👉*మళ్ళీ మళ్ళీ చెబుతున్న 1995 సీఎం ని నేను, చంద్రబాబు సంచలన వ్యాక్యలు**
మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తాను 1995 నాటి చంద్రబాబునని ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంగళగిరి లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా తొలి సభ్యత్వం అందుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీని గెలిపించిన ఘటన కార్యకర్తలకే దక్కుతుందని అన్నారు. మొన్న జరిగింది ఎన్నికలు కావని.. రాక్షసుడితో యుద్ధం అని చంద్రబాబు కామెంట్ చేశారు. గడిచిన ఐదేళ్ల పడిన కష్టాలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నామని అన్నారు. గ్రామం నుంచి రాష్ట్రం వరకు పార్టీకి పటిష్టమైన యంత్రాంగం ఉందని తెలిపారు. పార్టీలో మెరిట్ ఉన్న వాళ్లకే పదువులు ఇస్తున్నామని పేర్కొన్నారు.
👉 అమెరికాలో కొనసాగుతున్న లోకేష్ పర్యటన
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు. లోకేష్ కు అక్కడి తెలుగు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారత దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ హైటెక్ సిటీ పేరు చెప్పగానే చంద్రబాబు గుర్తుకు వస్తారు. 2000 సంవత్సరంలోనే విజన్ 2020 పేరుతో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ 2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారని వారు ప్రశంసించారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేష్ కి స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
విజయం తర్వాత…
ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటుచేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక టీడీపీ నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, టీడీపీ జోనల్ ఇన్ చార్జి రవి మందలపు, ఐటి సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీష్ మండవ, సురేష్ మానుకొండ ఎయిర్ పోర్టులో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
👉తెలంగాణ న్యూస్..రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో వుండగా ఎదురు దెబ్బ..
రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ మరియు బీఎస్పీ కాంటెస్టెడ్ క్యాండెట్ నర్మదా మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు…
👉కస్తూర్బాలో బాలికల విద్యాలయంలో రెండో రోజు విద్యార్థులకు అస్వస్థత
సంగారెడ్డి – న్యాల్‌కల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రెండో రోజు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.నిన్న తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం సహా ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిన బాలికలు మళ్లీ అవే లక్షణాలతో ఈరోజు ఆస్పత్రిలో చేరారు.
నిన్న ఆరోగ్యం నిలకడగా ఉన్న బాలికలు ఇంటికి వెళ్లి పోయిన తెల్లవారుజాము నుంచి మళ్లీ తీవ్రమైన అస్వస్థతకు లోనవడంతో తల్లిదండ్రులు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు…
👉కాగజ్‌నగర్ రూరల్ ఎస్ఐగా పని చేసిన సోనియా సస్పెన్షన్..కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్ఐగా విధులు నిర్వహించిన ఎస్ఐ సోనియా, ఏఎస్ఐ మను ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ సస్పెండ్ అయ్యారు. సోనియా ఒక కేసు విషయంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు విచారణ జరిపి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
👉 సీతక్క పరామర్శ..
బౌరంపేటలో లైంగిక దాడికి గురై హైదర్ నగర్ లోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగు సంవత్సరాల చిన్నారిని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యాన్ని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్లు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ తో కలిసి చిన్నారిని, కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పాప పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని మంత్రి సీతక్క డాక్టర్లకు సూచించారు. చిన్నారి వైద్య చికిత్సకి అవసరమైన ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. పాప పూర్తిగా కోలుకునేంతవరకు దగ్గర ఉండి అన్ని రకాలుగా అండగా నిలవాలని కాంతి వెస్లీని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ అండగా ఉంటుందని సీతక్క వెల్లడించారు. తక్షణ అవసరాల నిమిత్తం బాధిత కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. పాప తండ్రి మిత్రుడే కిరాతకానికి పాల్పడడం దారుణం అన్నారు. ఘటన వెలుగు చూసిన వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు.
👉 సైదాబాద్ బాలసదన్ లోని ఆర్చరీ అకాడమీ పిల్లలకు స్వర్ణ పతకాలు..
హైదరాబాద్ జిల్లా విలువిద్య ఛాంపియన్షిప్ లో రూబెన్ కి స్వర్ణం..రంగారెడ్డి జిల్లా విలువిద్య ఛాంపియన్షిప్ లో అశోక్ కి స్వర్ణం..ఈమధ్య బాలసదనలో విద్యార్థులను కలిసి ప్రోత్సహించిన మంత్రి సీతక్క..
బాల సదన్ విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్ మోడల్స్ రావడం పట్ల మంత్రి సీతక్క హర్షం..
*పతక విజేతలను అభినందించిన మంత్రి సీతక్క..
*కరీంనగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపిన సీతక్క*
👉కంటతడి పెట్టిన వైస్ షర్మిల**
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల వివాదంపై ఆమె స్పందించారు. తల్లి విజయమ్మ జగన్ చేసిన పనికి మానసిక వేదనతో కుమిలిపోతున్నారని తెలిపారు.
కన్న తల్లిని న్యాయస్థానానికి లాగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని షర్మిల ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రరత్న భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె కంటతడి పెట్టారు. సుబ్బారెడ్డి జగన్ మోచేతి కింద నీళ్లు తాగే వ్యక్తిగా అభిర్ణించారు. జగన్ పాలనలో ఆయనతో పాటు కుమారుడు లాభపడ్డారన్న వైఎస్ షర్మిల సాయిరెడ్డి కూడా తనకు వ్యతిరేకంగానే మాట్లాడతారని తెలిపారు. సుబ్బారెడ్డి బిడ్డలపై ప్రమాణం చేసి నిజం చెప్పాలని వైఎస్ షర్మిల కోరారు.
అవి జగన్ ఆస్తులు కాదు…సంస్థలకు వారి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన అవి జగన్ ఆస్తులు ఎలా అవుతాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తన పేర్లు ఉంటే షర్మిలపై కేసులు నమోదు చేయాలి కదా? అని సుబ్బారెడ్డి అంటున్నారని, అయితే భారతిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు. తనకు బహుమతి ఇచ్చేటట్లయితే ఎంవోయూ ఎవరైనా ముందు రాసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఆ వ్యాపారాలన్నీ తండ్రి వైఎస్ స్థాపించినవేనని వైఎస్ షర్మిల కుండ బద్దలు కొట్టారు. తాను ఎన్నికల్లో జగన్ కోసం ఎన్ని కష్టాలు పడ్డానో అందరికీ తెలుసునని తెలిపారు. 3,200 కిలోమీటర్ల వరకూ పాదయాత్ర కూడా చేసిన విషయాన్ని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. జగన్ మనస్తత్వమే…జగన్ మనస్తత్వమే ఎదుటి వారిని అణగదొక్కడమేనని అన్న షర్మిల గత పదేళ్లలో ఎన్ని కష్టాలు పడినా ఎంవోయులు బయటపెట్టలేదని, వాటిని వాడుకోలేదని వైఎస్ షర్మిల తెలిపారు. తనకు రాజకీయంగా లాభం వస్తుందని భావిస్తే జగన్ ఎవరినైనా తన కోసం వాడుకుంటారని, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తారని వైఎస్ షర్మిల అన్నారు. జగన్ చేసిన మోసాన్ని వైసీపీ కార్యకర్తలు గుర్తించాలని అన్నారు. జగన్ బెయిల్ రద్దు కోసం తాము కోర్టులో కేసు వేశామని చెబుతున్నారని, జగన్ నాయకుడు కాదని శాడిస్ట్ అని అన్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి విద్యుత్తు ఛార్జీలను పెంచుతుందన్నారు.
👉తారురోడ్డు భూమిపూజ ఒంగోలు..నగరంలోని ఒంగోలు నగరంలోని మంగమ్మ కాలేజీ జంక్షన్ నందు 1.30 కోట్లతో నూతనంగా మంజూరు కాబడిన మంగమ్మ కాలేజీ జంక్షన్ వద్ద నుండి కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ వద్ద వరకు తారురోడ్డు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రావు,పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు గుంటూరు వెస్ట్ శాసనసభ్యులు గల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు.
👉అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యం పట్టివేత*
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో బజాజ్ రికవరీ ఏజెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా గోవా మద్యం నిల్వ ఉంచగా ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.బాలయ్య తెలిపారు.అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి 50 (750 ఎంఎల్) ఫుల్ బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకే గోవా నుంచి మద్యం దిగుమతి చేసుకుని స్థానికంగా అమ్మేందుకు ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. ఈ దాడుల్లో కంభం సిఐ ఎస్ .కొండారెడ్డి, కంభం మరియు మార్కాపురం ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు…
👉మానసిక ఒత్తిడిని జయించడం పై విద్యార్థులకు అవగాహన.. ప్రకాశం జిల్లా కంభం..
పరీక్షలలో మానసిక ఒత్తిడిని జయించడం పై ప్రముఖ మానసిక తత్వవేత్త మందుముల రాధాకృష్ణారావు ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం, ప్రేరణ అనే అంశంపై శనివారం స్థానిక వాసవీ విద్యానికేతన్ విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా పాలమూరు విశ్వవిద్యాలయం తత్వవేత్త పూర్వ ఆంధ్ర రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు మనవడైన రాధాకృష్ణ రావు విద్యార్థులకు అవగాహన కల్పించారు.మానసిక ఒత్తిడిని జయించాలంటే వాటినుండి తప్పించుకో వాళ్లని చూడొద్దని ఆత్మస్థైర్యంతో తట్టుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. పరీక్షలంటే బద్ధకం, సోమరితనం, అశ్రద్ధలను వదిలి క్రమశిక్షణతో శ్రద్ధతో పట్టుదలతో చదివితే సత్ఫలితాలు సాధించవచ్చని తరగతి గదులను తరగతి గనులుగా భావించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోళ్ళ సుబ్బరత్నం, కళాశాల ప్రిన్సిపాల్ కె రాము, డి సి హెచ్. వెంకటరెడ్డి,విద్యార్థులు మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు
1995 సీఎం ని నేను..చంద్రబాబు సంచలన వ్యాక్యలు..అమెరికాలో కొనసాగుతున్న లోకేష్ పర్యటన..రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో వుండగా ఎదురు దెబ్బ..కస్తూర్బాలో బాలికల విద్యాలయంలో రెండో రోజు విద్యార్థులకు అస్వస్థత..సైదాబాద్ బాలసదన్ లోని ఆర్చరీ అకాడమీ పిల్లలకు స్వర్ణ పతకాలు..”కంటతడి పెట్టిన వైస్ షర్మిల.. తారు రోడ్డుకు భూమి పూజ (ఒంగోలు)..అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత.. విద్యార్థులకు అవగాహన (కంభం)
Recent Posts