👉ఏపీలో నవంబర్ నుంచి రేషన్లో కందిపప్పు, పంచదార, జొన్నలు*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని MLS
పాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా పౌరసరఫరాలశాఖ చర్యలు తీసుకుంది.
నవంబరు1 నుంచి రేషన్ కార్డు దారులందరికీ రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.
కిలో కందిపప్పు రూ.67కు, అరకిలో పంచదార రూ.17కు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.
👉దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు???
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రద్దు కాబోతోందా. ఉచిత ప్రయాణ భారం ఆర్టీసీ మోయలేకపోతోందా..???
బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రద్దు కాబోతోందా. ఉచిత ప్రయాణ భారం ఆర్టీసీ మోయలేకపోతోందా. కర్ణాటక డిప్యూటీ సీఎం తాజాగా చేసిన కామెంట్స్ ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కర్ణాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఐరావత క్లబ్ క్లాస్ 2.0 బస్సులను బుధవారం ప్రవేశపెట్టారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా, ఈ–మెయిళ్ల ద్వారా చాలా మంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదించారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చిస్తాం’ అని శివకుమార్ తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2023 జూన్ 11న ఈ పథకాన్ని ప్రారంభించింది.
అక్టోబర్ 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 వేల 507 కోట్లను ఖర్చు చేసింది. అయితే.. కొందరు మహిళలు టికెట్లకు డబ్బు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా.. కండక్టర్లు తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో ఈ అంశంపై చర్చించి ఉచిత బస్సు ప్రయాణంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇటు తెలంగాణాలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసింది.. కేపి
👉గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
కుమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థినులను వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బెడ్లు సరిపోకపోవడంతో ఒక్కోదానిపై ఇద్దరికి వైద్యసేవలు అందించారు. అస్వస్థతకు గల కారణాలు తెలియరాలేదు…
👉 ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం
బెడ్లు లేక రోగులను నేలపై పడుకోబెట్టి సెలైన్ ఎక్కిస్తున్న వైద్యులు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు.. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న రోగుల బంధువులు…
👉 ఇష్టమొచ్చినట్లు చార్జీలు పెంచి.. ప్రయాణికులను దోచుకుంటున్న ఆర్టీసి.. తెలంగాణ..
12 కిలోమీటర్ల దూరానికి గతంలో రూ.20 ఛార్జ్ ఉంటే ఇప్పుడు రూ.30 చేసిన ఆర్టీసి..
ఎందుకు పెంచారు అని అడిగితే టోల్ పెట్టారు అందుకు పెంచారు అని సమాధానం ఇస్తున్న కండక్టర్.
బస్సు టికెట్లో టోల్ మెన్షన్ చేయకుండా టికెట్ ఇచ్చి ఎందుకు టికెట్ రేటు పెరిగిందంటే.. నోటి మాటగా టోల్ చార్జీ అని చెబుతున్న ఆర్టీసి సిబ్బంది.
టికెట్ అడిగింది కోదాడకు 12 km దూరంలో ఉన్న చెరువుమదారం క్రాస్ రోడ్ స్టేజీ వరకు, కానీ బస్సు కండక్టర్ టికెట్ ఇచ్చింది కోదాడకు 18 km దూరంలో ఉన్న నేలకొండపల్లి వరకు.
బస్ స్టాప్ ఉన్నప్పటికీ అడిగిన స్టేజికి కన్నా రెండు స్టేజీలు ఎక్కువ టికెట్ కొట్టి దానికి టోల్ పేరు చెప్పి ప్రయాణికులను దోచుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేసిన ప్రయాణికుడు…
👉 ఆస్తుల వివాదంలో మరిన్ని ట్విస్ట్‌లు.. షర్మిల అడగకుండానే..
ఇటీవల జగన్ తల్లి విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆస్తుల పంపకం జరగలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 2019లో ఆస్తుల్లో వాటాల పంపకం ప్రతిపాదనను జగన్ తీసుకొచ్చారనే విషయాన్ని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్..
వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆమె సోదరి షర్మిల మధ్య ఆస్తుల వివాదం నడుస్తున్న వేళ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఆస్తుల పంపకం ప్రతిపాదనను ఎవరు తెరపైకి తెచ్చారనే అంశంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే జగన్, షర్మిల పేరిట ఆస్తుల విభజన చేశారని కొందరు చెబుతుండగా.. ఇటీవల జగన్ తల్లి విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆస్తుల పంపకం జరగలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 2019లో ఆస్తుల్లో వాటాల పంపకం ప్రతిపాదనను జగన్ తీసుకొచ్చారనే విషయాన్ని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఆస్తిలో వాటా కావాలని ఎప్పుడూ అడగలేదన్నారు. ఆస్తి పంపకాల కోసం షర్మిల ఎలాంటి ఆసక్తి చూపలేదని, జగన్ ప్రతిపాదనతోనే ఆస్తుల విభజన జరిగిందనే విషయాన్ని బయటపెట్టారు. 2019 ఎన్నికల తర్వాత జగన్ వైఖరిలో పూర్తిగా మార్పు కనిపించిందని బ్రదర్ అనిల్ చెప్పారు. షర్మిల ఆస్తిలో వాటా అడగలేదని, అదే సమయంలో తెలంగాణలో పార్టీని విస్తరించాలనే ప్రతిపాదనను జగన్ వ్యతిరేకించారని తెలిపారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని జగన్ వ్యతిరేకించారని, తమకు వ్యతిరేకంగా పనిచేశారని బ్రదర్ అనిల్ చెప్పారు. ఓ పత్రికా సంస్థలో షర్మిల భాగస్వామిగామ ఉన్నప్పటికీ కనీసం డబ్బులిచ్చి ప్రకటనలు ఇవ్వడానికి ఒప్పుకోలేదన్నారు. స్వయంగా విజయలక్ష్మి మాట్లాడినా తమకు ప్రకటనలు ఇచ్చేందుకు అవకాశం కల్పించలేదన్నారు. వైఎస్ విజయలక్ష్మి బహిరంగ లేఖలో ప్రస్తావించిన అంశాలతో పాటు, బ్రదర్ అనిల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్నికల తర్వాత జగన్ తన కుటుంబ సభ్యుల ప్రమేయం పార్టీలో ఉండకూడదనే నిర్ణయంతోనే ఆస్తుల ప్రతిపాదనను తీసుకురావడంతో పాటు షర్మిల, విజయలక్ష్మికి దూరంగా ఉంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయట.
మొదట వివేకా ఎపిసోడ్..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక జగన్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తన బాబాయి వివేకానందరెడ్డితో తనకు భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయనే ఆలోచనతో పాటు కడప ఎంపీ టికెట్ వ్యవహారంలోనే వివేకానందరెడ్డిని హతమార్చారనే ప్రచారం జోరుగా సాగింది. కడప ఎంపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డి షర్మిలను ప్రతిపాదించారనే చర్చ జరిగింది. షర్మిల రాజకీయంగా ఎదిగితే తనకు పోటీగా ఉంటారని, భవిష్యత్తులో సీఎం పదవికి షర్మిల పోటీదారుగా ఉంటారనే ఉద్దేశంతోనే షర్మిలకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో వివేకానందరెడ్డి ఉంటే పార్టీపై తన ప్రభావం పడుతుందని, షర్మిలకు ఆయన అండగా ఉంటారనే ఉద్దేశంతోనే హత్యకు ప్లాన్ చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ చేస్తోంది. దోషులెవరనేది కోర్టులు నిర్దారించాల్సి ఉంది.
ఆస్తుల పంపకం వెనుక అసలు ఉద్దేశం అదేనా..
ఆస్తులు ఉమ్మడిగా ఉంటే షర్మిలకు హక్కు ఉంటుందని, అదే ఆస్తుల పంపకం పూర్తిచేస్తే షర్మిలను దూరం పెట్టవచ్చనే ఉద్దేశంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చేందుకు ఎంవోయూ చేసుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీలో షర్మిల ఇన్వాల్ అయితే తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే జగన్ ఆస్తుల పంపకానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. తీరా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. తన సోదరికి ఇచ్చిన వాటాను వెనక్కి తీసుకోవడం ద్వారా ఆర్థికంగా షర్మిలను దెబ్బతీయాలని జగన్ కుట్ర చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జగన్, షర్మిల ఆస్తుల వివాదంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది.
