హైదరాబాద్ నడిబొడ్డున ఐదు వందల కోట్ల రూపాయల ఖరీదైన భూమి కబ్జా? ..బైబిల్ పై ప్రమాణం చేస్తా.. నువ్వు చేస్తావా”-షర్మిల..28న ఏపీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల” భేటీ..ఈ నెల 31న ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు..చిత్తూరులో 6 కొత్త బస్సులు ప్రారంభం..ఆర్టీసీ ప్ర‌యాణికులకు మెరుగైన సేవ‌లు.. ఆర్టీసీ ఈడి..కోతుల దాడిలో చిన్నారికి గాయాలు…తిరుపతిలో ముమ్మరంగా తనిఖీలు .. కనిగిరి, గిద్దలూరులో రక్తదానం..గిద్దలూరులో విత్తనాల పంపిణీ.. బెల్టు షాపులపై దాడులు ( కంభం).

👉 సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత*
కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేప్పట్టిన తండా వాసులు.
తమ గ్రామాల్లో ఫార్మా వద్దంటూ ఆందోళన చేసిన గ్రామస్థులు.ఆందోళన కారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు.
👉హైదరాబాద్ నడిబొడ్డున ఐదు వందల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ గద్దలు.. నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న వీడియో..మల్కాజిగిరి, తిరుమలగిరి ప్రాంతంలోని 399, 409, 410, 411 సర్వే నంబర్ లోని 19 ఎకరాల భూమి కబ్జా👉 యాబై ఏళ్ల క్రితం కొన్న భూమి నుంచి భూ యజమాని గెంటివేత.. బాధిత కుటుంబం రాచకొండ సీపీని ఆశ్రయించినా కబ్జాదారులకే సపోర్ట్
👉 సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్, సీఎం సన్నిహితుడు ఫయీం, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కలిసి సెటిల్ చేసుకోండని చెప్తున్న పోలీసులు ?
👉కాంగ్రెస్ రాబందుల పాలనలో సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపణలు…
👉 నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం రంగుండ్ల గ్రామం నుంచి అర్ధరాత్రి 12 గేదెలు,22 ఎద్దులను కంటైనర్ అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న సాగర్ పోలీసులు…గేదెలు,ఎద్దులను చండూరు బోరుగడ్డ గోశాలకు తరలించిన పోలీసులు…దొంగతనంగా గేదేలు,ఎద్దులను తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసిన సాగర్ పోలీసలు…పట్టుపడ్డ గేదెలు,ఎద్దులు విలువ సుమారు 40 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా…
👉బైబిల్ పై ప్రమాణం చేస్తా”..వైఎస్సార్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ! ఈ సమయంలో సాక్షి మీడియా ద్వారా బుధవారం పలు కథనాలు ప్రసారమయ్యాయి. ఏపీలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. షర్మిల, విజయమ్మలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ను అశ్రయించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సాక్షి మీడియా ద్వారా బుధవారం పలు కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై తాజాగా షర్మిల స్పందించారు. అవును… ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా… వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాసినట్లు తెలిపారు! .ఈ సందర్భంగా… “ఈ రోజు పొద్దున్న సాక్షి పేపర్ చూశాను.. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి ఏదైనా నమ్మించగలడు” అని మొదలుపెట్టిన షర్మిల.. “అయినప్పటికీ వైఎస్సార్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాదని” అన్నారు.
“నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం”!: ఈ సందర్భంగా… నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి అమ్మ వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకంలో… “రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తు అయితే.. తన బిడ్డ షర్మిల మరొకెత్తు” అని రాశారని.. నాన్నకు నేనంటే అంత ప్రేమ అని షర్మిల అన్నారు. ఆయన బ్రతికున్నంత కాలం… “నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం” అని అనేవారని తెలిపారు. ఇదే సమయంలో… రాజశేఖర్ రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే అని, అవి జగన్ మోహన్ రెడ్డి సొంతం కాదని, ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ “గార్డియన్” మాత్రమే అని, అన్ని వ్యాపారాలనూ నలుగురు పిల్లలకు సమానంగా పంచిపెట్టడం జగన్ బాధ్యత అని షర్మిల తెలిపారు. ఈ విషయంలో వైఎస్సార్ ఉద్దేశ్యం ఆన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికీ స్పష్టంగా తెలిసిన విషయమని.. అందులో కేవీపీ రామచంద్రరావు, వైవీ సుబ్బరెడ్డి, విజయసాయిరెడ్డి కూడా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఇది వైఎస్సార్ మేండేట్ అని ఆమె స్పష్టం చేశారు. ఒక్క సండూరు మినహాయించి.. సరస్వతి, భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ వ్యాపారాలన్నీ వైఎస్సార్ బ్రతికి ఉండగా స్థాపించినవి అని.. అందులో నలుగురు బిడ్డలకూ సమాన వాటా ఉండాలనేది వైఎస్సార్ మేండేట్ అని ఆమె పునరుద్ఘాటించారు. “సండూరు మినహా అన్నీ ఫ్యామిలీ ఆస్తులే”!: ఒక్క సండూరు మినహాయించి.. మిగిలిన అన్ని వ్యాపారాలూ కుటుంబ వ్యాపరాలే అని.. వైఎస్సార్ బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవమని.. నేను జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదమని.. నాకంటూ వ్యక్తిగతంగా ఆస్తులపై మోజు లేదని.. వీళ్లు పెట్టిన హింసలకు ఆ ఆస్తులు కావాలనే కోరిక కూడా లేదని షర్మిళ తెలిపారు. కాకపోతే… నా బిడ్డలకు ఆస్తులు చెందాలనేది వైఎస్సార్ అభిమతం గనుక ఈ రోజు వరకూ అమ్మ అయినా, తానైనా తపనపడుతున్నామని.. ఈ విషయంపై అమ్మ ఇప్పటికే వెయ్యి సార్లు అడిగి ఉంటుందని.. అయినా కూడా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తులు ఒక్కటి కూడా ఇవ్వలేదని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు! “బిడ్డలను పక్కన పెట్టి పార్టీని భుజాలపై మోసాను”!: ఇదే క్రమంలో… వైఎస్సార్ మరణించిన తర్వాత సుమారు 10 ఏళ్లు జగన్ ఇబ్బందులు పడితే అవి నా ఇబ్బందులు అనుకుని శక్తికి మించి సహాయం చేశానని… ఆ సమయంలో నా తోడబుట్టినవాడి కోసం బిడ్డలను సైతం పక్కన పెట్టి ఆయన పార్టీని ఏ స్వార్ధం లేకుండా నా భుజాల మీద మోశానని షర్మిల తెలిపారు. ఇక ఆ పదేళ్లలో నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ కంపెనీలోని డివిడెండ్ లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ రు.200 కోట్ల మేటర్ అని షర్మిల తెలిపారు. ఈ విషయంలో వాళ్లు చేసింది ఉపకారం కాదు, ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు, నాకు సమనా వాటా ఉంది కాబటి డివిడెండ్ లో సగం వాటా ఇచ్చారు.. అది కూడా అప్పుగా చూపించమన్నారు అని షర్మిల పేర్కొన్నారు! జగన్ సీఎం అయ్యాక గుర్తుపట్టలేనంతగా మారిపోయారు!: 2019లో జగన్ సీఎం అయిన తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయారని.. సీఎం ఎయిన నెలరోజులకే విడిపోదామని ఇజ్రాయెల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారని.. దీనికి అమ్మా, నేనూ వద్దని చెబితే.. ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టారని తెలిపారు. తర్వాత విజయవాడలో.. సాక్షిలో తనకు ఎక్కువ వాటా కావాలని అడిగారని తెలిపారు. ఈ సమయంలో అర్ధగంటలో ఆస్తుల వాటా అయిపోయిందని.. ఇందులో భాగంగా… సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్ లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్ లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్సార్ నివాసమున్న ఇల్లు, మరికొన్ని ఆస్తులు నా భాగానికి వచ్చినట్లు షర్మిల తెలిపారు. ఈ క్రమంలోనే 2019లో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి ఎంవోయూ తయారయ్యిందని.. అయితే… కేసుల్లో లేని సరస్వతి, యలహంక ప్రాపర్టీలను ఎంవోయూ ఎంవోయూపై సంతకం పెట్టిన 2019లోనే ఇవ్వాల్సి ఉండగా ఈ రోజు వరకూ నాకు ఇవ్వాలన్న ఉద్దేశ్యం వాళ్లకు లేదని షర్మిళ సెటైర్లు వేశారు!! ఆ తర్వాత 2021లో తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టడం.. మొదట తెలంగాణలో, తర్వాత ఆంధ్రకు రావడం జరిగిందని అన్నారు. “టీడీపీ హ్యాండిల్ లో లెటర్ పోస్ట్ అయితే…?” ఈ సందర్భంగా నేను జగన్ కి ఓ లేఖ రాస్తే.. అది ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ అయితే.. నాకు ఏమి సంబంధం అని షర్మిల ప్రశించారు. తానైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని.. నా వరకూ నేను గానీ,నా మనుషులు గానీ బయటపెట్టలేదని.. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్సార్ బిడ్డకు లేదని షర్మిల పేర్కొన్నారు.
👉ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో “28న ఏపీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిలారెడ్డి” భేటీ!.. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో జిల్లా సమీక్ష సమావేశం…నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలి:జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా.
పొదిలి (అక్టోబర్ 25) ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో ఏపీసీసీ చీఫ్ వై.యస్. షర్మిల రెడ్డి ఈనెల 28.వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల కు విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ లో భేటీ కానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా తెలిపారు.ఈ సమావేశానికి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు చెందిన నియోజకవర్గ పార్టీ బాధ్యులు, జిల్లా, రాష్ట్ర స్థాయి వివిధ పార్టీ కమిటీల్లో ఉన్నవారు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు హాజరుకావాలని సైదా కోరారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థగత నిర్మాణం,
జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యలు, వాటి పరిష్కారానికి పార్టీ తరఫున చేయబోయే ఉద్యమాలు తదితర అంశాలు మీద పిసిసి అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి, ఏఐసీసీ సహాయ కార్యదర్శి ఏపీ ఇంచార్జ్ పాలక్ వర్మ
దిశ నిర్దేశం చేయనున్నట్లు షేక్ సైదా అన్నారు.
ఈ సమావేశానికి ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెo
అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ బాధ్యులు బాధ్యత తీసుకొని సకాలంలో ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు అందరూ హాజరయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా కోరారు.
👉విజయవాడలో స్నేహితుల మధ్య ఘర్షణ.. గాజుసీసాతో దాడి..విజయవాడ గొల్లపూడిలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. భవానిపురం పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. గోవింద్ అనే యువకుడు సాయిపై గాజు సీసాతో దాడి చేశాడని తెలిపారు. సాయికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రక్తసిక్తంగా ఉన్న యువకులను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
👉ఈ నెల 31న ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు.ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్లను బుకింగ్‌ చేసుకోవచ్చు.పట్టణాల్లో 24 గంటల్లోపు, గ్రామాల్లో 48 గంటల్లోపు సిలిండర్‌ డెలివరీ అవుతుంది._
_ఈ పథకం ద్వారా సర్కార్‌కు ప్రాథమికంగా రూ.2,674 కోట్లు ఖర్చవుతుంది..మొత్తం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.
👉 చిత్తూరులో 6 కొత్త బస్సులు ప్రారంభం ఎమ్మెల్యే..
చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో 6 కొత్త బస్సులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు, రవాణా శాఖ మంత్రి చొరవతో ఇప్పటివరకు 70 బస్సులను జిల్లాలో ప్రారంభించామన్నారు. గిరింపేట మున్సిపల్ విద్యార్థుల విన్నపంతో అనుపల్లి, ప్రశాంత్ నగర్, ఓల్డ్ కలెక్టరేట్, గిరింపేట, పాత బస్టాండ్ వరకు లోకల్ బస్సులను ప్రారంభించామన్నారు.
👉 ఆర్టీసీ ప్ర‌యాణికులకు మెరుగైన సేవ‌లు*..చిల‌క‌లూరి పేట‌లో ఆర్టీసీ ఈడీ వెంక‌టేశ్వ‌ర‌రావు విస్తృత ప‌ర్య‌ట‌న‌..
*విజ‌య‌వాడ బ‌స్సులో ప్ర‌య‌ణించి స‌మ‌స్య‌లు తెలుసుకున్న ఈడీ..*క‌ళామందిర్ సెంట‌ర్ విజ‌య‌వాడ‌కు మ‌రిన్ని స‌ర్వీసులు* చిల‌క‌లూరిపేట‌: ప్ర‌యాణికులకు మెరుగైన సేవ‌లు అందించ‌టానికి ఏపీఎస్ ఆర్టీసీ సంసిద్దంగా ఉంద‌ని ఆ సంస్థ ఈడీ వెంక‌టేశ్వ‌ర‌రావు చెప్పారు. శుక్ర‌వారం ఆయ‌న చిల‌క‌లూరిపేట‌లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. చిల‌క‌లూరిపేట నుంచి విజ‌య‌వాడ వెళ్లే బ‌స్సులో ప్ర‌య‌ణించి, ప్ర‌యాణికుల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. బస్టాండ్ ప్రాంగ‌ణంలో సౌక‌ర్యాలు, ప్ర‌యాణికుల సమ‌స్య‌లు గురించి ఆరా తీశారు. క‌ళామందిర్ సెంట‌ర్‌లో ప‌ర్య‌టించి స్థానిక ఆర్టీసీ ప్ర‌యాణికుల నుంచి సూచ‌న‌లు, స‌ల‌హాలు అడిగి తెలుసుకున్నారు. డిపో ఆవ‌ర‌ణ‌లో కార్మికులు, సిబ్బందిని అడిగి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ నిరంతరం ఆర్టీసీ ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌, సౌక‌ర్యాల‌కు ఆర్టీసీ ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని వెల్ల‌డించారు. చిల‌క‌లూరిపేట‌లో అత్య‌ధిక మంది ప్ర‌య‌ణికులు క‌ళామందిర్ సెంట‌ర్ నుంచి ప‌య‌ణిస్తున్నార‌ని, వారు విజ‌య‌వాడ‌కు మ‌రెన్ని స‌ర్వీసులు పెంచాల‌ని కోరార‌ని వెల్ల‌డించారు. ఇందుకు త‌గ్త‌ట్లు ప్ర‌యాణీకుల ర‌ద్దీ వెళ‌ల్లో మ‌రెన్ని స‌ర్వీసులు పెంచ‌టానికి అధికారుల‌తో మాట్లాడాని వెల్ల‌డించారు. ఆర్టీసీప్ర‌వేశ పెట్టి కార్గో స‌ర్వీసుల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని , సేవ‌లు మరింత‌గా పెంచాల‌ని సూచించారు. స‌మ‌య పాల‌న పాల‌న పాటించాల‌ని, ఆర్టీసీ ప్ర‌యాణీకుల సూచ‌న‌లు , స‌ల‌హాలు స్వీక‌రించి, మెరుగైన సేవ‌లు అందించాలన్నారు. ప్ర‌యాణికులు త‌మ స‌మ‌స్య‌ల‌ను *టోల్ ఫ్రీ నంబ‌ర్ 149కు ఫోన్ చేయాల‌ని* కోరారు.
👉కోతుల దాడిలో చిన్నారికి గాయాలు..గుంటూరు జిల్లా, పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కేంద్రంలో ఎన్టీఆర్ కాలనీలో కోతుల దాడిలో షేక్ అస్పర్ అనే చిన్నారికి గాయాలు. నాడు కుక్కలు నేడు కోతులు దాడులతో నిత్యం ఇబ్బందులు గురవుతున్న పెదనందిపాడు గ్రామస్తులు.. పలుమార్లు మీడియా ప్రతినిధులు హెచ్చరించినా కానీ మారని అధికారుల తీరు.. ప్రజలపై దాడులు చేస్తున్న కానీ చోద్యం చూస్తున్న అధికారులు.. నిమ్మకునీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులు మరియు కుక్కల దాడిలు నియంత్రించి ప్రజలకు ప్రాణాలకు భద్రత కల్పించాలని పెదనందిపాడు గ్రామ ప్రజానీకం కోరుకుంటున్నారు.
👉 తిరుపతిలో ముమ్మరంగా తనిఖీలు ..ఉగ్రవాదుల బాంబు బెదిరింపు నేపథ్యంలో పలు హోటల్స్ తనిఖీ.రిగాలియా హోలుల్ ను తనిఖీ నిర్వహించిన ఈస్ట్ పోలీసులు.స్ప్రింగ్, గ్రాండ్ హోటల్స్ ను తనిఖీలు నిర్వహించిన తిరుచానూరు పోలీసులు. పోలీస్ స్టేషన్ అధికారులతో పై అధికారులు సెల్ కాన్ఫరెన్స్ లు.నగరంలో పలు హోటల్స్ యాజమాన్యాన్ని అప్రమత్తం. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్న తిరుపతి పోలీసులు.
👉తప్పిపోయిన బాలుడు అనుమానస్పద మృతి*
గిద్దలూరు సెంయిట్ ఫాల్స్ బిఈడీ కళాశాల వెనుక కొండపై ఎఏఐబి పనులు చేపట్టిన గుత్తేదారుడు నిర్లక్ష్యంగా వదిలి వేసిన గుంతలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి.తప్పిపోయా డకున్న విద్యార్థి మృతదేహం శుక్రవారం గుంతలో లభ్యం.
👉 ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గిద్దలూరు అర్బన్, రూరల్ సర్కిల్ పరిధిలోని రాచర్ల, కొమరోలు,గిద్దలూరు పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా గిద్దలూరు అర్బన్ సీఐ కే సురేష్, గిద్దలూరు రూరల్ సీఐ జె రామకోటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో సుమారు 100 మంది రక్తదానం చేశారు.రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి ప్రారంభించారు.కార్యక్రమంలో ASI షేక్ జిలాని తన కుమారుడు జావెద్ కలిసి రక్తదానం చేశారు. తనతో పాటు తన కుమారునితో రక్తదానం చేపించి సమాజం పట్ల బాధ్యత గా ఉండాలని, రక్తదానం చేయడం వలన రక్తం అత్యవసరం అయిన వారికి ఉపయోగ పడుతుందని తద్వారా వారి ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం ఉంటుందని తెలిపిన ASI జిలాని. కుమారునితో కలిసి రక్త దానం చేసిన జిలానిని, అతని కుమారుడు జావేద్ ని అభినందించిన గిద్దలూరు పోలీస్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మధు సూదన రావు, గిద్దలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, చిన్న శ్రీను, చేరెడ్డి జయరాం రెడ్డి, అరిగెల వీరనారాయణ,బీజేపీ నాయకులు ఆపిశెట్టి శేఖర్ మరియు కూటమి నాయకులు, గిద్దలూరు అర్బన్ రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
👉బెల్ట్ షాపుపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్
•20 క్వార్టర్ బాటిళ్లు సీజ్.. ఒకరు అరెస్టు…_
*కంభం:* ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాపుపై ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పి తిరుపతయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 20 క్వార్టర్ (180 ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
👉 పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని రక్తదానం..
ప్రకాశం జిల్లా కనిగిరి సర్కిల్ కార్యాలయం నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథులుగా స్థానిక కనిగిరి కోర్టు జడ్జి మరియు సర్కిల్ పరిధిలో ఉన్న. పీసీ పల్లె సబ్ ఇన్స్పెక్టర్. జి కోటయ్య. హెచ్ఎం పాడు సబ్ ఇన్స్పెక్టర్. మాధవరావు. పోలీస్ కానిస్టేబుల్స్. మరియు విద్యార్థినీ విద్యార్థులు. రెడ్ క్రాస్ సొసైటీ వారికి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ గఫూర్. వివిధ నాయకులు ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ. దేశానికి ఎంతో మేలు చేసి ప్రాణాలు అర్పించిన పోలీసు వారికి నివాళులు అర్పించారు.
👉రైతుల సంక్షేమమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం*
*25% రాయితీతో రైతులకు శనగ విత్తనాలు పంపిణి*
*రైతుల సంక్షేమమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి గారు అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణంలో అగ్రికల్చర్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తనాల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గోన్న కృష్ణ కిషోర్ గారు రైతులకు శనగ విత్తనాలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రబీ సీజన్ లో గిద్దలూరు నియోజకవర్గంలో రైతులు అత్యధికంగా శనగ పంటలు వేస్తుండటంతో వారి అవసరతను గుర్తించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు ఎటువంటి కొరత లేకుండా నియోజకవర్గంలో 6800 క్వింటాల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని 25% రాయితీతో అగ్రికల్చర్ అధికారులు అన్నీ మండల కేంద్రాల్లో పంపిణి చేస్తారని,, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ బాలాజీ నాయక్, మండల ఏపీఓ లు, మరియు గిద్దలూరు జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ శానేశా వలి, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గోన్నారు.

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.