👉అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు*
హైదరాబాద్: తెలంగాణలో కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన ద్వారా అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. కులాల వారీగా జనాభా లెక్కిస్తే తరాలుగా నష్టపోతున్న వారికి తగిన ప్రాతినిధ్యం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కులగణనకు సంబంధించి పౌరహక్కులు, మేధావులతో నిర్వహించిన సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, మేధావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారతదేశంలో కులవ్యవస్థ చాల బలంగా ఉందని అన్నారు. అగ్రకులాలకు ఎప్పుడూ కుల వ్యవస్థ అనేది కనిపించదని చెప్పారు. కులగణన ద్వారా ఏళ్లుగా నష్టపోతున్న వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. కుల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉందని.. రాజకీయ, న్యాయ వ్యవస్థలోనూ అది బలంగా పాతుకుపోయిందని చెప్పుకొచ్చారు. కుల వ్యవస్థ అనేది కొంత మంది ఆత్మ విశ్వాసం దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల యువత సైతం ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడా లేని ఈ కులవ్యవస్థ ఇండియాలోనే ఉందని రాహుల్ మండిపడ్డారు. కుల వివక్షత వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోగలనని చెప్పారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు కులగణనపై మాట్లాడి సూచనలు చేశారు. ప్రొఫెసర్లు చెప్పిన విషయాలను రాహుల్ గాంధీ స్వయంగా నోట్ చేసుకున్నారు..
👉విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను కాలేజీ ఖాతాల్లోకే జమ చేయాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కార్. గతంలో వైసీపీ ప్రభుత్వం మాదిరి తల్లుల ఖాతాల్లోకి కాకుండా నేరుగా కాలేజిలకే ఫీజు రీ ఎంబర్స్మెంట్ డబ్బులను చెల్లించే ఫైల్ ను ఈ రోజు క్యాబినెట్ ఆమోదించనుంది. ప్రస్తుత విధానం ప్రకారం విద్యార్థుల ను కాలేజీ యాజమాన్యం # ముందు మీరు ఫీజు చెల్లించండి. రీఎంబర్స్మెంట్ వచ్చినపుడు మీరే తీసుకోండి # అనే వేధించేవారు. ఫీజు కట్టేవరకు విద్యార్థులను పరీక్షలు రాయానిచ్చేవారు కాదు. అందుకే ఈ విడానాన్ని రద్దు చేసి నేరుగా ఫీజు రీ ఎంబర్స్మెంట్ డబ్బులను కాలేజీ ఖాతాల్లోకే వేయనున్న చంద్రబాబు సర్కార్*
👉 ఉండవల్లిలోని నివాసంలో ఇంటర్ విద్యపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు . వచ్చే ఏడాది నుంచి ప్రతి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టడంతో పాటు ప్రశ్నాపత్రంలోనూ మార్పులపై చర్చించారు.
👉*మెడికల్ కాలేజీ పనులు నిలిపివేసారా…?*
*ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలి.*
ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు – మదిరె రంగ సాయి రెడ్డి..ప్రకాశం జిల్లా..
మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలతో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి అభిప్రాయ పడ్డారు.
ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల ప్రజల విద్యా, వైద్య అవసరాల కోసం కర్నూలు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాలకు వెళ్లాల్సిందే.
ముఖ్యంగా వైద్యం కోసం ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మార్కాపురంలోని జిల్లా వైద్యశాలలో వసతులు, పూర్తిస్థాయి వైద్య సిబ్బంది లేకపోవటంతో.. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురంలో వైద్య కళాశాల మంజూరు చేసింది.
మార్కాపురం లోని రాయవరం వద్ద దాదాపు 50 ఎకరాల స్థలాన్ని సేకరించి వైద్య కళాశాల, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, దీని కోసం 500 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించింది.
అసలు మార్కాపురం మెడికల్ కాలేజీ పట్ల ప్రభుత్వ స్పష్టమైన వైఖరి ప్రజలకు బహిరంగంగా వెల్లడించాలని మదిరె రంగ సాయి రెడ్డి డిమాండ్ చేశారు.ఇప్పటికయినా మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణ పనుల వేగం పెంచి, కళాశాల నిర్మాణం పూర్తి చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని మదిరె రంగ సాయి రెడ్డి కోరారు.
👉*యువకుడు అరెస్ట్*..పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన యువకుడిని అరెస్టు చేసిన మార్కాపురం పోలీసులు.
సీఎం, డిప్యూటీ సీఎం లపై X వేదికగా అవినీతి ఆరోపణలు చేసిన కల్లి నాగిరెడ్డి అనే యువకుడు.
విజయవాడ వరద సహాయంలో 534 కోట్లు లూటీ చేసినట్లు పోస్ట్ చేసిన కల్లి నాగిరెడ్డి.తమ నేతలపై ఆరోపణలు చేశారంటూ మార్కాపురం పీఎస్ లో ఫిర్యాదు చేసిన యశ్వంత్ అనే 19 ఏళ్ల యువకుడు.
దీంతో తాడేపల్లి వెళ్లి నాగిరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన మార్కాపురం పట్టణ ఎస్సై సైదుబాబు.
