*ఈసీపై సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్..ఏం జరగనుంది? …”సాక్షికి చట్టం అంటే ఏమిటో చూపిస్తా: ఏబీ వెంకటేశ్వరరావు… 17 ఏండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన దుండగులు.. అడ్డుకున్న ఆటో డ్రైవర్ పై దాడి.. . పేకాట స్థావరంపై ఏలూరు రూరల్ పోలీసుల దాడి.. ఇంట్లో చోరీ చేసి పరారైన పని మనుషులు… సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు.. రేవతి కుటుంబానికి 2 కోట్ల పరిహారం.. “విదేశీ కరెన్సీని దొంగిలించారంటూ టీటీడీ చైర్మన్ కు వినతి… “ఇంటి నుంచి పని.. *సహకార,పొరుగు సేవల కేంద్రాలు..*శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాల కల్పన.. *గృహిణులకు చాన్స్‌: సీఎం చంద్రబాబు* .. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు … నూతన సంవత్సర వేడుకలకు ఫ్లెక్సీలు పెడితే తొలగిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి

👉మహిళలకు ఇంటి నుంచి పని.. *సహకార,పొరుగు సేవల కేంద్రాలు..*శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాల కల్పన..
*గృహిణులకు చాన్స్‌: సీఎం చంద్రబాబు**
రాష్ట్రంలో మహిళలకు ఇంటి నుంచే పనికల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
దీనిలో భాగంగా సహకార పని కేంద్రాలు(కో-వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు), పొరుగు సేవల కేంద్రాలు(నైబర్‌హుడ్‌ వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు) ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. చదువుకున్న మహిళలు గృహిణులుగా మిగిలిపోకూడదని, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఇంటి నుంచే పని(వర్క్‌ ఫ్రం హోమ్‌), సహకార పని కేంద్రాలతో మహిళలకు విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. మహిళలను ఇంటికి పరిమితం చేయడం సరికాదని సీఎం అన్నారు. వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆర్థిక వృద్ధి పెరుగుతుందని తెలిపారు. సహకార పని కేంద్రాల ఏర్పాటు ద్వారా 2025, డిసెంబరు చివరి నాటికి 1.50 లక్షల మందికి అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వివరించారు.
ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లో 22 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు? వారి అవసరాలు ఏమిటి? అనే సమాచారం సేకరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అదేవిధంగా ఇప్పటికే నిర్ణయించిన రతన్‌ టాటా సృజనాత్మక కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో భవనాలను గుర్తించాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పరిశ్రమలను, విద్యాసంస్థలను సృజనాత్మక కేంద్రాలకు అనుసంధానం చేయాలని నిర్దేశించారు.
👉కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తదితర నేతలు,టీడీపీ ఎంపీలతో సహా ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..

👉ఈసీపై సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్..ఏం జరగనుంది?
ఇటీవల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఇటీవల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. అయితే.. అక్కడితో ఆగని ఆ పార్టీ ఈ అంశంపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది తాజా చర్యలతో ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగొచ్చని పేర్కొంది. ఈ అంశంపై తన అభ్యంతరాల్ని పేర్కొంటూ రిట్ పిటిషన్ ను దాఖలు చేసింది.
ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ వేళ ఎలక్ట్రానిక్ రికార్డుల్ని ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే అంశంపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్.. వెబ్ కాస్టింగ్ రికార్డులను.. అభ్యర్థఉలకు సంబంధించిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 లోని రూల్ 93(2)(ఏ) ను కేంద్ర న్యాయశాఖ సవరిస్తూ చేసిన నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇందులో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సుప్రీంకోర్టుతో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేవారు. స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా.. ప్రజలతో సంప్రదింపులు జరపకుండా ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పులు చేయటం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మిగిలిన రాజకీయ పార్టీల స్పందన ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాడిపత్రి వాసులకు జేసీ వార్నింగ్*
➤ నూతన సంవత్సర వేడుకలకు ఫ్లెక్సీలు పెడితే తొలగిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి
➤ మీకు డబ్బులు ఎక్కువ ఉంటే పట్టణ అభివృద్ధి కోసం ఇవ్వండి..
