ప్రధాని మోడీకి స్టాలిన్ తీవ్ర హెచ్చరిక.. ఇంత మునిగిన పంటలను పరిశీలించిన షర్మిల.. పెరుగుతున్న నిఫాజికా కరోనా కేసులు

👉ప్రధాని మోడీకి స్టాలిన్ తీవ్ర హెచ్చరిక..ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇలాగే కొనసాగించవద్దంటూ మండిపాటు..బడ్జెట్‌లో తమిళనాడుకు కేటాయింపులు లేకపోవడంపై మండిపాటు..పార్లమెంట్‌లో ఇండియా కూటమి పార్టీల ఆందోళనకు గొంతు కలిపిన స్టాలిన్..ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు..

👉పశ్చిమ గోదావరి జిల్లా ..తాడేపల్లి గూడెం, నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి..పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన..

👉ఒడిస్సా రాష్ట్రానికి ఇచ్చిన మాట తప్పిన బీజేపీ పార్టీ – నవీన్ పట్నాయక్..ఒడిషా కు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మాట తప్పారని మాజీ ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

👉 జ‌గ‌న్‌కు దూరంగా బీఆర్ఎస్‌..!జ‌గ‌న్‌కు దూరంగా బీఆర్ఎస్‌..!ఢిల్లీ కేంద్రంగా జగన్ ధర్నా చేసారు. ఏపీలో దాడులకు నిరసనగా ఢిల్లీలో జగన్ పార్టీ శ్రేణులతో దీక్షకు దిగారు. జగన్ దీక్షకు ఇండి కూటమిలోని కాంగ్రెస్ మినహా ఇతర పక్షాలు మద్దతుగా నిలిచాయి. కానీ బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. కేసీఆర్‌తో సత్సంబంధాలు కొనసాగించిన జగన్‌కు మద్దతు ఇవ్వకపోవటంతో కొత్త చర్చ మొదలైంది. మ‌ద్దతు తెల‌ప‌క‌పోవ‌టంపైన‌ బీఆర్ఎస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

👉 ఏసీబీ కి దొరికిన సెంట్రల్ క్రైమ్ ఇనస్పెక్టర్.
👉 5లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన క్రెం ఇనస్పెక్టర్ వెంకట కిషోర్.
👉 సంగారెడ్డి జిల్లా కంది లోని సెంట్రల్ క్రైమ్ పోలీసు స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడి చేయగా 5లక్షలు తో పట్టుబడిన ఇనస్పెక్టర్ వెంకట కిషోర్.
👉 అమీర్ పూర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మెరుగు రవి గౌడ్ కు చెందిన మియాపూర్ లోని స్థలం
విషయం లో క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకట్ కిషోర్ కోటి యాభై లక్షలు డిమెండ్ చేయగా రవిగౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
అందుకుగాను 5లక్షలు రవిగౌడ ఇనస్పెక్టర్ వెంకట కిషోర్ కు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు.
👉దక్షణ గాజాలోని తూర్పు ఖాన్ యూనిస్ పై ఇశ్రాయేల్ మెరుపు దాడుల్లో 89 మంది పాలస్తీయన్లు మరణించినట్లు గాజా అధికారిక మీడియా తెలిపింది. యుద్ధము ప్రారంభమై ఇప్పటి వరకు 39 వేల మంది మరణించినట్లు, 89,828 మంది గాయపడినట్లు తెలిపారు.
👉దేశంలో మూడు రాష్ట్రాల్లో గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చండీపురా, నిఫా, జికా, కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ చండిపురా వైరస్ కారణంగా దేశంలో ఇప్పటి వరకు 27 మంది పిల్లలు మరణించారు.
👉 అమరావతి: రాష్ట్ర భవిష్యత్తు, ఏపీ పునర్‌నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎందరో మహానుభావులు తెలుగునేలపై జన్మించారని, వారందరి స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.‘‘వైకాపా పాలనతో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతోపాటు పోలవరం, అమరావతి ఆగిపోయాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. పెట్టుబడులు కూడా రాకుండా చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తాం. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. తప్పు చేస్తే జనసేన వారిపైనా చర్యలు ఉంటాయి. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి’’అని పవన్‌ అన్నారు.
👉అమరావతి ..వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ..వాలంటీర్ వ్యవస్థ పై ప్రభుత్వం సానుకూల స్పందనరాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి  అసెంబ్లీలో స్పష్టం చేశారు. వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలియజేశారు.

**అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో..
కృష్ణపట్నం పోర్టులో మారిటైమ్ వాటాల అంశంపై చర్చ
కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు కోసం..
అదానీ కాళ్లు పట్టుకుంటానన్న సోమిరెడ్డి
కంటైనర్ పోర్టును తీసేయడంతో తీవ్ర నష్టం
10 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయారు
సీఎం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి-సోమిరెడ్డి
👉👉సీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం….ఆంద్రప్రదేశ్ : 2019-24లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినమద్యం విధానంపై సీఐడీతో విచారణ చేయిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు..ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న పవన్ విజ్ఞప్తిపై సభలో మాట్లాడిన సీఎం…సీఐడీ విచారణలో వాస్తవాలు తేలుస్తాం…మొత్తం నగదు లావాదేవీలపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తాం…అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం….అసెంబ్లీలో వెల్లడించిన సీఎం చంద్రబాబు…..

👉 ముగిసిన జగన్ ధర్నా.. ఇండియా కూటమిలోకి వైసీపీ..?
ముగిసిన జగన్ ధర్నా.. ఇండియా కూటమిలోకి వైసీపీ..?
ఏపీలో జ‌రుగుతున్న కూట‌మి ప్ర‌భుత్వం పాల‌నకు నిర‌స‌న‌గా వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద చేపట్టిన ధ‌ర్నా ముగిసింది. జ‌గ‌న్ ధ‌ర్నాకు 8 రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. కాంగ్రెస్ మిన‌హా ఇండియా కూట‌మిలోని పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ను ఇండియా కూట‌మిలోకి రావాల‌ని ఆయా పార్టీల నేత‌లు కోరారు. అయితే జ‌గ‌న్ కూడా ఇండియా కూట‌మిలో క‌లిసేందుకు సానుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం.పోలీసు శాఖ కు,పోలీసు అధికారులకు వరాల జల్లు కురిపించి హోమ్ మంత్రి వి.అనిత…*
పోలీసులు వాడే వాహనాలకు డీజిల్ పెట్రోల్ పెంపునకు ప్రతిపాదనలు..వి ఆర్ లో వున్న వారికి గత ప్రభుత్వం లో జీతాలు సరిగా ఇవ్వలేదు మేము విఆర్ లో వున్న వారికి జీత బత్యాలు సక్రమంగా అందిస్తాం…గత ప్రభుత్వం లో పోలీసు జీపులకు,కార్లకు నెలకు 120 లీటర్లు పెట్రోలు డీజిల్ ఇచ్చేవారు,మేము ఇక మీదట ఆ లిమిట్ ను 120 నుండి 300 లీటర్లు కు పెంచుతాం.. బైకులకు నెలకు 25 లీటర్లు వున్న పెట్రోల్ లిమిట్ 50 లీటర్లు కి పెంచుతాం..
*నూతన వాహనాలు కొనుగోలుకు ప్రతిపాదనలు*
*రాష్ట్రం లో పోలీసు శాఖలో సిబ్బంది కొరత వుంది, 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 కాళీలు వున్నాయి*
అని హోమ్ మంత్రి వంగల పూడి అనిత అసెంబ్లీ లో తెలియ చేశారు…
👉ఒలింపిక్స్‌లో 8 మంది తెలుగు తేజాలు..
పారిస్ ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తున్న ఈ క్రీడలు జులై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరుగుతాయి. పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగుతున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఖ్యాతిని మరింత చాటేలా మన క్రీడాకారులు పట్టుదలతో సిద్ధమయ్యారు. అయితే వాళ్లలో తెలుగు క్రీడాకారులు 8 మంది ఉండటం విశేషం. వాళ్లంతా తప్పక పతకాలు సాధిస్తారని తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమంతా ఆశతో ఉంది.
👉IITలో సీటు వచ్చినా మేకలు కాస్తున్న విద్యార్థిని..విద్యార్థినికి సహాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డి..
సిరిసిల్ల జిల్లా:జులై 24
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత JEE మెయిన్ లో,ST, 824వ ర్యాంకు సాధించారు.
పాట్నా IITలో సీటు వచ్చి నా.. చేరేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించక మేకల్ని మేపుకొంటున్నారు.
మధులత ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్, ఆమెకు రూ. 1.5 లక్షల సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
డబ్బులేని ప్రతిభావంతులైన పిల్లలకు ఇలాంటి సాయాన్ని కొనసాగించాలని సీఎంను పలువురు కోరుతున్నారు…
👉 అమరావతి: నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్‌ బూదూరు లక్ష్మి సంతకాన్ని ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సర్పంచ్‍ను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అతని అనుచరులు తన సంతకాలు ఫోర్జరీ చేసి దూషించారంటూ మహిళా సర్పంచ్ లక్ష్మి.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో అసెంబ్లీ వద్దకు వెళ్లి డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
👉 ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో ఇతర రాష్ట్రాల నుండి ఏపీకి మద్యం అక్రమ రవాణా విపరీతంగా జరిగింది.చంద్రబాబు  పాలనలో ప్రజలకు , మహిళలందరికీ రక్షణ అనేది కలుగుతుంది.. వైసీపీ చేతకాని పాలనలో మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. 2019లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం ప్రపంచ స్థాయిలో నిలబడేది… నారా భువనేశ్వరి దేవి..

👉వైకాపా ప్రభుత్వంలో చిన్నారులపై 400% పెరిగిన అత్యాచారాలు.. ఏపీని క్రైమ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్ రాష్ట్రాన్ని రౌడీ రాజకీయాలకు అడ్డాగా మార్చిన జగన్.. వైకాపా పాలనలో 4 రెట్లు పెరిగిన రాజకీయ హత్యలు..జగన్ నీ చేతకాని పాలనలో 991 మంది మహిళల అర్తనాదాలు నీకు వినిపించలేదా?
: గత ప్రభుత్వంతో పోల్చితే జగన్ పాలనలో దళితులపై 26% పెరిగిన దాడులు
: జగన్ రౌడీ పాలనలో ఏపీలో దారుణంగా పెరిగిన హత్యాకాండలు : ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో గిరిజనులపై 20% పెరిగిన దాడులు దాడులు.. వాటి గురించి ఒక్కసారి నోరు మెదపని జగన్
: ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో రాజకీయ కక్షతో ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులపై పెట్టిన కేసుల వల్ల.. రాష్ట్రంలో 25 శాతం పెరిగిన కేసుల నమోదు
: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దుర్మార్గపు చట్టం.ప్రజల ఆస్తులను కొట్టేసే విధంగా ఈ  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తెచ్చారు.అటువంటి భయంకరమైన ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ప్రజలు నమ్మి ఆశీర్వదించారు. రాగానే ఈ చట్టాన్ని రద్దు చేశాo.
: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ.
👉 బకాయి పడ్డ కంపెనీలకు ఎన్ఓసి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడంపై విచారణ చేపడతాం
కొల్లు రవీంద్ర,గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి.
: వైకాపా ప్రభుత్వంలో చిన్నారులపై 400% పెరిగిన అత్యాచారాలు.. ఏపీని క్రైమ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్.. రాష్ట్రాన్ని రౌడీ రాజకీయాలకు అడ్డాగా మార్చిన జగన్.. వైకాపా పాలనలో 4 రెట్లు పెరిగిన రాజకీయ హత్యలు.. జగన్ నీ చేతకాని పాలనలో 991 మంది మహిళల అర్తనాదాలు నీకు వినిపించలేదా?
👉 గత ప్రభుత్వంతో పోల్చితే జగన్ పాలనలో దళితులపై 26% పెరిగిన దాడులు
జగన్ రౌడీ పాలనలో ఏపీలో దారుణంగా పెరిగిన హత్యాకాండలు👉 ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో గిరిజనులపై 20% పెరిగిన దాడులు దాడులు.. వాటి గురించి ఒక్కసారి నోరు మెదపని జగన్
👉 ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో రాజకీయ కక్షతో ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులపై పెట్టిన కేసుల వల్ల.. రాష్ట్రంలో 25 శాతం పెరిగిన కేసుల నమోదు
# ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దుర్మార్గపు చట్టం.ప్రజల ఆస్తులను కొట్టేసే విధంగా ఈ  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తెచ్చారు.అటువంటి భయంకరమైన ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ప్రజలు నమ్మి ఆశీర్వదించారు. రాగానే ఈ చట్టాన్ని రద్దు చేశాo…👉 హామీ లో చెప్పినట్టుగా తల్లికి వందనం పథకం కింద ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి ప్రతి బిడ్డకు రూ.15000 ఇస్తాం. ఇది ప్రైవేటు, గవర్నమెంట్ స్కూల్  రెండిటి కి వర్తిస్తుంది. విద్య &ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.👉 గత ఐదేళ్ల వైకాపా విధ్వంస పాలన వల్ల, 25 ఏళ్ళు కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. _ సీఎం చంద్రబాబు .👉 మద్యం ధరలు పెంచితే తాగేవాళ్లు తగ్గుతారని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు👉 గత రాక్షస వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా బాధితులే. 2024 ఎన్నికలు  ఓ స్వాతంత్ర్య ఉద్యమంలా జరిగాయి..రాష్ట్ర ప్రజలు తాము ఐదేళ్లు కోల్పోయిన హక్కులు, స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడం కోసం, కూటమికి ఓట్లేసి ప్రజా ప్రభుత్వాన్ని స్టాపించారు.

👉 ఐదు సంవత్సరాల నీ అరాచక పాలనలో నువ్వు చేసిన హత్యలు,హింసలు గురించి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీ సగం సరిపోదు జగన్ రెడ్డి. – హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత.
👉 కొత్త జీవోలు తెచ్చి మద్యంపై అడ్డగోలుగా రేట్లు పెంచారు. ఢిల్లీలో ఇవ్వాళ జరిగిన మన తెలుగువారి వేడుకలకు, ఫ్లైట్లల్లో తీసుకెళ్లారు అతిధులను. అందరూ ఉల్లాసంగా.. ఆనందంగా గడిపారు.
పాపం డబ్బు తీసుకొనే జాతీయ మీడియా విలేఖరులు, ఈ ఫంక్షన్‌లోని దృశ్యాలు చిత్రీకరించి, ఆంధ్రాలో శాంతి భద్రతల మీద వైకాపా చేసిన పోరాటం అని ప్రచారం చెయ్యాలి.
👉రౌండ్ టేబిల్, జోకులు & నవ్వులు, డ్రింక్స్ పార్టీ కాదు అది.వాళ్ల కార్యకర్త రషీదును ఇంకో వైకాపా కార్యకర్త జిలానీతో చంపించి, శాంతి భద్రతలు లేవు అని ఢిల్లీలో చేస్తున్న ధర్నా ఇదే.
👉హామీ లో చెప్పినట్టుగా తల్లికి వందనం పథకం కింద ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి ప్రతి బిడ్డకు రూ.15000 ఇస్తాం. ఇది ప్రైవేటు, గవర్నమెంట్ స్కూల్  రెండిటి కి వర్తిస్తుంది. విద్య &ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ .
👉 గత ఐదేళ్ల వైకాపా విధ్వంస పాలన వల్ల, 25 ఏళ్ళు కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. _ సీఎం చంద్రబాబు ..# మద్యం ధరలు పెంచితే తాగేవాళ్లు తగ్గుతారని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు
👉 గత రాక్షస వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా బాధితులే. 2024 ఎన్నికలు  ఓ స్వాతంత్ర్య ఉద్యమంలా జరిగాయి..రాష్ట్ర ప్రజలు తాము ఐదేళ్లు కోల్పోయిన హక్కులు, స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడం కోసం, కూటమికి ఓట్లేసి ప్రజా ప్రభుత్వాన్ని స్టాపించారు.
ఐదు సంవత్సరాల నీ అరాచక పాలనలో నువ్వు చేసిన హత్యలు,హింసలు గురించి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీ సగం సరిపోదు జగన్ రెడ్డి. – హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత.
కొత్త జీవోలు తెచ్చి మద్యంపై అడ్డగోలుగా రేట్లు పెంచారు.:

👉యువకుడు పై లాఠీ ఛార్జ్ కలకలం … కాళ్ళు పట్టుకుంటాను అన్న కూడా కనికరించని సీఐ ..!!!
అనంతపురం జిల్లాలో ఓ యువకుడు పై లాఠీ ఛార్జ్ చేసిన సీఐ…అనంతపురం జిల్లాలో రోడ్డు పై ఓ యువకుడు నీ చితకబాదిన సీఐ..
ఆ యువకుడు అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు …❓
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన …❓
రెండు రోజుల క్రిందట అనంతపురం పట్టణంలో స్థానిక శ్రీ కంఠం సర్కిల్ లో రాత్రీ 9:45 గంటలకు రోడ్డు పై ఇద్దరు స్నేహితులు మాట్లాడుతుండగా ఆ సీఐ జీప్ దగ్గరకు పిలిచి యువకుడు పై లాఠీ ఛార్జ్.
▪️ఎందుకు కొడుతున్నారు తెలియక షాక్ లో యువకుడు.
▪️కొట్టకండి సార్ కాళ్ళు పట్టుకుంటాను అని వేడుకున్న వద్దిలి పెట్టని సీఐ.
▪️లాఠీ దెబ్బలు తిన్న ఆ యువకుడు పరిస్థితి …❓
▪️లాఠీ ఛార్జ్ అనేది ప్రజల గుంపులను చెదరగొట్టడానికి ఒక సమన్వయ వ్యూహం.
▪️గతంలో ఇదే తరహాలో ఓ యువకుడి పై లాఠీ ఛార్జ్ చేసిన సమయంలో మొబైల్ పగిలి పొగ ఆ యువకుడికి గాయాలు కాగా, ఎమ్మెల్సీ కేసు పెట్టడానికి ఆ యువకుడు సిద్ధ పడ్డగ వాళ్ళతో రాజీ కుదుర్చుకున్న సదరు సీఐ.
▪️ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వారి పై కూడా లాఠీ ఛార్జ్ చేసిన సందర్బాలు ఎన్నో.
*కృష్ణా జిల్లా
*అనుమానాస్పదస్థితిలో ఇంటర్‌ విద్యార్థి మృతి*
కృష్ణాజిల్లాలోని కానూరులో ఎన్ఆర్ఐ కళాశాలలో విద్యార్థి మృతి.
విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడంటున్న కళాశాల యాజమాన్యం.
ఆ సూసైడ్ నోట్ తమ కొడుకు రైటింగ్ కాదని కావాలని యాజమాన్యం తప్పుదోవ పట్టిస్తుందని చెప్తున్న తల్లిదండ్రులు.
పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
👉 అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కుట్ర కోణంపై ఇప్పటికే నిర్ధరణకు వచ్చిన పోలీసులు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు, వైకాపా నేత మాధవ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరగడానికి 10 రోజుల ముందు నుంచి క్రమం తప్పకుండా మాధవరెడ్డి.. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లినట్టు గుర్తించారు. ఫైల్స్‌ దహనం కేసులో అతని హస్తం ఉందని నిర్ధరించుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పదిరోజుల పాటు వరుసగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి ఎందుకు వచ్చారు? ఏయే దస్త్రాలకు సంబంధించి ఎవరెవరిని కలిశారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. కుట్ర కారణంగా జరిగినట్లు అన్పిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సోమవారం ఆయన సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. పోలీసు అధికారులతో రెండు గంటల పాటు చర్చించారు. ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలించాక డీజీపీ మీడియాతో మాట్లాడారు. ‘ఆదివారం రాత్రి 11.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అన్ని కోణాల్లో పరిశీలించాక అది యాక్సిడెంట్‌ కాదు, ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం. 22ఏ భూముల దస్త్రాలతో పాటు పలు కీలక పత్రాలున్న గదిలోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఇది అనుమానాలకు తావిస్తోంద’ని వివరించారు. ‘ఘటన సమాచారం ఆర్డీవో హరిప్రసాద్‌కు తెలిసినా కలెక్టర్‌కు, ఎస్పీకి సమాచారమివ్వలేదు. ఘటన గురించి తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ, పోలీసు అధికారుల అలసత్వం కనిపిస్తోంది. కార్యాలయంలో షార్ట్‌ సర్య్కూట్‌ జరిగేందుకు అవకాశమే లేదని ఎస్పీడీసీఎల్‌ అధికారులు నివేదిక ఇచ్చారు. అక్కడ వోల్టేజీ తేడాలకు అవకాశమే లేదని తేలింది. ఫోరెన్సిక్‌ నిపుణులూ ఇదే విషయం చెబుతున్నారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. ఇవన్నీ అనుమానాలను పెంచుతున్నాయి’ అని డీజీపీ వివరించారు.
👉 బీఎస్ఎన్ఎల్‌కు రూ.82,916 కోట్లు కేటాయింపు..
బీఎస్ఎన్ఎల్‌కు రూ.82,916 కోట్లు కేటాయింపు
2024-25 ఆర్థిక సంంవత్సరానికి టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. అయితే ఇందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు రూ.లక్ష కోట్ల పైనే కేటాయించడం విశేషం. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్‌లో సాకేంతిక మెరుగుదల, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లను కేటాయించారు. కాగా, ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రారంభించనుంది.
👉 తస్మాత్ జాగ్రత్త.. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం..
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురం కి చెందిన చిగురుపాటి నాగేశ్వరరావు తన వాహనానికి చార్జింగ్ పెట్టగా అది ఎంతసేపటికి చార్జింగ్ ఎక్కకపోవడంతో స్విచ్ ఆఫ్ చేశాడు. ఆపిన కొద్ది క్షణాల్లోనే బ్యాటరీ పేలి మంటలు అంటుకున్నాయి.తృటిలో తప్పిన ప్రాణనష్టం .

👉ఫోన్ కాల్ తెచ్చిన మోసం.. ‘బావా.. తప్పు చేశాను’ అంటూ వివాహిత సూసైడ్.. అప్పు ముప్పు అని ఊరికే అనలేదు పెద్దలు.అప్పు చేయకుండా ఏదైనా చేశాం అంటే ధనికులు గా భావించవచ్చు. కానీ మధ్య తరగతి కుటుంబాలకు అప్పు చేయకుండా కాలం గడపడం కష్టం. అయితే అప్పు,లోన్ కావాలంటే బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. గడుస్తున్న కాలంలో జరుగుతున్న అభివృద్ధి లో భాగంగా ఫోన్ లలోనే యాప్ ల ద్వారా లోన్ పొందవచ్చు.వాటికి ఈ మధ్య ఎక్కువ అలవాటు పడిపోయారు. అయితే ఆ ఫోన్ లోన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత హాని కూడా ఉంది. దాన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ లో ఫోన్ లోన్ వివాహితను బలి తీసుకుంది. పేటేటి స్రవంతి(28)కి ఫోన్ లో రూ.5 లక్షలు రుణం ఇస్తామని ఒక సందేశం వచ్చింది.కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆ నంబరును సంప్రదించింది. రూ.5 లక్షలు రుణం ఇచ్చేందుకు తొలుత రూ.20 వేలు, తర్వాత రూ.60 వేలు, వరుసగా రూ.80 వేలు చెల్లించమంటే అప్పు తెచ్చి ఓ లక్ష చెల్లించింది. తర్వాత మరో రూ.1.20 లక్షలు చెల్లిస్తే మొత్తం రుణం ఇచ్చేస్తామంటూ మరో సందేశం రావడంతో తాను ఇక కట్టలేనని నిశ్చయించుకుంది.ఆ విషయన్ని భర్త శ్రీకాంత్ కి చెప్పు కోలేక ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి అందులో ‘బావా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు. నా ముఖం నీకు ఎలా చూపించగలను? రుణం విషయంలో మోసపోయాను. నాకు భయంగా ఉంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’.అని జరిగిన విషయాన్ని శోకసంద్రంతో వివరించింది.

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.