లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ కు సన్మానం.. గిద్దలూరు వైకాపాలో చేరికలు..ముత్తుములకు సన్మానం.. తర్లుపాడులో రాజకీయ వేదింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం ..

  • సుప్రసిద్ధ లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ ను ఘనంగా సన్మానించిన తెలంగాణ ఉద్యోగుల సంఘం..

జర్మనీకి చెందిన ప్రపంచ సుప్రసిద్ధ లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ తన పరిశోధనలో భాగంగా దక్షిణ భారతదేశాన్ని సందర్శించారు. మనదేశంలో యుద్ధాలలో వాడే ఆయుధాల గురించి ఫిరంగుల గురించి, వారసత్వ సంపద, ఆయుధాలు ఫిరంగులలో తయారీలో వినియోగించిన లోహాల గురించి అద్వయనంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షులు పద్మాచారి ఆధ్వర్యంలో ఆయనకు గ్రీన్ ల్యాండ్ లోని టూరిజం ప్లాజా లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వృత్తి రీత్యా విశ్వబ్రాహ్మణుడు అయిన ఆయన ఇటీవల భారతదేశం నిర్వహించిన సూర్యయాన్ చంద్రయాన్ యాత్రలలో రాకెట్లలో వెళ్లి అక్కడి వాతావరణ పరిస్థితులను, అక్కడి ఉష్ణోగ్రతను తట్టుకునే లోహాలను గురించి అనేక పరిశోధనలు నిర్వహించారు. అనేక దేవి దేవత విగ్రహాలను తయారు చేయడంతో పాటు విగ్రహాల తయారీలో ఎటువంటి లోహాలను వినియోగించాలన్న అంశాలపై పరిశోధన సాగిస్తుంటారు.తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన లోహ శాస్త్రవేత్త ప్రముఖ చరిత్రకారుడైన డాక్టర్ జై కిషన్ ఆహ్వానం మేరకు రేరెన్ తెలంగాణ సందర్శించారు.లోహ పరిశోధనలో ఆయన వద్ద 35 మంది డాక్టరేట్ పట్టాలు పొందారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తీలో రైరన్ ముంబైలోని తన శిష్యురాలైన డాక్టర్ మేఘనను కూడా కలిసి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఆర్థిక నేరాల విభాగం ఏసిపి కే కిరణ్ కుమార్ మాట్లాడుతూ తిలోరెన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ను కలవడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తాను గతంలో పోలీసు డిపార్ట్మెంట్ లో పని చేస్తూ వివిధ దేశాలలో పోలీసుల పనితీరు గురించి చేసిన సందర్భంగా జర్మనీలో సైతం పర్యటించానని ఆ దేశం గురించి మంచి అవగాహన ఉందని, ప్రజల జీవనశైలి కర్తవ దీక్షలో పోలీసులు అధికారుల తీరు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి బ్రహ్మశ్రీ వెంకటాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు వడ్రంగి కమ్మరి శిల్పి, లోహ కారులు, స్వర్ణకారులు తమ సంప్రదాయ వృత్తులలో కొనసాగుతూనే సమాజానికి ఉపయోగపడే వారి వారి కులవృత్తులలో అత్యంత ప్రతిభను కనబరుస్తూ విశ్వకర్మజాతికి తలమానికంగా నిలుస్తున్నారని ఆయనను ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బ్రహ్మశ్రీ ఎల్ ఎన్ చారి, దుబ్బాక కిషన్ చారి, డాక్టర్ రవీంద్ర చారి, శ్రీరామోజు ప్రదీప్ సురేందర్ డాక్టర్ సుధాకర్, దేవరకొండ నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.

*అర్దవీడు మండలంలో పట్టపగలే రెండు గృహాల్లో చోరీ*  పట్టపగలే రెండు గృహాల్లో చోరీ జరిగిన సంఘటన అర్దవీడు మండలం మోహిద్దీన్ పురం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల పెద్ద కాశయ్య, చిన్న కుమారుడు రంజాన్ గృహాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్దకాశయ్య దంపతులతో పాటు చిన్న కోడలు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లారు. పదింటి సమయంలో దొంగలు రెండు ఇళ్ల తలు పులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గ్రామం శివారు వరి మాగాణులకు సమీపంలో ఇళ్లు ఉండటంతో గమనించే వారు లేకపోయారు. దీంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రెండు బీరువాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్టు సమాచారం. రెండు గృహాల్లో సుమారు 10 తులాల బంగారు రూ.50 వేల నగదు అపహరించినట్లు సమాచారం. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి రావడంతో తలుపులు తెరచి ఉండటం పై దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై అనిత తమ సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి వేలి ముద్రలు సేకరించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…_

* 👉ఆంధ్రా మిర్రర్ ప్రకాశం జిల్లా ..తర్లుపాడు.. వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యా యత్నం…వైకాపా నాయకుడి వేధింపులే కారణమని బాధితుడి ఆరోపణ.. తర్లుపాడు మండలం కందల్లపల్లిలో వ్యక్తి ఆత్మహత్యా యత్నం..పురుగుమందు తాగిన తెదేపా కార్యకర్త బ్రహ్మతేజ కుమార్.మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు .వైకాపా నాయకుడి వేధింపులే కారణమని బాధితుడి వెల్లడి.తనకున్న చిన్నపాటి ఉద్యోగం తీసేయడంతో పాటు తన కుటుంబ సభ్యులను, కులాన్ని దూషించాడని బాధితుడి ఆవేదన.

👉 వైకాపాల్లో చేరికలు..ఆంధ్ర మిర్రర్ ప్రకాశం జిల్లా..

గిద్దలూరు .. మండలంలోని ముల్లపాడు పంచాయతీలోని వెంకటాపురం గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు టిడిపి నుండి వైసీపీలో చేరడం జరిగింది.వీరందరికీ గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త కేపీ నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

👉టిడిపి ఇన్చార్జి ముత్తుములను సన్మానించిన కంభం టిడిపి నాయకులు

గిద్దలూరు టిడిపి టికెట్  గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డి కేటాయించడంతో శుక్రవారం రాత్రి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అనీష్ అహ్మద్, తోట శ్రీనివాసులు, గౌస్ బాషా, జీలాని, అల్లాబకాష్ తది తరులు పాల్గొన్నారు.

 

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం