వైసిపి టిడిపి బిజెపి బానిసలు.. షర్మిల.. సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే అన్నా.. ఘనంగా అన్నా చైతన్య జన్మదిన వేడుకలు.. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు..డిఆర్ఓ వంశీకృష్ణ

👉వైసీపీ ,టీడీపీలు బీజేపీకి బానిసలని,బిజెపి రామ భక్తులమని చెప్పుకుంటే సరిపోతుందా అని వై ఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. వైసీపీ టీడీపి బిజేపీకి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారన్నారు.ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అని,ఈ ప్రయాణంలో బాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నామని,కలిసి పోరాడే అంశంపై చర్చలు చేశామని,కలిసికట్టుగా పోరాటాలు చేస్తాం అని,కలిసి కట్టుగా లేక పోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యం అన్నారు.అనంతపురం సభకు సిపిఐ ,సిపిఎం లను ఆహ్వానించామన్నారు.ఎన్నికల్లో సీట్లపై చర్చలు జరుగుతున్నాయని పొత్తులపై త్వరలో అన్ని అంశాల మీద క్లారిటీ వస్తుందన్నారు.కాంగ్రెస్ 2014 అధికారంలో వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.హోదా విషయంలో జగన్,బాబు ఇద్దరు విఫలం అయ్యారని, కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే పోలవరం పూర్తి అయ్యేదన్నారు.మోడీ తిరుపతి లో మాట ఇచ్చి హోదా పై మాట మార్చారని రామభక్తులమని చెప్పుకుంటే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి*..   బీజేపీ మతతత్వ రాజకీయం బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తె రాజ్యాంగాన్ని మారుస్తారని ..దేశం అత్యంత ప్రమాదంలో ఉందన్నారు..ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు బీజేపీ కి భయపడుతున్నారని జగన్,బాబు,పవన్ మోడీకి దాసోహం అంటున్నారు.తెలుగు ప్రజల ఆత్మ గౌరవం బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఇతర ప్రజా తంత్ర పార్టీలను కూడా కూడ గడతామని..దేశంలో బీజేపీ మళ్ళీ అధికారం రాకూడదని జగన్ 5 ఏళ్లు పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు.ప్రజలను బిచ్చగాళ్ల ను చేశారు..రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.ఈ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.

👉పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ను అరెస్ట్ చేయడం దారుణం..వి.శ్రీనివాసరావు( సిపిఎం రాష్ట్ర కార్యదర్శి)..

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ను అరెస్ట్ చేయడం దారుణం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండించారు.బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని,బీజేపీ,వైసీపీ ,టీడీపీ మీదనే మా పోరాటం అన్నారు.ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయని,రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు లేని బీజేపీ శాసిస్తుందని బీజేపీ మీద దుమ్మెత్తి పోసిన బాబు ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారన్నారు.బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇన్ని సార్లు డిల్లీ చుట్టూ తిరగడం లేదని ఎద్దేవా చేశారు. ఇన్ని సార్లు తిరిగిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని,రాజధానికి నిధులు లేవని అన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో సహకారం తీసుకుంటామని,కలిసి కట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తామని,ఈ దుష్ట కూటమిలను ఓడగొడతామని బీజేపీనీ,వారికి కాపు గాసేవారిని సాగనంపుతామన్నారు.

👉ముఖ్యమంత్రి జగనన్నను మర్యాదపూర్వకంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్హులైన 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని గిద్దలూరు ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబుమర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

👉ఘనంగా ఎమ్మెల్యే అన్నా తనయుడు చైతన్య జన్మదిన వేడుకలు 

గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు తనయుడు అన్నా కృష్ణ చైతన్య జన్మదిన వేడుకలు శుక్రవారం మార్కాపురంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మార్కాపురం జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా నివాసంలో కుటుంబ సభ్యులు, మిత్రులు, పలువురు నాయకుల తో కలిసి ప్రత్యేకంగా తయారు చేసిన భారీ కేక్ ను కృష్ణ చైతన్య కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పలువురు నాయకులు చైతన్యని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మార్కాపురం లోని కిట్స్ కళాశాలలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

👉 నిషేధిత వస్తువులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు.డిప్యూటీ రేంజి అధికారి డీ.వంశీకృష్ణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ..

ప్రకాశం జిల్లా..గిద్దలూరు:నిషేధిత వస్తువులు అక్రమ రవాణా చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అక్రమ రవాణా దారులను దిగువ మెట్ట అటవీశాఖ డిప్యూటీరేంజి అధికారి డీ.వంశీకృష్ణ హెచ్చరించారు.. డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ గిద్దలూరు వారి ఆదేశాల మేరకు, గుండ్లకమ్మ అటవీ రేంజి అధికారి సూచనల మేరకు వాహనాలు తనిఖీ చేయుటలో భాగంగా అటవీశాఖలో మెటల్ డిటెక్టర్ ను ఉపయోగించి వాహనాలు తనిఖీ చేపట్టామని డిప్యూటీ రేంజి అధికారి డీ.వంశీకృష్ణ తెలిపారు.దిగువ మెట్ట అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు..అటవీశాఖ సంబంధించిన ఎర్రచందనం, గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు..డబ్బులు తరలించే వారు తగిన రసీదులు పెట్టుకోవలన్నారు..అలా కాకుండా పెద్ద ఎత్తున నగదు తరలిస్తూ పట్టుబడితే ఆ నగదును సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం