చంద్రబాబు హెలిప్యాడ్‌ వద్ద బాంబు!

తాజాగా ఆయన అనకాపల్లి జిల్లా మాడుగులలో సభ నిర్వహించారు. దీంతోపాటు ఏలూరు జిల్లా చింతలపూడిలోనూ సభ నిర్వహించాల్సి ఉంది. ఆయన ‘రా.. కదిలి రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 17 లోక్‌ సభా నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు సభలు నిర్వహించారు. తాజాగా ఆయన అనకాపల్లి జిల్లా మాడుగులలో సభ నిర్వహించారు. దీంతోపాటు ఏలూరు జిల్లా చింతలపూడిలోనూ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే చింతలపూడిలో చంద్రబాబు హెలికాప్టర్‌ దిగాల్సిన హెలిప్యాడ్‌ వద్ద కలకలం చోటు చేసుకుంది. బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్‌ బజర్‌ మోగింది. దీంతో అధికారుల్లో, టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. దీంతో అధికారులు వెంటనే హెలిప్యాడ్‌ మధ్యలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో ఇనుప రాడ్‌ మాత్రమే బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ హెలిప్యాడ్‌ సభా స్థలికి సమీపంలోనే ఉండటం గమనార్హం. మరోవైపు చింతలపూడి సభ వద్ద హెలిప్యాడ్‌ వద్ద తవ్వకాలు చేపట్టడంతో చంద్రబాబు రావాల్సిన హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవడానికి తొలుత అధికారులు అనుమతులు నిరాకరించారు. మాడుగులలో రా కదలిరా సభను పూర్తిచేసుకొని వచ్చే సమయానికి హెలిప్యాడ్‌ ను సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా మాడుగులలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. 64 రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోందని తెలిపారు. ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసమని వెల్లడించారు. ఎన్నికల్లో రాష్ట్రం .. ప్రజలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్‌ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. బటన్‌ నొక్కుతున్నానని జగన్‌ గొప్పలు చెబుతున్నారని.. బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి అని ప్రశ్నించారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌ అని చంద్రబాబు మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై రూ.64 వేల కోట్ల భారం వేశారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం 8 లక్షలు నష్టపోయిందన్నారు. రోడ్లు, మద్యనిషేధం, జాబ్‌ కాలెండర్, సీపీఎస్‌ రద్దు తదితరాలపై బటన్‌ ఎందుకు నొక్కలేదని నిలదీశారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..