కారు,ఆటో ఢీ. ముగ్గురు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు.. పరామర్శించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల.. ఏజీపీగా సంగీతరావు.. కోనసీమ జిల్లాలో చర్చికి నిప్పు

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఎదురుదురుగా వస్తున్న కారు ఆటో ఢీకొనగా ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా , ఇద్దరు ఆటోలో సజీవ దహనం అయ్యారు.కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ, ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కాగా వీరిని మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు .మృతులు బెస్తవారిపేట మండలం బార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు,చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా గుర్తించారు.ఈఘటనపై ఎస్త్సె నరసింహరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మార్కాపురం డి.ఎస్.పి బాల సుందర రావు కంభం సీఐ కే రామకోటయ్య సంఘటన స్థలానికి విచారణ చేపట్టారు  .

*బాధిత కుటుంబాలను పరామర్శించిన వైసీపీ ఇన్చార్జ్*..రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి పరామర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*బాధిత కుటుంబాలను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల..ఈ సంఘటన గురించి తెలుసుకున్న  గిద్దలూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉ఏ.జీ.పీగా  దాసరి సంగీతరావు ..   

గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోనూతన అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాది (ఏ. జి.పి ) గా ప్రముఖ సీనియర్ న్యాయవాది దాసరి సంగీతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గిద్దలూరు మండలం ఆదిముర్తిపల్లే పంచాయతి జమ్ముల్లపల్లే గ్రామానికి చెందిన సంగీతరావు సంజీవరాయునిపేటలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. గిద్దలూరులోని ఎస్. వి డిగ్రీ, పి. జి కళాశాలలో బి. ఏ, ఎం. ఏ అభ్యసించారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర విద్య ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం పూర్తి చేసి పట్టా అందుకున్నారు. 21 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఏజీపీగా వ్యవహరించిన వల్లెల వెంకటరామిరెడ్డి నుండి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కోర్టులోని న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన సీ.ఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు లు సజ్జల రామకృష్ణారెడ్డి , గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

👉 చర్చి కి నిప్పు .. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న  దళితసంఘాలు..

డా.బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా: కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వద్దుపర్రు గ్రామంలో కాలువ రేవు ప్రక్కన గత 12 సంవత్సరాలుగా పాస్టర్ రెవరెండ్ దాసరి మోజేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బైబిల్ మిషన్ భేతెస్తే స్వస్థత శాలపై కొంతమంది దుండగులు ఆదివారం అర్ధరాత్రి తెల్లవారితే సోమవారం సుమారు ఒంటి గంట ప్రాంతంలో మందిరములోనికి ప్రవేశించి, విలువైన వస్తు సామాగ్రిని ధ్వంసం చేసి సుమారు మూడు లక్షల 50 వేల రూపాయలు విలువగల ఎలక్ట్రానిక్స్ పరికరాలను ధ్వంసం చేసి మందిరంలోపల పాత ఎక్సెల్ బండిని ఉంచి నిప్పంటించడం జరిగింది.దీంతోమందిరం పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమై బూడిద పాలయింది. ఈ విషయం తెలుసుకున్న ఆత్రేయపురం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులందరూ అక్కడకు చేరుకుని ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుని, ఈ దాడిలో నష్టపోయిన పాస్టర్ మోజేష్ ని అన్ని విధాలుగా ఆదుకోవాలని నినాదాలు చేస్తూ, స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పత్రాన్ని అందజేశారు.విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలన్నీ అక్కడకు చేరుకుని పాస్టర్లకు మద్దతు తెలియజేశారు.ఈవిషయంలో ఎవరి పాత్ర ఉన్నా ఎంతటి వారైనా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనియెడల పాస్టర్ కి న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

 

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.