గిద్దలూరులో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేది నేనే..టీడీపి ఇంచార్జ్ ముత్తుముల.. గిద్దలూరు జనసేన టికెట్ “ఆమంచికే”.. ఫేక్ లెటర్ అని ఖండిస్తున్న టిడిపి నాయకులు..

  • తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధం కావాలని గిద్దలూరు టీడీపి ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశించిన ప్రతీ కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతంగా పూర్తి చేయాలని, మరో 50 రోజుల్లో ఎన్నికలు పూర్తి అవుతాయని గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతుందని ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన, అవాకులు చవాకులు పేలిన టీడీపి అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానన్నారు. 👉మంగళవారం గిద్దలూరు పట్టణంలోని షాదీఖానాలో నియోజకవర్గ ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం జరగనుందని ఈ సమావేశానికి మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

👉వచ్చే నెల 2. 3 తేదీల్లో టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గిద్దలూరు రానున్నారని నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యులతో సమావేశం అవుతారన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరూ తెలుగుదేశం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియచేయాలనీ టీడీపి జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను క్లుప్తంగా ప్రజలకు తెలియచేయాలని, వైసీపీ పాలనలో జరిగిన అరాచక పాలనను, దోపిడీని వివరించాలని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం టీడీపి జనసేనల ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియచేశారు..ఈకార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ మరియు గిద్దలూరు జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, కాపు నాయకులు దుత్తా బాల ఈశ్వరయ్య, టీడీపి మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మైనార్టీ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, టీడీపి సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గోన్నారు.

  • 👉

జనసేన అభ్యర్థుల లిస్టుతో తిక మక..ఫేక్ లెటర్  పెట్టి సంబరాలు చేసుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకులు.. గత రెండు రోజులుగా  అభ్యర్థులుగా టిడిపి జనసేన లో కలిసి లిస్టు ప్రకటించినట్లు జనసేన విడుదల చేసిన ఒక లిస్టు పేర వచ్చిన ఒక పోస్టు ప్రస్తుతం టిడిపి నాయకులను తికమక కు గురిచేస్తుంది.  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కు కేటాయించిన విషయం విధితమే.అయితే ఈ లెటర్ లో ఒంగోలు జనసేన అభ్యర్థి రియాజ్ అని వుంది,గిద్దలూరు అభ్యర్థిని మొదటి లిస్టులో ప్రకటించలేదు.కాగా జనసేన లిస్టులో గిద్దలూరు అభ్యర్థిగా ఆమంచి స్వాములు పేరు ఉంది.ఇది జనసేన పార్టీ వారే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత ఐదేళ్లుగా టిడిపిని బలోపేతం చేసేందుకు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అహర్నిశలు కృషిచేశారు.ఇటీవల నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ఎంతోమంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారరంటే అశోక్ రెడ్డి ఎంతగా కృషి చేశారో అర్థం చేసుకోవచ్చని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘంటాపదంగా చెప్తున్నారు. అలాంటిది ఎక్కడి నుండి ఈ నియోజకవర్గంలో అసలు సంబంధమే లేని వారికి టికెట్ ఇచ్చి  ఆయన గెలుపు కోసం పనిచేయమంటే ఎలా చేస్తామని బహిరంగంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరి టిడిపి అధిష్టానం గిద్దలూరు టికెట్టు కేటాయింపు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడక తప్పదు.

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..