పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…

👉పెద్దన్న అంటే .. ఇచ్చింది గుండుసున్నా ! ‘బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరుతూ ఢిల్లీకి 14సార్లు వెళ్లి వినతిపత్రాలు ఇచ్చాం ‘బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరుతూ ఢిల్లీకి 14సార్లు వెళ్లి వినతిపత్రాలు ఇచ్చాం. ప్రధాని మోదీని మేము పెద్దన్నగా భావించాం. తెలంగాణకు పెద్దన్నగా న్యాయం చేయాలని, నిధులు కేటాయించాలని ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కోరినా ప్రయోజనం లేదు. కేంద్ర బడ్జెట్ లో కనీసం తెలంగాణ అనే పదాన్నే ఉచ్చరించలేదు’ అని తెలంగాణ సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తంచేశాడు. వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదన్నట్లుగా కేంద్రం తీరు ఉంది. బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు లేకపోవడం దారుణం. ఓట్లు, సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి. కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని రుజువైంది అని రేవంత్ అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా, నరేంద్ర మోదీ మంత్రివర్గంలో యూనియన్ కేబినెట్ మినిస్టర్ గా కిషన్ రెడ్డి తెలంగాణకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహించాలి. తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పి, తక్షణమే మోదీ మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి తప్పుకోవాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడం విశేషం. ఏపీకి నిధులు ఎందుకిస్తున్నారని మేము అడగడం లేదు. మాకు ఎందుకు ఇవ్వడం లేదనే అడుగుతున్నాం. గుజరాత్ కు ఎలా నిధులు కేటాయిస్తున్నారో, తెలంగాణకు అలానే ఇవ్వాలి. మూసీ నది అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అడిగాం. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంతా బోగస్” అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

👉2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడే విధంగా బడ్జెట్‌ రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్‌ను తయారు చేశామని.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని ఆమె తెలిపారు. బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు అధిక స్థాయిలో కేటాయింపులు దక్కాయి.ముఖ్యంగా ఏపీ రాజధాని అభివృద్దికి ప్రత్యేకంగా రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ, జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ క్రెడిట్ కోసం ఇరు పార్టీల నేతలు పోటీ పడ్డారు. తమ వల్లే ఈ కేటాయింపులని టీడీపీ నేతలు అంటుంటే, పవన్ వల్లే ఇంతటి స్థాయిలో నిధులు వచ్చాయంటూ జనసేన నేతలు చంకలు గుద్దుకున్నారు. తీరా ఇది సాయం కాదు అప్పుగా మాత్రమే ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.😱
👉కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..😔
*అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి… కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. “తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారు. కక్ష పూరితంగా వ్యవహరించారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు.
🔶 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో స్పందించారు. తెలంగాణ పట్ల ప్రదర్శించిన వివక్షపై అసెంబ్లీలో చర్చ చేపట్టి ప్రభుత్వ నిరసనను కేంద్రానికి తెలియజేస్తామని చెప్పారు.
🔶 “వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని కేంద్రం భావిస్తున్నట్టు తాజా వైఖరిని బట్టి స్పష్టమవుతోంది. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా మూడుసార్లు ప్రధానమంత్రిని కలిసి కోరాం. వివక్ష లేని, వివాదాలు లేని, కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కలిగి అభివృద్ధికి సహకరించాలని కోరాం. కానీ బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారు” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
🔶 “ఇతర రాష్ట్రాల కేటాయింపులపై తమకెలాంటి అభ్యంతరాలు లేవు. విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించినప్పుడు అదే చట్టంలో పేర్కొన్న తెలంగాణ అంశాలపై ఎందుకు వివక్ష చూపించారు? ఎందుకు నిధులు కేటాయించలేదు? దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోంది. ఆ వివక్షపై దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాటం చేస్తాం. కలిసొచ్చే ప్రభుత్వాలతో మా వైఖరిని కేంద్రానికి స్పష్టంగా చెబుతాం” అని అన్నారు.*
🔶 తెలంగాణకు ప్రధానంగా బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, ఐఐఎం ఏర్పాటు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు నిధులు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్‌పోర్ట్, మరుగున పడిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ, రైతులకు ప్రత్యేక కార్యాచరణ, వైద్య ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పనలో తెలంగాణకు ఏవీ ఇవ్వలేదన్నారు.*
🔶 ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని స్వయంగా ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాం. కానీ తెలంగాణకు ఐఐఎం ఇవ్వబోమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. ఎందుకు ఇవ్వరు? ఎందుకింత వివక్ష? అంటూ నిరసన వ్యక్తం చేశారు.*
*రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని అన్నారు. “ఈ వైఖరి ఏమాత్రం సమంజసం కాదు. సహేతుకం కాదు. మా నిరసనను కేంద్రానికి తెలియజేస్తాం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.*
👉సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
బడ్జెట్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు
వ్య తిరేకంగా, రాష్ట్ర హక్కులను కాపాడేలా రేపు
అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని CM రేవంత్
రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిరసనను ప్రధానికి
అధికారికంగా తెలియజేయడానికి తీర్మానాన్ని కేంద్రానికి
పంపుతామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతో
కలిసిరావాలన్నారు. గతంలో ఇలాంటి వివక్షనే ప్రత్యేక
రాష్ట్ర సాధనకు కారణమైందని సీఎం గుర్తు చేశారు.

👉కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చడంపై హర్షం వ్యక్తం చేసిన జిల్లా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, దామచర్ల జనార్ధన్ , కందుల నారాయణరెడ్డి,బి.ఎన్ విజయ్ కుమార్, ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎం ఎం కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు..ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు..ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

👉 పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి యం.రమేష్ మున్సిపల్ కమిషనర్ పి కోరారు.మంగళవారం మున్సిపల్ కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో కమీషనర్ కి వినతిపత్రం ఇచ్చారు.ఈ సంధర్భంగా రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ఆప్కాసులో చేర్చి న 2023 సెప్టెంబర్ నుండి 2024ఫిబ్రవరి వరకు హెల్త్ అలవెన్స్ బాకాయిలు నేటికి చెల్లించలేదన్నారు.ఫలితంగా ఒక్కొక్క కార్మికుడికి 36 వేల రూపాయలు బకాయి ఉందన్నారు.మున్సిపల్ కార్మికులు సమ్మె ఒప్పందం మేరకు పండుగ అలవెన్స్ 1000 రూపాయలు 6 నెలలు గడిచినా నేటికి చెల్లించలేదని అన్నారు.పెరిగిన నగర పంచాయితీ విస్తీర్ణం,జనభా కనుగుణంగా పారిశుధ్య కార్మికులు సంఖ్య పెంచుకోవడంలో పనిభారం విపరీతంగా పెరిగి తరచూ అనారోగ్యం బారీన పడుతున్నారన్నారు.75 మంది పారిశుధ్య కార్మికులలో కొంత మందిని ఇతర పనులకు కేటాయించటంతో 50 మందితోనే పారిశుధ్య పనులు నిర్వహించాల్సి రావడం,అనారోగ్యంతో కొంత మంది సెలవు పెట్టడంతో పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులు తల ఎత్తుతున్నాయి.తక్షణం పారిశుధ్యకార్మికులు 75 మంది పనిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.జీతాలతో సంబంధంలేకుండా పారిశుధ్యకార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అమలుచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) పొదిలి నగర పంచాయితీ నాయకులు డి.సుబ్బయ్య, కె.వి.నరసింహం,బి.కోటేశ్వరావులు పాల్గొన్నారు.

👉రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎంపీపీ అమూల్య… భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన కామూరి రమణారెడ్డి..

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాధినేనిపల్లి గ్రామంలో మొహరం పండుగను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్య ప్రారంభించారు. బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్యను గ్రామస్తులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. మొహరం పండుగను పురస్కరించుకొని మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నదనానికి సహకరించిన కామూరి రమణారెడ్డికి మొహరం పండగ వేడుకలు నిర్వహణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొహరం పండగ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.

7k network
Recent Posts

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు

కెసిఆర్ అంటే ఇష్టం- రఘురామ సంచలన వ్యాఖ్యలు .. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై హత్య…. జమ్ముకశ్మీర్‌లో ఏపీ విద్యార్థులు దుర్మరణం..ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన..టీడీపీ – జనసేన పార్టీల మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు