వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..

👉నాలుగున్నర గంటల పాటు 22 కి.మీ మేర జేసీబీపైనే ప్రయాణించి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన*

*వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకున్న సిఎం*
*భవానీపురం నుండి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటన*
*వరద బాధిత ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి, ప్రజలకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి*
*అమరావతి:-* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడవ రోజూ వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపు నాలుగున్నర గంటలు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కార్లు వెళ్లే అవకాశం లేని చోట కాన్వాయ్ ను పక్కన పెట్టి దాదాపు 22 కిలోమీటర్లు జేసీబీపైనే చంద్రబాబు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వదర బాధితులకు అందుతున్న సాయాన్ని స్వయంగా అడిగితెలుసుకున్నారు. వారి ఆవేదన, బాధను విని ధైర్యం చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రెండు రోజులుగా బసచేస్తున్న సిఎం…మూడవ రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి భవానీపురం వెళ్లారు. ముందుగా అక్కడ బాధితులతో మాట్లాడారు. తమకు సాయం చేరిందని…ఇప్పుడు కాస్త వరద తగ్గడంతో సాంత్వన చేకూరిందని ఆ ప్రాంత ప్రజలు చెప్పారు. సితార సెంటర్ నుంచి కార్లు వెళ్లలేని పరిస్థితుల్లో కాన్వాయ్ పక్కన పెట్టి జెసిబి ఎక్కి ముందుకు కదిలారు. దారి పొడవునా బాధితులతో మాట్లాడారు. అదే జేసీబీపై జక్కంపూడి వెళ్లి అక్కడ బాధితులను కలిసి ప్రజలకు అందుతున్న వరద సాయంపై తెలుసుకున్నారు. అక్కడి నుండి వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, నున్న, కండ్రిక ఇన్నర్ రింగ్ రోడ్ కు వచ్చారు. అక్కడికి తన కాన్వాయ్ రావడంతో అక్కడి నుంచి కారు ఎక్కి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విధంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు సిఎం అన్ని ప్రాంతాల్లో జేసీబీపైనే ప్రయాణం చేశారు. పలు ప్రాంతాల్లో బాధితుల సమస్యలు విన్న సిఎం అధికారులను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. సమన్వయం లోపం కారణంగా వేగంగా సాయం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల్లో బాధ్యత, భయం తీసుకురావాలనే కారణంతోనే తాను స్వయంగా మూడు రోజులుగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సీఎం తెలిపారు. అధికారులు బాధ్యత, మానవీయకోణంలో పనిచేయాలని సిఎం అన్నారు. సరిపడా ఆహార ప్యాకెట్లు పంపుతున్నా ఎందుకు చేరవేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. నీరు తగ్గని ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు.సితార సెంటర్ లో బయలు దేరిన ముఖ్యమంత్రి మళ్లీ వెనక్కి వస్తారని అధికారులు కాన్వాయ్ ను అక్కడే ఉంచారు. అయితే సిఎం అక్కడి రాకపోగా ఏ ప్రాంతానికి వస్తారో తెలియకపోవడంతో కాన్వాయ్ ను పలు చోట్లకు తిప్పారు. ప్రతి ప్రాంతాన్ని చూడాలని, సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని సిఎం భావించారు. దీంతో అనేక ప్రాంతాల్లో నాలుగున్నర గంటల పాటు ఆయన పర్యటన జేసీబీపైనే సాగింది. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా సిఎం వరద బాధిత ప్రాంతాల్లోనే పర్యటించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు వదర ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. సితార సెంటర్ వద్ద వరద ప్రాంతంలో అడుగు పెట్టిన ముఖ్యమంత్రి పలు చోట్ల పర్యటించి రామవరప్పాడు వంతెన సమీపంలో సాధారణ ప్రాంతానికి చేరుకున్నారు. సిఎం అక్కడికి వచ్చే సరికి ఆయన కాన్వాయ్ కూడా ఆ ప్రాంతానికి రాలేదు. దీంతో మరికొంత దూరం అయన జేసీబీపైనే ముందుకు సాగారు. సిఎం రూట్ పై సమాచారం అందుకున్న కాన్వాయ్ అక్కడికి చేరుకోవడంతో అక్కడ నుంచి తన వాహనంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. ఈ నాలుగున్నర గంటల పర్యటనలో ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. సిఎంతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పర్యటిచారు. వరద కారణంగా ఇతర వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో సిఎం సెక్యూరిటీలోని కొంత మంది సిబ్బంది మాత్రమే ముఖ్యమంత్రితో వెళ్లగలిగారు.
👉బ్రూనై నుంచి పారాలింపిక్స్ క్రీడాకారులకు మోదీ ఫోన్
బ్రూనై పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పారాలింపిక్స్ క్రీడాకారులకు ఫోన్ చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. “బ్రూనైలో కార్యక్రమాల అనంతరం.. మన పారాలింపిక్స్ ఛాంపియన్లకు ఫోన్ చేసి అభినందించాను. తన క్రీడాకారుల పట్ల భారత్ గర్వంగా ఉంది” అని మోదీ పేర్కొన్నారు.
👉ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి…
👉 హైడ్రాను మండల, తాలూకా, జిల్లాలకు కూడా విస్తరించచాలనే డిమాండ్ వస్తోందని.. త్వరలోనే జిల్లాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. *తెలంగాణలో వరద నష్టం రూ.5,438కోట్లు.. శాఖల వారీగా లెక్కలివే!
వరద ప్రభావానికి తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం..రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.శాఖల వారిగా నష్టం వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.415 కోట్ల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.
👉 ఆన్ … సీఎం డ్యూటీ ..*ఆంధ్రా, తెలంగాణా:* వరద నీటిలోనే తిరుగుతూ తెలుగు రాష్ట్రాల సీఎం లు సమీక్షలు.▪️వరదల కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు గడిపిన సమయం.▪️తెలంగాణ సీఎం – 24 గంటలు (నిన్న మధ్యాహ్నం మొదలై ఈరోజు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి)
▪️ఏపీ సీఎం – 72 గంటలు (ఇంకా సహాయ చర్యల్లో పాల్గొంటున్న చంద్రబాబు నాయుడు)
వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..ఏకంగా తాసిల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికెట్లు జారీ..వరంగల్ ఎమ్మార్వో ఇక్బాల్ మట్ట్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..పోలీసుల విచారణలో బయటపడ్డ నమ్మలేని నిజాలు.డబ్బులు ఇస్తే ఎ సర్టిఫికెట్ అయినా ఐదు నిమిషాల్లో తయారు చేస్తారు..ఇప్పటివరకు 460 మందికి సుమారు 640సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సమాచారం.ఒక సర్టిఫికెట్ తయారు చేయడానికి సహకరించిన డిటిపి, స్టాంపు, సంతకం ఫోర్జరీ, దళారి ఇలా ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు.
కోపి లాగితే డొంక కదులుతున్నట్లు సమాచారం..

👉 బ్రూనై నుంచి పారాలింపిక్స్ క్రీడాకారులకు మోదీ ఫోన్..బ్రూనై పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పారాలింపిక్స్ క్రీడాకారులకు ఫోన్ చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. “బ్రూనైలో కార్యక్రమాల అనంతరం.. మన పారాలింపిక్స్ ఛాంపియన్లకు ఫోన్ చేసి అభినందించాను. తన క్రీడాకారుల పట్ల భారత్ గర్వంగా ఉంది” అని మోదీ పేర్కొన్నారు.

👉ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి…

👉 హైడ్రాను మండల, తాలూకా, జిల్లాలకు కూడా విస్తరించచాలనే డిమాండ్ వస్తోందని.. త్వరలోనే జిల్లాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. *తెలంగాణలో వరద నష్టం రూ.5,438కోట్లు.. శాఖల వారీగా లెక్కలివే!వరద ప్రభావానికి తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం..రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.శాఖల వారిగా నష్టం వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.415 కోట్ల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.

👉👉👉వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం.. ఏకంగా తాసిల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికెట్లు జారీ..వరంగల్ ఎమ్మార్వో ఇక్బాల్ మట్ట్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..పోలీసుల విచారణలో బయటపడ్డ నమ్మలేని నిజాలు.డబ్బులు ఇస్తే ఎ సర్టిఫికెట్ అయినా ఐదు నిమిషాల్లో తయారు చేస్తారు..ఇప్పటివరకు 460 మందికి సుమారు 640సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సమాచారం.ఒక సర్టిఫికెట్ తయారు చేయడానికి సహకరించిన డిటిపి, స్టాంపు, సంతకం ఫోర్జరీ, దళారి ఇలా ప్రతి ఒక్కరిని విచారిస్తు న్నారు.కూపి లాగితే డొంక కదులుతున్నట్లు సమాచారం..

👉వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు..ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సినీ స్టార్లు ముందుకు వస్తున్నారు. ప్రముఖ హీరో మహేష్ బాబు రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు మంగళవారం ట్వీట్ చేశారు.

👉భారీ విరాళం ప్రకటించిన ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ …రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన ప్రభాస్..వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు నీళ్లు ఏర్పాటు చేశారు .*ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్.రేపు సీఎం చంద్రబాబును కలిసి కోటి రూపాయల విరాళం అందిస్తానన్న పవన్‌ కళ్యాణ్:

👉వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు..ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సినీ స్టార్లు ముందుకు వస్తున్నారు. ప్రముఖ హీరో మహేష్ బాబు రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు మంగళవారం ట్వీట్ చేశారు.

*తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..*6 ఎకరాల భూమిని తిరిగి తండ్రి పేరిట మార్చిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్..*తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రకటన*..ధర్మారం(పెద్దపల్లి): వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదంటూ కొడుకు పేరిట చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ను తిరిగి తండ్రి పేరిట బదిలీ చేస్తూ పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతల పల్లి గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డి తన కుమారుడైన గడ్డం స్వామిరెడ్డికి వివిధ సర్వే నంబర్లలోని తనకున్న 6 ఎక రాల 5 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ చేశారు.అయితే కొంతకాలంగా తన బాగోగులు చూసుకోవట్లేదని కొడుకుపై పెద్దపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.దీంతో విచారణ చేపట్టిన ఆర్డీవో.. స్వామిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు.అయినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బాపురెడ్డి గతంలో తన కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసేందుకు దరఖాస్తు సమర్పించారు.ఆ దరఖాస్తును అప్పీలుగా స్వీకరించి ఇరువ ర్గాలకు నోటీసులు జారీ చేసి కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరిపారు.ఆర్డీవో ఉత్తర్వుల అమల్లో స్వామిరెడ్డి నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ నిర్ధారిం చారు.దీంతో వయోవృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం గడ్డం బాపురెడ్డి కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి తిరిగి తండ్రి పేరిట బదిలీ చేయాలని నిర్ణయించారు.అలాగే తండ్రి పోషణకు ప్రతి నెలా రూ. 10వేలను ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కుమారుడు స్వామి రెడ్డి, కుమార్తె సింగిరెడ్డి లతను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.తల్లి దండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత సంతానంపై ఉంటుందని..ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుం టామని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

👉 పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯😯😯 :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పనిచేయని మంత్రులు తమకు అవసరం లేదని ఆయన అన్నారు. వారిని మంత్రి వర్గం నుంచి కూడా తొలగిస్తానని తెలిపారు. పని చేయని వారు తమకు అక్కరలేదని ఆయన తెలిపారు. మంత్రులైనా, అధికారులైనా ఒకే చర్య ఉంటుందని ఆయన తెలిపారు.
అధికారిపై సస్పెన్షన్ వేటు…జక్కంపూడిలో ఒక అధికారిని సస్పెండ్ చేసిన చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. చంద్రబాబు వరద ఇంకా ఉన్న జక్కంపూడి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా తమకు ఆహారం, మంచినీరు అందలేని బాధితులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. సహాయక చర్యల్లో అలస్వతం వదిలిస్తే ఎవరినీ వదలబోమని ఆయన హెచ్చరించారు.
👉నూజివీడులో వచ్చిన వరదల్లో 85 మందిని ప్రజలను కాపాడిన ఏలూరు జిల్లా పోలీసులు మరియు SDRF సిబ్బంది.
👉 బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..
బాలీవుడ్ నటి జైత్వానీ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. మాజీ జగన్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆయనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. ఆయనకూ ఇద్దరు ఆడబిడ్డలున్నారు కదా? అని ప్రస్తావిస్తూ..జైత్వాల్ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో నాటి సీఎం వైఎస్ జగన్ అనుసరించిన వ్యవహార శైలిని తూర్పారబట్టారు. ఆయనకూ ఇద్దరు బిడ్డలున్నారు కదా? జైత్వాల్‌కు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదని అని ప్రశ్నించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన షర్మిల.. ముంబై నటి కాదంబరి జైత్వాల్‌ను కట్టడి చేయడానికి, ఆమెను అడ్డుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేశారని విమర్శించారు.
కాదంబారి జైత్వాల్ ఒక మహిళా డాక్టర్ అని.. ఆమెను మానసికంగా వేధించారని విమర్శించారు. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైత్వాల్ సామాన్యురాలైతే రూ. 100 కోట్లు ఇచ్చి నొక్కిపెట్టేసేవారన్నారు. జైత్వాల్‌కి అండగా పోరాటం చేయడానికి తాము సిద్ధం అని షర్మిల ప్రకటించారు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చెయ్యడం దుర్మార్గం అఅని గత ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు. నాటి సీఎం జగన్‌కు తెలియకుండానే ఐఎఎస్, ఐపిఎస్‌లు ఇలా వ్యవహారిస్తారా? అని షర్మిల ప్రశ్నించారు. ఇద్దరు కుమార్తెలున్న జగన్.. కాదంబరికి జరిగిన అన్యాయంపై ఎందకు స్పందించలేదని నిలదీశారు.
జగన్.. సజ్జన్ జిందాల్ వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గొప్పుగా చెప్పుకున్నారని గుర్తు చేసిన షర్మిల.. జిందాల్‌కు ఎందుకు కోట్ల రూపాయల ఆస్తిని కట్టబెట్టారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. జగన్, బాబు ఇద్దరూ బీజేపీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఇంత బానిసలుగా ఎందుకు తయారయ్యారో బాబు, జగన్ సమాధానం చెప్పాలన్నారు. కడప ఉక్కు పరిశ్రమను ఆదిలోనే తుంచివేశారని షర్మిల విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ సాధించేందుకు ఉద్యమిస్తామన్నారు. అవసరమైన ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధం అని షర్మిల ప్రకటించారు. కడప ఉక్కు పరిశ్రమకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టుబడి ఉన్న నేత అని చెప్పారు.ఇదే సమయంలో గుడ్ల వల్లేరు కాలేజీ ఘటనపై వైఎస్ షర్మిల స్పందించారు. అది ఒక ఫేక్ న్యూస్ అని అన్నారు. 300 వీడియోల్లో ఒక్కటి కూడా ఎందుకు బయటపడలేదని షర్మిల ప్రశ్నించారు. షవర్ లోపల పెట్టి ఉంటే..వాటర్ పడితే బ్లర్ అవుతుందన్నారు.
👉అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి…అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
అమెరికాలోని టెక్సస్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. మరో వ్యక్తి చెన్నైవాసి అని తెలిసింది. రోడ్డుపై వెళ్తున్న 5 వాహనాలు ఒకేసారి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మృతుల పేర్లు రఘునాథ్, లోకేష్, ఫరూక్ షేక్, కాగా చెన్నై వాసి పేరు దర్శిని వాసుదేవన్‌గా నిర్ధారించారు. మృతుల్లో ఒకరు కూకట్‌పల్లి వాసి అని సమాచారం.
👉పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..
తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన యువతి దీప్తి జీవన్‌జీ పారాలింపిక్స్‌లో సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్‌లో దీప్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 55.82 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరుకుంది. ఇక జపాన్‌లో మే నెలలో నిర్వహించిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీ రేసులో దీప్తి 55.07 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం సాధించింది.
👉సుభాన్ సుభాన్ సుభాన్*
*ఇప్పుడు ఈ వ్యక్తి పేరే* *అన్నిచోట్లా వినబడుతుంది*..
*ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద వరదల్లో చిక్కుకున్న 9 మందిని ఒక్కడే వెళ్ళి కాపాడిన సుభాన్ నువ్వే ఇప్పుడు* *రియల్ హీరో*..అధికారులు* *NDRF సిబ్బంది* *హెలికాప్టర్లు* *మంత్రులు చేయని పనిని సామాన్యుడివి ఒక జేసీబీ డ్రైవర్ వి నువ్ ఒక్కడివే చేశావు విపత్తు లో ప్రాణాలను పణంగా పెట్టి ఒక్కడివే వెళ్ళి తొమ్మిది మందిని కాపాడావు నిజంగా నువ్వే నిజమైన హీరో**నీలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరం*..*ఖమ్మం ప్రజలు నిన్ను ఎప్పటికి* *మర్చిపోరు*.పోతే ఒక్కడిని పోతా* *వస్తే *వాళ్ళతో పదిమందిమి వస్తాం* *అంటూ నువ్వు అన్నటువంటి* *మాటలు అందరికీ స్ఫూర్తి*చిమ్మ చీకట్లో కబళించే* *ఆ పెను వరద ముప్పులో పడి* *వెళ్ళి ఆ 9 మంది ప్రాణాలకు* *దిక్చూచి అయ్యావ్..*వారి కుటుంబాలకు* *రక్షకుడయ్యావ్..*ప్రజలందరికీ ఆదర్శమయ్యావ్*
*నువ్వే నిజమైన హీరో హాట్స్ ఆఫ్ 🫡🫡🫡
👉విజయవాడ..వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా? – బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇవే
*వరద బాధితులకు సహాయం చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది…*దాతలకు సమాచారం అందించేందుకు హెల్ప్ లైన్ నెంబరు ఏర్పాటు చేశారు.*
*ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా కూడా సహాయం చేయవచ్చని అధికారులు తెలిపారు…వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రత్యేక పాయింట్‌ ఏర్పాటు చేశారు.
ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్‌కు అప్పగించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబరు ఏర్పాటు చేశారు. ధన సహాయం చేసే దాతలు ఆన్‌లైన్‌ చెల్లింపు ద్వారా ఈ క్రింద పేర్కొన్న బ్యాంక్ ఖాతాలకు జమ చేయవచ్చని అధికారులు తెలిపారు.*బ్యాంక్ ఖాతాల వివరాలు:*State Bank Of India:
A/c Name : CMRF
A/c Number : 38588079208
Branch: AP Secretariat
IFSC code : SBIN0018884
Union Bank of India:
A/c name : CM Relief Fund
A/c number : 110310100029039

*సీఎంఆర్‌ఎఫ్‌కు మంత్రి టీజీ భ‌ర‌త్ విరాళం:* వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.10 లక్షల విరాళాన్ని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అంద‌రూ సాయం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయంలో అందరూ అండగా నిలవాలని మంత్రి భ‌ర‌త్ కోరారు.
👉 నేడు కడప ఉరుసు మహోత్సవం ..
కుల మతాలకు అతీతంగా భక్తులు కోరుకున్న కోరికలు తీర్చుచూ కొంగు బంగారమై వెలిసిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సూఫీ పుణ్యక్షేత్రం కడప అమీన్ పీర్ దర్గా నందు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేని చిష్ఠివుల్ ఖాదరీ వారి ఉరుసు మహోత్సవము 04-09-2024 వ తేదీ రాత్రి గంధ మహోత్సవం 05-09-2024 వ తేదీ ఉరుసు మరియు అమిల్ ఆరిఫ్ సాబ్రి మిరాట్ వారిచే గొప్ప ఖవ్వాలి.. 06-09-2024 వ తేదీ తహలీల్ ఫాతేహ జరుగును కావున భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందగలరని నిర్వాహకులు తెలిపారు.

👉👉👉విజయ సాయి కబ్జా కూల్చివేత..😯..సి ఆర్ జెడ్ ను ఉల్లంఘించి సముద్రం ఒడ్డున కట్టిన కాంక్రీట్ గోడలు కూల్చివేత..😯..విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరంలో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పి విజయసాయిరెడ్డి తన కుమార్తె నేహా రెడ్డి పేరిట సముద్రం ఒడ్డున నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు బుధవారం ఉదయం కూల్చివేశారు. కోస్తా నియంత్రణ మండలి( సి ఆర్ జెడ్) నిబంధనలను ఉల్లంఘించి విజయ సాయి రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై జనసేన కార్పోరేటర్ పీతలమూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు ‌. విచారణ సమయంలో తమకు రక్షణ కల్పించాలంటూ విజయ సాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి కూడా పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మహావిశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది. కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీవీఎంసీ హైకోర్టు స్పష్టం చేయడంతో 15 రోజుల్లో చర్యలు తీసుకొని తమకు తెలియజేయాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు బుధవారం ఉదయం జెసిబిల సాయంతో అక్రమ కాంక్రీట్ గోడలను కూల్చివేశారు. ఈ నివేదికను సోమవారం జీవీఎంసీ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. మిగిలిన కట్టడాల పరిస్థితి ఏమిటో..వైసిపి ప్రభుత్వం హయాంలో విశాఖ నుంచి భీమిలి వరకు సాగర తీరంలో సి ఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున కట్టడాలు వెలిశాయి. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి వ్యవహరించిన సమయంలో 2020లో ఒక పర్యాయం ఆయన ప్రమేయంతోనే ఈ కట్టడాలు అన్నిటిని జీవీఎంసీ అధికారులు నోటీస్ ఇచ్చి తొలగించారు. ఆ తరువాత వారంతా విజయసాయిరెడ్డి తో లాలూచీపడి అంతకంటే భారీగా శాశ్వత కట్టడాలను నిర్మించారు. భీమిలి సాగర తీరానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని సి ఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొత్తగా పలు కట్టడాలు 2023, 24 సంవత్సరాలలో వెలిశాయి. విజయ సాయి రెడ్డి కుమార్తె కట్టడాన్ని కూల్చివేసిన నేపథ్యంలో మిగిలిన కట్టడాల విషయంలో జీవీఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్న చర్చ ప్రారంభమైంది.

7k network
Recent Posts

మంత్రి సీతక్క జిల్లాలో మహిళకు దక్కని న్యాయం..మత సామరస్యం ప్రతీ ఒక్కరూ పాటించాలి: KLR..పవన్ కళ్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్..ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటోన్న ఎంపీ మిథున్ రెడ్డి..ఘనంగా ఎస్ డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం..మార్కాపురం డిఎస్పీగా నాగరాజు .. ప్రకాశంజిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం.. జూదరుల అరెస్టు..50 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం

ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు !..జగన్మోహన్ రెడ్డి కి హైడ్రా అధికారుల నోటీసులు..వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం..సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్.. సీతారాం ఏచూరి మృతి పట్ల పలువురి సంతాపం..అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు..వంట నూనెలను మంట నూనెలు గా మార్చిన మోడీ ప్రభుత్వం.. అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు..బీజేపీలో నేతల మధ్య తీవ్రమవుతున్న కలహాలు.. మరో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్.. ఎస్సై పై హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో కేసు..ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్ల తొలగింపులో ఎందుకింత ఆలస్యం?…

వైసీపీ అధినేత నోటి వెంట పాపం పవన్ అన్న మాట..!కోమాలో ఉన్న కానిస్టేబుల్ కోసం 10 లక్షల వైద్య సహాయం అందజేసిన పవన్ కళ్యాణ్.. ఆస్తికోసం సినిమా ఫక్కీలో బావ మరిదిని హత్య! చేసిన బావ..ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జాప్యంతో విద్యార్థుల ఆందోళన..ప్రకాశం బ్యారేజ్ బొట్ల పరిస్థితి! అధికారులకు మళ్లీ నిరాశే.. .

క్రీం+బన్ = క్రీమ్-బన్…నిర్మలమ్మపై కామెంట్స్ వర్షంలో బిగ్ టర్న్!..గుంటూరు నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..సిబ్బంది వేదింపులు భరించలేక కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..ఆధార్ ఉచిత గడువు మరోసారి పొడిగింపు..గిద్దలూరులో జాతీయ లోక్ అదాలత్.

ఏపీ గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం ఏసీబీ గాలింపు..జనసేనలోకి బాలినేని..వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు..మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం..నటి జత్వానీ కేసులో ఏసీపీ, సీఐపై సస్పెన్షన్ వేటు..కొడుకు ప్రేమ వివాహం – తల్లిని కట్టేసి చిత్రహింసలు ..పొదిలిలో నిఘా నేత్రాలు.

ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించనున్న చంద్రబాబు..తాడేపల్లి టీడీపీలో బయట పడ్డ విభేదాలు..మంత్రి నారా లోకేష్ ని కలిసి విరాళాలు అందజేసిన పలువురు ప్రముఖులు..మా భూమిని కబ్జా చేశారు..పర్మిషన్ ఇస్తే పాకిస్థాన్ వెళ్లిపోతాం..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట.