టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. వైపాలెంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన.. పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ ఎడ్యుకేషనల్ సెక్రెటరీ.. 7న నారా లోకేష్ శంఖారావం..కంభం టిడిపి నాయకుల ఉధృత ప్రచారం

*చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..

గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా సభకు చంద్రబాబుహాజరైనారు.ఈ సందర్బంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి సాధరంగ ఆహ్వానించారు………………………………….

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్ర విద్యా ఎడ్యుకేషనల్ సెక్రటరీ..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల లోని ఇలపావులూరు గోనేపల్లి వారి పాలెం ఎలిమెంటరీ స్కూల్లను మరియు గాడిపత్రివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యా ఎడ్యుకేషనల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శనివారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంవత్సరం పూర్తవుతున్న పిల్లలకి ఇంతవరకు సిలబస్ కాకపోగా మాయ మాటలు ఎందుకు చెబుతున్నారని, మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది ఎందుకని మీ జీతాలు మీరు తీసుకుంటూ ఇక్కడికి వచ్చి ఊరకనే కూర్చొని వెళ్లడానికి ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ఖర్చుపెట్టి మీకు జీతాలు ఇస్తుంది పిల్లలకి చదువు చెప్పమంటే స్కూళ్లకు వచ్చి బాతా ఖానీలు చెప్పుకోవటానికి సిగ్గుగా లేదా అని ఉపాధ్యాయులను, చీమకుర్తి ఎంఈఓను ప్రశ్నించారు.దీంతో వారు ఆయన అడిగిన సమాధానాలకు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలదించుకున్నారు.కార్యక్రమంలో గుంటూరు ఆర్జెడి, ప్రకాశం జిల్లా డిఇఓ, డిప్యూటీ డి ఓ, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు.

👉*ప్రకాశం జిల్లా, కంభంమండలం, తరిమెల్ల,

పంచాయతీలో , బెస్తవారిపేట మండలం, బసినేపల్లె పంచాయతీలోని జెన్నివారిపల్లె గ్రామంలో ,అర్ధవీడు మండలం, యాచవరం పంచాయతీలో ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించాలని రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించినారు…….👉 ఈ నెల 6వ తేదిన యర్రగొండపాలెం పట్టణానికి విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి

వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటన మరియు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్.కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా డీస్పీ సిఐ లు ఎస్సైలు అన్ని శాఖల అధికారులు పాలొగొన్నారు.

*గిద్దలూరులో మార్చి 7న నారా లోకేష్ శంఖారావం*.. గిద్దలూరు పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభ మార్చి 7వ తేదీన జరగనున్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి తెలియచేశారు. ఈ సందర్బంగా పట్టణంలోని ఒంగోలు రోడ్డు హెచ్ పి పెట్రోల్ బంకు సమీపంలో నిర్వహించనున్న సభా ప్రాంగణ ఏర్పాట్లను అశోక్ రెడ్డి టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి శనివారం సాయంత్రం పరిశీలించారు. మార్చి 7వ తేదీ గురువారం ఉదయం జరిగే శంఖారావం సభకు నియోజకవర్గంలోని తెలుగుదేశం శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గోనాలని అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..