👉సత్య నాదెళ్లతో మంత్రి లోకేశ్ భేటీ..
అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏఐ, ఐటీ, నైపుణ్యాభివృద్ధికి సత్య నాదెళ్ల మద్దతు కోరినట్లు మంత్రి లోకేశ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో డిజిటల్ పరివర్తనకు సహకారం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నాదెళ్లతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
👉 ఫామ్‌హౌస్ పార్టీ కేసులో కొత్త ట్విస్ట్.. విజయ్ మద్దూరి కీలక వ్యాఖ్యలు..
హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మోకిల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఏ1 రాజ్ పాకాలా, ఏ2గా విజయ్ మద్దూరిలను చేర్చారు. ఇప్పటికే రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లు మోకిలా పోలీసులు చెబుతున్నారు. విజయ్ మద్దూరికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకొని ఆదివారం విచారించారు. తాను డ్రగ్ కన్జూమర్ ని అని పోలీసులకు విజయ మద్దూరి చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో సెక్షన్ 25, 27, 29 NDPS, 3, 4 TSGA యాక్ట్ కింద మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ మరోసారి విజయ్ మద్దూరిని పోలీసులు విచారించనున్నారు.
ఓరియన్ విల్లాస్ లో రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల, నాగేశ్వర్ రెడ్డి ఇండ్లలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. విల్లా నంబర్ 5, 40, 43లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 53 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జన్వాడ ఫాం హౌజ్ లో సైతం భారీగా విదేశీ, స్వదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 34(a)34(1)9(1) ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. మోకిల రాజ్ పాకాల ఫాంహౌస్ పార్టీ కేసులో కొత్త మలుపు తిరిగింది. రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాను చెప్పని విషయాలను ఎఫ్ఐఆర్ లో రాశారంటూ ఆయన ఆరోపించారు. తనపై అక్రమ కేసులు పెట్టారని వాపోయాడు. పార్టీలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగలేదని, కావాలనే తమను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అయితే, నిన్న విజయ్ మద్దూరిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అనంతరం ఆయన్ను వదిలిపెట్టారు. ఇవాళ మరోసారి మోకిలా పోలీసులు విజయ్ మద్దూరిని విచారించనున్నారు.
👉 ముఖ్యమంత్రి ఆదేశాలు – సోమిరెడ్డి బేఖాతరు..”*
*సర్వేపల్లి నియోజకవర్గం లో విచ్చలవిడిగా బెల్టు షాపులలో మద్యం అమ్మకాలు..*సర్వేపల్లిలో దాదాపుగా 300 పైగా విస్తరించిన బెల్టు షాపులు..*ఒక్కొక్క బెల్టు షాపు నుండి నెలకు 15 వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్న సోమిరెడ్డి..అన్ని ఆధారాలు లొకేషన్స్ తో సహా ఫిర్యాదులు చేస్తున్న ఏమాత్రం పట్టించుకోని అధికారులు.*సోమిరెడ్డి దెబ్బకు భయపడి బెల్ట్ షాపుల జోలికి వెళ్లలేమని చేతులెత్తేసిన అధికారులు.*సోమిరెడ్డి ఆదేశాలతో బెల్టు షాపు నిర్వాహకులను కాకుండా, ఫిర్యాదు చేసే వారిపై, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు*
*SPS నెల్లూరు జిల్లా.. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన “మస్తాన్ బాబా దర్గా” ఉన్న ప్రదేశం, కసుమూరు గ్రామంలో బెల్టు షాపుల అమ్మకాలకు చెందిన ఆధారాలు ఫోటోలతో సహా…
*చంద్రబాబు బెల్టు షాపులు నడిపితే ఊరుకునేది లేదని, పదేపదే చెబుతున్నా, వాస్తవ రూపం దాల్చడం లేదు.*
*రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా బెల్టు షాపులు విస్తరించాయి.*గుడి, మసీదు, చర్చి, బడి అనే తేడా లేకుండా బెల్టు షాపులు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.*సోమిరెడ్డి నెలకు ఒక్కొక్క షాపుకు 15వేల రూపాయలు చొప్పున సుమారు 300 బెల్టు షాపుల నుండి, దాదాపు 45 లక్షల రూపాయల పైన వసూలు చేస్తున్నాడు.*
*సర్వేపల్లి నియోజకవర్గంలోనే కేవలం బెల్టు షాపులపైనే నెలకు 45 లక్షల రూపాయలు పైగా సంపాదిస్తున్న సోమిరెడ్డి, ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడో అర్థం చేసుకోగలం.*
*ఫోటోలతో సహా ఆధారాలు పంపిన తర్వాత నిర్వాహకులు అక్కడి నుండి తాత్కాలికంగా బెల్టు షాపులు తొలగించినా, ఎక్సైజ్ అధికారులు కానీ, పోలీసు అధికారులు గానీ విచారణ చేపట్టి వాస్తవాల ఆధారంగా చర్యలు చేపట్టవచ్చు.*
*సోమిరెడ్డి ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్టు షాపుల ద్వారా అధిక రేటుకు అమ్మకాలు జరపడంతో చిన్న, పేద కుటుంబాలు చితికి పోతున్నాయి.*
*భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ నలమూలల నుండి ఎందరో భక్తులు విచ్చేసే, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న “మస్తాన్ బాబా దర్గా” ప్రాంతమైన కసుమూరు గ్రామంలో విచ్చలవిడిగా బెల్టు షాపులలో మద్యం అమ్మకాలు జరపడం పట్ల తీవ్ర ఆవేదన వెల్లిబుచ్చుతున్న భక్తులు, ప్రజలు.
👉భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…. కొత్తగూడెం…
ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల ఏవో ఖలీలుల్ల,జూనియర్ అసిస్టెంట్ సుధాకర్..రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డిఎస్పి వై.రమేష్…
👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి దోర్నాల మండలం, కొత్తూరు సమీపంలోని రెండు సొరంగాలను పరిశీలించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు,ప్రకాశం ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్,డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి,ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు,మార్కాపురం, ఎస్. ఎన్ పాడు, కనిగిరి,గిద్దలూరు,కందుకూరు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు,కందుల నారాయణరెడ్డి, బి.ఎన్. విజయకుమార్,డా.ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి,ముత్తుముల అశోక్ రెడ్డి,ఇంటూరు నాగేశ్వర రావు,ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. నూకసాని బాలాజీ,20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, దర్శి, యర్రగొండపాలెం నియోజక వర్గ ఇంచార్జీ లు డా. లక్ష్మి, ఏరీక్షన్ బాబు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్,సీఈ శ్యాంప్రసాద్, ఎస్ఈ అబూతలీం తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రహమాన్
👉 ప్రకాశం జిల్లా జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్ట్ ను ప్రాధ్యాన్యతా క్రమంలో త్వరలో పూర్తి చేసి ప్రకాశం జిల్లా ప్రజలకు సాగునీరు,తాగు నీరు అందించడం జరుగుతుంది 👉మంత్రి నిమ్మల రామానాయుడు.మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్క్రోలింగ్ పాయింట్స్..
వెలిగొండ పూర్తయితే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది..తాను అధికారంలోకి వస్తే ఏడాదిలోగా వెలుగొండ పూర్తి చేస్తానన్న జగన్ ఐదేళ్లపాటు ఏం చేశారు?..ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా,పరిహారం ఇవ్వకుండా ప్రారంభోత్సవం చేసి జిల్లా ప్రజల్ని జగన్ మోసం చేశారు..2014 – 19 లోనే మెజార్టీ పనులు పూర్తి చేశాం..జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి..వెలిగొండ ప్రారంభించింది చంద్రబాబు నాయుడే పూర్తి చేసేది చంద్రబాబు నాయుడే..త్వరితగతిన వెలిగొండ పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.
👉 రాచర్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన గిద్దలూరు సీఐ జె.రామకోటయ్య..
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐ.పి.యస్., సూచనల మేరకు, గిద్దలూరు సీఐ జె.రామకోటయ్య
,రాచర్ల పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది యొక్క పనితీరును తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో పెండ్డింగ్ కేసులు అన్ని పూర్తి చెయ్యాలి అని సూచించారు. స్టేషన్ రికార్డ్స్ తనిఖీ చేసి పెండ్డింగ్ కేసులను త్వరగా విచారణ జరిపి కోర్ట్ కి పంపాలి అన్నారు.బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి అని నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు. ముఖ్యంగా గంజాయి ,పేకాట,గుటక పై ప్రత్యేక నిఘ పెట్టి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాలు జరగకుండా పోలీస్ అధికారులు రాత్రిపూట పెట్రోలింగ్ చెయ్యాలి అన్నారు. సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ఆదేశించారు. డివిజన్ ఇంచార్జ్ అస్లాం బేగ్
👉సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్టు..!
సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ జ్యోతి అరెస్టు అయ్యారు. ఓ ల్యాండ్ ఇష్యూకు సంబంధించిన కేసులో సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని అరెస్ట్ చేసిన జీడిమెట్ల పోలీసులు.. ఆమెను మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి మేడ్చల్ కోర్ట్ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్ నగర్లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా పద్మాజా రెడ్డి అనే మహిళా కబ్జా చేసింది.
ఈ సమయంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ గా పనిచేసిన జ్యోతి.. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు పద్మజా రెడ్డికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పద్మజా రెడ్డితో పాటు సబ్ రిజిస్ట్రార్ జ్యోతి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇటీవల పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..మంగళవారం జ్యోతిని అరెస్ట్ చేశారు…
👉పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారభించిన పల్నాడు జిల్లా ఎస్పీకంచి శ్రీనివాస రావు.
★ ప్రముఖ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మరియు ఇతర వైద్యుల సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు..
★ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం – 2024 సందర్భంగా ప్రజా రక్షణ కొరకు వారు చేసిన త్యాగాలకు గుర్తుగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో గొప్పవిషయం.ఈ కార్యక్రమాన్ని ప్రారభించడం చాలా సంతోషంగా ఉందని ఎస్పీ తెలిపారు.
★ *రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడంతో సమానం కావున ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.*
★ ప్రజా రక్షణకై అసాంఘిక శక్తులు అణచివేతలో ఎందరో పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అమరులైనారు.ఆ పోలీస్ అమరవీరుల నాటి త్యాగాల ఫలితమే నేడు మనం సంతోషంగా ఉంటున్నాము.ఆ పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అనేది మనం వారికి ఇస్తున్న నివాళి అని ఎస్పీ తెలిపారు.
★ ప్రజల ధన,మానాలతో పాటు వారి ప్రాణాలను కాపాడటానికి పోలీస్ వారు ఎల్లవేళలా ముందువరుసలో ఉంటారని చెప్పడానికి ఈ పోలీస్ రక్తదాన శిబిరం ఒక ఉదాహరణ అని ఎస్పీ తెలిపారు.
★ ఈ రోజు రక్తదానం చేసిన పోలీస్ వారికి,యువతకు అభినందనలు. ఇంకా యువత, ప్రజలు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఎస్పీ సూచించారు.
ఈ సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ HDFC వారి సౌజన్యంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలోనీ మొబైల్ బ్లడ్ బ్యాంక్ వాహనాన్ని ఎస్పీ పరిశీలించినారు.
సమాజ హితం కోసం HDFC Bank వారు అందిస్తున్న తోడ్పాటు ఎంతో ప్రశంసనీయం అని,వారికి హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.
★ పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.రక్తదానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే మాట అవాస్తవం. కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
★ ఈ రక్తదాన శిబిరానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసిన ఏఆర్ డి యస్ పి జి.మహాత్మా గాంధీ ,వెల్ఫేర్ ఆర్ఐ యల్.గోపినాథ్ ,ANS RI యువరాజ్ ని,MT RI కృష్ణ ,అడ్మిన్ RI యం.రాజా ని ఎస్పీ అభినందించారు.
★ ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంలో సహకారం అందించిన డాక్టర్. కంజుల జగన్ మోహన్ రెడ్డి , చైర్మన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా, పి వి యం శరత్ బాబు వైస్ చైర్మన్,బత్తుల మురళీ , మేనేజింగ్ కమిటీ సభ్యులను జిల్లా ఎస్పీ అభినందించారు.కార్యక్రమంలో ఎస్పీ,అదనపు ఎస్పీ జె.వి.సంతోష్, డాక్టర్లు,పోలీసు అధికారులు మరియ సిబ్బంది పాల్గొన్నారు.
👉ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిఐజిగా రాహుల్ దేవ్ శర్మ నియమితులయ్యారు.
👉విజయవాడలో మహిళా డాన్సర్ మృత
NTR: విజయవాడ సింగ్ నగర్ మహిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె డాన్సర్ వెంకటలక్ష్మిగా స్థానికులు గుర్తించారు. ఆమె స్వస్థలం కాకినాడ కాగా, సింగినగర్కు వచ్చి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో స్థానికులు హత్యగా భావించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అజిత్ సింగ్ నగర్ సీఐ వెంకటేశ్వరా నాయక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
👉 ఏలూరులో ఘరానా మోసం..అధిక వడ్డీ ఆశతో లక్షలు పోగొట్టుకున్న ప్రజలు..
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆన్‌లైన్ యాప్‌లో పెట్టుబడిపెట్టి సుమారు 200 మంది మోసపోయారు. ఏఎస్‌వో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ పేరుతో తమ ఆన్‌లైన్ యాప్‌లో రూ.20 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.750 వడ్డీ వస్తోందని ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు.
డబ్బులకు ఆశపడి ఆన్ లైన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఎంతో మంది మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని బలవుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో ఇలాంటి ఓ సంఘటనే చోటుచేసుకుంది. ఏఎస్‌వో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపించి కొందరు కేటుగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆన్‌లైన్ యాప్‌లో పెట్టుబడిపెట్టి సుమారు 200 మంది మోసపోయారు. ఏఎస్‌వో ఇన్వెస్ట్‌మెంట్ అనే సంస్థ తమ ఆన్‌లైన్ యాప్‌లో రూ.20 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.750 వడ్డీ వస్తోందని ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు.
*వడ్డీ వస్తుందనే ఆశతో..*
వడ్డీ ఎక్కువ వస్తుందనే ఆశపడి దాదాపు 200 మంది ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే 2 వారాల నుంచి యాప్ పని చేయట్లేదు. దీంతో ఏం చేయాలో తెలీక బాధితులు విలవిల లాడుతున్నారు. ఆన్‌లైన్ యాప్‌లో పెట్టుబడిపెట్టి లక్షలు పోగొట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు.. సదరు బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.
జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో కొత్త ట్విస్ట్..వెలుగొండ పూర్తి చేస్తానన్న జగన్ ఐదేళ్లపాటు ఏం చేశారు?…సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్టు..!..ఎపి డైరెక్టర్ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిఐజిగా రాహుల్ దేవ్ శర్మ..ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల ఏవో ,జూనియర్ అసిస్టెంట్..సర్వేపల్లి నియోజకవర్గం లో విచ్చలవిడిగా బెల్టు షాపులు..విజయవాడలో మహిళా డాన్సర్ మృతి..ఏలూరులో ఘరానా మోసం.
Recent Posts