➤ విగ్రహాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదు..
➤ తాడిపత్రి పట్టణంలో ఎక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా వెంటనే తొలగిస్తాం.. *జేసీ ప్రభాకర్ రెడ్డి*
👉 ప్రధానితో చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలు ఇవే!
ప్రధానితో చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలు ఇవే!
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. సమావేశంలో అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం.. మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్లు వేగంగా అందేలా చూడాలని ప్రధానిని చంద్రబాబు కోరారు. పోలవరం నిర్మాణం వేగంగా జరిగేలా ఆర్థిక వనరులు సమకూర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించాలని.. ఏపీ పర్యాటనకు రావాలని ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు.
👉రేవతి కుటుంబానికి 2 కోట్ల సాయం..

పుష్ప సినిమా తొక్కిసలాటలు మరణించిన రేవతి కుటుంబానికి మూవీ టీం రెండు కోట్ల సాయం ప్రకటించింది. అల్లు అర్జున్ కోటి రూపాయలు,సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. సినీ నిర్మాతలు దిల్ రాజు,అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రేవతి కుమారుణ్ణి పరామర్శించారు.
👉పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు తల్లి విజయమ్మ గారితో కేక్ కట్ చేయించిన వైయస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ జగన్ దంపతులు ప్రార్థనలు…
👉దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు😲😲😲
గత ప్రభుత్వ హయంలో రూ.1.15 కోట్లు అక్రమంగా చెల్లించారని ఆరోపిస్తున్న ఏపీ ఫైబర్ నెట్
15 రోజుల్లో మొత్తం చెల్లించాలంటూ వర్మకు నోటీసులు
చెల్లించని పక్షంలో వర్మపై కేసు నమోదుకు రంగం సిద్ధం.
👉 సాక్షికి చట్టం అంటే ఏమిటో చూపిస్తా: ఏబీ వెంకటేశ్వరరావు..
సాక్షికి, ఓ యూట్యూబ్ చానల్‌కు చట్టం అంటే ఏమిటో చూపిస్తానని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతాలో ఆయన ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే విష సంస్కృతి, వికృత ఆలోచనల నుంచి కొన్ని పక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఇంకా బయటకు రాలేదు. ఆరోపణలకు, కేసుకూ, విచారణకు తేడా తెలియకుండా బురద జల్లుతున్న సాక్షి దినపత్రిక తో పాటు…మరో యూట్యూబ్ ఛానల్ కు పరువునష్టం నోటీసులు పంపాను. నికార్సైన పోలీసుగా పనిచేసిన నేను చట్టంపై నమ్మకంతో చెపుతున్నాను…వీళ్లకు చట్టం అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని హెచ్చరించారు.
ఏబీ వెంకటేశ్వరరావుకు ఎందుకు కోపం వచ్చిందంటే.. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయనపై వచ్చిన ఆరోపణలపై కేసులు లేవని మొత్తం ఉపసంహరించుకుంది. ఇవన్నీ జగన్ హయాంలో పెట్టిన తప్పుడు కేసులని తేల్చింది. అయితే ఉపసంహరించుకోవడమే పెద్ద తప్పన్నట్లుగా కథనాలు వండి వారిస్తున్నారు. ఆయనపై ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఉందని సాక్షితో పాటు ఓ యూట్యూబ్ చానల్ లో ప్రసారం చేశారు. ఇది ఏబీవీకి కోపం తెప్పించింది. నా మీద పెట్టిన అక్రమ కేసులో అసలు ఫోన్ టాప్పింగ్ అనే అంశమే లేదనీ తెలుసని ఇయినా దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
ఏబీవీ ఐదేళ్ల సర్వీసును జగన్ రెడ్డి వికృతానందం కోసం కోల్పోయారు. ఆయనను ఐదేళ్ల పాటు టార్చర్ పెట్టారు. దేశంలో అన్ని వ్యవస్థలను మాయచేశారు. చివరికి కారణం లేకుండా డిస్మిస్ చేయాలని సిఫారసు చేశారు. ఆయనను డిస్మిస్ చేస్తే ఇవాళ ఇప్పటికే స్పష్టమైన కారణాలతో పది మంది ఐపీఎస్‌లు, పది మంది ఐఏఎస్‌లు డిస్మిస్ అయి ఉండేవారన్న అభిప్రాయం. తనను తప్పుడు కేసుల్లో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీ కోరుతున్నారు కానీ అలాంటి అవకాశాలు కనిపించడం లేదు.
👉 ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన దుండగులు..
అడ్డుకున్న ఆటో డ్రైవర్ పై దాడి.. బాలికను ఇంట్లో వదిలిపెట్టినా కూడా వదలని కామాంధులు.
హైదరాబాద్‌లో బీహార్‌కు చెందిన బాలిక బోరబండలోని తన దగ్గరి బంధువుల వద్ద ఉంటూ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్నది.
అయితే జీతం కోసం మాదాపూర్‌ వెళ్లింది. ఈ క్రమంలో అదే హోటల్‌లో కుక్‌గా పనిచేసే బీహార్‌కు చెందిన యువకుడి (18)తో కలిసి రాత్రి 10.40 గంటల సమయంలో బోరబండ వెళ్లే ఆటో ఎక్కింది.
సంత ప్రాంతం వద్ద ఐదుగురు యువకులు ఆటోను అడ్డగించి.. వారిలోంచి ఇద్దరు ఆటో ఎక్కగా, వారిలో ఒకడు బాలిక పక్కన కూర్చుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మిగతా వారు ఆటోను అనుసరిస్తూ బైక్‌పై వచ్చారు.
బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బాలిక స్నేహితుడితోపాటు ఆటో డ్రైవర్‌ ప్రశ్నించడంతో యువకులు దాడికి తెగబడ్డారు.. అయినప్పటికీ ఆటో డ్రైవర్‌ ధైర్యంగా వారితో పోరాడి ఆటో నుంచి వారిని బయటకు తోసేసి ఆటోను వేగంగా ముందుకు పోనిచ్చాడు.
అయినా వదలని నిందితులు పరుగులు పెడుతూ ఆటోలోకి చేరుకున్నారు. అయినా ఆటోను ఆపని డ్రైవర్‌ నేరుగా బాలిక ఇంటి వద్ద ఆమెను దింపేశాడు.
అయినప్పటికీ నిందితులు ఇంట్లోకి చొరబడి బాలికను బాత్రూంలోకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. బాలిక బంధువులు వారి కాళ్లు పట్టుకుని వేడుకున్నా వదల్లేదు.
దీంతో కాపాడాలంటూ బాలిక చేస్తున్న ఆర్తనాదాలు విని పొరుగింటి వ్యక్తి డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు.. దీంతో పోలీసులు వచ్చి నిందితులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
👉 ఏలూరు జిల్లా..ఏలూరు ఎస్ ఎం అర్ నగర్ లో పేకాట స్థావరంపై ఏలూరు రూరల్ పోలీసుల దాడి..
8 లక్షల 10 వేలు నగదు, 25 సెలఫోన్ లు ఒక ద్విచక్ర వాహనం,32 మంది అరెస్ట్..దాడిలో పాల్గొన్న సీఐ. జి సత్యన్నారాయణ,ఎస్ ఐ లు దుర్గా ప్రసాద్, దానం మరియు పోలీసు సిబ్బంది..
👉 రాజేంద్రనగర్ :”నెలరోజుల పాటు ఓ ఇంట్లో నమ్మకంగా పనిచేసిన దంపతులు ఆ ఇంట్లో చోరీ చేసి పరారైన ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. సన్‌సిటీలో నివాసం ఉండే డాక్టర్‌ కొండల్‌రెడ్డి ఇంట్లో నవంబరు నెలలో భార్యాభర్తలు పనికి కుదిరారు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన నమీన్‌కుమార్‌యాదవ్, భారతిలుగా వారు తమ చిరునామా తెలిపారు. నెలరోజులగా ఇంట్లోనే ఉండి అక్కడి పనులు చేసే వారు. సోమవారం రాత్రి ఆ దంపతులు సంచి పట్టుకుని బయటకెళ్లారు. మంగళవారం ఉదయం కూడా ఇంటికి రాకపోవడంతో కొండల్‌రెడ్డి వారికి ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అనుమానం వచ్చిన కొండల్‌రెడ్డి కుటుంబసభ్యులు ఇంట్లోని అల్మారాను తనిఖీ చేశారు. 25 తులాల వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.35 వేల నగదు మాయమైనట్లు గుర్తించారు. పని మనుషులుగా చేరిన వారే వాటిని చోరీ చేసి ఉడాయించినట్లు ఆయన రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
👉 కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆత్మహత్య*
*⬤ నంద్యాల – సుబ్బరాయుడు, సరస్వతి దంపతుల కొడుకు సునీల్ బీటెక్ ఫస్టియర్ ఫెయిలై ఆటో డ్రైవర్లతో తిరుగుతున్నాడు. ఈక్రమంలోనే ఓ హిజ్రాతో కొడుకు ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలిసి తల్లిదండ్రులు అతడిని మందలించారు.*
*⬤ అయితే హిజ్రా గ్యాంగ్ వారి షాపుకు వచ్చి బూతులు తిడుతూ హంగామా చేశారు.. దీంతో అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగి చనిపోయారు.*
👉సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు..
హైదరాబాద్:డిసెంబర్ 25..సంధ్య థియేటర్‌ ఘటనకు సంబంధించిన వీడియోను రెండ్రోజుల క్రితం మీడియా ముందు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ రావటంతోనే తొక్కిసలాట జరిగినట్లు చెబుతూ.. వీడియోను రిలీజ్ చేశారు.
ఇదిలా ఉండగా..”తాజాగా మరో సీసీటీవీ ఫుటేజి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అల్లు అర్జున్ థియేటర్‌లోకి రాకముందే అపాస్మారక స్థితిలో ఉన్న రేవతిని బయటికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ పాయింట్‌ నే అల్లు అర్జున్ ఫ్యాన్స్, నెటిజన్లు లేవనెత్తుతు న్నారు.
అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిస లాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇలా ఎడిటెడ్ వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,వార్నింగ్ ఇచ్చారు..
👉రేవతి కుటుంబానికి 2 కోట్ల పరిహారం.. హైదరాబాద్:డిసెంబర్ 25
సంధ్య థియేటర్ తొక్కిస లాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు నిర్మాత దిల్‌ రాజు, అల్లు అరవింద్, పుష్ప ప్రొడ్యుసర్‌ ఎలమంచిలి రవి. అనం తరం బాలుడు శ్రీతేజ్‌ తండ్రికి ధైర్యం చెప్పిన నిర్మాతలు.. అతడి కుటుంబానికి రూ.2 కోట్లు పరిహారం అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.
ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. అల్లు అర్జున్ తరపున రూ.1 కోటి, పుష్ప 2 నిర్మా తలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వ నున్నట్లు తెలిపారు. ఈరోజు ఎఫ్‏డీసీ ఛైర్మన్ దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవిశంకర్ తో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు.
అనంతరం బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడి అతడికి ధైర్యం చెప్పారు. అనంతరం అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మైత్రీ మూవీస్ సంస్థ భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 4న సంధ్య థియే టర్ వద్ద జరిగిన తొక్కిస లాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అదే ఘటనలో రేవతి కుమారు డు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులె టిన్స్ విడుదల చేస్తున్నారు. కిమ్స్ ఆసుపత్రి వర్గాలు.
👉 రేపు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటీ..
ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో ఉద‌యం 10 గంట‌ల‌కు సీఎంతో స‌మావేశం..
సీఎంతో భేటీపై హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు దిల్ రాజు స‌మాచారం..తాజా ప‌రిణామాలు, చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై భేటీలో చ‌ర్చ‌.. గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో స‌మావేశం కానున్నారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్లు,నిర్మాత‌లు అంద‌రం క‌లిసి రేపు ముఖ్య‌మంత్రిని క‌లుస్తామ‌ని దిల్ రాజు వెల్ల‌డించారు. సీఎంతో భేటీపై హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు దిల్ రాజు స‌మాచారం ఇస్తున్నారు. కాగా,ఈ స‌మావేశంలో తాజా ప‌రిణామాలు, చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు అల్లు అర‌వింద్‌, మైత్రి మూవీ మేక‌ర్స్‌తో పాటు వెళ్లి కిమ్స్ ఆసుప‌త్రిలో శ్రీతేజ్‌ను దిల్ రాజు ప‌రామ‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ క‌లిసి రేవ‌తి కుటుంబానికి రూ.2కోట్ల సాయం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.. హైదరాబాద్ ఇన్చార్జ్ షేక్ అమీర్..
👉 మా అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన.
ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది.
సున్నితమైన సమస్యలపై మా సభ్యులు స్పందించొద్దు.
సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిది.
ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుంది…
👉 టీడీపీని తిడుతూ … గోవర్ధన్ గొడవ … అధికారులు ఆగ్రహం..
▪️అధికారులను బెదిరిస్తూ మాజీమంత్రి కాకాణి హెచ్చరికలు.
▪️పోలీసు, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ కాకాణి ఘాటు వ్యాఖ్యలు.▪️మాజీమంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ప్రభుత్వ వర్గాలు.▪️ఇటీవల మహిళ ఫిర్యాదుతో కాకాణి ముఖ్య అనుచరుడు వెంకట శేషయ్యపై లైంగికదాడి కేసు నమోదు.
▪️తన అనుచరుడిపై కేసు పెట్టారంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం..CI సుబ్బారావు, RI రవిపై చర్యలు తప్పవంటూ కాకాణి బెదిరింపులు.
▪️మేము అధికారంలోకి వస్తే ఖాకీ దుస్తులు వదిలేసి పసుపు దుస్తులతో టీడీపీ నేతల వెనుక తిరగాల్సిందేనంటూ కాకాణి తీవ్ర హెచ్చరికలు.
👉 విదేశీ కరెన్సీని దొంగిలించారంటూ టీటీడీ చైర్మన్ కు వినతి.విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్.
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోలేదని విమర్శ.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు, హుండీల లెక్కింపు చేపట్టే పరకామణిలో భారీ కుంభకోణం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హుండీ నగదు లెక్కింపు సమయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారని చెప్పారు. ఇందుకోసం ఆపరేషన్ చేయించుకుని పొట్టలో రహస్య అర ఏర్పాటు చేయించుకున్నారని అన్నారు. ఇలా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి శ్రీవారి సొమ్ము రూ.100 కోట్లు కొల్లగొట్టారని టీటీడీ చైర్మన్ కు వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
పెద్ద జీయర్ తరఫున పరకామణిలో సి.వి.రవికుమార్‌ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని భానుప్రకాశ్ రెడ్డి చెప్పారు. కొన్నేళ్లుగా ఆయన రహస్యంగా రూ. 100 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని తన పొట్టలోని రహస్య అరలో దాచి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. 2023 ఏప్రిల్‌ 29న హుండీ నగదు తరలిస్తూ రవికుమార్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడన్నారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, అయితే, లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకున్నారని చెప్పారు. ఈ కేసు విషయంలో నాటి టీటీడీ చైర్మన్, కొంతమంది అధికారులు, పోలీసులు రవికుమార్ ను బెదిరించి వంద కోట్ల ఆస్తులు రాయించుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని టీటీడీ చైర్మన్ ను కోరారు

7k network
Recent Posts

మంత్రులుగా ‘నాగబాబు, పల్లా’ !!! ..సైలెంట్‌గా సినిమా చూసి వస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తమ్మారెడ్డి.. *చనిపోయిందని బన్నీకి చెప్పినా సినిమా చూశాకే వెళ్తానన్నాడు: ఏసీపీ.. *రూ.15 లక్షలు మద్యం పట్టివేత • డ్యూటీ ఫ్రీ మద్యం ముసుగులో లిక్కర్ వ్యాపారం… *లా కాలేజీలో ర్యాగింగ్ భూతం (నెల్లూరు) .. మచిలీపట్నంలో దొంగ నోట్ల కలకలం … తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని …

*మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత…*ఎన్నికల విధానం, ప్రక్రియ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది: కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే .. *సొంత గడ్డపై జగనన్నకు షాక్…*లంచాల కేసు దృష్టి మళ్లించడానికే జగన్‌ ఛార్టీల నాటకాలు:చీఫ్ విప్ జీవీ*…*సినీ పరిశ్రమపై సీఎం సానుకూలంగా ఉన్నారు-దిల్‌రాజు ..*ఘనంగా మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహ వేడుకలు … *పంచాయతీ సెక్రటరీ పై వైసీపీ నాయకుడు దాడి..*భవానీ దీక్షల సందర్భంగా విజయవంతంగా బందోబస్తు నిర్వహించిన పోలీసు కమిషనర్ కు సన్మానం … *కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన ఐజీ ..*13 వేల జీతం..అక్రమ రీతిలో 21 కోట్లు సంపాదించాడు.

*ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యుత్ కోతలు! …*సోనియా గాంధీకి అస్వస్థత .. ”వైఎస్ ఎఫెక్ట్.. వెంటాడిన పాపం.. సిరి కోల్పోయిన శ్రీల‌క్ష్మి! … ”సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ..’నా వల్ల తప్పు జరిగితే హోంగార్డుకైనా సారీ చెబుతా: పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ .. ” పేకాట స్థావరంపై సత్తెనపల్లి రూరల్ పోలీసుల దాడి … *సినిమా విడుదలైన వారంరోజుల్లోనే ఖర్చులు రాబట్టుకోవాలట: మురళి మోహన్ …షేక్ హసీనాను అప్పగింత ఇష్యూ…మోడీ సర్కార్ ఏం చేస్తుంది … పేకాట స్థావరంపై సత్తెనపల్లి రూరల్ పోలీసుల దాడి

*ఓ తప్పుడు కేసులో ఢిల్లీ సీఎం అతీశీని త్వరలో అరెస్టు చేస్తారని కేజ్రీవాల్‌ జోస్యం!!! …*మోడీ ప్లాన్‌: జ‌మిలి గ‌ట్టెక్కించే బాధ్య‌త.. చంద్ర‌బాబుకు? … *తెలంగాణ ప్రభుత్వానికి లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అభినందనలు … *బీజేపీలోకి వంశీ… టీడీపీకి షాకేనా ? .. *వాల్తేరు డివిజన్‌ను విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా జోన్‌లో కొనసాగించే విషయమై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సానుకూలం … *నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ రూ.30 లక్షల వ్యయం కలిగిన వైద్య పరికరాల అందజేత … *25 కేజీలు గంజాయి పట్టివేత..ముగ్గురు నిందితులు అరెస్ట్ (తిరుపతి).. *చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్..

*ఈసీపై సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్..ఏం జరగనుంది? …”సాక్షికి చట్టం అంటే ఏమిటో చూపిస్తా: ఏబీ వెంకటేశ్వరరావు… 17 ఏండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన దుండగులు.. అడ్డుకున్న ఆటో డ్రైవర్ పై దాడి.. . పేకాట స్థావరంపై ఏలూరు రూరల్ పోలీసుల దాడి.. ఇంట్లో చోరీ చేసి పరారైన పని మనుషులు… సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు.. రేవతి కుటుంబానికి 2 కోట్ల పరిహారం.. “విదేశీ కరెన్సీని దొంగిలించారంటూ టీటీడీ చైర్మన్ కు వినతి… “ఇంటి నుంచి పని.. *సహకార,పొరుగు సేవల కేంద్రాలు..*శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాల కల్పన.. *గృహిణులకు చాన్స్‌: సీఎం చంద్రబాబు* .. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు … నూతన సంవత్సర వేడుకలకు ఫ్లెక్సీలు పెడితే తొలగిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఉద్యోగాలివ్వడం చేతకాని బీజేపీ ప్రభుత్వం .. ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా జీఎస్టీ వసూళ్లపై మండిపడ్డ ప్రియాంకా గాంధీ … VRO వ్యవస్థ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం…ఏపీ ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు… అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన (హైదరాబాద్)… ఏపీ ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు … అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఓ గర్భిణీ మృతి …షూ లేస్‌తో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్య … కడప సర్వసభ్య సమావేశంలో మళ్లీ రచ్చ … సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసానికి యత్నం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు.