సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

👉ఏపీ సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం.. విజయవాడ..మధురానగర్ ఏరియాలో వరద నీటిని పరిశీలిస్తూ రైల్వే ట్రాక్ మీదికి వెళ్లిన చంద్రబాబు..అకస్మాత్తుగా పట్టాలమీదికి వేగంగా దూసుకొచ్చిన రైలు..రైలు వంతెనపై పక్కన నిలబడిన చంద్రబాబు.కింది నుంచి వరద కనిపించడం లేదని రైల్వే ట్రాక్ పైకి ఎక్కిన చంద్రబాబు..చంద్రబాబుతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది.ట్రైన్ వెళ్లేవరకు రైలు వంతెన పక్కనే నిలబడిన చంద్రబాబు.ఆసమయంలో ట్రైన్ వెళ్తుందని అంచనా వేయలేకపోయిన అధికారులు.ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టీడీపీ శ్రేణులు..తృటిలో ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న జనాలు.

👉నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో *ఇద్దరు ముద్దాయిల* అరెస్టు…గుంటూరు క్రైమ్..మీడియా ముఖంగా వెల్లడించిన పశ్చిమ డీఎస్పీ *పి.మల్లికార్జున రావు…*ఉప్పల సురేష్ ,*కందివలసు నరసింహారావు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు* వెల్లడించిన డీఎస్పీ…వీరిద్దరి పై పలు పోలీస్ స్టేషన్ లలో కేసు లు వున్నట్లు గుర్తించాం అన్నారు…సుమారు *5కేజీ ల వెండి అభరణాలు,బంగారు చైను, చెవి ద్దిద్దులు* స్వాధీన చేసుకున్నట్లు వెల్లడించిన డీఎస్పీ…ఇద్దరు ముద్దాయిలను *రిమాండ్ కి తరలిస్తున్నట్లు* వెల్లడి…

👉మార్కాపురం..శ్రీ సాయి బాలాజి విద్యార్థులు మేము సైతం అంటూ విజయవాడలోని వరద బాధితుల సహయార్థం 22,500 రూపాయు వసూలు చేసి మార్కాపురం సబ్ కలెక్టర్ బి. సహాధితో వెంకట్ త్రివినాగ్ కి పాఠశాల డైరెక్టర్ పి. ప్రకాశరావు ప్రన్సిపల్, మస్తాన్వలి ఇనాఖ్యాలు క్రిష్ణవేణి, సుభాషిరి Spc విద్యార్థులు కలసి నగదు అందచేశారు…
👉 మహబూబాబాద్ జిల్లా..*పోలీస్ వారి చేయూత*
ఇటీవల ముంచ్చేత్తిన వరదలలో ముంపుకు గురై దీన స్థితిలో ఉన్న మరిపెడ మండల ఊళ్లేపల్లి గ్రామంలో 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులను అందించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.
ఈ కార్యక్రమంలొ మరిపెడ సీఐ రాజు గౌడ్, మరిపెడ ఎస్.ఐ సతీష్, సీరోల్ ఎస్.ఐ నగేష్, నూకల నరేష రెడ్డి పాల్గొన్నారు
👉 ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ స్ మరియు అజీమ్ చారిటీ తరుపున విజయవాడ వరద బాధితులకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం ను యూనియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు  అజాద్ గురువారం చింతలపూడి లో జంగారెడ్డి గూడెం డిఎస్ పి .రవి చంద్ర, . సిఐ రవీంద్ర ల చేతుల మీదుగా చింతలపూడి జామియా మసీదు కమిటీ మరియు జమాత్ ఇస్లాం హింద్ బాధ్యులకి అందించారు.ఈ సందర్భంగా డీఎస్పీ రవి చంద్ర మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని,వరద బాధితులకు అజీమ్ చారిటీ అజాద్ చేయూత ఇవ్వడం అభినందనీయం అని ,ప్రతి ఒక్కరూ వరద బాధితులకు తమకున్న దాంట్లో చేయూత ఇవ్వాలని పిలుపు ఇచ్చారు.జిల్లా ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ స్ వైస్ ప్రెసిడెంట్ అజాద్ మాట్లాడుతూ మనిషి కి సాటి మనిషి అండగా ఉండాలి అన్న దృక్పథంతో తన కున్న దాంట్లో apuwj మరియు అజీమ్ చారిటీ తరుపున చేయూత ఇవ్వడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై కుటుంబరావు,పాత్రికేయులు ముత్తే శ్వర్రావు,క్రుపవరం,సంజయ్,సురేష్ ,
జామియా మసీదు కమిటీ కార్యదర్శి జిలానీ,వైస్ ప్రెసిడెంట్,జమాత్ పెద్దలు అక్బర్ అలి, పెద్దలు నవాబ్ ,ఖాజా మొహిద్దిన్,షబ్బీర్, ఇక్బాల్ ,ఇమ్రాన్, రబ్బానీ,iym చింతలపూడి అధ్యక్షుడు రఫీ మరియు మండల నాయకులు మాటూరీ వెంకటరామయ్య, సి హెచ్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

👉ఏడాదిగా బుడమేరుకి గండ్లు పడితే ఏమి చేయని చేతకాని వ్యక్తి, ప్రజల కష్టాలని గాలికి వదిలి పెట్టి, విలాసాలు చేసే వాడు, మనకి చెప్తున్నాడు. రెడ్ కార్పెట్లు వేసుకుని పరామర్శించిన వ్యక్తి, ఇప్పుడు నన్ను చూసి బురదలో దిగాడు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఈయన లాగా ప్యాలెస్ లో కూర్చోవాలా ? ఇలాంటి వ్యక్తికి నేను సమాధానం చెప్పాలా ?… సీఎం చంద్రబాబు..

👉వెలుగులోకి టిడిపి ఎమ్మెల్యే రాసలీలలు*??? ఏపీలో రాజకీయ నాయకుల అశ్లీల వీడియోలు కలకలం రేపుతున్నాయి..హోటల్ గదిలో ఓ మహిళతో సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏకాంతంగా గడిపిన వీడియోలు బయటకు వచ్చాయి..చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని ఆదిమూలంపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది..తన ఫ్యామిలీని చంపేస్తానని ఆదిమూలం బెదిరించడంతో అతడికి లొంగిపోయారని ఆమె వెల్లడించారు..దీనిపై ఆదిమూలం స్పందిస్తూ తనపై కుట్ర చేశారని వీడియో మార్ఫింగ్ చేశారని అది కనపడు తుందని  అన్నారు.. 👉 ఎమ్మెల్యే ఆదిమూలంపై క్రమశిక్షణ చర్య.. క్రమశిక్షణ ఫస్ట్….మంగళగిరి ..ఆదిమూలంకు సంబంధించి వీడియో వైరల్ అయ్యింది ..ప్రజల్లో చెడు అభిప్రాయం కలగకూడదని ఆదిమూలంను సస్పెండ్ చేశాం ..వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతాం..నివేదిక తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి.. *క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అంటేనే….ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తాం.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

👉 డాక్టర్ జయానంద ప్రకాష్ మృతి.
మార్కాపురం.శాంతి క్లినిక్ అధినేత, ప్రముఖ డాక్టర్ జయానంద ప్రకాష్ (75) గురువారం వేకువ జామున వారి నివాసంలో మృతి చెందారు. ఈయన గత నాలుగున్నర దశాబ్దాలుగా పట్టణంలో వైద్య సేవలు అందిస్తున్నారు. పేదల డాక్టర్ గా ఈయనకు మంచి గుర్తింపు వుంది.ఈయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకుఏ 1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ అలీ బేగ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)రాష్ట్ర నాయకులు డాక్టర్ మాధినేని మాధవ రావు, పట్టణ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ సి హెచ్ కనక దుర్గ తదితరులు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
👉 ఒంగోలు పట్టణంలో గురుపూజోత్సవము 2024 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ .ఎ.తమీమ్ అన్సారీయా ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ ,ఒంగోలు నగరపాలక మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ,దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ ,మరియు ఉపాధ్యాయులు
👉 మార్కాపురం..శ్రీ సాయి బాలాజి విద్యార్థులు మేము సైతం అంటూ విజయవాడలోని వరద బాధితుల సహయార్థం 22,500 రూపాయు వసూలు చేసి మార్కాపురం సబ్ కలెక్టర్ బి. సహాధితో వెంకట్ త్రివినాగ్ కి పాఠశాల డైరెక్టర్ పి. ప్రకాశరావు ప్రన్సిపల్, మస్తాన్వలి ఇనాఖ్యాలు క్రిష్ణవేణి, సుభాషిరి Spc విద్యార్థులు కలసి నగదు అందచేశారు…
👉పుట్టినరోజు వేడుకల్లో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*…గిద్దలూరు మండలం, సంజీవరాయుని పేట గ్రామంలో గిద్దలూరు మండల జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్  కుమార్తెలు చి. యశస్విని మరియు చి. మనస్విని” ల పుట్టినరోజు వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే  ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఆదర్శ విద్యా సంస్థల అధినేత బుడతా తిమ్మయ్య ముఖ్య అతిధులుగా పాల్గోని, కేక్ కట్ చేసి చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ దప్పిలి విజయ భాస్కర్ రెడ్డి, అర్ధవీడు జడ్పీటీసీ సభ్యురాలు చెన్ను విజయ మరియు సర్పంచులు, మాజీ సర్పంచులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గోన్నారు.*

👉 కడప జిల్లా కలెక్టర్ లో తోటి శివశంకర్ ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలెక్టర్ చాంబర్లో కలసిన ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(PAAP) కడప జిల్లా అధ్యక్షులు గొల్లపల్లె భాస్కర్ కడప జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుచున్న బాలికలకు రక్షణ కల్పించాలని నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం మంచి పరిశుభ్రత పేద విద్యార్థిని విద్యార్థులకు అందించాలని కలెక్టర్ ని కోరడం జరిగింది అంతేకాకుండా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపుల గురించి చర్చించడం కూడా జరిగింది అలాగే కడప జిల్లాలో లైంగిక వేధింపులకు నా దృష్టికి వస్తే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు విద్యార్థులను గాని మహిళా సిబ్బందిని గాని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చినా ఉద్యోగంలో నుండి సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తానని తెలియజేశారు
*వినుకొండ వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం వైసీపీ సమనవ్య కర్త అన్నా రాంబాబు*

మార్కాపురం మండలం యాచవరం గ్రామంలో వినుకొండ పొలయ్య,రాణి ల కుమార్తె వివాహానికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన అనూష,వినోద్ కుమార్ లను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా వెంకట రాంబాబు వైసిపి నాయకులు పాల్గొన్నారు*
👉 బంగారం షాపులో భారీ చోరీ..
గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణం తోటమ్మ తల్లి గుడి దగ్గర బంగారం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి నలుగురు దొంగలు చొరబడి దుకాణంలో ఉన్న సుమారు రూ. 35 లక్షల విలువ చేసి వెండి, బంగారం వస్తువులను అపహరించారు. షాపు షట్టర్ తీసి దర్జాగా నగదు చోరీ చేయటం సీసీ కెమెరాలో రికార్డు అయింది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు విచారిస్తున్నారు. రాజస్థాన్ ముఠాకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
👉 కరకగూడెం మండలం రఘునాధపాలెం అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
*గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు…*ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ సభ్యులు మొత్తం ఆరుగురు మృతి…*ఎదురు కాల్పుల్లో ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు…*ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం కార్యకలాపాలు కొనసాగిస్తుంది.
చత్తీస్గడ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న నాయకత్వంలో సంచరిస్తున్న దళం…
👉ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించి, రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 22వ తేదీన జరుగు హాలో మాల ఛలో ఒంగోలు ను జయప్రదం చేయాలి.. దళిత సంఘాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంగళరావు…sc st రిజర్వేషన్లు పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించి రద్దు చేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం నకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కంభం వచ్చిన సంఘం కార్యాలయంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కల్వకూరి అబ్రహాం అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం జరిగినది సెప్టెంబర్ 22 హాలోమాల ఛలో ఒంగోలు సభ కరపత్రాలు తూమాటి అచ్చయ్య ఆవిష్కరణ చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మణువాదులు నాశనం చేయడానికి కృషి లో భాగమే sc st రిజర్వేషన్లు పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అని అన్నారు.sc st లు ఉమ్మడిగా మనువాదుల కుట్రలను తిప్పికొట్టి,రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని,అంబెడ్కర్, ఫూలే పెరియార్ కాన్సిరాం వాదులు, ప్రజాస్వామిక వాదులు అభ్యుదయ వాదులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.మనువాదుల తీర్పును పునః పరిశీలించి రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ నెల22న ఒంగోలు లో నెల్లూరు బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ ఆడిటోరియంలో జరుగు సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్య క్రమం లో మాలమహానాడు నాయకులు నూతలపాటి రాజు, లింగం రాజేంద్రారాజు, లింగాళ శ్రీనివాస్, గుంటి చిన్న వెంకటేశ్వర్లు, లక్కు వినోద్కుమార్, లక్కు ప్రభాకర్, లక్కు రంగయ్య, పెండెం లక్ష్మయ్య, చప్పిడి ఆనంద్, చిదర్ల జగదీష్ కుమార్,శ్రీరామ్. ఉదయ్, శ్రీరాం పెద్దక్క గౌరి జక్రయ్య, కోటి కల. మరియదాస్ బిల్లా తిరుపాల్, మూవచర్ల కిషోర్, బాలతోటి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
👉 గిద్దలూరు అపుస్మా (ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కొరకు లక్ష రూపాయల విరాళం:
విజయవాడ వరద బాధితుల కొరకు గిద్దలూరు నియోజకవర్గ ఆరు మండలాల ప్రైవేట్ పాఠశాలల నుండి విరాళాలు సేకరించి ప్రకాశం జిల్లా విద్యాశాఖాదికా రైన డి.సుబద్రా దేవీకి లక్షరూపాయలు అందించడమైనది.
ఈ సంధర్భంగా జిల్లా విద్యాశాఖాదికారి మాట్లాడుతూ విరాళాలు అందించిన ప్రతీ ఒక్క ప్రైవేట్ స్కూలు మేనేజిమెంట్ వారికి ధన్యవాదములు తెలిపారు.
కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ అపుస్మా పాఠశాలల తరపున పి.సుధీర్ కుమార్ రెడ్డి, జడ్.చంద్ర శేఖర్,కె గణేష్ యాదవ్, షేక్ అచ్చుకట్ల ఖాజావలి, పి.మణిచైతన్య తదితరులు పాల్గొన్నారు.
👉వినాయకుడి విగ్రహ ఏర్పాట్లకు అనుమతులు తప్పనిసరి: గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్*
గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ రాబోవు వినాయక చవితి పండుగ సందర్భంగా ఎవరైన వారి వార్డుల్లో, బజారులలో గ్రామాలలో వినాయకుడు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే పట్టణ పోలీసు వారి నుంచి ముందస్తుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సిఐ సురేష్ అన్నారు. వినాయక మంటపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) పత్రం పొంది ప్రజలు సుఖ సంతోషాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వినాయక చవితి పండగ జరుపుకోవాలని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ కోరారు.
👉విద్యార్థుల లక్ష్యం ఉన్నతంగా ఉండాలి..
కంభంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలిభాష అధ్యక్షతన జరిగాయి.కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ విద్యావేత్త మరియు కవి అన్నపురెడ్డి వీరారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ని ఆదర్శంగా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆదునిక సాంకేతిక జ్ఞానాన్ని సదుద్దేశంతో,సత్కార్యాలతో, సమున్నత జ్ఞానాన్ని పొందేందుకు ఉపయోగించుకోవాలని ఆకాంక్షించారు. అలాంటి గురువు పరంపరను సంస్మరణ చేసుకోవటమే ఈ గురుపూజోత్సవం అంతరాత్మ అన్నారు. కార్యక్రమంలో సి ఎల్ ఆర్ జూనియర్ కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ శీరిగిరి బ్రహ్మం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బివి నారాయణ, ముక్తేశ్వరరావు, షేక్ షరీఫ్, ఏనుగుల రవికుమార్, వనజ, ఎం శ్రీనివాసరెడ్డి, పి ఆంజనేయులు, కే నారాయణ తదితరులు పాల్గొన్నారు
👉ఉత్తమ ఉపాధ్యాయునికి ప్రశంసల వెల్లువ* మండలంలోని ఎన్ఆర్ రోడ్ తురిమెళ్ళ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సిహెచ్.భాస్కర్ నాయుడుపై మండలంలోని పలువురు ఉపాధ్యాయులు ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ప్రకాశం భవనంలోని స్పందన హల్లో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర చేతుల మీదుగా ఆయన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. సవాళ్లను సామాజిక బాధ్యతగా భావించి, విద్యాభివృద్ధికై నిరంతర కృషి చేసిన ప్రధానోపాధ్యాయుడు సీహెచ్. భాస్కర్ నాయుడు సేవలు స్ఫూర్తిదాయకమని మండల విద్యాశాఖ అధికారులు బి. మాల్యాద్రి ,కె.శర్వాణి లు ప్రశంసించారు.

👉జిల్లా ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులుగా ముగ్గురు ఎంపిక..ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర చేతులమీదుగా జిల్లా ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఉర్దూ ఉపాధ్యాయులను ఉర్దూ డి.ఐ మొయినుద్దీన్ అభినందించారు.మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రకాశం భవనంలోని స్పందన హాల్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో భాగంగా కంభం పట్టణానికి చెందిన సయ్యద్.యాస్మిన్ భాను,పొదిలి నుండి షేక్.మల్లిక,కనిగిరి నుండి పఠాన్.జైనాభీ ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులుగా ఎంపికైనట్లు ఆయన తెలిపారు. అత్యుత్తమ బోధనా పద్ధతుల ద్వారా పలువురు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది,ఉర్దూ భాషాభివృద్ధి కోసం వారు చేసిన సేవలను పలువురు ప్రశంసించారు.

👉పొదిలి నగర పంచాయతీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, మాజీ ఉప సర్పంచ్ షేక్ జిలాని భాష, దివ్య ల మురళి, సత్యం పాల్గొన్నారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం