రైతు సమస్యలపై చర్చించేందుకు సమయమివ్వండి.. *రాష్ట్రపతిని కోరిన సంయుక్త కిసాన్‌ మోర్చా .. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు …*మూడు మిస్సింగ్ కేసులును ఛేదించిన విశాఖ నగర పోలీసులు… *వరుస దొంగతనాలు చేసే దొంగల ముఠా అరెస్ట్ ..* హత్య కేసును ఛేదించిన ప.గో జిల్లా పోలీసులు ..*విజయవాడలో పలువురు సిఐల స్థాన మార్పిడి.. *ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లితండ్రులు…* హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించిన పోలీసులు .. *2.83 లక్షల నగదు చోరీ.. EMI కడతావా లేదంటే నీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టమంటావా: యువతికి బెదిరింపులు ..(తిరుపతి) …*దొంగల ముఠా అరెస్టు ..(సత్యవేడు) ..

👉రైతు సమస్యలపై చర్చించేందుకు సమయమివ్వండి..!! *రాష్ట్రపతిని కోరిన సంయుక్త కిసాన్‌ మోర్చా ఎస్‌కేఎం..
న్యూఢిల్లీ: డిమాండ్ల సాధనకు రైతుల ఆందోళన, రైతు నేత జగ్జీత్‌ సింగ్‌ డల్లేవాల్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలో వారి సమస్యలపై చర్చించేందుకు తమకు సమయమివ్వాలంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసింది.”కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని,”డల్లేవాల్‌ ఆమరణ దీక్ష చేస్తున్నారని తెలిపింది.దేశవ్యాప్తంగా 500 జిల్లాలకు చెందిన రైతులు ఇప్పటికే రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాలు సమర్పించారని,రైతు సమస్యలపై చర్చించేందుకు సమయం కేటాయించాలని ఎస్‌కేఎం విజ్ఞప్తి చేసింది.
👉నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీలపై నువ్వే ధర్నాలకు పిలుపివ్వడమేంటి జగన్?*
*వైసీపీ ధర్నాలకు ప్రజల్లోనే కాదు…సొంత పార్టీలోనూ స్పందన లేదు*
*ఉనికి కోసమే ఆందోళన పేరుతో వైసీపీ డ్రామాలాడుతోంది*
*మా ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు…ఈ మాటకు కట్టుబడి ఉన్నాం*
*ఛార్జీల పెంపు పాపం జగన్‌దే…ఈ విషయం చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తారు*
*జగన్ విధ్వంసం చేసిన విద్యుత్ శాఖను సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారు*
*-విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్*
*అమరావతి :-* కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత వరకూ విద్యుత్ చార్జీలను పెంచనేలేదని, జగన్‌మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన చేసిన పాపాల కారణంగా విద్యుత్ చార్జీలు పెరిగాయని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. 22.5 మిలియన్ యూనిట్ల కొరత ఉన్న రాష్ట్రాన్ని 2019 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ది వైసీపీ ప్రభుత్వానికి నాటి టీడీపీ ప్రభుత్వం అప్పగించిందన్నారు. 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క రూపాయీ కరెంట్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ప్రజలపై రూ.35 వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపడమే కాకుండా రూ.1.20 లక్షల కోట్ల నష్టాన్ని విద్యుత్ శాఖలో తెచ్చిపెట్టారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా డిస్కంల ద్వారా ప్రజలపై భారం వేయండని ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపారన్నారు. సాధారణంగా ఈఆర్సీకి పంపిన 90 రోజుల్లోపు ట్రూప్ అప్ చార్జీలు ఆమోదం పొందాలని…కానీ 2024 మే వరకు కూడా ట్రూప్ అప్ చార్జీలను వాయిదా వేస్తూ వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈఆర్సీ నుంచి ఆమోదం పొందిన ట్రూప్ అప్ చార్జీలు నేడు ప్రజలపై భారంగా పడుతున్నాయని వివరించారు. ప్రతీ ఏటా విద్యుత్ వినియోగం సగటున 6 శాతం పెరుగుతుందని, పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లు ఉత్పత్తిని కూడా పెంచాల్సి ఉంటుందని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వీటీపీఎస్, కృష్ణపట్నం జెన్కో ప్లాంట్ల సామర్థ్యాన్ని విస్తరించామన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి వాటిని పూర్తి చేయలేకపోయారన్నారు. అంతేకాకుండా జగన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు పీపీఏలను రద్దు చేయడమని, పీపీఏల రద్దు కారణంగా 8 వేల మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఏపీ కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆ 8 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సీఎం చంద్రబాబు తిరిగి అందుబాటులోకి తీసుకుని వచ్చారన్నారు. కేవలం సీఎం చంద్రబాబుకు పేరు వస్తుందన్న అక్కసుతోనే జగన్ రెడ్డి నాడు పీపీఏలను రద్దు చేశారన్నారు. పీపీఏలను రద్దు చేయడం కారణంగా విదేశీ బ్యాంకర్లు, పెట్టుబడిదారులు కేంద్రానికి ఫిర్యాదు చేశారని, ఈ కారణంగా విద్యుత్ వినియోగించుకోకపోయినా డబ్బు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మరోవైపు జగన్ తన కమీషన్ల కక్కుర్తి కోసం ఎక్కువ రేటు కు విద్యుత్ కొనుగోలు చేశారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కనీసం ఒక్క మెగావాట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదన్నారు. రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టాన్ని ఏ ఏ రాజకీయ నాయకుడూ చేయలేదని దుమ్మెత్తి పోశారు. విద్యుత్ వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారన్నారు. విద్యుత్ చార్జీలపై జగన్ మోహన్ రెడ్డి ధర్నాలకు పిలుపునివ్వడం మరో తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాలకు పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్‌కు నాసిరకం బొగ్గును సరఫరా చేశారని, నాలుగు లక్షల టన్నులు కృష్ణపట్నం ప్లాంట్ కోసం కొనుగోలు చేస్తే.. దానిలో లక్ష టన్నులు నాసిరకం కొనుగోలు చేశారని ఆరోపించారు. నాసిరకం విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందుకు సంబంధించిన వారిపై విచారణకు ఆదేశిస్తామని తేల్చి చెప్పారు. విద్యుత్ శాఖకు అందించిన సేవలకు సన్మానం చేయాలని జగన్ అంటున్నారని, ప్రజలు ఇప్పటికే 11 సీట్లు ఇచ్చి జగన్‌ను ఘనంగా సన్మానించారన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై కార్యకర్తలే తిరగబడే పరిస్థితిని తెచ్చుకున్నారన్నారు. కాంట్రాక్టు పనులు చేయించి బిల్లులు ఎగ్గొట్టారన్నారు. వైసీపీ కార్యకర్తలే జగన్ రెడ్డిపై తిరగబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. తన ఐదేళ్ల పాలనలో 10 సార్లు విద్యుత్ చార్జీలను జగన్ పెంచారని గుర్తు చేశారు. నాడు జగన్ తెచ్చిన పాలసీలను చూసి ఒక్కరూ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదని, విద్యుత్ వ్యవస్థకు రూ.1.29 లక్షల కోట్లు మేర అప్పులు చేశారని విమర్శించారు. ప్రజలపై కరెంటు బిల్లు రూపంలో ఒక్క రూపాయి కూడా భారం వేయబోమన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జగన్ తప్పులతో నాశనమైన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు సరిదిద్దుతున్నారన్నారు. ప్రజల్లో ఉనికి కోల్పోయిన వైసీపీ ధర్నాలు చేస్తోందని, వైసీపీ డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు. ధర్నాల్లో పాల్గొనాలని జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజల్లోనే కాకుండా, సొంత పార్టీలో కూడా స్పందన లేదన్నారు.
👉మల్లెల పాలేమ్మ అనే మహిళ వద్ద పట్టపగలు నడి బజార్లో చోరీ..*తిరుపతి జిల్లా..నాయుడుపేట*
*👉అవసరాల కోసం బంగారు తాకట్టు పెట్టీ తెచ్చుకున్న 2.83 లక్షల నగదు చోరీ*
తిరుపతి జిల్లా నాయుడుపేట బజారు వీధిలో గొట్టుప్రోలు వడ్డుపాలెంకు చెందిన మల్లెల పాలెమ్మ వద్ద నుంచి 2.83 లక్షల నగదును అపహరించుకుపోయిన గుర్తు తెలియని దుండగులు బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టిన నగదు సంచిలో ఉంచుకొని బజార్లో వస్తువులు కొనుగోలు చేస్తున్న క్రమంలో అపహరణ..పోలీసులుకు ఫిర్యాదు చేసిన బాధితురాలు..విచారణ చేపట్టిన పోలీసులు
👉ఆదర్శంగా మేమే ముందుంటాము..హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించిన పోలీసులు..తిరుపతి జిల్లా..
చంద్రగిరి పోలీసులు..
తిరుపతి జిల్లా ఎస్పి ఎల్ సుబ్బారాయుడు ఐపిఎస్., గారు ప్రజల్లో హెల్మెట్ వాడకం పై విస్టృతంగా చైతన్యం తీసుకురావాలనే ఆదేశాలపై ఈరోజు సాయత్రం విన్నుతంగా సిఐ గారి ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బంది అందరు హెల్మెట్ ధరించి ర్యాలీగా బయలుదేరి నగరంలొ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రత నియమాల లో భాగముగా వాహనదారులు హెల్మెట్ ధరించడం గురించీ ఇచ్చినా అదేశాలతో తిరుపతి రూరల్ మండలంలో ప్రజలకు రోడ్డు సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెల్మెట్ వినియోగం పట్ల ప్రజలందరినీ చైతన్యవంతం చేయడమే మా ముఖ్య ఉద్దేశ్యంగా ఈ ర్యాలీ జరిగింది.
ముందుగా పోలీస్ సిబ్బందితో సాయంత్రం హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించి ఎస్పీ గారి ఆదేశానుసారం పోలిస్ సిబ్బంది అందరు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని. ప్రతిజ్ఞ చేసుకున్నారు.
ఈ కార్యక్రమం పట్టణ ప్రధాన వీధుల్లో హెల్మెట్ అవగాహన ర్యాలీ చేసి టవర్ క్లాక్ వద్ద మానవ హారం చేసినారు.
అనంతరం ప్రజలకు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల నివారణపై
రోడ్డు నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను ఎలా రక్షించుకోవచ్చునో వివరించారు.
పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరూ హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు..
👉సీఎం హెలిప్యాడ్‌ ఏర్పాట్ల పరిశీలన*_
*ఈనెల 31వ తేదీన సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీకి సీఎం చంద్రబాబు*_
*ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు,జిల్లా అధికారులు*
నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ ఈనెల 31న నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు.ఎమ్మెల్యే డా౹౹చదలవాడతో జిల్లా అధికారులు కలిసి సీఎం హెలిప్యాడ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.అదే విధంగా కార్యక్రమ స్థలి,ప్రాంగణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు.ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాట్ల పై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ వెంట కూటమి శ్రేణులు పాల్గొన్నారు._
👉 పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి – పోలీసులు చేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, మూడో భార్య విజయలక్ష్మి (సుష్మ) లను పోలీసులు అరెస్టు చేశారు.
తులసి తల్లిదండ్రుల ఆస్తిని దక్కించుకోవడమే నిందితుల ప్రధాన లక్ష్యంగా ఉండగా, ఈ కుట్రలో భాగంగా ఒంటరిగా ఉన్న పర్లయ్యను హత్య చేసి, అతని శరీరాన్ని పార్సెల్‌లో ప్యాక్ చేసి తులసి ఇంటికి ఈనెల 19న పంపించారు. నిందితుడు శ్రీధర్ వర్మ మూడు పేర్లతో ముగ్గురిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తులసిని భయపెట్టేందుకు పర్లయ్యను హత్య చేసినట్లు తేలింది.
ఈ కేసు సంబంధించిన నిందితులను ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. పూర్తి విచారణ కొనసాగుతుండగా, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడంలో పోలీసులు కృషి చేస్తున్నారు.
👉వరుస దొంగతనాలు చేసే దొంగల ముఠా అరెస్ట్*
ఆంధ్ర ,తమిళనాడులో ఇండల్లో చోరీ చేసే ముఠా ను చాకచక్యంగా అరెస్టు చేసిన సత్యవేడు పోలీసులు….
పుత్తూరు డిఎస్పి రవికుమార్ ఆదేశాలతో సత్యవేడు సిఐ మురళి పర్యవేక్షణలో పాత కేసులను ఛేదించే క్రమంలో సత్యవేడు ఎస్సై రామస్వామి దూకుడు పెంచిన వైనం….
ఈ క్రమంలోనే ఈరోజు సత్తి వేడు లోని ఓ పాలకేంద్రం సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కారును దారి మళ్లించి వేగంగా వెళుతున్న విషయాన్ని గమనించిన ఎస్సై రామస్వామి ఆ కారును తన సిబ్బందితో చుట్టుముట్టి అందులోనే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా సత్యవేడు మండలంలోని శరణంబుదురు, దాసకుప్పంలలో జరిగిన ఇంటి దొంగతనాలతో పాటు తమిళనాడులో కూడా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి 80 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు…
చోరీ చేసిన బంగారాన్ని ఊతుకోట నుండి అమ్మడానికి మాదర పాకం కు తీసుకొని వెళ్తున్న ఈ దొంగల ముఠా ప్రయాణిస్తున్న కారు కూడా దొంగతనం చేసిందే అవ్వడం కోసం అరుపు…
*ఏది ఏమైనా*
జల్సాలకు, వ్యసనాలకు బానిసలై సులువైన మార్గంలో డబ్బు సంపాదించే క్రమంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇలాంటి దొంగల ముఠా తో అప్రమత్తంగా ఉండాలని…. ఎవరైనా తమ సొంత ఇళ్లను వదిలి పెళ్లిళ్లకు, శుభకార్యాలకు, సుదూర ప్రాంతాలకు ,ఇతరత్రా కార్యక్రమాలకు వెళ్లే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని , మీ మీ గ్రామాలలో ప్రాంతాలలో ఎవరైనా అనుమానంగా సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరిన సత్యవేడు ఎస్సై రామస్వామి
👉కడప జిల్లా దిద్దెకుంట గ్రామంలో విషాదం.. అప్పుల్లబాధతో కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లితండ్రులు.4 గురు మృతి, తాము చనిపోతే పిల్లలు అనాధలు అవుతారని ఆందోళనతో పిల్లలకు విషం ఇచ్చిన తల్లితండ్రులు.
👉 *విజయవాడలో పలువురు సిఐల స్థాన మార్పిడి..సీఐ బాల రాజాజీ బదిలీ..* *లక్ష్మీనారాయణ బదిలీ.._*
* *జానకి రామయ్య బదిలీ..*విజయవాడ సత్యనారాయణపురం సీఐ బాల రాజాజీ స్థానంలో సీసీఎస్ లో ఉన్న లక్ష్మీనారాయణను నీమించిన సీపీ..
*బాల రాజాజీని విజయవాడ స్పెషల్ బ్రాంచ్ లో నీమించిన సిపి.._అలాగే టూ టౌన్ ట్రాఫిక్ సీఐగా సైబర్ క్రైమ్లో ఉన్న జానకి రామయ్య ను నేనిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విజయవాడ సిపి రాజశేఖర్ బాబు.._
👉 మూడు మిస్సింగ్ కేసులును ఛేదించిన విశాఖ నగర పోలీసులు.
విశాఖ నగరంలో ఎం.వి.పీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన వేర్వేరు మిస్సింగ్ కేసులలో ముగ్గురి ఆచూకీ కనుగొని, ఈ రోజు వారి కుటుంబ సభ్యులుకు క్షేమంగా అప్పగించడమైనది. ఎం.వి.పి పోలీసులు స్పందించిన తీరుకు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు ఎం.వి.పీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు.
👉లోను EMI కడతావా లేదంటే నీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టమంటావా అంటూ సాఫ్ట్వేర్ యువతిని బెదిరించిన ఇద్దరు రికవరీ ఏజెంట్లు అరెస్టు చేసిన సూళ్లూరుపేట పోలీసులు..
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో లోన్ కట్టాలంటూ సాఫ్ట్వేర్ యువతిని వేధింపులకు గురి చేయడంతో ఇద్దరు రికవరీ ఏజెంట్లును పోలీసులు అరెస్టు చేశారు, కేసు వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ జి సుబ్బరాయుడు మీడియాకు తెలియజేశారు..
సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఆరు నెలల క్రితం ఫిన్ బుల్ అనే యాప్ లో లోన్ తీసుకున్నట్లు తెలిపింది, సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో తన ఫోటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరించడం తో పాటు యువతి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ లు చేసి దూషించారు, అంతటితో ఆగకుండా యువతి సోదరునికి యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి కొన్ని న్యూడ్ ఫోటోలు కూడా పంపించారు, ఏజెంట్లు వేధింపులు తాళలేక యువతి సూళ్లూరుపేట పోలీసులను ఆశ్రయించింది,స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు అవసరమని ఎస్పీ సుబ్బరాయుడు తెలియజేశారు, సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫిన్ బుల్ లోన్ యాప్ పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు, కేసు వ్యవహారంలో నిందితులను అరెస్టు చేయడంలో కోచ్చక్యంగా వ్యవహరించిన సూళ్లూరుపేట SI బ్రహ్మనాయుడు ను పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
👉మద్యం మత్తులో హోంగార్డును కర్రతో బాదిన కానిస్టేబుల్*
*విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో APSP కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి*😲😲😲
*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన*
*పల్నాడు – మాచర్లలో నైట్ బీట్ నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ వద్దకు కానిస్టేబుల్ మల్లిఖార్జున పీకలదాకా మద్యం తాగి వచ్చాడు*
*అనంతరం శ్రీనివాస్ పై అకారణంగా దాడి చేసిన కానిస్టేబుల్.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన సీఐ*

7k network
Recent Posts

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.