తన తండ్రి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ ను కూడా విచారించాలని, వచ్చే ఎన్నికల్లో తన అన్న (వైఎస్ జగన్)పార్టీకి ఓటేయొద్దని దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో తన అన్న (వైఎస్ జగన్) పార్టీకి ఓటేయొద్దని దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈమేరకు తాజాగా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రి హత్య విషయంలో తన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనకు మొదటి నుంచి అండగా నిలిచారని చెప్పారు. తన తండ్రి కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు చేశారనేది 4–5 రోజుల్లో తెలిసిపోతుందని సునీత తెలిపారు. వివేకానందరెడ్డి కేసులో ఐదేళ్లయినా ఇంకా ఎందుకు తెలియడం లేదు? అని ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేశారని గుర్తు చేశారు. అయితే సొంతవాళ్లే మోసం చేయడంతో ఓడిపోయారన్నారు అయినా నిరాశ చెందకుండా.. రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరించారన్నారు. ఎంత ప్రయత్నించినా ఆయన్ను అణగదొక్కలేకపోతున్నామనే భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైందన్నారు. అప్పట్లో తమకు ఇదంతా అర్థం కాలేదన్నారు. తన తండ్రి వివేకానందరెడ్డిని హత్య చేసిన తర్వాత మార్చి 15, 2019న మార్చురీ బయట ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి తన వద్దకు వచ్చారని సునీత గుర్తు చేసుకున్నారు. రాత్రి 11.30 గంటల వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని అవినాష్ రెడ్డి తనతో చెప్పారన్నారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు మన మధ్యే ఉన్నా మనం మాత్రం రియలైజ్ కాలేమన్నారు. తన తండ్రిని చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? అని సునీత ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు? అని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు ఉండకూడదన్నారు. తన తండ్రిని గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసు? అని సునీత సందేహం వ్యక్తం చేశారు. ఆ విషయం తేలాలన్నారు. తన తండ్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్లిద్దరినీ జగన్ రక్షిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుందన్నారు. వంచన, మోసానికి పాల్పడిన తన అన్న పార్టీ వైసీపీకి ఓటేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలేనన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడతా.. విశ్వసనీయత అంటూ జగన్ పదేపదే చెబుతున్నారని సునీత ఎద్దేవా చేశారు. కానీ ఈచెల్లికి ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలని కోరారు. సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేమని.. అందుకే జగన్ ను కలిసినప్పుడు తనకు ఆయనపై అనుమానం రాలేదన్నారు. ఒక్కో వాస్తవం బయటకు వస్తుంటే నమ్మాల్సి వచ్చిందన్నారు. తన తండ్రి హత్య కేసులో 8 మంది పేర్లు బయటకు వచ్చాయని.. ఇంకా రాని పేర్లు చాలా ఉన్నాయన్నారు. జగన్ పాత్రపైనా విచారణ చేయాలని కోరారు. నిర్దోషి అయితే వదిలేయాలని.. తప్పు చేస్తే మాత్రం తప్పించుకోకూడదన్నారు. నిందితులు ఒక్కసారి బెయిల్ పై బయటకొస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేయరా? అని సునీత ప్రశ్నించారు. జగనన్న కేసుల వల్లే తన తండ్రి హత్య కేసును సాగదీస్తున్నారన్నారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో తనకు తెలియదన్నారు. తాను కూడా ప్రజల్లోకి వెళ్తానని సునీత హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఎలా వెళ్లాలనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు. అనుమానితులుగానే తనను, తన భర్తను అధికారులు ప్రశ్నించారని సునీత చెప్పారు. ప్రభుత్వం నిందితుల వెనుక ఉంది కాబట్టే తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. మాలాగే అందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. విచారణ త్వరగా పూర్తిచేసి దోషులను గుర్తించాలని డిమాండ్ చేశారు.
👉కొత్తరకం చైన్ లింక్ సిస్టంతో యువకులకు గాలం.. కొత్త రకం మోసం.. ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన.. తీరా చూస్తే ముందు ట్రైనింగ్ క్లాసులు..తర్వాత ప్రోడక్ట్ కొనాలంటూ కొత్త రకం మోసం..
ఇటీవల అనేక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలను పలు రకాలుగా మోసగిస్తున్నాయి. ఇటీవల ట్రాంజ్ ఇండియా ( tranzindia)అనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు . నిరుద్యోగులైన యువతి యువకులకు తమ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలతో ఒక ప్రకటన ఇస్తుంది . దీన్ని నమ్మిన యువతీ యువకులు వారికి ఫోన్ చేయగా ముందు 600 రూపాయలు చెల్లించి ఆన్లైన్ వర్క్ షాప్ కు అటెండ్ కావాలని.. ప్రతినెల వేల రూపాయలు సంపాదించుకోవచ్చని చెప్తారు..సరే 600 రూపాయలే కదా అని ఆ డబ్బును చెల్లించి క్లాసు కు అటెండ్ అయిన అనంతరం రూ 9300లు చెల్లించి ప్రోడక్ట్ కిట్టు ఇస్తామంటారు. ఆ కిట్టు ధర కేవలం రెండు లేదా మూడు వేల రూపాయలకు మించదు.కానీ ఆ కంపెనీ ఇచ్చే వస్తువులు, ఆయుర్వేద మందుల ధర మార్కెట్ ధర కంటే ఎంతో ఎక్కువగా ఉంటుంది . కంపెనీలో చేరిన తర్వాత కేవలం ఫోన్లు చేస్తూ తమ కంపెనీలోనే ప్రొడక్ట్స్ గురించి వ్యాపారం గురించి తమ బంధుమిత్రులకు తెలిసిన వారికి తెలియజేస్తూ సంపాదించుకోవాలని చెప్తున్నారట. దీంతో పలువురు యువకులు అటు డబ్బు పోగొట్టుకొని ఇటు ప్రొడక్ట్స్ ను సేల్ చేయలేక డబ్బు పోగొట్టుకుంటున్నారని సమాచారం.
👉కాగా ఇటీవల సేఫ్ షాప్ అనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఒక్కసారి 14,500 రూపాయలు కడితే చాలని, జీవితాంతం లక్షల రూపాయల ఆదాయాన్ని నిశ్చింతగా, పొందవచ్చని మాయమాటలతో బీద బిక్కిని సైతం నమ్మించి మోసం చేస్తున్నారని సమాచారం. ఈ కంపెనీలో రూమ్ 14,500 చెల్లిస్తే రెండు సూట్ లెంగ్తలు,రెండు చీరలు ఇస్తున్నారు . వాటి విలువ మార్కెట్ విలువతో సరి చూస్తే కేవలం ఐదులేదా ఆరువేల లోపే ఉంటుందని సమాచారం.చేరిన వారు కేవలం ముగ్గురిని చేరిస్తే వారు కట్టిన అమౌంట్ వచ్చేస్తుందని, తర్వాత వారి కింద చేరిన వారి నుండి ఎంతో ఆదాయం పొందవచ్చని ఊదరగొట్టి ప్రజలను మోసం చేస్తున్నారని సమాచారం. గతంలో ఒడిశాలోని గాల్వే (galway)అనే సంస్థ గిద్దలూరు నియోజకవర్గం లోని పలు మండలాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులను ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. 15 వేల రూపాయలు చెల్లిస్తే కంపెనీలో ట్రైనింగ్ ఇస్తామని పిలిపించుకొని ఇదేవిధంగా మోసగించినట్లు సమాచారం. చదువుకుంటున్న యువతీ యువకులు సైతం ఆ కంపెనీ వారి మాటలు నమ్మి.. తాము చదువుతున్న చదువులు కూడా మానేసి అనేక రకాలుగా మోసపోయామని వాపోతున్నారు. ఇటువంటి కంపెనీలపై కట్టుదిట్టమైన తీసుకోక కపోవడంతో నిరుద్యోగ యువతీ యువకులు అనేక రకాలుగా మోసపోతున్నారు.ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలలో తయారు చేసే ప్రొడక్ట్స్ ధరలు మార్కెట్ ధరల కంటే ఎంతో అధికంగా ఉంటాయని సమాచారం.ఇంత ధర పెట్టి ఎవరైనా కొంటారా అని అడిగితే మా ప్రొడక్టులో క్వాలిటీ ఎక్కువ అని మభ్య పెడుతున్నారని వాపుతున్నారు. దీంతో అంత ధరలు చెల్లించి ఎవరు కొనక పోవడంతో వేలాది రూపాయలు కట్టే ఈ కంపెనీలలో చేరిన యువతీ యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు.పైగా కేంద్ర ప్రభుత్వమే ఇటువంటి కంపెనీలను ప్రోత్సహిస్తుందని,పోలీసు శాఖ ఉద్యోగులు కూడా చేరారని అందులో పని చేసే లీడర్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం. ఏదేమైనప్పటికీ ప్రజలను మోసం చేస్తున్నటువంటి కంపెనీలపై ప్రభుత్వం కొరడా ఝలిపించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
👉*మామూళ్ల మత్తులో బోర్డ్ ఆఫ్ ఇంటర్ మిడియెట్ అధికారులు..పదో తరగతి పరీక్షలకు ముందే అడ్మిషన్లు.. తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తున్న అధికారులు..ఉచిత విద్య వైద్య సాధన సమితి నాయకుల ఆరోపణ..!!!
పదో తరగతి పరీక్షలు జరగకముందే నారాయణ,శ్రీ చైతన్య ఇతర ప్రయివేట్ జూనియర్ కాలేజీలు అడ్మిషన్లు తీసుకుంటున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియెట్ ఉద్యోగులు ఏమి తెలియనట్లు నటిస్తున్నారని ఉచిత విద్య వైద్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎన్ ప్రవీణ్ కుమార్ బి వెంకటేశ్వర్లు ఆరోపించారు.ఇటువంటి జూనియర్ కాలేజీలకు అనుమతులు లేకున్న వాటికి ల్యాబ్స్,లైబ్రరీ,ఆటస్థలం, ఫైర్ సెప్టి వుండదని,ఫీజులు కూడా వారి ఇష్టం వచ్చినట్లు వసూల్ చేస్తూ కింది నుండి పై స్థాయి ఉద్యోగులందరికీ లంచాలు పువ్వుల్లో పెట్టిస్తారని ఉచిత విద్యా వైద్య సాధన కమిటీ నాయకులు ఆరోపించారు.
👉ఈ కాలేజీలను తనిఖీ చేసిన అధికారిలేడని ,ఆ దైర్యం కూడా వారికి ఉండదని,అధికారంలో ఉన్న నాయకులు దృతరాస్టుడి లాగ నటిస్తుంటారని ఎద్దెవా చేశారు. నిజంగా ఇది ఒక మాఫియా.. అత్యధికంగా ఫీజులు వసూల్ చేసి లంచాల రూపంలో అధికార పార్టీకి వందల కోట్లు ఇస్తారు కావున వారి వాటా వారికి వస్తుంది కాబట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.ఎన్ని జూనియర్ కాలేజీలకు పర్మిషన్ లేవో లెక్కలు బోర్డ్ ఆఫ్ ఇంటర్ మిడి యెట్ అధికారులకు తెలిసిన చర్యలు తీసుకోరని ,విద్యాశాఖ మంత్రి వర్యులు ఇప్పటికైనా దృష్టి పెట్టి అనుమతి లేని, మౌలిక సదుపాయాలు లేని ప్రైవేటు కళాశాలలను మూపించాలని డిమాండ్ చేశారు. నారాయణ శ్రీచైతన్య కాలేజీల పై ఎన్ని పిర్యాదులు అందినా అధికారులు వాటిని చెత్త బుట్టలో వేస్తారన్నారు.ఈ కాలేజీలలో హాస్టల్ లలో పిల్లలు ఆత్మ హత్యలు చేసుకున్న ఉన్నాయని, వాటిని బయటకు పోకుండా సెటిల్ మెంట్లు చేస్తారని , ఎవరి మామూళ్లు వారికి అందితే అవన్నీ మాపి చేస్తున్నారని, పిల్లల తల్లిదండ్రులకు వారి మాటలకు ఆ కాలేజీలలో విలువ ఉండదని,నారాయణ శ్రీచైతన్య జూనియర్ కాలేజీల ఉద్యోగులు బిచ్చ గాళ్ళ కంటే నీచంగా చూస్తారని,దురుసుగా ప్రవర్తిస్తారని ,కేవలం వారు అడిగినంత ఫీజు కట్టి వెళ్ళాలి,తెలంగాణ వచ్చాక కూడా వాటి పెత్తనమే నడుస్తుందని ఆరోపించారు.
👉*ప్రవేట్ జూనియర్ కాలేజీలలో చదివే విద్యార్థుల ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలి, లేదా ఫీజులు ప్రభుత్వమే నిర్ణయించాలి, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను విద్యార్థులకు సరిపోయే అన్ని ప్రభుత్వం నిర్మించాలనీ, ఉచిత విద్య వైద్య సాధన సమితి డిమాండ్ చేస్తుందన్నారు ,ఇది ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు.వాటిపై చర్యలు తీసుకుంటారా? మీరు కూడా అమ్యామ్యాలు పుచ్చుకుంటారా? ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల తల్లదండ్రులు దోపిడీకి గురి అవుతున్నారని లక్షలలో ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు గత ప్రభుత్వం లంచం తీసుకోనివారి మీద చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.