ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

👉ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా గత ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల పైన పెట్టిన కేసుల గురించి చంద్రబాబు ప్రస్తావించిన సమయంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఇక దీని ద్వారా నిన్న ఏపీ ప్రభుత్వ దాడులు అంటూ ఢిల్లీ వేదికగా మాటల దాడి చేసిన జగన్ కు చంద్రబాబు ఊహించని గట్టి షాక్ ఇచ్చారు..ఢిల్లీ వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడులపైన నిన్న దీక్ష చేసిన విషయం తెలిసిందే.

జగన్మోహన్ రెడ్డి తన దీక్ష ద్వారా దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసి, ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇక జగన్ చర్యకు ప్రతిచర్యగా నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పైన శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే.జగన్ ప్రభుత్వంలో ప్రత్యర్థి పార్టీల నేతలపై కేసులు శ్వేత పత్రం విడుదల ద్వారా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులను, దారుణాలను ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎదుర్కొన్న కేసులను చంద్రబాబు అందరికీ అర్థమయ్యేలా వెల్లడించారు. శాసనసభ వేదికగా నేడు శ్వేత పత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు జగన్ ప్రభుత్వ హయాంలో తనతో పాటు పవన్ కళ్యాణ్, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా ఎంతోమంది నేతలు కేసులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.సభలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశం తనపై జగన్ సర్కార్ 17 కేసులు, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టిందని గుర్తు చేశారు .ఇక ఇదే సమయంలో శాసనసభలో ఒక అరుదైన దృశ్యం కూడా ఈ సందర్భంగా చోటుచేసుకుంది. వైసిపి ప్రభుత్వ హయాంలో కేసులు ఎదుర్కొన్న నేతలందరూ ఒక్కసారి లేచి నిలబడవలసిందిగా సభలో చంద్రబాబు కోరడంతో ఒక్కసారిగా సభలో మెజారిటీ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు.పవన్ తో సహా శాసనసభలో నిలబడ్డ ఎమ్మెల్యేలు చంద్రబాబు అడిగిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు శాసనసభలో పదుల సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే లేచి నిలుచున్నారు. శాసనసభలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యుల పైన గత ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టారు. సభలో కూర్చున్న సభ్యుల సంఖ్య, నిలుచున్న సభ్యుల సంఖ్య కంటే తక్కువగా ఉంటుందని కూటమి శ్రేణుల అభిప్రాయం.

👉లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌.. జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?
లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌.. జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?
ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం వైసీపీ హ‌యాంలో అమ‌లు చేసిన‌ మ‌ద్యం పాల‌సీపై సీఐడీ విచార‌ణ‌కు ఆదేశించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఏం జ‌రుగుతుంది? వైసీపీ హ‌యాంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను వెలికి తీయ‌డం సాధ్య‌మేనా? జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా? అసలు చంద్ర‌బాబు వ్యూహం ఏంటి? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. లిక్క‌ర్ కేసును అడ్డు పెట్టుకుని జ‌గ‌న్ ను అరెస్టు చేయించాల‌నే వ్యూహం ఉన్న‌ప్ప‌టికీ.. దీనికి ప‌క్కా ఆధారాలు చూపించాలి.

👉ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి*
ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. జీపీఎఫ్, ఇతర బిల్లులు కలిపి దాదాపు రూ.40వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో 10, 15 తేదీల వరకూ ఉద్యోగులకు జీతాలు వచ్చేవి కాదని, ఇప్పుడు తాము ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని భట్టి అన్నారు

👉 అసెంబ్లీ హైలైట్స్……… ముఖ్యమంత్రి చంద్రబాబు…3 లక్షల 13 వేల 832 టిడ్కో ఇళ్లను డిశంబర్ చివరిలోగా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం.వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా కక్షపూరితంగా వ్వవహరించింది..*సొంత చెల్లిని కూడా వదలకుండా ప్రతిపక్ష నాయకులందరిపైన తప్పుడు కేసులు బనాయించాడు జగన్..ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి  అధికారంలో కూర్చేంటే,బాబాయ్ గొడ్డలి వేటు,కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా  ఇవన్నీ ఉదాహరణలే.. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను పర్యవేక్షించడానికి అంగళ్లు ప్రాంతానికి వెళ్తే నా పైన కేసులు పెట్టారు.*ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను నియంత్రించడానికి జీవో నెం 1 తీసుకొచ్చారు.నేరాలు, దొంగతనాలు జరగకుండా ముందుగానే పట్టుకునే వ్యవస్థను తీసుకొచ్చాం.*శాంతి భద్రతల విషయంలో అప్పటి ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఇదే. *హైదరాబాద్ లో మత ఘర్షణలను ఉక్కుపాదంతో అణిచివేశాం.పీడీ యాక్ట్ ప్రయోగించి, రౌడీలపై ఉక్కుపాదం మోపాం..*హైదరాబాద్ లో మతసామరస్యాన్ని నెలకొల్పాం దాని వలన అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చాయి..*రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించిన ఘనత తెలుగుదేశం పార్టీదే.రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అరికట్టింది తెలుగుదేశం పార్టీనే..

👉హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత…స్థానిక సంస్థల ఎన్నికలో ఏకగ్రీవంగా గెలవడానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీ అభ్యర్థుల నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు ..గత వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ఉద్దేశపూర్వకంగా అణచివేయాలని కుట్ర పన్నింది.ప్రజాపక్షం వహించి రాజకీయ పోరాటం చేసిన అందరిపైనా కేసులు పెట్టింది జగన్ ప్రభుత్వం.. ప్రజాస్వామ్యానికి పునాది అయిన రాజకీయ పార్టీలను అణిచివేయాలని ప్రయత్నించింది జగన్ ప్రభుత్వం.. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని, ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారు.. పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు వెంకట లక్ష్మిపై  పోలింగ్ ఏజెంట్ ఎన్.శేషగిరిరావు పై దాడి చేసి గాయపరిచారు..👉జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యను నడిరోడ్డుపై పీక కోసి చంపేశారు వైసీపీ ఉన్మాదులు.. ఎటువంటి సంబంధం లేని కేసులు పెట్టి అత్యంత దారుణంగా వేధించారు గత వైసీపీ నేతలు.ప్రతిపక్షాలను అణచివేయాలనే ఉద్దేశంతో జగన్ ఐదేళ్లు నియంత పాలన చేశాడు..వైకాపా నాయకులు ప్రశ్నలు అడిగి సమాధానం తీసుకోవడానికి అసెంబ్లీకి రాలేదంటేనే వారి డొల్లతనంమొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే ఇదే అని అర్థమవుతుంది..👉అవినీతి చేసినవాళ్లు, తప్పుడు పని చేసిన వాళ్ల గురించి లోకేష్ బాబు రెడ్ బుక్ లో ఉంది. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు జగన్..
హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత.
👉 పేద ప్రజల కడుపు నింపడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు ..నారా భువనేశ్వరి…
👉గత వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల సొంత ఇల్లు లేక పేద,మధ్యతరగతి వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. _ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
👉 రుషికొండలో జగన్ 1000 గజాలతో బాత్రూం కట్టుకున్నాడు..పేదవారికి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతంలో కేవలం 48 గజాలు మాత్రమే ఇచ్చాడు. గత వైకాపా ప్రభుత్వంలో పేదవారికి దారుణంగా అన్యాయం జరిగింది. _ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.: **గత జగన్ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంది. కేసీ కెనాల్ ప్రాజెక్టును ఆపేసింది.ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.

👉అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల నుంచి వినతులు సేకరిస్తున్న మాజీ మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ మరియు కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్..
👉 కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం**
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనార్టీలపై, వివక్ష, కొరతను, బిజెపి నాయకత్వం లోని ఎన్డీఏ గవర్నమెంట్ మో డి అనుసరించే మైనార్టీ వ్యతిరేక విధానాలు తాజా బడ్జెట్ ప్రత్యక్షంగా కనబడుతున్నాయని, ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఏ సుభాన్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు, పి ఇక్బాల్ హుస్సేన్, ఎస్ ఎం డి షరీఫ్ లు ఘాటుగా విమర్శించారు .మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో మైనార్టీ వ్యవహార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో , పలు కార్యక్రమాలు, బడ్జెట్ కోతలను చూశాయని, వారు వివరించారు. ముఖ్యంగా అనేక స్కాలర్షిప్ లను ,నైపుణ్యాభివృద్ధి, పథకాలు విధులలో పెద్ద కోతలను చూశాయని వారు తెలియజేశారు. తాజా బడ్జెట్లో జరిగిన కేటాయింపుల్లో మైనారిటీలు అధికంగా ఉండే, దాదాపు 1300 ప్రాంతాలలో అభివృద్ధి లోటును పూడిచేందుకు, ఉద్దేశించిన కార్యక్రమం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం (వి ఎం జె వి కె )కు జరిగిన కేటాయింపులే నని వారు వివరించారు. కొత్త ఎన్డీఏ ప్రభుత్వ తొలి బడ్జెట్లో కేంద్ర పథకాల కింద కేవలం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మాత్రమే ,1.0 65 కోట్ల నుంచి 1.145 కోట్లకు పెరిగింది. నైపుణ్య అభివృద్ధి, జీవనోపాధి పథకాలు గత ఏడాది మంజూరు చేసిన 64.4 కోట్లతో పోలిస్తే ఇది మూడు కోట్లు తగ్గాయి. నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ ,అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి చివరిసారిగా 61 కోట్లు మంజూరు చేయగా, ఈసారి ఎటువంటి మొత్తాన్ని కేటాయించకపోవడం గమనర్హం. మొత్తం విద్యాసాధికారిత 1. 689 కోట్లు నుంచి 1.575 కోట్లకు తగ్గింది. ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం గత ఏడాది కేటాయించిన, 433కోట్లతో పోలిస్తే ఈ బడ్జెట్ లో 326.2 కోట్లకు తగ్గింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఫిలోషిప్ కు గత ఏడాది 96 కోట్లు ఇస్తే ఈసారి కేవలం 45 కోట్ల కేటాయించారని, వారు మండీ పడ్డారు ఉచిత కోచింగ్ అనుబంధ పథకాలకు గతసారి కేటాయించిన, 30 కోట్లతో పోలిస్తే కేవలం 10 కోట్ల మాత్రమే ఈసారి కేంద్రం కేటాయించిందని వారు విమర్శించారు. విదేశీ చదువుల కోసం విద్యా రుణాలపై, వడ్డీ రాయితీని 21 కోట్ల నుంచి 15.3 కోట్లకు తగ్గించింది ఇలా ప్రతి అంశంలోనూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ,మైనార్టీల పైన వివక్షత చూపుతోందని వారు నిప్పులు జరిగారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ను సవరించి మైనార్టీల అభివృద్ధి కోసం, అభివృద్ధి కోసం,విద్యా, వైద్యం కోసం వారి జనాభా క నుగొనగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని ,డిమాండ్ చేశారు.

👉ప్రకాశం జిల్లాలో తూనికలు కొలతల అధికారుల ఆకస్మిక తనిఖీలు. బేస్తవారిపేట, కంభం మండలాల్లో పలు దుకాణాలపై దాడులు. నిబంధనలు పాటించని నాలుగు దుకాణాలపై కేసు నమోదు. 34వేలు ఫైన్…

👉ఒలింపిక్స్ బరిలో ఉన్న తెలుగమ్మాయిలు వీరే*
ఒలింపిక్స్ బరిలో ఉన్న తెలుగమ్మాయిలు వీరే
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. ఇందులో 40 మందికి పైగా మహిళా అథ్లెట్లు ఉండగా, ఐదుగురు తెలుగమ్మాయిలు ఉన్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, బాక్సింగ్ నుంచి నిఖత్ జరీన్, 100 మీ. హార్డిల్స్ రేస్‌లో జ్యోతి యర్రాజీ, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శ్రీజ ఆకుల, 4×400M రిలే ఈవెంట్‌లో జ్యోతిక శ్రీ ఒలింపిక్స్ బరిలో పాల్గొననున్నారు.
👉ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో… 20 వ రోజు కొనసాగుతున్న…*మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్*రోజుకో వంటతో ఉచిత భోజనాలు*
*చంటి పిల్లలతో వచ్చే వారికీ పాలు* , *బిస్కెట్లు చిన్నారుల కోసం*రోజు 800 మంది దాక హాజరు*
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే *అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న మెగా డియస్సి ఉచిత కోచింగ్ *20 వ రోజు* కొనసాగుతోంది.. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో ఉరవకొండ, రాయదుర్గం, *అనంతపురం ప్రాంతాల* నుండి కూడా నిరుద్యోగులు కోచింగ్ కోసం వస్తున్నారు. రోజు *800మందికి* పైగా హాజరు అవుతున్నారు. వారికి మధ్యాహ్నం *రోజు ఒక వంట తో* ఉచిత భోజనాలు పెడుతున్నారు. అంతే కాకుండా చంటి పిల్లలతో రోజు 60 మంది దాక వస్తున్నారు. ఆ చంటి పిల్లల కోసం రోజు వారికీ పాలు, బిస్కెట్స్ అదనంగా ఇస్తున్నారు. ఈ ఏర్పాట్లు చేయడం పట్ల జిల్లా వ్యాప్తంగా అమిలినేని సేవలను ప్రశoసిస్తున్నారు. ఇక కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు ఇలాంటి ఎమ్మెల్యే మాకు రావడం మా నియోజకవర్గం ప్రజల చేసుకున్న పూర్వజన్మ అదృష్టమని.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును ప్రశoసిస్తున్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం