్రమోట్ చేయం. ఇది మా విధానం.
👉మార్కాపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాథ్….
ఉదయం నుంచి కరెంటు లేకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్, మేనేజ్మెంట్ పై మండి పడ్డ సబ్ కలెక్టర్….6 గంటలు కరెంటు లేకపోవడంతో బాలింతలు, పసిపిల్లలు, రోగులు ఇబ్బందులు పడ్డారని మేనేజ్మెంట్ పై ఫైర్ అయిన సబ్ కలెక్టర్…..హాస్పిటల్లో జనరేటర్ ఉండి కూడా ఎందుకు ఉపయోగించ లేదని ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం…ఆస్పత్రికి సంబంధం లేని వ్యక్తులు రాత్రి పూట ఐసీయూలో నిద్రించడంపై సూపరింటెండెంట్ , వైద్యులను ఆరా తీసిన సబ్ కలెక్టర్..
👉 డాక్టర్లు అందుబాటులో లేరని డెలివరీ చేసిన నర్సులు.. శిశువు మృతి..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని, నర్సులు ప్రసవం చేయడంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి వివరాల ప్రకారం.. నాగసాలకు చెందిన కీర్తి నెలలు నిండటంతో ప్రసవం కోసం బుధవారం ఆసుపత్రికి రాగా, అంతా బాగానే ఉందని రేపటిలోపు డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ సాయంత్రం పురిటినొప్పులు రాగా, హెడ్ నర్స్ ఆమెకు ప్రసవం చేశారు. అయితే ఉమ్మనీరు తాగడంతోనే శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పారు.
👉 మహిళలు అని చూడకుండా అర్థరాత్రి గ్రూప్ 1 అభ్యర్థులను అరెస్టు చేసిన పోలీసులు.. వీడియో వైరల్..
ఎక్కడికి తీసుకువెళ్తున్నారని అడిగిన కూడా చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న పోలీసులు…
👉హైదరాబాద్ లో ఐటీ సోదాలు_*హైదరాబాద్లో
గురువారం కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుత్ రావు ఇంట్లో, బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ ఐటీ దాడులపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
👉కడప పట్టణంలో “అమిన్ పీర్ దర్గా” ఉర్సు గంధమహోత్సవ కార్యక్రమాలకు! ముఖ్యమంత్రి వర్యులు నారాచంద్రబాబు నాయుడును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానం పలికిన మఠాధిపతులు.
👉 మద్యంపై ఆ పన్నులు తొలగింపు..
మద్యంపై ఆ పన్నులు తొలగింపు
ఏపీలో కొత్త మద్యం షాపులు ప్రారంభమైన విషయం తెలిసిందే. మద్యంపై ఉన్న పలు రకాల పన్నులు, మార్జిన్‌లను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న 4 శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను, ఏపీఎస్‌బీసీఎస్ రిటైల్ మార్జిన్ (6 శాతం), ల్యాండెడ్ కాస్ట్‌పై 10 శాతం అదనపు ఎక్సైజ్ పన్నులకు స్వస్తి పలికింది. గతంలో మొత్తంగా 10 రకాల పన్నులు ఉండగా.. 6కి తగ్గించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
👉 హైదరాబాద్: కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై SOT దాడులు.. నగర శివారు ప్రాంతంలోని కోహినూర్ సంస్థలో సోదాలు చేస్తున్న SOT అధికారులు.. నకిలీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తింపు.. ముడి సరుకుల పాల ఉత్పత్తులను తయారు చేస్తున్న కోహినూర్ సంస్థ.. కోహినూర్ సంస్థ యజమాని గజేందర్ సింగ్ అరెస్ట్.. 300 కేజీల పన్నీర్, మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్న SOT.. కెమికల్స్ తో కలాకండ్ స్వీట్స్ తయారు చేస్తున్న కోహినూర్.. పాల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన ముడి సరుకు స్వాధీనం..
👉ఏపీ: సొంత మీడియాపై తిరగబడ్డ టిడిపి ఎమ్మెల్యే భార్య..!
టిడిపి పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా పేరు అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రజ్యోతి పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ముఖ్యంగా ఆర్కె అంటే చంద్రబాబుకు ముఖ్యమైన వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. అయితే అలాంటి మీడియా మీద గత కొద్దిరోజులుగా చాలామంది టీడీపీ నేతలు గొంతెత్తుతూ విమర్శిస్తూ ఉన్నారు. కొద్దిరోజుల క్రితం కోలికపుడి శ్రీనివాసరావు కూడా పలు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా కులపర్తి ఎమ్మెల్యే భార్య సుధా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురయ్యాలా చేస్తున్నాయి.
ఇప్పుడు తాజగా తన భర్త ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రగిరికి మాత్రం తాను ఎమ్మెల్యే అంటూ చెప్పుకొచ్చారు.. తాను తిరిగి ఇక్కడ గెలిపించాలని అందుకే ఆ హామీలను నెరవేర్చ పనిలో ఉన్నానంటూ తెలిపింది సుధా రెడ్డి. కానీ తన కుటుంబం మీద చెవిరెడ్డి అన్న తన అనుచరులు కొంతమంది సోషల్ మీడియా గ్రూపులలో తమ కుటుంబం పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ కేసు పెట్టింది వారందరూ కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ ఫైర్ అయ్యింది. అయితే ఈ పేపర్ ఫోటోలన్నీ కూడా ఆంధ్రజ్యోతి పేపర్ కి సంబంధించినవని ఆమె తెలియజేసినట్లుగా సమాచారం.
ఈ పేపర్లో గడిచిన కొద్ది రోజుల క్రితం తమ్ముళ్ళు ఇది తగదు అనే పేరుతో పెద్ద బ్యానర్ ని వేశారు. దీంతో అందుకు సంబంధించిన ఫోటోల పైన ఆమె సీరియస్ అవుతూ ఇలా సొంత మీడియాలోనే పలుకు కథనాలు రావడం తనకు చాలా ఇబ్బంది కలుగుతోందని ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అంటూ ఆమె ఆరోపణలు చేయడం జరిగింది.. మరి సుధా రెడ్డి కుటుంబం ఆర్కేను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది.. మరి ఈ విషయం పైన మరి ఎవరు కాంప్రమైజ్ అవుతారు లో లోపల ఏమైనా సర్దుబాట్లు జరుగుతాయా లేదా చూడాలి మరి. మొత్తానికి సొంత మీడియా మీదే టిడిపి నేత భార్య ఎదురు తిరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.అంతేకాకుండా ఆంధ్రజ్యోతిలో కూడా కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తూ పలు కథనాలు వెలువడుతున్నాయి.
👉👉పలు వివాహ మహోత్సవ కార్యక్రమాలకు హాజరు అయిన మాజి ఎమ్మెల్యే అన్నా.. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త ఎమ్మెల్యే అన్నా రాంబాబు వాళ్లు వివాహ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
*మార్కాపురం టౌన్ శుభం కళ్యాణమండపం నందు మూల అల్లూరి రెడ్డి, కాశీశ్వరిల కుమారుడు వివాహానికి హాజరయి నూతన వధువువరులు అయిన ప్రసన్న కుమార్ రెడ్డి, సౌమ్యలను
*మార్కాపురం టౌన్ జగదాంబ సమేత మార్కండేశ్వరస్వామి వారి కళ్యాణమండపం నందు జాగర్లపూడి రాంబాబు శర్మ,శైలజ కుమారి ల కుమార్తె వివాహానికి హాజరయి నూతన వధువువరులు అయిన లక్ష్మీ దీపిక,శంకర శాస్ట్రీ లను,
*మార్కాపురం టౌన్ “B”కన్వెన్షన్ హాల్ నందు గుంటక వెంకటరెడ్డి, విజయరాణిల కుమార్తె వివాహానికి హాజరయి నూతన వధువువరులయిన డా”విజయ లక్ష్మి,డా”సుమంత్ రెడ్డి లను ,
*మార్కాపురం టౌన్ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమండపం నందు జంకే చెన్నారెడ్డి, రామలక్ష్మమ్మ ల కుమార్తె వివాహానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన మహేశ్వరి,మహేశ్వరరెడ్డిలను,
*మార్కాపురం మండలం భూపతిపల్లె గ్రామంలో శరబారెడ్డి,బాలకోటమ్మల కుమారుడు వివాహానికి హాజరుఅయి నూతన వధువరులయిన మల్లికార్జునరెడ్డి,శారదా లను ఆశీర్వదించారు.కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్టాఫ్ రిపోర్టర్ ఎస్ ఎస్ రహమాన్
👉గిద్దలూరు లో మరో హైడ్రా!!
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల ఆధ్వర్యంలో రోడ్డు కు ఇరు వైపులా ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఎన్ని సార్లు ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చిన స్పందన లేదని స్వయంగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మున్సిపల్ కార్మిక సిబ్బంది సహాయంతో అక్రమ బంకులను తొలగించారు.
ఇటీవల కాలంలో రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా మరియు డ్రైనేజీ కాలువలు ఇష్టారాజ్యంగా కూర్చి వేయడం వలన వర్షపు నీరు పోవడానికి మార్గం లేక ప్రజల అవసరం దృష్టిలో పెట్టుకొని తొలగించామని,ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు నిర్మించడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు.. డివిజన్ రిపోర్టర్ అస్లాం బేగ్
జగన్ పై నిప్పులు చెరిగిన లోకేష్..వైసిపి నేత మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జలకు పోలీసు నోటీసులు ..మహిళలు అని చూడకుండా అర్థరాత్రి గ్రూప్ 1 అభ్యర్థులను అరెస్టు చేసిన పోలీసులు!..హైదరాబాద్ లో ఐటీ సోదాలు..సొంత మీడియాపై తిరగబడ్డ టిడిపి ఎమ్మెల్యే భార్య..!..జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో శిశువు మృతి.. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాథ్.. గిద్దలూరులో మరో హైడ్రా .. పలు వివాహ కార్యక్రమాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా..
Recent Posts