వైకాపాలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇంచార్జ్.. బండి సంజయ్ అవినీతిపై పోరు.. హోల్ సేల్ మెడికల్ షాపులపై సోదాలు..పుల్లలచెరువు వైకాపాకు భారీ షాక్..ఎమ్మెల్యే కేపీ ఆయన సతీమణి విస్తృత ప్రచారం

👉వైసిపి లో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి. ఆంధ్ర మిర్రర్..

జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు .ఆమె 2019 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసారు.కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు.

👉బండి సంజయ్ అవినీతిపై కిషన్ రెడ్డి నోరు విప్పాలి!!!….పొన్నం ప్రభాకర్,ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కు మధ్య విభేదాలున్నాయని, వారిద్దరికీ పడదని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఆతర్వాత బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ కూడా దీటుగా కౌంటర్ ఇచ్చారు.తన తల్లిని బండి సంజయ్ అవమానించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బండి సంజయ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కు మధ్య విభేదాలున్నాయని,వారిద్దరికీ పడదని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఆస్కార్ అవార్డు పొందే రేంజ్ లో బండి సంజయ్ నటిస్తున్నారని సెటైర్లు వేశారు. సెప్టెంబర్ లో బీఆర్ఎస్ అధికారంలో ఉందని, తాము డిసెంబర్లో అధికారంలోకి వచ్చామని, అది వర్షాకాలం కాదని చెప్పారు. పంట నష్టం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. బండి సంజయ్ పై అవినీతి ఆరోపణలు వచ్చినందునే ఆయనను తొలగించారని ఆరోపించారు. కారణం లేకుండా తనమీద బండి సంజయ్ అభాండం వేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను సజీవ దహనానికైనా సిద్ధం అని సవాల్ విసిరానని, కానీ, తనపై ఆరోపణలు బండి సంజయ్ నిరూపించలేక సైలెంట్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ అవినీతిపరుడు కాదని కిషన్ రెడ్డి చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.తన వాయిస్ రికార్డ్ చేసిన ఆర్డీవోపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశానని,చర్యలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఉచిత బస్సుల్లో ఇప్పటిదాకా 30 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని అన్నారు. బండి సంజయ్ అవినీతిపై తెలంగాణ రాష్ట్రం కోడై కూస్తుందని,దానికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కేసీఆర్ అపాయింట్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.గంగుల కమలాకర్ బండి సంజయ్ ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు.

👉హైదరాబాద్ లో హోల్ సేల్ మెడికల్ షాప్ లపై తనిఖీలు.. ..ఆంధ్రా మిర్రర్.

ఢిల్లీ నుండి ఎలాంటి బిల్స్ లేకుండా తీసుకువచ్చి హైదరాబాద్ లో 40% డిస్కౌంట్ లో ఇంజక్షన్స్ ని అమ్ముతున్న మెడికల్ షాపులు.. హోల్ సేల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కేసు నమోదు చేసి 51 లక్షల విలువైన ఇంజక్షన్స్ స్టాక్ సీజ్ చేసారు.సికింద్రాబాద్ లో దుర్గా హబ్ మెడికల్ షాప్ లో 6.7 లక్షల స్టాక్ ను,ఉప్పల్ లో శ్రీ తిరుమల ఫార్మా మెడికల్ షాప్ లో 3.52 లక్షల స్టాక్,సుల్తాన్ బజార్ లో శ్రీ పరస్ మెడికల్ ఏజెన్సీస్ లో 9 లక్షల స్టాక్,నాగోల్ లోని శ్రీ గణేష్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ లో 14 లక్షల స్టాక్,కాప్రాలోని శ్రీ రాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ లో 2 .7 లక్షల స్టాక్ సీజ్ చేశారు.కాచిగూడ లోని శ్రీ బాలాజీ ఏజెన్సీస్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు 16 లక్షల స్టాక్ సీజ్ మెడికల్ షాప్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

👉 *పుల్లలచెరువు మండల వైసీపీకి షాక్*.. ఆంధ్ర మిర్రర్.. ఏఎంసీ మాజీ చైర్మన్

ఉడుముల సొంత గ్రామం నుండి భారీ వలసలు ..మండలంలోని వెంకటరెడ్డి పల్లి గ్రామంలో టీడీపీ నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, గొగి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 60 వైసిపి కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మేల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరారు.వారిని ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపి వంటెద్దు పోకడలు నచ్చక,పెత్తందారు వ్యవస్థ ఎక్కువ అవడంతో పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న తమని పక్కకు నెట్టేసి ఒక వర్గాన్ని తాటిపర్తి చంద్రశేఖర్ పనిచేస్తున్నారన్న అభియోగంతో వారు టిడిపిలో చేరుతున్నట్లు తెలిపారు. టిడిపిలో తగిన గౌరవం కల్పిస్తామని ఎరిక్షన్ బాబు వారికి హామీ ఇచ్చారు.

👉యడవల్లి పంచాయతీ పరిధిలోని కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో గిద్దలూరు వైసిపి ఇన్చార్జి కేపీ*

 ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లి పంచాయతీ పరిధిలోని నాయకులు మరియు కార్యకర్తలతో యడవల్లి గ్రామంలో ఆత్మీయ సమావేశం లో గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుందురు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..👉*కంభం టౌన్ లో కొంతమంది నాయకులతో గిద్దలూరు ఇంచార్జ్ కేపి.నాగార్జున రెడ్డి సతీమణి కల్పనా రెడ్డి ముఖాముఖి కలిస మాట్లాడారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త