👉ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్*..విశాఖపట్టణం, అక్టోబర్ 31 ః నవంబర్ 02వ తేదీన జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఇతర అధికారులతో కలిసి సీఎం హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే కోస్టల్ బ్యాటరీ ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. కాన్వాయ్ బయలుదేరి కలెక్టరేట్ కు చేరుకునే మార్గాన్ని, ఇతర సెక్యూరిటీ పరమైన అంశాలను సరి చూశారు. కోస్టల్ బ్యాటరీ వద్దకు శనివారం మధ్యాహ్నం 1.00 గంట సమీపంలో చేరుకుంటారని, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా కలెక్టరేట్ కు చేరుకుంటారని కావున ఈ మార్గంలోని హోర్డింగులు, ఫ్లెక్సీలు, విద్యుత్ తీగలు, తొలగించాలని, అవసరమైతే రోడ్డుకు మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని ఏ మార్గం గూండా మీటింగు హాలుకు తీసుకెళ్లాలి.. అధికారులు, సిబ్బంది ఏం చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా పోలీసు కమిషనర్, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందితో కలెక్టర్ చర్చించారు. కోస్టల్ బ్యాటరీ నుంచి కలెక్టరేట్ వరకు ఉండే మార్గంలో… కలెక్టరేట్ పరిసరాల్లో విధులు నిర్వర్తించే భద్రతా సిబ్బంది, ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ మీటింగు హాలులో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అయితే కోస్టల్ బ్యాటరీకి లేదా నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ముందస్తుగా చేసుకోవాలని సూచించారు.
👉బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు..
తెలంగాణ : సంగారెడ్డి జిల్లా నిజాంపేట (M) ఖానాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు.. ఒంటిపై ఉన్న బంగారు గుండ్ల కోసం అమ్మమ్మను హత్య చేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దుర్గమ్మ(60)తో మహేష్ (26) గొడవ పడ్డాడు. అమ్మమ్మ ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేశాడు. బంగారు గుండ్లు తీసుకొని మనవడు మహేష్ పరారయ్యాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
👉తెలంగాణ పోలీసులకు కేంద్ర అవార్డులు..!!*
న్యూఢిల్లీ: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఇచ్చే ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ అవార్డులను ఈ ఏడాదికి గానూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను అందజేయనుంది. దేశవ్యాప్తంగా 463 మంది పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అస్సాం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, చండీగఢ్ తదితర కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలీసులు, సీఆర్పీఎఫ్, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీపీ, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎస్పీలు, తెలంగాణ నుంచి ఒక ఎస్పీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీసు కానిస్టేబుళ్లకు ఈ పురస్కారాలు దక్కాయి.
👉 బ్యూటీషన్ మహిళను 6 ముక్కలుగా నరికి చంపేశాడు!
బ్యూటీషన్ మహిళను 6 ముక్కలుగా నరికి చంపేశాడు!
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అక్టోబర్ 28న దారుణ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం ఓ మహిళా బ్యూటీషన్ (50) పార్లర్ మూసేసి కనిపించకపోయింది. అయితే ఆమెను ఓ వ్యక్తి చిన్న వివాదం కారణంగా ఆమెను 6 ముక్కలుగా నరికి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి పాతిపెట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
👉దారుణం.. ఆస్తి వివాదంలో కొడుకును హత్య చేయించిన తల్లి.. పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్రోసూరు మండలం హసనాబాద్‌కు చెందిన మహబూబ్ బాషా(28)పై గురువారం తన తల్లి మున్నీబీ దాడి చేయించింది. ఈ దాడిలో మహబూబ్ బాషాకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. అయితే గత కొంతకాలంగా తల్లీకొడుకులకు ఆస్తి వివాదాలు ఉన్నట్లు, ఈ వివాదంలో మున్నీబీ కొడుకుపై దాడి చేయించినట్లు పోలీసులు వెల్లడించారు.
👉ఇన్‌స్టాలో పరిచయం, మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం..!!!
TG: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) జివంగి గ్రామానికి చెందిన వినీల్ (19)కు, న్యాల్కల్‌కి చెందిన ఓ బాలిక (16)తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇటీవల వినీల్.. బాలిక గ్రామానికి వచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు?..తెలంగాణ పోలీసులకు కేంద్ర అవార్డులు..ఆస్తుల వివాదంలో మరిన్ని ట్విస్ట్‌లు.. షర్మిల అడగకుండానే..బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు..ఆస్తి వివాదంలో కొడుకును హత్య చేయించిన తల్లి….ఇన్‌స్టాలో పరిచయం, మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం..
Recent Posts