బిట్‌కాయిన్‌ పేరుతో దగా..డాలర్లు పోగేయొచ్చని అమాయకులకు ఎర..మోడీ తాజా పిడుగు? రూ.2వేల లోపు డిజిటల్ పేమెంట్లకు జీఎస్టీ?..షాద్ నగర్ లో ఆరేళ్ల బాలుడి హత్య.

👉బిట్‌కాయిన్‌ పేరుతో దగా..డాలర్లు పోగేయొచ్చని అమాయకులకు ఎర..ఏజెంట్లుగా ఎక్సైజ్‌ ఎస్సై, సివిల్‌ కానిస్టేబుల్‌..వందల మందిని చేర్పించిన ప్రభుత్వ టీచర్లు..కోట్లలో పెట్టుబడులు పెట్టిన అమాయకులు.. నిర్మల్‌ జిల్లాలో భారీ దందా.. నిందితుల అరెస్ట్‌..

చట్టబద్ధత లేని యూబిట్‌ కాయిన్‌ చైన్‌ వ్యాపారం కలకలం రేపుతోంది. ఇందులో నిర్మల్‌ జిల్లాకు చెందిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సూత్రధారులుగా వ్యవహరిస్తూ అమాయకులను బలి చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అందిన ఫిర్యాదుల మేరకు నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యూబిట్‌ కాయిన్‌ చైన్‌దందా గుట్టును రట్టు చేశారు. పలువురు ఏజెంట్లను అరెస్టు చేశారు. ఓఎక్సైజ్‌ ఎస్సైతో పాటు రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి, కానిస్టేబుల్‌ మరో ఇద్దరు టీచర్లు వందల మందిని ఈ దందాలో రూ.లక్షల పెట్టుబడులు పెట్టించారని విచారణలో తేలింది. గొలుసుకట్టు పద్ధతిలో ఈ దందాను కొనసాగిస్తున్నారు. మొదట రూ. 50వేల పెట్టుబడి పెట్టిన వారికి డాలర్లరూపంలో కాయిన్‌లు వస్తాయి.*ఈ పెట్టుబడికి ప్రతీ నెల వడ్డీ రూపంలో వీరి ప్రత్యేక ఖాతాలో జమ అవుతున్నట్లు చూపుతున్నారు. దీంతో పాటు సభ్యులు మరో ఐదుగురిని చేర్పిస్తే వారికి మరింత ఆదాయం వస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో సభ్యులను చేర్పించిన వారికి యూబిట్‌ కాయిన్‌ సంస్థ స్టార్‌ రేటింగ్‌లు ప్రకటిస్తుండటం విశేషం. ఫైవ్‌ స్టార్‌ పొందిన వారు ఈ దందాలో సీనియర్లుగా చెలామణి అవుతూ జిల్లా అంతటా సభ్యులను చేర్పించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్‌, కామారెడ్డి లాంటి పట్టణాల్లో కూడా వీరు నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు చెబుతున్నారు. అయితే ఈ చైన్‌ దందాలో చివరకు ఎవరు చెల్లింపులు చేస్తారనే విషయంపై స్పష్టత లేకున్నా.. అమాయకులు రూ.లక్షలు పెట్టుబడి పెడుతున్నారు….*ఉద్యోగులను నమ్మి పెట్టుబడులు.. నిర్మల్‌ జిల్లాలోని కడెం మండలానికి చెందిన టీచర్లు, ఓ కానిస్టేబుల్‌తో పాటు నిర్మల్‌కు చెందిన ఓ ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఈ దందాకు సూత్రధారులుగా ఉన్నట్లు తేలింది. ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ జానకీ షర్మిల సూత్రధారుల సెల్‌ఫోన్లు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. దీంతో గుట్టు రట్టయ్యింది. వీరితో పాటు మరో 40మంది టీచర్లు కూడా వందల మందిని సభ్యులుగా చేర్పించి వారిచేత రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించారని తెలుస్తోంది. అయితే ఈ పెట్టుబడులన్నీ తిరిగి రావడం కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు.*స్టేట్‌ సైబర్‌ క్రైం ఆరా..నిర్మల్‌లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న యూబిట్‌ కాయిన్‌ దందాపై రాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. నిర్మల్‌ ఎస్పీ పంపిన నివేదిక ఆధారంగా సైబర్‌ క్రైం ఉన్నతాధికారులు కొద్ది రోజుల్లోనే రంగంలోకి దిగి ఈ దందాపై ఆరా తీయనున్నట్లు సమాచారం.

👉మహిళ అదృశ్యం కేసు నమోదు😯😯😯

ఖాజీపేట మండలం ముత్తులూరుపాడు గ్రామానికి చెందిన గెంటెం మేరీ, వయస్సు: 34 సంవత్సరాలు, భర్త: (లేట్) వెంకటసుబ్బయ్య అను ఈమె నిన్నటిదినం అనగా 5- 9-2024 వ తేదీ మధ్యాహ్నం సుమారు 1:30 pm గంటల సమయంలో జ్వరంతో బాధపడుతూ, ఖాజీపేట టౌన్ కు తన ఆడబిడ్డ తోటి వచ్చి, ఆసుపత్రి నందు చూపించుకొని తిరుగు ప్రయాణం నందు ఖాజీపేట టౌన్ బస్టాండ్ నందు తన ఆడబిడ్డ తినుబండారాల కోసం వెల్లి తిరిగి వచ్చేలోపు సదరు మేరీ కనిపించకుండా పోయినందున, ఎంత వెతికిననూ కనపడనందున ఈ దినం అనగా 6- 9 -2024 వ తేదీ ఖాజీపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి మేరీ తల్లి అయినా గంటెం చిన్న రెడ్డమ్మ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగినది.సదరు మహిళ ఆచూకీ తెలిసిన యెడల ఈ క్రింది ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము.9121100623  ..ఖాజీపేట పోలీస్ స్టేషన్.. ఇన్ ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ S. సుబ్బారావు.

👉మోడీ తాజా పిడుగు? రూ.2వేల లోపు డిజిటల్ పేమెంట్లకు జీఎస్టీ? తాజాగా రూ.2వేల లోపు డిజిటల్ చెల్లింపులపైనా 18శాతం జీఎస్టీ వసూలు చేసేలా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఖర్చు చేసే ప్రతి రూపాయికి జీఎస్టీ వసూలు చేసే కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పుడు చిన్న పేమెంట్ల (రూ.2వేల కంటే తక్కువ డిజిటల్ పేమెంట్లు) మీదా కన్నేసిందా? అంటే అవునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ2వేల లోపు లావాదేవీలపై జీఎస్టీ విధించమని చెప్పిన మోడీ సర్కారు ఇప్పుడు ఆ భారం మోపేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. రోజర్ పే.. పైన్ లాబ్స్ లాంటి పేమెంట్ అగ్రిగేటర్ల ద్వారా జరిపే చెల్లింపులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు ఈ పేమెంట్లను డెబిట్ కార్డులు.. క్రెడిట్ కార్డుల ద్వారా చేస్తున్నారు.

వీటితో రూ.2 వేల కంటే ఎక్కువ చెల్లంపులపై జీఎస్టీ ఇప్పటికే వసూలు చేస్తున్నారు. తాజాగా రూ.2వేల లోపు డిజిటల్ చెల్లింపులపైనా 18శాతం జీఎస్టీ వసూలు చేసేలా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను జీఎస్టీ మండలి పరిశీలిస్తున్నట్లు తెలుసతోంది. సోమవారంఢిల్లీలో జరిగే జీఎస్టీ సమావేశంలో ఇందులో చర్చిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఆగ్రిగేటర్లు ఒక్కో లావాదేవీ మీద 0.5 శాతం నుంచి 2 శాతం వరకు పేమెంట్ గేట్ వే ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇలాంటి వేళ.. అదనంగా జీఎస్టీ విధిస్తే.. అది కూడా వినియోగదారుడి మీదే భారం పడుతుంది. మరి.. ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ.. దీన్ని జీఎస్టీ కిందకు చేర్చాలని భావిస్తేమోడీ సర్కారు మరో భారీ దెబ్బ వేసినట్లేనన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

👉షాద్ నగర్ లో ఆరేళ్ల బాలుడి హత్య*.. దొంగతనం చేస్తుంటే చూసాడని బండకేసి కొట్టిన ఉన్మాది*..చూసింది చెబుతాడెమోనని బాలుడి హత్య*, షాద్ నగర్.. పెంచుతున్న పందులను దొంగతనం చేస్తుందగా ఆ పసికందు కంటిలో పడ్డాడు. రాత్రి సమయంలో ఎవరు ఉండరని భావించి పందుల దొంగతనానికి వచ్చిన వ్యక్తి వాటిని దొంగిలించుకుపోయేది అక్కడే ఉన్న పసి బాలుడు చూశాడు. దొంగతనం కోసం వచ్చిన దొంగ తాను చేసే పనిని చిన్న బాలుడు పసిగట్టాడని గమనించి విషయం బయటికి రావద్దని ఆలోచన చేసి ఆ పసికందును హతమార్చిన ఘటన ఇది. షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని హాజీపల్లి రోడ్ లో కొంతమంది జీవనోపాధి కోసం ఎంతో కాలంగా గుడిసెలు వేసుకొని పందుల పెంపకంపై ఆధారపడి ఉన్నారు. అయితే శుక్రవారం రాత్రి సమయంలో ఎల్లయ్య అనే వ్యక్తి పందులను దొంగిలించుకు పోతున్న సమయంలో అదే పరిసరాల్లో ఉన్న గుడిసెలో ఉంటున్న దుర్గయ్య, సాయమ్మ సంతానమైన ఆరేళ్ల బాలుడు కట్టప్ప ఆ దృశ్యాన్ని చూసాడు. పందుల దొంగతనానికి పాల్పడ్డ ఎల్లయ్య అనే వ్యక్తి తాను దొంగిలించిన విషయాన్ని పసిగట్టిన చిన్నారి ఆరేళ్ల బాలుడు కట్టప్ప ఎవరికైనా చెబుతాడేమోనని అనుమానంతో ఆ బాలుడిని పట్టుకుని అతని రెండు కాళ్లు చేతులో పట్టి బండకేసి మొదడంతో తీవ్ర గాయాలైన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

👉రేపటి నుంచి ఈ రూట్‌లో వెళ్తున్నారా..*కొత్త చిక్కులు కొన్ని తెచ్చుకున్నట్లే* ..వినాయక చవితి వచ్చేసింది.. హైదరాబాద్‌లో బడా గణేశుడు కొలువుదీరాడు. తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే వేల సంఖ్యలో వినాయక మండపాలు వెలిశాయి. ప్రధాన వీధుల్లో తప్పకుండా ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భద్రతా పరమైన చర్యలు చేపడుతున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య వాహనదారులను తెగ ఇబ్బంది పెడుతోంది. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులుల తలెత్తకుండా పోలీసులు ప్రత్యుక చర్యలు తీసుకుంటున్నారు. పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. సెప్టెంబర్7వ తేదీ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే 17వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఈపది రోజులు ఉదయం 11 గంటల వరకు అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అందుబాటులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు…ట్రాఫిక్ మళ్లింపు ఇలా..ఖైరతాబాద్‌ విశ్వేశ్వరాయ విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్‌ను అనమతించరు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నిరంకారి జంక్షన్ వైపు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.సైఫాబాద్ పాత పోలీస్ నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ వైపు రాజ్ దూత్ లేన్‌లోకి సాధారణ ట్రాపిక్‌ను అనుమతించరని, ఇక్బాల్ మినార్ వైపు వాహనాలను అనుమతించరు.**సాధారణ వాహనాలను ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు అనుమతించరు. మింట్ కాంపౌండ్ లేన్ ఎంట్రన్స్ నుంచి వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.ఎన్టీఆర్ మార్గ్/ఖైరతాబాద్ ఫ్లైఓవర్/ నెక్టెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. నెక్టెస్ రోడ్‌లో రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్ వైపు, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. నిరంకారి నుంచి సాధారణ ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్, ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు అనుమతించరు. పోస్టాఫీసు వద్ద ఓల్డ్ సైఫాబాద్ జంక్షన్ వైపు కూడా వాహనాలను అనుమతించరు.*సెలవు రోజుల్లో..   సాధారణ, వారాంతపు సెలవు రోజుల్లో ఖైరతాబాద్ బడా గేణేశుడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖైరతాబాద్, షాదన్ కాలేజ్, నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, మింట్ కాంపౌండ్ ప్రాంతాలు రద్దీగా ఉంటాయని, సెలవు దినాల్లో ఈ మార్గాల్లోకి వావాహనదారులు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

👉ప్రయత్నం బెడిసి కొట్టింది… పోలీసులకు దొరికిపోయారు*..నకిలీ బంగారాన్ని ఒరిజినల్ బంగారంగా అమ్మాలనే ఉద్దేశం* ..చాకచక్యంగా ముగ్గురు నేరస్తులను పట్టుకుని రిమాండ్ కు తరలించిన షాద్నగర్ పోలీసులు*..నకిలీ బంగారం అడ్డాగా బళ్ళారి* అమాయకులైన ప్రజలను నకిలీ బంగారాన్ని ఒరిజినల్ బంగారంగా అమ్మ జూపాలనే ప్రయత్నంతో మోసం చేయాలనుకున్న ముగ్గురు నిందితులను షాద్ నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. షాద్ నగర్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బలరాం తెలిపిన వివరాల ప్రకారం కడ వెండి గ్రామం, దేవ్ రూపుల మండలం, జనగామ జిల్లాకు చెందిన (A1) భాషాపక సుజీత్ @ సంతోష్ @ రంజిత్, మైత్తరం గ్రామం, పాలకుర్తి మండలం, జనగామ జిల్లాకు చెందిన (A2) పలనాటి అశోక్, దేవ్ రుపుల గ్రామం మరియు మండలం, జనగామ జిల్లాకు చెందిన (A3) భాషపాక రమేష్ లు ముగ్గురు కలిసి బళ్లారిలో మహేష్ అనే వ్యక్తి దగ్గర నకిలీ బంగారం అని తెలిసి కూడా అట్టి బంగారం కొని అట్టి నకిలీ బంగారం ను ఒరిజినల్ బంగారంగా చెప్పి ప్రజలని మోసం చేసి ఎక్కువ ధరకు అమ్ముకొని ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో నకిలీ బంగారం ను హైద్రాబాద్ తరలిస్తుండగా పై నేరానికి పాల్పడిన ముగ్గురు నేరస్తులను షాద్ నగర్ పోలీసు వారు నిన్న తేదీ: 05.09.2024 నాడు రాయికల్ టోల్ ప్లాజా దగ్గర పట్టుకుని అరెస్ట్ చేసారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్ నగర్ పోలీసులు క్రైం.నెం. 686 /2024, U/s 318(4), 3(5)BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పై తెలిపిన ముగ్గురు నిందితుల నుండి 790 గ్రాముల నకిలీ బంగారం, స్విఫ్ట్ డిజైర్ కార్, 3 మూడు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించారు. నేరస్తులను పట్టుకోవడం చాకచక్యంగా వ్యవహరించిన ఈ కేసులో ఏసీపీ రంగస్వామి పాల్గొని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. విజయ్ కుమార్ ను, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శరత్ కుమార్ ను మరియు అతని టీం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ బలరాం లను అభినందించారు.

**16మంది వరదల వల్ల చనిపోయారు.. చాలా బాధాకరం..*వరద వల్ల చనిపోయిన ప్రతి ఒక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా.. *గోవులు చనిపోయిన వారికి గోవుకు రూ.50వేలు* *జీవాలకు రూ.5వేలు ఎక్స్ గ్రేషియా.. *పంట నష్టపరిహారం కిందా ఎకరానికి రూ.10వేలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి.. *ఇండ్లు మునిగి బాధపడుతున్న బాధితులకు తక్షణ సహాయం కిందా రూ.10వేల అర్థిక సహాయం.. *ఖమ్మం కలెక్టర్ ఖాతాకు రూ.5కోట్లు కంటినేన్సీ పండ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..*

👉 త్వరలో జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు.. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లకు డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పీజీలో 55% మార్కులు, నెట్/స్లెట్/పీహెచ్ ఉన్నవారు అర్హులని, ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూనియర్ కాలేజీల్లో పనిచేసే లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకూ పదోన్నతులు కల్పించనుంది. వారికి కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చింది.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త