ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య.. బి పేటలో కోడి పందెం రాయుళ్ళు అరెస్టు.. ముత్తుములను కలిసిన టిడిపి నాయకులు.. శ్రీశైలంలో చిరుత పులి సంచారం

 

 ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అర్బన్ సిఐ సోమయ్య ట్రాఫిక్ సమస్యపై  దృష్టి సారించారు.ఈసందర్భంగా ఆయన గురువారం తోపుడుబండ్ల వ్యాపారులతో  మాట్లాడుతూ వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా రోడ్లపై తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేయడం వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని దీనివలన ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని కావున రోడ్లపై తోపుడుబండ్లను పెట్టి వ్యాపారాలు చేయవద్దని, ప్రజలకు ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని వ్యాపారస్తులకు సూచనలు ఇచ్చారు.

👉ముత్తుములను మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి

గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డిని కంభం పట్టణ ఆర్యవైశ్య నాయకులు వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి గర్రె వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘణంగా సన్మానించి తన మద్దతు తెలియచేశారు. రాబోయే ఎన్నికల్లో తాను గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు టీడీపి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కేతం శ్రీను పాల్గోన్నారు.

👉కోడి పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్న ఎస్సై నరసింహా రావు

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఎం.పి చెరువు గ్రామ శివారులో పందెంరాయుళ్లు కోడిపందాలు నిర్వహిస్తుండగా స్థానిక ఎస్సై బి.నరసింహా రావు పందెం నిర్వహిస్తున్న స్థావరం పై దాడి చేశారు.దాడిలో భాగంగా పందెం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.అలానే నిందితుల నుండి ఒక పందెం కోడి, మరియు రూ 5100 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు..

👉శ్రీశైలంలో చిరుత పులి సంచారం..

నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది.. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు.. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రోడ్డుకు దగ్గరలోనే అటవీ ప్రాంతం ఉండటంతో చిరుతపులి జనారణ్యంలోకి వస్తుంది.. చిరుతపులిని చూసిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..

చిరుతపులి వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో శ్రీశైలంలోని స్దానికులు భక్తులు భయాందోళనలకు గురయ్యారు.. శ్రీశైలంలో గతంలో కూడ చిరుతపులులు ఔటర్ రింగ్ రోడ్ శివాజి స్పూర్తి కేంద్రం రూద్రాపార్క సమీపంలో చిరుతలు భక్తులకు కనబడ్డాయి.. అయితే శ్రీశైలం దేవస్థానం అధికారులు అటవీశాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు..

👉పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం…

దుర్గి మండలం జంగమేశ్వర పాడు కు చెందిన టిడిపి నాయకుల పై కర్రలతో దాడి చేసిన తర్వాత ప్రత్యర్థులు…దాడిలో ఇద్దరికీ తీవ్రగాయాలు ఒకరి పరిస్థితి విషమం గా ఉంది.దుర్గి నుండి కోలగుట్ల వెళ్లేదారిలో ఈ ఘటన జరిగింది గాయపడిన వారు గాజుల అంజి 35 పాశం రాజు 37 గుమ్మ శ్రీను 38దాడిలో గాయపడిన క్షతగాత్రులను 108 లో మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

7k network
Recent Posts

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..

సీఎం సమక్షంలో వైకాపాలో చేరిన కీలక నేతలు..ప్రచారంలో మాగుంట చందన..జగన్ సర్కారు పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైకాపాలో చేరికలు..ఇజ్రాయిల్ దాడులను ఖండించిన ఎస్ఐఓ..రాష్ట్రస్థాయిలో కంభం వాసవి విద్యార్థుల ప్రతిభ.

బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు .. పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!..రంజాన్ వేడుకలలో ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే కేపీ..విస్తృత పర్యటన లో ముత్తుముల..యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స