“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

👉ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో ముఖ్యమంత్రి ..

తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించి వారి గౌరవ వందనం స్వీకరించారు👉అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కముందే దాదాపు 60 వేల ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.👉ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించామని, ఆ తర్వాత డీఎస్సీ, గ్రూప్ 1, 2, 3, లాంటి వివిధ శాఖల్లో ఖాళీలైన మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం గుర్తుచేశారు.👉చట్టబద్దమైన జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా నిర్దిష్టమైన గడువులోపు ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువకుల్లో విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి వివరించారు.అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి, గతంలో 30 వేలు మంది నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్‌మెన్‌లు, 155 డ్రైవర్‌ ఆపరేటర్స్‌కు కూడా ఉండటం, వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడంపట్ల ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు.👉ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బాధ్యతగా ఉద్యోగంలో చేరడానికి ముందు కొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, వారిచ్చే సూచనలు అమలు చేయడానికి, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాలన్నదే తమ ఆలోచనగా పేర్కొన్నారు. సహేతుకమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు.👉 ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

👉 మాజీ సీఎం జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్  పాబ్లో ఎస్కోబార్ తో పోల్చిన సీఎం చంద్రబాబు.. ఎస్కోబర్ పేరు పలకలేకపోయిన వైఎస్ జగన్.. సోషల్ మీడియాలో ట్రోల్స్..

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీడియా సమావేశంలో భాగంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంలో వైఎస్ జగన్ తడబడటమే ఇందుకు కారణం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ.. ఆయన కొలంబియన్ డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చారు. అయితే ముఖ్యమంత్రి చేసిన విమర్శలకు ఏం సమాధానం ఇస్తారని మీడియా ప్రతినిధులు అడగ్గా.. పాబ్లో ఎస్కోబార్ పేరును ఆయన పలకలేకపోయారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పాబ్లో ఎస్కోబార్ పేరు.. జగన్ నోటి వెంట రాలేదు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ట్రోల్స్, కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు.👉ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన వైఎస్ జగన్‌కు.. కనీసం పాబ్లో ఎస్కోబార్ పేరును కూడా పలకడం రాలేదు. ఈ క్రమంలోనే ఎవరు, ఏంటి అని ఆ రిపోర్టర్‌ను 2, 3 సార్లు జగన్ అడిగారు. ఆ రిపోర్టర్ పాబ్లో ఎస్కోబార్ పేరు చెప్పినా, పక్కన ఉన్నవారు కూడా చెప్పినా జగన్‌కు అర్థం కాలేదు. దీంతో ఆయన ఎవరో తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎవరో ఒకరి పేరును తీసుకువచ్చి.. పదే పదే చెబుతారని అన్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు మాఫియా, ఎవరు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు అని వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు.

👉మంత్రి లోకేశ్ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం- టీడీపీలో చేరిక లాంఛనమే!శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేశ్ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం కలిశారు. ఇప్పటికే మంత్రి ఫరూక్తో భేటీ అయిన జకియా ఖానం, ఇవాళ లోకేశ్ని కుటుంబసభ్యులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జగన్ సహా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభల్ని బహిష్కరించినా, జకియా ఖానం మండలికి హాజరవుతున్నారు. త్వరలో ఆమె తెలుగుదేశంలో చేరుతున్నారంటూ విస్తృత చర్చ జరుగుతుంది.

👉 చిలకలూరిపేట: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 5 సెల్ ఫోన్ లను రికవరీ చేసి ఈరోజు చిలకలూరిపేట అర్బన్ పి.యస్ ఇన్స్పెక్టర్ పి.రమేష్ సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు అప్పగించడమైనది.

👉‘రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం’రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం’2022-23, 2023-24లో ఆవరణలో చెత్త వేయడం, ఉమ్మివేయడం ద్వారా 3.30 లక్షల మందికి జరిమానా విధించామని, వారి నుంచి రూ.5.13 కోట్లు వసూలు చేశామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. గత రెండేళ్లలో గుట్కా మరకల నివారణకు, రైల్వేలను శుభ్రపరచడానికి చేసిన ఖర్చు వివరాలను కాంగ్రెస్ ఎంపీ నీరజ్ సభలో ప్రశ్న వేయగా.. దీనిపై అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు.

👉 అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో లోకేష్ హాట్‌ కామెంట్లు..నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పా..తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి.. చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా..ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు..
ఇంకా రెడ్‌ బుక్‌ తెరవలేదు.. అప్పుడే గగ్గోలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు మంత్రి నారా లోకేష్‌.. ఈ రోజు అసెంబ్లీ చివరి రోజు కావటంతో నారా లోకేష్ కు వినతులు వెల్లువెత్తాయి.. లోకేష్ ని కలిశారు పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు.. తమ తమ బయోడేటాలు లోకేష్ కు అందజేశారు.. అయితే, పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.. ఇక, అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో హాట్‌ కామెంట్లు చేశారు లోకేష్‌.. నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పాను అని గుర్తుచేశారు.. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి.. చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను అని స్పష్టం చేశారు.. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని గుర్తుచేసిన మంత్రి లోకేష్‌.. రెడ్ బుక్ కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించాడు అని దుయ్యబట్టారు.. గత 5ఏళ్ల కాలంలో జగన్ రెండు ప్రెస్‌మీట్లు పెడితే.. 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో ఐదు ప్రెస్‌మీట్లు పెట్టాడు అంటూ ఎద్దేవా చేశారు.. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే.. వాస్తవాలు మేం వివరిస్తాం కదా? అని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తాం అన్నారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరు, వైఎస్‌ జగన్ కుటుంబసభ్యుల్ని అగౌరవపరచరని వ్యాఖ్యానించారు
👉తిరుపతిలో దారుణం😱
తిరుపతిలో కిలాడీ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలుకు చెందిన యువతిని.. ప్రణవ-కిషోర్ రెడ్డి దంపతులు ట్రాప్ చేశారు. తిరుపతిలో లా చదువుతున్న యువతితో భార్య పరిచయం చేసుకుంది. ఆ పరిచయంతో ఇంటికి తీసుకెళ్లింది. మత్తు ఇచ్చి యువతిని భర్తతో అత్యాచారం చేయించింది. ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసింది. రూ.5 లక్షలు తీసుకున్నా వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ప్రణవ, కిషోర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

👉బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్లో కృతి (24) అనే యువతిపై ఉన్మాది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు కత్తితో పొడిచి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యువతి కాపాడమని అడగటం సీసీటీవీలో రికార్డైంది. పక్క గదుల్లోనే యువతులున్నప్పటికీ ఎవరూ స్పందించలేదు. తన ప్రియురాల్ని తన నుంచి విడగొట్టిందన్న కారణంతో పగ పెంచుకుని అతడు ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు.

7k network
Recent Posts

అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కాలేజీలకే.. ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల-మంత్రి నారా లోకేష్.. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు నిలిపివేశారా.. వైసిపి కో-ఆర్డినేటర్ “కారుమూరి”నిసత్కరించిన “అన్నా”.. పొలంబడి ( కంభం)సీఎం, డిప్యూటీ సీఎం లపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు