విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

👉 👉విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద గతవారం భారీ వరదలతో కండ్రిగ, నున్న, వాంబే కాలనీ సహా ఆ చుట్టుపక్కల కాలనీలు వరదలో చిక్కుకుపోయాయి.

విజయవాడలో వచ్చిన వరదలు వారం రోజులపాటు అక్కడి ప్రజలు నిద్ర లేకుండా చేశాయి. రాత్రికిరాత్రి చుట్టుముట్టిన వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలాల్సి వచ్చింది. బుడమేరు వరద విజయవాడలో ఈ ప్రళయానికి కారణమైంది.గతవారం భారీ వరదలతో కండ్రిగ, నున్న, వాంబే కాలనీ సహా ఆ చుట్టుపక్కల కాలనీలు వరదలో చిక్కుకుపోయాయి. ఈ వరదలకు కారణమైన బుడమేరు పేరు వింటేనే ఇప్పుడు అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. బెజవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన భారీ వరదలతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఇంకా ఆ వరద నుంచి ఆ ఇళ్లను వీడనే లేదు. అయితే.. విజయవాడను ఇప్పుడప్పుడే వరదలు వీడేలా కనిపిస్తలేవు. వర్షాలు తగ్గి, వరదలు తగ్గాయని కాస్త రిలీఫ్ అవుతున్న తరుణంలో.. మరోసారి వర్షాలు భయపెడుతున్నాయి. తాజాగా మరోసారి నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో జనం మళ్లీ ఆందోళనలో పడింది. తాజాగా.. సింగ్‌నగర్, విద్యాధరపురం, భవనీపురం, రాజరాజేశ్వరిపేట, రూరల్ పరిధిలో అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరంతోపాటు పలు గ్రామాల్లో అడుగు నుంచి రెండడుగుల మేర నీరు పెరిగింది. దీంతో మరోసారి ప్రజల్లో భయాందోళన మొదలైంది. అయితే.. వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ పరిధిలో ఎలాంటి వరద లేదని తేలడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అటు.. కృష్ణా జిల్లా పరిధిలోని బుడమనేరు మాత్రం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరను మండలాల్లో తగ్గిన వరద.. గుడివాడ, నందివాడ, మండపల్లి మండల్లాలో ఉధృతమైంది. దీంతో అక్కడి ప్రజలు మరోసారి తలదాచుకునేందుకు పరుగులు పెట్టారు. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు వరదతో ముంచెత్తాయి. దేవుడా.. మొన్న వచ్చిన వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మరోసారి మాకు ఈ పరీక్ష ఏంటని జనం ఆక్రందనలు చేస్తున్నారు.

👉గూగుల్ మ్యాప్ తెచ్చిన తంటా.. వరదలో చిక్కుకున్న తల్లీకొడుకు..గూగుల్ మ్యాప్ పెట్టుకుని కారులో బయలుదేరిన తల్లీకొడుకు వరదలో చిక్కుకుపోయారు. ఈ ఘటన విజయవాడ రూరల్‌లో చోటు చేసుకుంది. నున్న గ్రామానికి చెందిన తల్లి రాజకుమారి, కొడుకు గౌతమ్‌ గూగుల్ మ్యాప్ పెట్టుకుని కారులో తమ గమ్యస్థానికి బయలుదేరారు. సావారగూడెం వద్దకు వచ్చేసరికి కారు వరదలో చిక్కుకుంది. దాంతో తమను కాపాడంటూ గన్నవరం తహసీల్దార్ శివయ్యకు బాధితులు లొకేషన్ సెండ్ చేయగా.. సిబ్బంది వారిని వరద నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

👉 *మీడియా లో మాట్లాడకూడదు అంటూ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కి ఆంక్షలు….తాడేపల్లి.. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి గా ఉన్న రవి చంద్ర రెడ్డి కి ఆంక్షలు విధించిన వైసీపీ లోని ఒక వర్గం…. మీడియా లో ఎవరెవరు మాట్లాడాలో వారి పేర్లు నిన్న ఒక ప్రకటన విడుదల చేసిన వైసీపీ  *గతంలో సాక్షి ఛానల్ డిబేట్ లో సజ్జల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన రవి చంద్ర రెడ్డి…. జాతీయ అధికార ప్రతినిధి గా ఉండి మీడియా ను అడ్రస్ చేసే ప్యానెల్ లో తన పేరు లేకపోవడం తో… ఖంగుతిన్న రవిచంద్ర రెడ్డి…. *వైసీపీ లో రోజు రోజుకి ముదురుతున్న అంతర్గత పోరు…*

👉హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్… హైడ్రా కు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల తర్వాత శాసనసభను ప్రొరోగ్‌ చేసిన నేపథ్యంలో ఆర్డినెన్స్‌ల జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ వివరించారు. పది రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేసేందుకు అధికారులు పని చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కారు ప్రవేశ పెట్టనుంది. 👉మూడు జోన్లుగా హైడ్రా!* హైడ్రాని మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్‌ఎండీఏ వరకు విస్తరించనుంది. మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ను సెంట్రల్‌ జోన్‌గా, సైబరాబాద్‌ను నార్త్‌ జోన్‌గా, రాచకొండను సౌత్‌ జోన్‌గా విభజించనుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది.

👉విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ? విమర్శలకు వైసీపీ సమాధానమేంటి ?*జగన్ రూ. కోటి సాయం – ఎలా ఇస్తారో ..ఎప్పుడిస్తారో ఎవరికీ తెలియదు !*వరద సమయాల్లో కనిపించని వైసీపీ నేతలు,పార్టీ శ్రేణులు**దర్జాగా ఇంట్లో ఉండి వీడియో ద్వారా మాధ్యమాల్లో సందేశాన్ని పంపిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా…*విజయవాడ వరదల విషయంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేసింది. ప్రజల్ని ఆదుకోవడం లేదని ఆరోపించింది. అయితే వైసీపీ తరపు నుంచి కనీస సాయం ప్రయత్నాలు చేయకపోవడం విమర్శలకు కారణం అవతోంది.తమ పార్టీ తరపున కనీస సహాయ చర్యలను చేపట్టకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.* ఫీల్డ్ లో కనిపిచంని వైసీపీ నేతలు..విజయవాడకు వరదలు వచ్చినప్పటి నుుంచి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. అయితే ప్రభుత్వానికి ఉండే వనరులు పరిమితం. అందరికీ ఒకే సారి సర్వీస్ చేయలేరు. అందుకే స్వచ్చంద సంస్థలతో సలహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు రంగంలోకి దిగి ప్రజల్ని ఆదుకునేందుకు ప్రయత్నించారు. అయితే వైసీపీ నేతలు ఎక్కడా కనిపించలేదు. జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్ కొన్ని చోట్ల పులిహోర పొట్లాలు పంచుతూ హడావుడి చేశారు కానీ..అవి సుజనా చౌదరి ఫౌండేషన్ నుంచి తీసుకొచ్చి పంచారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. పెద్దగా సాయం చేసింది కూడా ఏమీ లేదు. దీంతో అసలు వైసీపీ వరద బాధితుల్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొంది. జగన్ రూ. కోటి సాయం – ఎలా ఇస్తారో ..ఎప్పుడిస్తారో ఎవరికీ తెలియదు ! పార్టీ నేతల సమావేశంలో విజయవాడ వరద బాధితుల కోసం రూ. కోటి ఇస్తున్నట్లుుగా జగన్ చెప్పారు. అయితే సీఎంఆర్ఎఫ్ కు ఇవ్వడం లేదని.. సొంతంగా సాయం చేయాలని నిర్ణయించారు. బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇప్పుడు సాయం చేస్తేనే వారికి సాయం అందినట్లుగా ఉంటుంది. అయితే ఇంత వరకూ రూ. కోటితో ఏం చేయాలో చెప్పలేదు. నిజానికి వైసీపీ సొంతంగా రూ. కోటితో ఏదైనా సాయం చేయాలనుకుని చేసినా.. విమర్శల పాలవుతుంది. ఎందుకంటే.. లక్షల మందికి .. రూ. కోటితో వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేరు. అయినా ఆ కోటితో ఏమిస్తారో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హుదూద్ సమయంలోనూ ఇలాగే రూ.కోటి ప్రకటించారు కానీ.. ఇంత వరకూ ఇవ్వలేదని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి వంటి వారు విమర్శిస్తున్నారు. వరదలు అంతా సద్దుమణిగిపోయాక.. ప్రజలంతా సాధారణ జీవనంలోకి వెళ్లిపోయాక.. వైసీపీ సాయం చేసినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే అవసరమైనప్పుడే చేయాలని గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఆ కోటి గురించి మళ్లీ మాట్లాడటం లేదు.

*రాజకీయం మాత్రం ఫుల్.. అయితే రాజకీయం మాత్రం తగ్గడం లేదు. చంద్రబాబు ఎండీయూ వాహనాలతో.. ఇంటింటికి సాయం పంపిణీ చేసే ఏర్పాట్లు చేశారు. ఆ వాహనాలను జగనే కొనుగోలు చేశారని అంటున్నారు. ఎవరు కొనుగోలు చేసినా అవి ప్రభుత్వ ఆస్తులని.. ఎందుకూ పనికి రాకండా.. మూడు వేల కోట్లు వృధా చేస్తే కనీసం దీనికైనా ఉపయోగపడ్డాయని టీడీపీ నేతలంటున్నారు. మరో వైపు వైసీపీ నేతలు .. తమ పార్టీకి చెందిన చానల్ ద్వారా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. బుడమేరకు.. కృష్ణానదికి లింక్ లేకపోయినా పెట్టేసి విమర్శలు చేశారు. చంద్రబాబు ఫీల్డ్ లో తిరగడాన్ని పబ్లిసిటీ స్టంట్ అన్నారు. అసలు ప్రభుత్వం ఏమ చేయడం లేదని చెన్నై నుంచి రోజా వీడియో విడుదల చేయడం మరిన్ని విమర్శలకు కారణం అయింది. కనీస సాయం చేసి.. మానవత్వం చూపించాలని ఆ తర్వాతే..రాజకీయాలు చేయాలన్న సూచనలు వచ్చాయి. మొత్తంగా వైసీపీ ఇంకా ఏం జరిగినా రాజకీయం చేస్తే చాలన్నట్లుగా ఉందని.. కానీ ఆ వ్యూహాలను మార్చుకోవాలన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్ లో వినిపిస్తోంది.

👉👉హైదరాబాద్‌:నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బార్లు, పబ్బుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు.. 5 పబ్బుల్లో 33 మందికి డ్రగ్‌ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్టులు..టెస్టుల్లో నలుగురికి పాజిటివ్.. శేరిలింగంపల్లిలోని కోరం క్లబ్‌లో ఇద్దరికి, జూబ్లీహిల్స్‌లోని బేబిలాన్ పబ్‌లో మరో ఇద్దరికి పాజిటివ్.. డ్రగ్స్‌ తీసుకొని పట్టుబడ్డ చిన్న నాగేష్, రవికుమార్‌, కేశవరావు, అబ్దుల్ రహీమ్.. పట్టుబడ్డ నలుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్‌ కింద కేసులు నమోదు.

👉 వివాహితపై అత్యాచారం.. కేసు నమోదు చింతకాని మండలంలోని చిన్నమండవకు చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి నాలుగు రోజుల క్రితం అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఆమె భర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఈ ఘటనకు అవమానంగా భావించిన ఆమె పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరగా ఆస్పత్రిలో చేర్పించామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్ మీరా తెలిపారు.

👉వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా..వరద బాధితులకు దగ్గుబాటి హీరోలు కూడా మేము సైతం అంటూ చెయ్యి కలిపారు. దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా .. కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆపద సమయంలో చేపట్టిన సహాయక కార్యక్రమాల కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధులకు రూ.కోటి విరాళంగా ఇస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది సహాయపడుతుందని మేము ఆశిస్తున్నామని తెలిపారు.

👉 69 ఏళ్ల వయసులో ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికాకు వెళ్లిన కమల్ హాసన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు 69 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తపన తగ్గలేదు. ఆయన అమెరికాలోని టాప్ ఇనిస్టిట్యూట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చదవడానికి అమెరికాకు వెళ్లారు. ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ అధునాతన టెక్నాలజీపై పట్టు సాధించేందుకు కమల్‌ వెళ్లారని సన్నిహిత వర్గాలు ఓ కోలీవుడ్‌ మీడియాకు తెలిపాయి. 90 రోజుల కోర్సు కాగా ఆయన 45 రోజులే హాజరు కానున్నారు.

👉నిమజ్జనం సందర్భంగా కంభం చెరువును పరిశీలించిన సీఐ రామకోటయ్య*

ప్రకాశం జిల్లా :కంభం చెరువు పరిసర ప్రాంతాలను కంభం,గిద్దలూరు రూరల్ సర్కిల్ సిఐ జె.రామకోటయ్య పరిశీలించారు. కంభం చెరువుపై వినాయక విగ్రహాల నిమజ్జనం జరిపే ప్రాంతాలను పరిశీలించి, కంభం ఎస్సై బి.నరసింహారావుకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో కంభం ఎస్సై బి. నరసింహారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రిపోర్టర్ ఎన్ వెంకటేశ్వర్లు..

👉వినాయక వేడుకల్లో వ్యక్తి మృతి …పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం :శావల్యాపురం మండలం పొట్లూరు బీసీ కాలనీలో ఏర్పాటుచేసిన గణనాధుని విద్యుత్ దీపాలు అలంకరిస్తుండగా స్థానిక ఎస్సీ కాలనీ చెందిన పోపూరి దేవ సహాయం విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో హుటాహుటిన వినుకొండ లోని హాస్పటల్ కు తరలించే లోపు మార్గమధ్యంలో అతను మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి సమయంలో జరిగిందని గ్రామస్తులు తెలిపారు.. రిపోర్టర్ గౌస్ భాష..

👉నిరుపేద విద్యార్థి ఆపరేషన్ కొరకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన అమ్మ ఫౌండేషన్..కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామంలో నివాసం ఉంటున్నా నిరుపేద కుటుంబానికి చెందినటువంటీ ఆంజనేయులు, వెంకటరమణమ్మ దంపతుల కుమారుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో భారీ వర్షం కురవడంతో కాలు జారీ విద్యార్థి కాలు విరగడంతో స్థానికంగా ఉన్నటువంటి డిజి.ఆర్ హాస్పిటల్ కి ఆపరేషన్ కొరకు తీసుకెళ్లారు డాక్టర్లు విద్యార్థినీ పరిశీలించి కాలు ఆపరేషన్ చేయాలని చెప్పటంతో తల్లితండ్రులు బాధలో ఉన్నా విషయాన్ని గమనించి అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంధ సేవాసంస్థ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు హాస్పిటల్ కి వెళ్లి విద్యార్ధిని పరామర్శించి అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుల సహకారంతో సేకరించినటువంటి పదివేల రూపాయల నగదును వారికి అందించడం జరిగింది. కార్యక్రమంలో అమ్మఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు జనరల్ సెక్రటరీ పందనబోయిన భూపాల్ పాల్గొన్నారు.. డివిజన్ రిపోర్టర్ అస్లాం బేగ్..

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..