👉వైసిపి కో-ఆర్డినేటర్ “కారుమూరి”ని*
*సత్కరించిన “అన్నా”..*ఉమ్మడి ప్రకాశం జిల్లా YSRCP సమీక్ష సమావేశానికి హాజరైన పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్,మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును మాజీ ఎమ్యెల్యే,మార్కాపురం YSRCP సమన్వయ కర్త అన్నా రాంబాబు మంగళవారం సత్కరించారు.*
*పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రీజనల్ కో-ఆర్డినేటర్ చేస్తున్న కృషికి తమ సంపూర్ణ మద్దతు, తోడ్పాటును అందిస్తామని రాంబాబు తెలిపారు.మార్కాపురం నియోజకవర్గంలో YSRCP బలోపేతం కోసం, కార్యకర్తలు, శ్రేణుల కోసం తాము చేస్తున్న కృషిని ఆయన కారుమూరికి వివరించారు.*
👉 వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు – పులివెందుల వాసి వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు – పులివెందులలో అదుపులోకి తీసుకొని కడప స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు – ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడిగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డి – చంద్రబాబు, పవన్, లోకేష్, అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి – షర్మిల, సునీత, విజయమ్మపైనా అసభ్యకర పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డి – విచ్చలవిడిగా పోస్టులు పెట్టి దూషించిన రవీందర్ రెడ్డి – పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్ లో రవీందర్ రెడ్డిపై పలు కేసులు
👉పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వ్యవసాయాధికారులు మంగళవారం ఎల్ కోట, లింగోజిపల్లి గ్రామాల్లో పంటలను పరిశీలించారు. వివిధ రకాల వ్యవసాయ ప్రభుత్వ పథకాల గురించి తెలియజేశారు. అలాగే పిఎం కిసాన్ ఎంతవరకు ఎవరికన్నా ప్రభుత్వం అందించేటటువంటి డబ్బులు అందక పోయినట్లయితే ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో వాటిని తెలియజేశారు . ఈ ఏడాది నుండి రబీ పంటలకు అవసరమయ్యే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి వాటి ప్రీమియం గురించి మరియు చివరి గడువు తేదీ గురించి తెలిపారు. సెనగ మొక్కజొన్న పైర్లలో వచ్చే తెగుళ్ల గురించి వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. మొక్కజొన్న పైరు ప్రస్తుతం 20 నుంచి 30 రోజుల వయసు ఉంది ఈ సమయంలో కలుపు బెడద ఎక్కువగా ఉండటం వలన మార్కెట్లో మంచి కలుపు మందులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యంగా 20 నుంచి 25 రోజుల వయస్సు ఉన్నప్పుడు టెంబో ట్రయాన్ అనే మందును 115ml అనే మందును ఎకరాకు పిచికారి చేసుకోవాలని ,ఇది కాకుండా టాప్ రా నైజాం 30 -36ఎంఎల్ ఎటువంటి కలుపు ఉన్న పిచికారి చేసుకుంటే చాలా వరకు నివారణ చేసుకోవచ్చని, కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చని అలాగే తుంగ ఎక్కువగా ఉన్నట్టయితే హాలో సల్ఫర్ మిథైల్ అనే మందును పిచికారి చేసుకోవాలని ఈ పంటలో నీటి ఎద్దడి లేకుండా పైరు మోకాళ్ళ ఎత్తు దశలోనూ పూత దశలోనూ గింజ పాలు పోసుకునే దశలోనూ గింజ నిండుకునే దశలోను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించినట్లయితే నీటి వినియోగం సరిగా చేయడం మాత్రమే కాకుండా పది నుండి 15% వరకు దిగుబడిని కూడా పెంచుకోవచ్చన్నారు. అలాగే 2018 నుంచి మొక్కజొన్నలో ప్రధానంగా సమస్య అయినటువంటి కత్తెర పురుగు నివారణకు ఎకరాకు 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా స్పైనో సాడ్ లేదా క్లోరిన్థోనీల్ అనే మందును పిచికారి చేసుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు ఈ పిచికారిని మధ్యాహ్న సమయంలో చేసుకున్నట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఈ కత్తెర పురుగు రాత్రి సమయంలో పైరుపై ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి కార్యక్రమానికి మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు డి బాలాజీ నాయక్ మాట్లాడుతూ పొగాకు పంటకు బదులుగా ప్రత్యామ్నాయంగా పప్పు జాతి పంటలను అనగా కంది మినుము పెసర ఉలవ శనగ వంటి పంటలను వేసుకోవడం ద్వారా రైతులకు ప్రభుత్వం వారు మంచి మద్దతు ధరను అందిస్తారని తెలియజేయడం జరిగింది . కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి స్వరూప తోపాటు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీమంత్ అలాగే గ్రామంలోని అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.
అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కాలేజీలకే.. ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల-మంత్రి నారా లోకేష్.. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు నిలిపివేశారా.. వైసిపి కో-ఆర్డినేటర్ “కారుమూరి”నిసత్కరించిన “అన్నా”.. పొలంబడి ( కంభం)సీఎం, డిప్యూటీ సీఎం లపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్
Recent Posts