కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

👉దిల్లీ: కేంద్రం వెలువరించిన బడ్జెట్‌పై (2024-2025) ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పెదవి విరిచారు. ఇది ప్రజామోదమైన బడ్జెట్‌ కాదని, కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని విమర్శించారు.

అందుకే కేంద్రంలో కీలకంగా మారిన బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, మిగతా రాష్ట్రాలకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. *కేవలం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ఎన్డీయే ఈ బడ్జెట్‌ను రూపొందించిందని సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. అందుకే  అత్యధిక పార్లమెంట్‌ సభ్యులు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌కు కూడా నిరాశే ఎదురైందన్నారు. ‘‘ ఎన్డీయే ప్రవేశ పెట్టిన 11వ బడ్జెట్‌ ఇది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌నే తీసుకుంటే.. రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి ఏంటి? అధికార పార్టీ నేతలంతా పెద్ద పెద్ద నెంబర్ల గురించి మాట్లాడుతుంటారు. కానీ, వారు చేపట్టిన పెద్ద ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా పూర్తికాదు. గత పదేళ్లుగా నిరుద్యోగాన్ని సృష్టించి…  ఇప్పుడు ఆ సమస్యను పారద్రోలుతామంటున్నారు. చిన్నా చితకా ఉద్యోగాలు ఇచ్చి.. ‘మమ’ అనిపించాలనుకుంటున్నారు. కానీ, యువతకు కావాల్సింది స్థిరమైన ఉద్యోగాలు’’ అని అఖిలేశ్‌ అన్నారు.కేంద్రం చేసిన నైపుణ్య శిక్షణ ప్రకటనతో భాజపా ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోను ఎత్తివేసినట్లయిందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శించింది. *కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ చేసి బడ్జెట్‌ రూపొందించారని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ‘‘ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ లోక్‌సభ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి పార్లమెంట్‌ వేదికగా చదివి వినిపించడం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని 30వ పేజీలో పేర్కొన్న ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల హామీని కాపీ కొట్టారు. ఇలా చాలా అంశాలు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోనివే.’’ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు.*కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు దశదిశ లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.  రాజకీయంగా ప్రేరేపితమైందని ఆరోపించారు. చీకట్లో వెలుగు నింపేలా బడ్జెట్‌లో తనకెలాంటి అంశం కనిపించలేదని అన్నారు.  2024-25 బడ్జెట్‌ ప్రజలకు, పేదలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు.

👉కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నిరసనకు.. తమిళనాడు సీఎం స్టాలిన్ మద్దతు..
కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన ఫెడరలిజం మరియు న్యాయమైన సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా కేంద్ర బడ్జెట్ ఉందని రాహుల్ గాంధీ ఖండించారు. దీనికి నిరసనగా, జూలై 27వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎంలు దూరంగా ఉంటారని కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సుఖ్వీందర్ సింగ్ సుఖ (హిమాచల్ ప్రదేశ్), సిద్ధరామయ్య (కర్ణాటక) మరియు రేవంత్ రెడ్డి (తెలంగాణ). కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండనున్నారు.
👉కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌పై మాటలు ఘనం – నిధులు స్వల్పం.. ఆంధ్ర మిర్రర్ విజయవాడ..
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు.. కేవలం మాటలు ఘనం నిధులు నిల్‌ అన్నట్లుగా వుందని, ఎన్నికలనంతరం ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాలు అమలుకు నిధులు కేటాయిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు.ఆర్థికమంత్రి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్‌ పేరు పలుసార్లు ప్రస్తావించారు. కానీ నిధులు కేటాయింపు నిరాశ కలిగించిందని,చెప్పిన మాటల్లో కూడా స్పష్టత లేదని, ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రజల్ని మోసగించడానికి కేంద్రం ప్రయత్నించిందన్నారు.రాజధాని అమరావతికి 15 వేల కోట్ల రూపాయలు పలు ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తామని మంత్రి పేర్కొనటం వల్ల రాస్ట్రానికి, రాజధానికి మేలు జరగదని 15 వేల కోట్ల రూపాయలు నేరుగా గ్రాంటుగా ప్రకటించాలి. వివిధ సంస్థల ద్వారా అప్పుగా ఇప్పించడం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి అవగాహన ఉన్నా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం అన్యాయమని,పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన హామీల అమలు కట్టుబడి ఉంటామని చెప్పారే తప్ప వాటికి నిధుల ప్రస్తావన లేదన్నారు. ఆర్థిక మంత్రి ప్రస్తావించిన రెండు పారిశ్రామిక కారిడార్లకూ నిధుల గురించి ప్రస్తావన లేదని,పోలవరానికి 12 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా బడ్జెట్‌లో స్పందన లేదు. నిర్వాసితుల్ని గాలికొదిలేశారన్నారు.*ప్రత్యేక హోదా ఊసే లేదు. రైల్వే జోన్‌, కడప ఉక్కు, మెట్రో, విద్య, వైద్య సంస్థలు తదితర చట్టబద్ధమైన హామీలు బడ్జెట్‌లో చోటు చేసుకోలేదు. గత పది సంవత్సరాల నుండి విభజన చట్ట ప్రకారం నిధులు కేటాయించకుండా బిజెపి నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ బడ్జెట్‌లోనూ ఆశించిన రీతిలో కేటాయింపులు లేవని పుణ్యక్షేత్రాల టూరిజం, వరద నివారణ చర్యలు తదితర విషయాల్లో అనేక రాష్ట్రాలకు నిధులు కేటాయించినా, ఆంధ్రప్రదేశ్‌, తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్రంపైనా, బిజెపిపైనా రాజకీయ ఒత్తిడి తేవాలని బడ్జెట్‌లో మాటలతో సంతృప్తి పడకుండా స్పష్టమైన నిధులు సాధించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కేంద్రాన్ని, బిజెపిని నిలదీయాలని,కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం,జనసేన పార్టీల పైన ఒత్తిడి తేవాలని పార్లమెంటులో మన రాష్ట్ర యంపీలు బడ్జెట్లో న్యాయం కొరకు పోరాడాలన్నారు.

👉ప్రకాశంను వెనుకబడ్డ జిల్లాగా ప్రకటింపజేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..
గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలలోని వెనుకబడ్డ ప్రాంతాలతో ఏర్పాటుచేయబడి, అన్ని రంగాలలో ఇప్పటికీ వెనుకబడిన ప్రకాశం జిల్లాను వెనుకబడ్డ జిల్లాగా గుర్తింపజేసి కేంద్ర బడ్జటులో ప్రకటింపజేసినందుకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

👉జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత కోచింగ్ అప్లికేషన్ తీసుకోవడం ఆఖరి తేదీ జూలై 27వ తేదీ వరకు పొడిగింపు..జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల్లోని అన్ని గ్రామాల అభ్యర్థులు డీఎస్సీ కోచింగ్ కు అర్హులే. గత ఎనిమిది రోజుల నుండి ఉచిత కోచింగ్ కు అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించ బడుచున్నవి. గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డీఎస్సీ అభ్యర్థులు రావడానికి ఇబ్బంది పడుతున్నారని మళ్లీ రెండు రోజులపాటు అప్లికేషన్ తీసుకోవడం పొడిగించి ఈనెల 27వ తేదీ వరకు అప్లికేషన్ లు స్వీకరించబడుచున్నవి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తన ఫౌండేషన్ అనగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా తన నియోజకవర్గంలోని అనేక మంది ఉచిత డీఎస్సీ ఉచిత కోచింగ్ తీసుకుని టీచర్లుగా ఉద్యోగ అవకాశాలు పొందుతారని ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు . కార్పొరేట్ స్థాయిలో బెస్ట్ ఫ్యాకల్టీ ని తీసుకువచ్చి ఉచితంగా నిర్వహించబడుతుంది. ఈ కోచింగ్ కి హాజరైన అభ్యర్థులందరికీ మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించబడుతుంది .కాబట్టి ఈ సదవకాశాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో డీఎస్సీకి అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.అప్లికేషన్ తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ పోర్టు సైజు ఫోటో తీసుకు రావలన్నారు.
*అప్లికేషన్లు తీసుకునే సమయం..ఉదయం 10:00 నుండి, సాయంత్రం 4-00 గంటల వరకు*అప్లికేషన్ తీసుకునే స్థలంకాపు కళ్యాణమండపం*
*గోకవరం రోడ్డు జగ్గంపేట*
*అప్లికేషన్లు తీసుకునే ఆఖరి రోజు జులై 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు పొడిగింపు..క్లాసులు ప్రారంభం ఆగస్టు రెండవ తేదీ నుండి రెండు నెలల పాటు కోచింగ్ నిర్వ హించబడును.సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు*కొత్త కొండబాబు సెల్ నెంబర్ 98481 69790*తోలేటి సూర్యనారాయణ 94903 00606*
అమరావతి:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిల్లారి వెంకట రోశయ్య.*
👉 తాడేపల్లి:ఉండవల్లి కరకట్ట సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద రైతులు అదోళన..రోడ్డుకు ఆడ్డు వచ్చిన తమ పొలాలకు నష్టపరిహారం చెల్లించకుండా కొలతలు వేస్తున్నారంటూ..
*సిఆర్డిఏ అధికారులును అడ్డుకుని కరకట్టపై ఆందోళనకు దిగిన రైతులు..తమకు నష్టపరిహారం చెల్లించకుండా పొలాలు ఆక్ర్రమణకు దిగేతె భారీ ఆందోళన చేపడతామంటూ రైతులు హెచ్చరిక..
👉 డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు వీడు సామాన్యుడు కాదు.. రాజమహేంద్రవరానికి చెందిన షేక్‌ బిలాల్‌ ఇంటర్‌ వరకు చదివాడు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయికి అలవాటుపడ్డాడు. అరకు నుంచి గంజాయిని తెప్పించుకునేవాడు. 2020లో కొవిడ్‌ సమయంలో హైదరాబాద్ నగరానికి వచ్చాడు. మాదాపూర్‌ ఇజ్జత్‌ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. అక్కడి నుంచి కావాల్సిన వారికి గంజాయి విక్రయించేవాడు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా మారి ఐటీ ఉద్యోగులను టార్గెట్‌ చేసుకున్నాడు. వారికి గంజాయి అమ్మకాలు మొదలుపెట్టాడు. సొంతూరుకు చెందిన భాను తేజా అనే యువకుడి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తెప్పించుకున్నాడు. వాటిని డెలివరీ బాయ్ ముసుగులో ఐటీ ఉద్యోగులకు విక్రయించేవాడు.
ఇలా డ్రగ్స్ విక్రయిస్తుండగా.. 2022లో బిలాల్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టుచేశారు. అనంతరం జైలుకు వెళ్లి శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక తిరిగి మళ్లీ డ్రగ్స్ విక్రయించే దందా మొదలుపెట్టాడు. అతడి కదలికలపై పక్కా నిఘా ఉంచిన పోలీసులు.. దాడి చేసి గదిలో దాచిన 22.5కిలోల గంజాయిని, 15 గ్రాముల నిషేదిత ఎండీఎంఏ డ్రగ్స్, 76 నైట్రోసన్‌ మాత్రలు, 491 గ్రాముల హాష్‌ ఆయిల్‌ సీజ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకునే బిలాల్.. వివిధ సంస్థలకు చెందిన 50 మంది ఉద్యోగులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు తెలిసింది. ఇతడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వారందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. బిలాల్‌ జైలులో ఉన్నప్పుడు కూడా తన అనుచరుల ద్వారా ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్‌ సరఫరా చేసేవాడని తెలిసింది.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..