👉ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..*వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం*విజయవాడ :
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర బృందం పర్యటించనుంది. వరదలతో అతలాకుతలమైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించి నష్టం అంచనా వేయనుంది. కాగా వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రం ఇంకా స్పందించ లేదు…
👉👉👉జగన్ ఐదు నిముషాల షో.. ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..
సోమవారం ఐదు నిముషాలు వచ్చి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి షో చేసి వెళ్లారని కనీసం ఒక్కరికైనా ఒక్క పొట్లం ఆహారం ఇచ్చారా… ఒక్క రినైనా రక్షించారా… కనీసం పలకరించారా అని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. వికృత చర్యలకు పాల్పడుతూ డ్రగ్ మాఫియా డాన్ లాగా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.కొందరు అధికారులను వీఆర్లో పెట్టామని, వీఆర్లో పెడితే పనిచేయరా, జీతం తీసుకోవడంలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఉంటేనే మనం ఉంటామని, వారు ఇబ్బందులలో ఉంటే మీన మేషాలు లెక్కేస్తారా అని మండిపడ్డారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటించి ఆదేశాలిచ్చినా కొందరు అధికారులు ఇంకా పనిచేయడంలేదని బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.అధికారులు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆ తరువాత మీరే చూస్తారని మరోసారి సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆనాడు ప్రధాని హుద్ హుద్ సమయంలో చేసిన సేవలను గుర్తించి అభినందించారని ఇప్పుడు కూడా రాష్ట్రానికి మీరున్నారుగా భయం లేదని చెప్పారని ఆ నమ్మకాన్ని ప్రజల భరోసాను నిలబెట్టుకునేందు కు తాను పనిచేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు
👉పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన హర్విందర్ సింగ్..పారిస్ పారాలింపిక్స్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచారు. పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో పోలాండ్ అథ్లెట్ లుకాస్ట్ సిస్టెక్పై 6-0 తేడాతో విజయం సాధించారు. దీంతో ఒలింపిక్స్/ పారాలింపిక్స్ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత ఆర్చర్గా రికార్డు సృష్టించారు. ఒలింపిక్స్ లోనూ ఆర్చరీలో భారత్ కు ఇప్పటి వరకూ స్వర్ణ పతకం రాలేదు.
👉నేటి నుంచి నిత్యావసరాలు పంపిణీ..వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి నిత్యావసరాల కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తామని చెప్పారు. ఇళ్లు, షాపులు పూర్తిగా మునిగిపోయి నష్టపోయిన వారిని ఆదుకుంటామని చెప్పారు.
👉బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి*మంత్రి లోకేష్ పర్యవేక్షణ శరవేగంగా సాగుతున్న బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు.*గంటగంటకు డ్రోన్ లైవ్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి లోకేష్.*.. క్షేత్రస్థాయిలో ఫ్లడ్ లైట్ల వెలుగులో పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు.రేపటికల్లా ప్రధానమైన 3 గండ్లు పూడ్చివేత పూర్తిచేస్తామని సిఎం సమీక్షలో అధికారుల వెల్లడి.*లోకేష్ పిలుపుతో వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న 1800 మంది టీడీపీ కార్యకర్తలు..వరద తగ్గడంతో ముమ్మరంగా సహాయ చర్యలు.*
👉ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు*..హిమాచల్ ప్రదేశ్ :*ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ నుండి మరొక పార్టీకి మారటం ఈ రోజుల్లో సాధారణ విషయమే..ఇటువంటి ఫిరాయింపులను నిరోధించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి మారకుండా తెచ్చిన కొత్త బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపింది.దీని ప్రకారం ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యే లకు పెన్షన్ రద్దు కానుంది.వారి జీవితంలో ఏ సమయంలో నైనా పార్టీ మారితే ఇది వర్తిస్తుంది.
👉సెప్టెంబర్ 6 నుంచి వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ*ఇండ్లు దెబ్బతిన్నోళ్లకు ‘డబుల్’ ఇండ్లు ఇస్తం: తుమ్మల…ఖమ్మంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వెల్లడి..ఖమ్మం టౌన్ : మున్నేరు వరద తగ్గుముఖం పట్టగానే బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం నుంచి వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేస్తామని తుమ్మల తెలిపారు. ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నోళ్లకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ”వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద తొలగించేందుకు అదనంగా పారిశుధ్య కార్మికులను, ట్రాక్టర్లను పక్క జిల్లా నుంచి రప్పిస్తున్నాం. వరదల్లో పూర్తిగా మునిగిన ఇండ్లు 7 వేలకు పైగా ఉన్నాయి. బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నాం. నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం’ అని వెల్లడించారు. ఇంకా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదన్నారు. గత వందేండ్లలో ఎన్నడూ ఇలాంటి వరదలు రాలేదని, అయినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టామన్నారు. సహాయక చర్యలు పాలుపంచుకున్న అధికారులు, సిబ్బంది, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఫైర్ ఇంజన్లతో రోడ్లను శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా హెల్త్ డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో పది బృందాలు రంగంలోకి దిగాయని, ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ శ్రీజ, సీపీ సునీల్ దత్, కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
👉 గ్రూప్-4 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్లకు స్పెషల్ రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2022 డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది…
👉రిటైనింగ్ వాల్ కట్టినందుకు కృష్ణలంక వాసులు నన్ను ఆపి కృతజ్ఞతలు తెలిపారు…* *వైయస్ జగన్ , వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు..!*ఆ గోడ ఉండటంతోనే ఈరోజు దాదాపు 3 లక్షల మంది నిశ్చితంగా నిద్రపోగలుగుతున్నారు…* ఒకవేళ ఆ రిటైనింగ్ వాల్ లేకుండా ఉండి ఉంటే.. ఈరోజు విజయవాడ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అన్నారట…*
👉బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు*….. హైదరాబాద్ లో అరెస్టు చేసిన మంగళగిరి గ్రామీణ పోలీసులు*తెదేపా కార్యాలయం పై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు..సురేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ కొట్టివేసిన హైకోర్టు..దీంతో అజ్ఞాతంలోకి పారిపోయిన నందిగం సురేష్..హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం..సమాచారం అందుకుని హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేసిన పోలీస్ ప్రత్యేక బృందాలు.సురేష్ ను గుంటూరు జిల్లాకు తరలిస్తున్న పోలీసులు..ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం..ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు..
👉ఒంగోలు పట్టణం..విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ సేవలు చేపట్టేందుకు ఒంగోలు ఉప రవాణా శాఖ ఆధ్వర్యంలో ట్రాక్టర్లను పంపే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా.
👉విజయవాడ లోని 54,55,56 డివిజన్ లో పర్యటించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి,శాఖ మంత్రివర్యులు సవితమ్మ ఇంటింటికీ వెళ్లి ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసిన మంత్రి. సవితమ్మ.వరద బాధితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా. సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరిన మంత్రి సవితమ్మ..
👉యాక్టర్ ఫిష్ వెంకట్ రెండు కాళ్ళకు ఇనుపమేకు గుచ్చుకోవడం వల్ల డయాసిస్ ట్రీట్మెంట్ చేపించుకొనుట కు ఆర్థిక సహాయం కోరుచున్నారు..ప్లీజ్ దాతలు ఉంటే ఫిష్ వెంకట్ ఫోన్ పే నెంబర్ కి సహాయాన్ని అందిస్తారని కోరుతున్నారు.
👉👉కలెక్టర్ ద్వార విజయవాడ వరద బాధితులకు సహాయార్ధం ..మాగుంట 10.00 లక్షలు వితరణ ..గత నాలుగు రోజులుగా ఎన్నడూ లేని విధంగా కురిచిన అధిక వర్షాలతో విజయవాడ నగరం వరదతో అతలాకుతలమై అనేక బాధలు పడుచూ విపత్కర పరిస్థితిలో వున్న వరద బాధితులను ఆదుకోవలసిన బాధ్యత మనందరిపై వున్నదని, కనుక వారికి ఆహార పదార్ధాలు అందజేయుటకు ప్రజలు విరివిగా విరాళాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు. మాగుంట శ్రీనివాసులురెడ్డి మరియు టి.డి.పి. యువ నాయకులు, మాగుంట రాఘవరెడ్డి గారు కోరుచూ, తమ వంతుగా రూ.10.00 లక్షలు విరాళాన్ని ఈ రోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ కి వారి కార్యాలయ ప్రతినిధులద్వారా అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఒంగోలు సూపర్ బజార్ చైర్మన్, తాతా ప్రసాద్ , మాజీ జిల్లా సహకార సంఘ అధ్యక్షులు,బెల్లం సత్యనారాయణ, జిల్లా సహకార సెంట్రల్ బ్యాంకు అధ్యక్షులు,కండె శ్రీనివాసరావు , మాజీ జిల్లా డైరీ అభివృద్ధి అధ్యక్షులు,కుప్పా రంగనాయకులు, మాజీ సెన్సార్ బోర్డు సభ్యులు, ఆత్మకూరి బ్రహ్మయ్య జయవరం కృష్ణారెడ్డి,షేక్ అన్సార్ భాష పాల్గొన్నారు.
👉ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని.. నవ వధువు ఆత్మహత్య..ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని.. నవ వధువు ఆత్మహత్య ..
పెళైన 17 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల(D) మల్యాల(M) తక్కళ్లపల్లికి చెందిన కనక భాగ్యలక్ష్మి(24)కి మ్యాడంపల్లికి చెందిన ఉదయ్‌కిరణ్ తో ఆగస్టు 18న వివాహం జరిగింది. ఉదయ్‌కిరణ్ హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు సోమవారం కూతురును తక్కళ్లపల్లికి తీసుకొని వచ్చారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మి బుధవారం మధ్యాహ్నం బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చేతిపై ‘నేను ఎవరి వల్ల చనిపోవడం లేదు.. నాకే ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు అందుకే వెళ్లిపోతున్నా’ అని రాసి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు…
👉 ఆర్ఎంపి వైద్యులు ఇచ్చిన ఇంజక్షన్ తో బాలుడు మృతి..భద్రాద్రి.. కొత్తగూడెం జిల్లా..పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సోనియా నగర్ లో ఆర్ఎంపి వైద్యుడు సతీష్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి నాలుగు సంవత్సరాల గూగులోత్ జిన్ను అనే బాలుడు మృతి..బాలుడి మృతదేహంతో ఆర్ఎంపి వైద్యుడు ఇంటి ముందు బంధువుల ధర్నా పరారీలో ఆర్ఎంపి వైద్యుడు..పాల్వంచ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు..
👉విజయవాడ వరద బాధితులకు నిత్యవసర వస్తువులు అందజేసిన కంభం వాసులు.
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల 1988-89 బ్యాచ్ విద్యార్థులయిన ఉప సర్పంచ్ సయ్యద్ ఖాసిం,బాబ్జి, సత్యం, చిట్టి రసూల్ , బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్లు పంపిణీ చేశారు.
👉గణేష్ పండుగపై ఎస్సై నరసింహా ఆధ్వర్యంలో “పీస్” కమిటీ*..ప్రకాశం జిల్లా కంభం మండలం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణములో ఎస్సై నరసింహా ఆధ్వర్యంలో వినాయక చవితి దృష్ట్యా బుధవారం నాడు “పీస్” కమిటీ సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది.ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ జె.రామకోటయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్సై మరియు సిఐ లు మాట్లాడుతూ పండుగ వేడుకల్లో పోలీసులు సూచించిన నిబంధనలను తూ చా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు.అలానే యువత చట్టపరమైన కఠిన చర్యలకు గురికాకుండా నడుచుకోవాలని అన్నారు.అలానే నిమజ్జన వేడుకల్లో ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా వేడుకలను నిర్వహించాలని తెలిపారు.నిమజ్జన వేడుకల్లో మందుబాబులు ఆకతాయి పనులు చేయకూడదని అలా ప్రవర్తించినచో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో మండల అధికారులు,నాయకులు పాల్గొన్నారు.
👉అర్థవీడు నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ సుదర్శన్ యాదవ్.
ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం నూతన ఎస్ఐగా సుదర్శన్ యాదవ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలలో భాగంగా ఆయన అర్థవీడు పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుదర్శన్ యాదవ్ మాట్లాడుతూ.. నేరాల నిరోధానికి కృషి చేస్తానన్నారు. అలానే శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.