11 సీట్లు వచ్చినా అహంకారం తగ్గలేదు… తోలు తీసి కూర్చోబెడతాం: పవన్ కల్యాణ్*..*DCM మన్యం పర్యటనలో నకిలీ IPS హల్‌చల్…! *కొడాలి నాని రాజ‌కీయ స‌న్యాసం..ఏపీలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేట్ పెరిగింది డిజిపి ద్వారకా తిరుమల రావు …..హోంమంత్రి అమిత్ షా రాజీనామా కోసం ఈ నెల 30న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..”వామపక్షాల పిలుపు (తిరుపతి)…*పెండింగ్ లో ఉన్న 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటన్నే పూర్తి చేసి ఇండ్లు లేని పేదలకు ఇవ్వాలి (మహబూబాబాద్ సిపిఎం డిమాండు)..*మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ ఉద్యోగుల ధర్నా…*పాల్వంచకు చెందిన పాస్టర్‌ అఘాయిత్యం*

*సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేత..*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పింఛన్ల తనిఖీ పూర్తయ్యే వరకు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నిరాశ ఎదురుకానుంది.పింఛన్దారులలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.దీంతో జనవరి నుంచి మే వరకు పింఛన్ల తనిఖీ చేయనున్నట్లు సమాచారం.తొలుత రూ.15వేలు అందుకునే లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహిస్తారట.
👉జనసేనాని,DCM మన్యం పర్యటనలో… నకిలీ IPS హల్‌చల్…!
పర్యటన ఆసాంతం పవన్ కళ్యాణ్ వెంటే నకిలీ IPS…!
భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చిన కేటుగాడు…
*వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం… భధ్రతాలోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం…!* సమగ్ర విచారణకు ఆదేశం….
ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా కలియ తిరిగిన వ్యక్తి..
పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులు ఇచ్చిన వ్యక్తి.. పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో ఎంక్వైరీ చేసిన మన్యం జిల్లా పోలీసులు.. నకిలీ IPS ఆఫీసర్ అని తేలడంతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న విజయనగరం రూరల్ పోలీసులు.. నకిలీ IPS గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తింపు.. ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు..విచారణ చేపట్టిన పోలీసులు..
👉 కరీంనగర్ జిల్లా :
ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ తహాసిల్దార్ ..
శంకరపట్నం మం. డిప్యూటీ తహసిల్దార్ మల్లేశం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వెన్షన్ కోసం 6,000 రూ. లంచం తీసుకుంటుండగా ఏసిపి అధికారులు పట్టుకున్నారు.
👉 ఏపీలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందని… సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఈ ఏడాది వార్షిక నేర నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఏడాది క్రైమ్ రేట్ ఓవరాల్‌గా 5.2 శాతం తగ్గిందని.. అయితే సైబర్ క్రైమ్ రేట్ మాత్రం కొంత పెరిగిందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఏడాది పెద్దపీఠ వేశామన్నారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలన్నారు. ప్రాపర్టీ అఫెన్స్స్‌లో గత సంవత్సరం కంటే క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందన్నారు. పోలీసులు తీసుకున్న చర్యలతో రోడ్డు ప్రమాదాలు కూడా కొంత మేర తగ్గాయని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళ కలిగిస్తోందన్నారు. డిజిటల్ అరెస్టులపై ఎవరు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లు ఉన్నాయన్నారు.
గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. గంజాయి రహిత ఏపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్పారు.10, 837 ఎకరాల్లో గంజాయికి మారు పంటలు కూడా వేయించామ‌ని తెలిపారు. ఈగల్ పెట్టిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. గంజాయిని నిర్మూలించడంలో డ్రోన్స్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మనిషి వెళ్లలేని ప్రదేశానికి కూడా డ్రోన్ వెళ్తుతుందన్నారు. 10 పోలీస్ స్టేషన్లకు ఒక డ్రోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు.
నేరస్థులకు ఒక్కటే చెబుతున్నా
నేరం చేసినవాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని.. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని నేరస్తులకు డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలని చెప్పారన్నారు.టెక్నాలజీ వాడకం ఏపీలో పెరిగిందన్నారు. నేరస్థులను సునాయాసంగా పట్టుకుంటున్నామని చెప్పారు. దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని.. ఇప్పటి వరకు 37 దేవాలయాల్లో జరిగిన దొంగతనం కేసులు చేధించినట్లు తెలిపారు. రానున్న మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సిసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్స్‌పై మొత్తం 576 కేసులు నమోదు చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.
👉మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ ఉద్యోగుల ధర్నా….* *గ్రామపంచాయతీ ఉద్యోగుల లను గుర్తించి కనీసం వేతనం చెల్లించాలంటూ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి గ్రామపంచాయతీ ఉద్యోగులందరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు..*
👉 తెలంగాణలో రీ ఎంట్రీకి టీడీపీ ప్లాన్ రెడీ!
హైదరాబాద్‌లో ప్రశాంత్‌కిషోర్ మరియు పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షోటైమ్ రాబిన్ శర్మ లను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్‌
తెలంగాణ టీడీపీ రీ ఎంట్రీ కోసం ప్రణాళికను అందించినట్లు సమాచారం…
👉11 సీట్లు వచ్చినా అహంకారం తగ్గలేదు… తోలు తీసి కూర్చోబెడతాం: పవన్ కల్యాణ్*
వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎంపీడీవో జవహర్ బాబు..రిమ్స్ ఆసుపత్రిలో జవహర్ బాబును పరామర్శించిన పవన్ కల్యాణ్..ఎంపీడీవోపై జరిగిన దాడిని ప్రభుత్వంపై జరిగిన దాడిగానే చూస్తామన్న పవన్..
మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో ప్రభుత్వానికి తెలుసని అన్నారు..సీఐ వెళితే కానీ పరిస్థితి కంట్రోల్ కాలేదన్న పవన్
వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. దాడి గురించి బాధితుడిని, ఆయన కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘నేనున్నా… మీరు ధైర్యంగా ఉండండి’ అని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీపై నిప్పులు చెరిగారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని ఆయన అన్నారు. ఎంపీడీవో అంటే మండలానికి కలెక్టర్ లాంటి అధికారి అని చెప్పారు. జవహర్ బాబును దారుణంగా కొట్టారని… ఆయనపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి గతంలో కూడా పలువురు అధికారులపై దాడి చేశాడని తెలిపారు.
ఇంకా వైసీపీ రాజ్యం నడుస్తోందని అనుకుంటున్నారని… 11 సీట్లు వచ్చినా వీళ్లకు ఇంకా అహంకారం తగ్గలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవోపై జరిగిన దాడిని ప్రభుత్వంపై జరిగిన దాడిగానే చూస్తామని చెప్పారు. సీఐ వెళితే గానీ పరిస్థితి కంట్రోల్ కాలేదని చెప్పారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో కూటమి ప్రభుత్వానికి తెలుసని… చేసి చూపిస్తామని హెచ్చరించారు.
జవహర్ బాబును చంపుతామని బెదిరించారని… ఇలాంటి నాయకులు ఎన్నికల్లో పాల్గొనాలి అంటే భయపడే పరిస్థితి రావాలని పవన్ అన్నారు. మండల స్థాయి అధికారిని కులం పేరుతో దూషించడం పరిపాటి అయిందని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. పులివెందుల ప్రాంతంలో ఒక రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని… దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు.
👉హోంమంత్రి అమిత్ షా రాజీనామా కోసం ఈ నెల 30న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..”వామపక్ష పార్టీ నాయకులు పిలుపు”.. తిరుపతి…
భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకరమైన, ప్రతిష్టకరమైన వాక్యాలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30వ తేదీన తిరుపతి నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వామపక్ష పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.శనివారం ఉదయం 10 గంటలకు బైరాగి పట్టడం సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం సెక్రటేరియట్ నెంబర్ సుబ్రహ్మణ్యం సుసి పార్టీ జిల్లా నాయకులు హరీష్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసనల్లో నడిచే బిజెపి పార్టీ రాజ్యాంగంపై దాని నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎంతటి దేశం ఉన్నదో పార్లమెంటు లో హోం మంత్రి అమిత్ షా చేసిన వాక్యాలు స్పష్టమైందని అన్నారు. దేశంలో అంబేద్కర్ ను స్మరించడం ఫ్యాషన్ అయిపోయిందని అంబేద్కర్ ను స్మరించే బదులు దేవుని స్మరిస్తే ఏడు జన్మలు దాకా స్వర్గమన్న దక్కుతాదంటూ అమిత్ షా చేసిన వాక్యాలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మనువాదం తీసుకురావడంలో కుట్రలో భాగమేనని వాపోయారు. పార్లమెంటులో రిజర్వేషన్లు మీద గెలిచినటువంటి 160 మంది ఎంపీలు పైగా ఉన్న నోరు మెదకపోవడం అంబేద్కర్ ను అవమానించడమేనని, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నోరు మెదకకపోవడం దారుణం అని అన్నారు. ఎన్నికల టైం లో మాత్రం అంబేద్కర్ ను ఉపయోగించుకొని 125 అడుగుల విగ్రహాలను పెట్టామని చెప్పుకొని ప్రచారానికి వస్తారా తప్ప రాజ్యాంగాన్ని కాపాడు కోసం, అంబేద్కర్ ను ద్వేషిస్తున్న ప్రశ్నించకపోవడం ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల వంకర బుద్ధి బయటపడిందని దుయ్యబట్టారు. ఈనెల 30వ తేదీన దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే తిరుపతి నగరంలో 30వ తేదీన అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ నిరసన కార్యక్రమానికి అత్యధిక మంది రాజ్యాంగాన్ని కాపాడు కోసం ప్రజలందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, వేణు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణ,ఎండి రవి, ఎం శివ,శ్రీరాములు,కేవైరాజా,కాలయ్య,నాగరాజు, గోవిందస్వామి,రామచంద్రయ్య,సిపిఎం నాయకులు బుజ్జి,మురళి తదితరులు పాల్గొన్నారు.
👉పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుంది*
*పోలీస్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ని మర్యాదపూర్వకపుగా కలసిన సిబ్బంది*
వరంగల్ కమీషనరేట్ లొ విధులు నిర్వహిస్తు పోలీస్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్స్ పాదోన్నతి పొంది ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ వారిని అభినందించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి తో ఉద్యోగం పట్ల మరింత బాధ్యత పెరుగుతుందని తెలియజేశారు. ఇదేవిధంగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ సర్వీస్ లో మరిన్ని పదోన్నతులు పొందుతూ జిల్లాకు మరియు వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు ..పదోన్నతులు పొందిన వారి వివరాలు
1,సి.హెచ్.రామ రాజేష్
2,ఎ.అశోక్
3,జె.రవీందర్
4,పి.సోమేశ్వర్
5,ఎం.సురేష్
6,Md. రౌఫ్పాషా
7,ఎస్.సదయ్య
8,బి.అశోక్
9 ఎం. ప్రవీణ్ కుమార్
10,పి.నర్సయ్య
11,జి.దామోదర్
కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందారు.
👉పెండింగ్ లో ఉన్న 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటన్నే పూర్తి చేసి ఇండ్లు లేని పేదలకు ఇవ్వాలి*
*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మున్సిపాలిటీ ప్లార్ లీడర్ సూర్నపు సోమయ్య*
మహబూబాబాద్ పట్టణం లోని వేల్పుల సత్యం నగర్ ఏరియా లో *సిపిఎం పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం నాయక్* అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో
*సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మున్సిపాలిటీ ప్లార్ లీడర్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ*
గత BRS ప్రభుత్వం లోని మంత్రి సత్యవతి రోతోడ్ మాజీ MLA బానోతు శంకర్ నాయక్ MLC ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మంగా 36వార్డులకు సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు….
మహబూబాబాద్ పట్టణంలో అప్పటి గత BRS ప్రభుత్వం ఆదేశాలమేరకు పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలు
మీ సేవలో 6వేయిల మంది నీరు పేదలు ఆన్లైన్ చేసుకున్నారు కానీ 200వందల మందికి మాత్రమే నిమిత్తం మాత్రంగా పూర్తి చేసి ఇవ్వడం జరిగాందని మిగితా సుమారు 150మందికి ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సింది ఉంది కానీ అప్పటి అధికారులు అధికారపార్టీ నాయకులు సంబంధించిన కాంట్రాక్టు నిర్లక్ష్య ధోరణి వల్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రపంభ దశలోనే వదిలేయడంతో సగం లో అడిపోయి సిగులు రాడ్లు ఇండ్ల స్లాబులు సిదిలా వ్యవస్థ లో కూలిపోవడానికి ఉన్నదని దంతో కుక్కలకు పందులకు విష పురుగులకు మరియు అపరిచిత వ్యక్తులు గంజాయి మందు గుట్కా బాబుల కార్య కలపలకు నివాసంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసారు…
ఇప్పటికైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మానుస్యంగా నిలిచిన్న డబల్ బెడ్ రూమ్ ను పూర్తి చేసేవిధంగా చర్యలు చీసుకోని తొరగా నిర్మాణం పూర్తి చేసి ఇండ్లులేని నీరు పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేసారు…
ప్రభుత్వలు మారిన ప్రజల స్థితి గతులు మారడం లేదని ఇచ్చిన హామీలు అమలు చేయడం లో విఫలం ఔతున్నారని నీరు పేదలకు అందకుండా నిర్మానుష్యంగా నిలిచిన్న ఇండ్లను వెంటనే పూర్తి చేసి ఇండ్లు లేని నీరు పేదలకు పంపిణి చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నీరు పేదలతో భారీ ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి
సిపిఎం పార్టీ టూ టౌన్ ఏరియా కార్యదర్శి రావుల రాజు,
పార్టీ నాయకులు మేకల వీరేష్ బానోతు బాబు భూక్యా శ్రీను పద్మ ఐలయ్య, మకరంజాన్ బేగం బానోతు సుమన్ ప్రకాష్ కాలనీ వాసులు తదితరులు పాల్గన్నారు…
👉 కొడాలి నాని రాజ‌కీయ స‌న్యాసం..!
రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఏం జ‌రిగినా.. నాయ‌కులు త‌మ మంచికేన‌ని అనుకుంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి జ‌రిగే ప‌రిణామాలు సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి ప‌రిణామ‌మే వైసీపీలోనూ జ‌ర‌గ‌నుంది. కీల‌క నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. రాజ‌కీయంగా స‌న్యాసం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలిసింది. దీనిపై త్వ‌ర‌లోనే ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నట్టు గుడివాడలో చ‌ర్చ సాగుతోంది.
రాజ‌కీయంగా కొడాలి నాని దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు కొడాలికి అత్యంత స‌న్నిహితంగా ఉన్న అనుచ‌రులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం కొడాలి నాని అనారోగ్యంతో ఉన్నారని, ఆయ‌న హైద‌రాబా ద్‌లో చికిత్స పొందుతున్నార‌న్న‌ది గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. ఈ రోజు కాక‌పోతే.. రేపైనా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్ అవుతార‌ని అంద‌రూ భావించారు. కానీ, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్తితులు.. రాజ‌కీయంగా ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు.
ఈ క్ర‌మంలోనే కొడాలి నాని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌న్న‌ది ఆయ‌న వ‌ర్గం చెబుతున్న మాట‌. వాస్త‌వానికి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌లే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాను పోటీ చేసేది కూడా లేదని నాని చెప్పుకొచ్చారు. అయితే.. దీనిని రాజ‌కీయంగా ఆయ‌న సెంటిమెంటుకోసం వాడుకున్నార‌ని అనుకున్నా.. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయిన త‌ర్వాత ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా కూట‌మి స‌ర్కారు కేసులు పెడుతుంద‌న్న బెరుకు ఉంద‌ని కొంద‌రు అంటున్నారు.
కానీ, అనారోగ్య స‌మ‌స్య‌లు.. ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల కార‌ణంగానే నాని రాజ‌కీయాల నుంచిత‌ప్పుకొని.. వ్యాపారాలకే ప‌రిమితం అవుతార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న దాదాపు రాజ‌కీయాల్లో ఉండే ప‌రిస్థితి కూడా లేద‌ని అనుచ‌రుల నుంచి వినిపిస్తున్న మాట‌. మ‌రి ఈయ‌న గ్యాప్ ను ఎవ‌రు ఫిల‌ప్ చేస్తార‌నేది చూడాలి. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు.. కొడాలి త‌మ్ముడు కొడుకు నియోజ‌క‌వ‌ర్గంలో రంగంలోకి దిగే ప్ర‌య‌త్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కొడాలి క‌నుక రాజ‌కీయాల నుంచి నిజంగానే త‌ప్పుకొంటే గుడివాడ‌లోనేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచ‌ల‌న‌మే.
👉 పాల్వంచకు చెందిన పాస్టర్‌ అఘాయిత్యం.
కొండపల్లికిచ చెందిన బాలికపై అత్యాచారం చేసిన పాస్టర్‌.
బాలికను విజయవాడలో ఆస్పత్రికి తరలింపు.
ఇబ్రహీంపట్నం పోలీసుల అదుపులో పాస్టర్‌.*టిడిపి సీనియర్ నాయకులు, ఎమ్మెల్సి సి. రామచంద్రయ్య తనయుడు విష్ణు హైదరాబాద్ లో గుండెపోటు తో మృతి…..*
👉స్పీకర్ అయ్యన్న పాత్రుడు,డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ తో కలిసి సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అసెంబ్లీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.*ప్రముఖుల చిత్రాలు-చరిత్రతో వినూత్నంగా క్యాలెండర్‌ రూపొందించారు.రాజ్యాంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయమని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
👉 మీడియా పై పోలీసుల జులుం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాలివీడు ప్రోగ్రాం కవరేజ్ కోసం ఉదయం 11:00 గంటలకు ఎంపిడి ఓ కార్యాలయం వద్దకు చేరుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ..ఎంపిడిఓ కార్యాలయం నుంచి వందమీటర్లు దూరం లో ఉన్నా కూడా చేయిపట్టి మీడియా ను పక్కకు లాగేసిన పోలీసులు ..ఉదయం నుంచి కనీసం 2 గంటల వరకు తాగు నీరు కూడా అందుబాటులో లేక పడిగాపులు కాస్తున్న మీడియా ప్రతినిధుల పై పోలీసుల దురుసు వైఖరి కి నిరసనగా రోడ్ పై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు ..లేడీ జర్నలిస్ట్ పై కూడా దురుసు గా ప్రవర్తన పోలీసులు..లక్కిరెడ్డి పల్లి సీఐ కొండారెడ్డి ఎస్ ఐ బక్తవత్సలం లు జోక్యం చేసుకొని మీడియా ప్రతినిధుల ను లోపలికి అనుమతించారు

7k network
Recent Posts

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.